Riding
-
మీరెప్పుడూ చూడని గ్రేట్ ఖలీ రైడింగ్ వీడియో.. ఓ లుక్కేసుకోండి!
Khali Royal Enfield Riding: బాక్సింగ్ గురించి తెలిసినవారికి ప్రత్యేకంగా 'గ్రేట్ ఖలీ' (Great Khali) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెజ్లింగ్ అరేనాలో పాల్గొన్న భారతీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచిన ఈయన రిటైర్ అయిన తరువాత ఇండియాకి తిరిగి వచ్చేసాడు. అప్పటి నుంచి కొన్ని టీవీ యాడ్స్‌లో నటించడం, 2015లో పంజాబ్‌లో కాంటినెంటల్ రెజ్లింగ్ స్కూల్ ప్రారంభించడం వంటివి చేసి కాలం గడుపుతున్నారు. ఇటీవల ఖలీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదలైన ఒక వీడియోలో ఖలీ 'రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్' నడపడం చూడవచ్చు. ఈ సంఘటన చూడటానికి బొమ్మ బైకుపై ఆజానుబాహుడున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అత్యంత బరువైన బైకుల్లో ఒకటైన బుల్లెట్ ఖలీ ముందు చిన్న బైకుగా మారిపోయింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది దీనిని లైక్ చేశారు. కొంత మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఖలీ బైకుని రైడ్ చేస్తూ కనిపించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఇంటర్‌సెప్టర్ 650, బుల్లెట్, హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ వంటి వాటిని రైడ్ చేస్తూ కూడా కనిపించాడు. ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. నిజానికి ఖలీ ఎత్తు 7 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఏ బైకైనా అతని పరిణామంతో పోలిస్తే మరగుజ్జు మాదిరిగా కనిపిస్తుంది. బైకులు మాత్రమే కాకుండా ఆయన వద్ద టయోటా ఫార్చ్యూనర్, టయోటా గ్లాంజా వంటి కార్లను కలిగి ఉన్నప్పటికీ.. అతని పరిమాణానికి అనుకూలంగా కస్టమైజ్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) -
ఇదేందిది.. ఒక్క బైక్‌పై ఏడుగురా?.. ఆఖరోడు అలా కూర్చున్నాడేంటి?
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ లేక్కలేనన్ని చర్యలు చేపడుతోంది. అయినా కొందరు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, వాహనాలను ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారు. తాజగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ బైక్‌పై ఒకరో, ఇద్దరో కాదు ఏకంగా ఏగుగురు కుర్రాళ్లు రయ్యిమని దూసుకుపోతున్నారు. పైగా వారు తామేదో ఘనకార్యం చేశామన్నట్టు ఫీలవుతున్నారు. ఈ వీడియో యూపీలోని హాపూర్‌కు చెందినదని తెలుస్తోంది. ఏడుగురు కుర్రాళ్లు నిర్భయంగా బైక్‌పై కూర్చుని ప్రయాణించడాన్ని వీడియోలో చూడవచ్చు. వారిలో చివరనున్న కుర్రాడు ముందునున్న కుర్రాడిపై ఎక్కి కూర్చున్నాడు. 22 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో బైక్‌పై కూర్చున్న కుర్రాళ్ల తీరు చూస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. అయితే ఆ బైక్‌పై ఉన్నవారితో కించిత్తు ఆందోళన కూడా లేకపోవడం విశేషం. ఈ వీడియోను చూసినవారంతా ఆ కుర్రాళ్లపై పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను @Akshara117 అనే ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇది కూడా చదవండి: పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా.. Video of 7 people riding a bike in #Hapur goes viral, raising questions on the working style of Hapur police. #Viralvideo pic.twitter.com/wfMfjkOkdF — Akshara (@Akshara117) August 9, 2023 -
బుల్లెట్టు బండెక్కి బైక్ రైడింగ్.. హిజాబ్ రైడర్ స్టోరీ ఇదే
ఇట్టే వస్తే రానీ వెంటా,నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా,డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ.. పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, బైక్ ఎక్కే రోజుల నుంచి గేర్ల్మీద గేర్లు మార్చుకుంటూ రయ్యన దూసుకెళ్తున్నారు నేటి తరం అమ్మాయిలు. సెల్ఫ్‌తో బండిని స్టార్ట్‌చేసి సూదూర ప్రాంతాలకు సోలోగా రైడ్ చేస్తూ దునియాని చుట్టేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో రైడింగ్ చేస్తుంటే... మరింత ప్రత్యేకంగా హిజాబ్ ధరించి జాతీయ రహదారులే కాదండోయే దేశాలు దాటి మక్కా దాక బుల్లెట్ మీదే వెళ్తానంటోంది ముఫ్పై ఏళ్ల నూర్ బీ. చెన్నైలోని పల్లవరానికి చెందిన అమ్మాయి నూర్‌బీ. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇది చేయకు! అది చేయకు! అలా ఉండకు! ఇలా ఉండాలి! అంటూ ఎన్నో నిబంధనలు. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించాలి. అయినా నూర్ బీకి మాత్రం బైక్ నడపడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంట్లో అమ్మాయిలు బైక్‌లు అస్సలు నడపకూడదు. అయినా తన ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. కాలేజీలో ఉండగానే మోటర్ సైకిల్ కొనుక్కోవాలనుకునేది. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఐటీ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం వచ్చింది. నెలనెలా వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని బండి కొనుక్కోవడానికి దాచుకునేది. ఇలా జమ చేసిన డబ్బులతో 2021లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌ను కొనుక్కుంది. బండి కొన్న వెంటనే ఉద్యోగం మానేసి రైడింగ్ షురూ చేసింది. ఫస్ట్ రైడ్... ఎన్నాళ్లుగానో వేచిచూస్తోన్న క్షణాలు వచ్చేశాయి. వెంటనే రైడింగ్‌కు ప్రణాళిక రూపొందించుకుంది నూర్. 2021 నవంబర్ 14 తొలి రైడింగ్ గేర్‌ను స్టార్ట్ చేసింది. ఈ రైడ్ గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. బెంగళూరు నుంచి మహారాష్ట్ర, డామన్ డయ్యూ, గుజరాత్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పటికీ మహారాష్ట్రలోని లోనావాలకు చేరుకునేటప్పటికి విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు నూర్. ఐదున్నర అడుగుల ఎత్తున్న నూర్.. హిజాబ్ ధరించి బుల్లెట్ బండి మీద డుగ్గు డుగ్గు అని వెళ్తుంటే ఆమెను అంతా ఆసక్తిగా చూసేవారు. ఆ చూపులు నూర్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. ఈసడింపులు, యాక్సిడెంట్ ఎదురైనప్పటికీ... ప్రపంచం రోజురోజుకీ అప్డేట్ అవుతున్నప్పటికీ కొంతమంది ఇంకా ‘అమ్మాయి ఏంటీ ఇలా చేస్తోంది? ఇదేం విడ్డూరం?’ అని నోరు వెళ్లబెట్టిన వాళ్ల ఈసడింపులు నూర్‌కూ ఎదురయ్యాయి. అయినప్పటికీ రోడ్డు మీద గేర్లు మారుస్తూపోతూనే ఉంది. తన రైడ్‌ను ఎక్కడా ఆపలేదు. ఇదే దూకుడుతో... ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ప్రయాణిస్తూ నేపాల్‌కు వెళ్లాలనుకుంది. బిహార్ సరిహద్దులోకి రాగానే చిన్న యాక్సిడెంట్ జరిగి రైడింగ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు తన మోటర్ సైకిల్‌ను ట్రైన్లో చెన్నై పంపించాల్సిన పరిస్థితి. చాలా బాధ వేసింది. అయినా తప్పలేదు. 2022 మేలో యాక్సిడెంట్ అయితే జూలైలో కోలుకుని బెంగళూరు వచ్చేసింది. ఇంక బండిని అమ్మేయమని అంతా చెప్పారు. అయినప్పటికీ నూర్ రైడింగ్ అపలేదు. జాతీయ రహదారులేగాక అంతర్జాతీయ రహదారులపై రైడింగ్ చేస్తానూ అంటోంది. వచ్చే సంవత్సరం బెంగళూరు నుంచి మక్కా, సౌదీ అరేబియా కూడా వెళ్తానని చెబుతోంది. మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి... ‘‘నేను నోమాడ్ హిజాబీ రైడర్ని. దక్షిణ భారత దేశం నుంచి తొలి సోలోరైడర్ని నేనే అవుతాను. ఉత్తర భారతదేశంలోని గురుద్వారాలు, గుళ్లు, ఆశ్రమవాసులు నా మతం వేరైనప్పటికీ ప్రేమగా భోజన, వసతి సదుపాయాలను కల్పించేవారు. కొన్ని సేఫ్టీరూల్స్ పాటిస్తే తక్కువ బడ్జెట్లో ట్రిప్స్‌ను విజయవంతంగా పూర్తిచేయవచ్చు. సాయంత్రం ఐదు తరువాత ఎటువంటి రైడింగ్ చేయను. తెలియని వ్యక్తులతో అస్సలు మాట్లాడను.పెట్రోల్ బంకులు, ప్రార్థనా స్థలాలు, ఆశ్రమాల్లో రాత్రుళ్లు బస చేస్తూ, ఉదయం రైడింగ్ చేస్తున్నాను. ఈ స్పీడుతో మక్కాను చేరుకుంటాను ’’అని నూర్‌బీ ధీమా వ్యక్తం చేస్తోంది. -
డేంజర్ రైడింగ్.. స్కూటీపై ఏడుగురు పిల్లలతో.. వీడియో వైరల్..
ముంబయి: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా కొందరు మాత్రం తమ పంథా మార్చుకోరు. జరిమానాలు విధించినా రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటారు. రహదారులపై ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. కొన్ని సార్లు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ముంబయిలో ఓ వ్యక్తి తన స్కూటీపై ఏకంగా ఏడుగురు పిల్లలను ఎక్కించుకుని రద్దీగా ఉండే రహదారిపై వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. This irresponsible maniac is riding with seven children on a scooter. He should be immediately arrested for risking the lives of seven young children. Even the parents of these kids should be prosecuted. @MumbaiPolice @CPMumbaiPolice @CMOMaharashtra @TOIMumbai @BrutIndia pic.twitter.com/PalarAQzcH — Sohail Qureshi (@sohfacts) June 20, 2023 ఇదీ చదవండి: పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు! ముంబయి లాంటి నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. అలాంటి రద్దీగా ఉండే రోడ్లపై ఓ వ్యక్తి ఏడుగురు పిల్లలను స్కూటీ మీద ఎక్కించుకున్నాడు. స్కూటీ ముందు భాగంలో ఇద్దరు పిల్లలు, సీటుపై ముగ్గురు పిల్లలు కూర్చున్నారు. మరో ఇద్దరు పిల్లలు స్కూటీ వెనక భాగంలో కేవలం కడ్డీ మీదే నిలబడ్డారు. ఇంత ప్రమాదకరంగా ఏడుగుర్ని ఎక్కించుకుని రహదారిపై వెళ్తున్న సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. Not the ride we support! This rider had put the life of all pillion riders and others in danger. A serious offence u/sec 308 IPC for attempt to commit culpable homicide not amounting to murder has been registered against the accused rider. #FollowRules #SetRightExample https://t.co/PKgCY0grhN pic.twitter.com/q2VmoRi8oj — Mumbai Traffic Police (@MTPHereToHelp) June 25, 2023 ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రయాణికుల ప్రాణాలు తీయడానికే ఇలా ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తారని మండిపడ్డారు. ఈ సంఘటనపై ముంబయి ట్రాఫిక్ పోలీసులు కూడా స్పందించారు. అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇదీ చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! -
బీఎండబ్ల్యూ అంటే... బ్యూటీఫుల్ మంజు వారియర్!
అందాల కథానాయిక మంజు వారియర్‌కు బైక్ రైడింగ్ సాహసాలు అంటే ఇష్టం. తాజాగా ఒక అడవిలో తన బీఎండబ్ల్యూ బైక్ రైడింగ్‌కు సంబంధించిన ఫోటోలను ‘యూ గాట్ ఇట్ గర్ల్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ–నాన్ సెలబ్రిటీ అనే తేడా లేకుండా మంజు వారియర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఐరన్ గర్ల్ ఆఫ్ సౌత్ ఇండియా’ ‘వావ్ అమేజింగ్. కీప్ ఇట్ అప్’లాంటి ప్రశంసల మాట ఎలా ఉన్నా, కొద్దిమంది మాత్రం మంజూకు జాగ్రత్తలు కూడా చెప్పారు. ‘నేను కూడా రైడర్ని. మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఫుల్‌ఫేస్ హెల్మెట్ ధరించండి’ అని శ్రీరామ్గోపాలక్రిష్ణన్ అనే యాజర్ సలహా ఇచ్చారు. మరి కొందరు ఫారెస్ట్ ఏరియాలో ఎలాంటి రైడింగ్ బూట్స్ ధరించాలనే దాని గురించి చెప్పారు. బైక్ రైడింగ్‌లో మంజు వారియర్‌కు హీరో అజిత్ స్ఫూర్తి. ఆయనతో కలిసి బైక్ రైడింగ్ చేస్తుంటుంది. -
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన పోలీసులు.. ఛేజ్ చేసి పట్టుకున్న అమ్మాయిలు
-
నిప్పుకోడిపై యువతి సవారీ.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..
-
Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు..
చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. మనం ఏం చేసినా అది మనకు తప్పక తిరిగి వస్తుందని భావిస్తుంటారు. ఎవరికైనా మంచి చేసినా లేదా హాని తలపెట్టినా దాని ఫలితం తప్పక అనుభవిస్తామని గట్టిగా నమ్ముతారు. అచ్చం ఇలాగే కొంత మంది తాము చేసిన ఘనకార్యానికి తక్షణ కర్మను ఎదుర్కొన్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్లో మార్చి 28న షేర్ చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో అయిదుగురు వ్యక్తులు దున్నపోతు మీద కూర్చొని రోడ్డు మీద సవారీ చేస్తున్నారు. వీళ్లు రోడ్డుపై బైక్‌పై, గుర్రం మీద వెళుతున్న మరికొంతమందితో పోటీపడి రైడ్ చేస్తున్నారు. పక్కన వెళుతున్న వారు హారన్లు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తుండటంతో.. దున్నపోతు కూడా వేగంగా వెళ్లాలని దాని మీద ఉన్న వ్యక్తులు దున్నపోతును రెండు దెబ్బలు వేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. చదవండి: భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే.. దెబ్బలు తిన్న దున్నపోతు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కుడివైపుకు తిరిగింది. బండి చక్రాలలో ఒకటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బండి మీదున్న అయిదుగురు వ్యక్తులు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జంతువులను చిత్ర హింసలు పెడితే తగిన శిక్ష అనుభవిస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ముగింపు ఇది. కర్మ తిరిగి పొందారు’ అని కామెంట్లు చేశారు. Karma 🙏 (Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO — Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022 -
వర్షంలో సైక్లింగ్ చేసిన సమంత.. వీడియో వైరల్
సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా హైదారాబాద్‌లోని రైడింగ్ గ్రూప్ సభ్యులతో కలిసి సైక్లింగ్ చేసిన వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమెతోపాటు కొంతమంది పారా సైక్లిస్టులు సరాదాగా రైడింగ్ చేశారు. ‘బెస్ట్ కంపెనీతో వర్షంలో రైడింగ్’ అనే దానికి క్యాప్షన్ ఇచ్చింది. సైక్లింగ్ ప్రారంభించిన మొదటి రోజే 21 కీమీ ప్రయాణించిన సామ్, 100 కీమీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పింది. దీని గురించి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఈ నటి ‘డే1, 21 కీమీ, 100 కీమీ.. నీ కోసం వస్తున్నా’ అని రాసుకొచ్చింది. ఇది పోస్ట్ కొద్ది గంటల్లోనే 2 లక్షలకుపైగా లైక్స్‌తో వైరల్ అయ్యింది. కాగా ఇటీవల సమంత, కీర్తీ సురేష్, త్రిష, కల్యాణి ప్రియదర్శన్‌తో చిల్ అవుతున్న ఫోటోని పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అలాగే తన రెండు కుక్కల పిక్స్ షేర్ చేసి వాటిపై తనకున్న ప్రేమని వ్యక్తపరిచింది. చదవండి: ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సామ్.. వైరల్ View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) -
సీఎం స్టాలిన్ సైక్లింగ్: ఈసీఆర్‌లో 20 కి.మీ ప్రయాణం
సాక్షి, చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ఈసీఆర్ మార్గంలో సైకిల్‌పై దూసుకెళ్లారు. ముట్టుకాడు నుంచి మహాబలిపురం వరకు 20 కి.మీ దూరం సైకిల్ తొక్కుతూ, మార్గ మధ్యలో ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. సీఎం స్టాలిన్ వ్యాయామం, సైక్లింగ్, వాకింగ్ చేస్తుంటారు. ప్రతి ఆదివారం ఈసీఆర్ మార్గంలో సైక్లింగ్ చేసేవారు. సీఎం అయినా ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తల్లో మార్పు లేదని చాటుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చిన ఓ ఆదివారం సైకిల్‌పై స్టాలిన్ దూసుకెళ్లారు. ఆ తర్వాత అధికారంలోకి రావడం, కరోనా కట్టడికి విస్తృతంగా సేవల్ని అందించడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కరోనా కట్టడికి వచ్చిన నేపథ్యంలో మళ్లీ సైకిల్ పయనంపై దృష్టి పెట్టారు. మార్గ మధ్యలో సెల్ఫీలు ఇది వరకు ఎలాంటి భద్రత లేకుండా ఒకరిద్దరితో కలిసి సైకిల్‌పై స్టాలిన్ వెళ్లేవారు. సీఎం కావడంతో భద్రతా పరంగా చర్యలు తప్పలేదు. ఎక్కడా ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈసీఆర్ మార్గంలో సైక్లింగ్ చేశారు. ఉదయాన్నే 15 మందితో కలిసి స్టాలిన్ ముట్టకాడు చేరుకున్నారు. అక్కడ రోడ్డుపక్కన ఉన్న ఓ దుకాణంలో తేనీరు సేవించి సైకిల్‌పై మహాబలిపురం వైపుగా 20 కి.మీ దూరం ప్రయాణించారు. సైకిళ్లు ముందుకు సాగుతుంటే, వెనుక ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు కదిలాయి. మార్గ మధ్యలో అక్కడక్కడ ప్రజలను స్టాలిన్ పలకరించారు. సెల్ఫీలు దిగారు. మహాబలిపురం వద్దకు చేరుకుని అక్కడి ఓ హోటల్లో తేనీరు సేవించి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. -
ఆలయం పైకి దూసుకెళ్లిన లారీ : కామారెడ్డి
-
బైక్ రైడింగ్‌తో నడుమునొప్పా.. అయితే ఇది మీకోసమే!
సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్ వంటి అంశాల్లో కొన్ని నిర్ణీత ప్రమాణాలను పాటిస్తుంటారు. బైక్ నడుపుతున్నప్పుడు ఆయా అవయవాలపై ఒత్తిడి పడకుండా ఉండేలాంటి (ఎర్గానమిక్స్) జాగ్రత్తలతో వాటిని తయారు చేస్తుంటారు. దాంతో దాదాపుగా అవయవ సమస్యలు రావు. ఒకవేళ బైక్‌లోని హ్యాండిల్‌బార్, సీట్, ఫుట్రెస్ట్స్ వంటి వివిధ అంశాలు సరైన ప్రమాణాలతో లేకపోతే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలా బైక్ ఎర్గానమిక్స్ సరిగా లేక నడుమునొప్పి వస్తుందని అనుమానిస్తుంటే ఈ కింది జాగ్రత్తలు పాటించడం మంచిది. ►బైక్‌ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ►మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. అలాగని మరీ దగ్గరగా కూడా ఉండకూడదు. ఈ రెండు అంశాల్లో ఎక్కడ తేడా వచ్చినా నడుమునొప్పి రావచ్చు. ►బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ►బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్‌ప్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి. నడుమునొప్పితో బాధపడేవారు తమ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, అలాగే వారు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. దాంతో నొప్పి తగ్గవచ్చు. ఈ జాగ్రత్తల తర్వాత కూడా నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడమే మంచిది. -
జాలీరైడ్‌కు వెళ్లి ప్రమాదానికి గురైంది
-
క్యాబ్ చార్జీ ఇక మీ చేతుల్లో...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ చార్జీల విషయంలో ఇప్పటి వరకు అగ్రిగేటర్లదే తుది నిర్ణయం. రైడింగ్, పీక్‌టైం, సర్జ్ వంటి పేర్లతో కస్టమర్లపై అదనపు భారం మోపుతున్నాయి. ఇలాంటిది లేకుండా చార్జీని వినియోగదార్లే నిర్ణయించుకునేలా అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ‘ఇన్‌డ్రైవర్’ తన సేవల్ని ప్రారంభించింది. ఈ సంస్థ డ్రైవర్ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోదు. కస్టమర్ నగదు రూపంలో చార్జీని డ్రైవర్‌కే చెల్లించాలి. ఇదెలా పని చేస్తుందంటే.. కస్టమర్ తాను ఎక్కవలసిన, దిగాల్సిన స్థలం నిర్దేశిస్తూ ఎంత చెల్లించేదీ యాప్‌లో సూచించాలి. సమీపంలో ఉన్న డ్రైవర్లకు ఈ సమాచారం వెళ్తుంది. కస్టమర్ చెల్లించదల్చుకున్న మొత్తం నచ్చకపోతే డ్రైవర్ బేరమాడవచ్చు. హైదరాబాద్‌లో 2,000 మంది డ్రైవర్లతో చేతులు కలిపామని ఇన్‌డ్రైవర్ ఇండియా పీఆర్ మేనేజర్ పవిత్ నందా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. బేస్ ఫేర్ రూ.40గా నిర్ణయించామన్నారు. ఆరు నెలల తర్వాత డ్రైవర్ల నుంచి 5–10 శాతం కమీషన్ తీసుకుంటామని చెప్పారు. -
ఓలా, ఉబెర్‌లకు షాక్ : నగరవాసులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : క్యాబ్ సర్వీసు సంస్థలు ఓలా, ఉబెర్‌తో విసిగిపోయిన హైదరాబాద్ వాసులకు శుభవార్త. ప్రధానంగా డిమాండ్‌ను బట్టి చార్జీలు, సర్ చార్జీలు బాదేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్న ప్రధాన క్యాబ్ సర్వీసులకు షాకిచ్చేలా టోరా క్యాబ్స్ పేరుతో నగరంలోకి కొత్త క్యాబ్ సర్వీసుల సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ‘జీరో సర్జ్, జీరో కమిషన్ క్యాబ్స్’ లక్ష్యమని టోరా ప్రకటించడం విశేషం. అంతేకాదు తమ యాప్ ఆధారిత సర్వీసు ద్వారా పారదర్శక బిజినెస్‌తో అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు ఇద్దరికీ ప్రయోజనాలు అందించాలని భావిస్తోంది. జూన్ 12న పైలట్ వెర్షన్‌గా సేవలను ప్రారంభించిన టోరా క్యాబ్స్ వచ్చే 45 రోజుల్లో పూర్తి సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొరియన్ సంస్థ భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నామని టోరా క్యాబ్స్ డైరెక్టర్ ఎస్.బి. షిన్ చెప్పారు. తన సేవలను తొలుత హైదరాబాద్‌లోనే ప్రారంభించడం విశేషమన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 1500 మంది డ్రైవర్లు తమ ప్లాట్‌ఫాంపై రిజిస్టరై ఉన్నారని, మరో 45 రోజుల్లో ఈ సంఖ్య 4 వేలకు చేరుతుందని టోరా క్యాబ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ కవితా భాస్కరన్ ప్రకటించారు.ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతమైన, ప్రయోజనం కల్గించే విధానాన్ని టోరా ప్రవేశపెడుతోందని అన్నారు. టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(టీటీఎస్‌పీఎల్) డ్రైవర్లు కేవలం రోజువారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.199, వారానికి రూ. 1194 నెలకు రూ.4975గా నిర్ణయించింది. ఇది మినహా ఎలాంటి కమిషన్లు తీసుకోదు. దీనికి తోడు కంపెనీ నుంచి డ్రైవర్లు రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ను పొందుతారు. అలాగే ప్రయాణికుల నుంచి ఎలాంటి సర్‌ఛార్జ్‌ను వసూలు చేయమని మినిమమ్ ఛార్జీగా మూడు కిలోమీటర్లకు రూ.39 వసూలు చేయనున్నామని, ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్‌కు బేస్ ఛార్జీగా రూ.8ను విధించనున్నామని ఆమె పేర్కొన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అధిక చార్జీలు వసూలు చేయబోమని ఆమె స్పష్టం చేశారు. -
కలకలం సృష్టిస్తోన్న ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు దాక్కున్నారనే అనుమానంతో పలువురి ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి పలు ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కోణంలో 8 మంది అనుమానితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. ఈ మేరకు కింగ్స్ కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు. గతంలో పట్టుబడ్డ బాసిత్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలతోనే అనుమానితులను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మాడ్యుల్ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన యువకులు ఢిల్లీలో భారీ విధ్వంసాలకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం వారు రసాయనాలను, డబ్బులను సమకూర్చుకుంటున్నారు. గతంలోనే.. ఢిల్లీలోని ఆర్ఎస్సెస్ నాయకుడి హత్యకు కుట్రలు పన్నారని.. ఈమేరకు వారికి ఐసిస్ నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఆర్ఎస్సెస్ నాయకుడి హత్యకు ఢిల్లీ వెళ్లిన బాసిత్, నలుగురు యువకులకు ఏకే 47లను ఐసిస్ సమకూర్చింది. ఢిల్లీలో ఆ నలుగురు యువకులను అరెస్ట్ చేయడంతో.. ప్లాన్ విఫలమైంది. దీంతో బాసిత్ హైదరాబాద్‌కు తిరిగొచ్చేశాడు. హైదరాబాద్‌లో బాసిత్ పాటు మరో ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఒకరిని అదుపులోకి.. ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఓ యువకుడి (తహన్)ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తహన్‌ను గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తోంది. -
కోహ్లి, ధోని.. ఏం చేశారో చూడండి
నేపియర్: న్యూజిలాండ్ గడ్డపై శుభారంభం చేసిన టీమిండియా మంచి ఊపుమీద ఉంది. బుధవారం జరిగిన మొదటి వన్డేలో కివీస్‌ను చిత్తుగా ఓడించి కోహ్లి సేన భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మెక్లీన్ మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని కాసేపు సందడి చేశారు. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టూవీలర్ ‘సెగ్వే’పై చక్కర్లు కొట్టారు. (కివీస్ గడ్డపై తొలి వన్డే మనదే!) ముందుగా కోహ్లి దీనిపై హుషారుగా ప్రయాణించాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ అక్కడున్నవారిని అలరించాడు. తర్వాత ధోని కూడా తనదైన శైలిలో కూల్‌గా చక్కర్లు కొట్టాడు. బీసీసీఐ ట్వీట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా మైదానం సిబ్బంది సులువుగా ప్రయాణించేందుకు ‘సెగ్వే’ను వినియోగిస్తారు. కాగా, భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే ఈనెల 26న జరగనుంది. Post-game shenanigans courtesy @msdhoni & @imVkohli This looks fun 😁😁😁#TeamIndia #NZvIND pic.twitter.com/0EXXHYh2v7 — BCCI (@BCCI) 23 January 2019 -
గాలిలో తేలి.. తేలి.. తేలిపొండి!
హైదరాబాద్: నగర యువతకు రాష్ట్ర టూరిజం అడ్వెంచర్ స్పోర్ట్స్ విభాగం పారా మోటర్ రైడింగ్‌ను ప్రారంభించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బైసన్‌పోలో మైదానంలో ఆదివారం ప్రారంభమైన ఈ రైడింగ్ మరో 2 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ మహేందరెడ్డి, టూరి జం ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, తెలంగాణ, ఆంధ్ర సబ్‌ఏరియా కమాండింగ్ ఆఫీసర్, మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. డీజీ పీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ రైడ్‌ను ప్రజలు ఎంజాయ్ చేయాలన్నారు. టూరిజం ప్రిన్సిపల్ సెక్రెట రీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ కేవలం రూ.2,500 చెల్లిస్తే గాలిలో డ్రైవ్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ రైడ్ ఉంటుందన్నారు. -
ఈ మేకలకు నేనే.. మేస్త్రీ
గోస్పాడు: ముఠామేస్త్రీ సినిమాలో చిరంజీవి పాడుకున్నట్లు ఇదిగో ఇక్కడో ఓ వానరం నడవడం కూడా ఎందుకని ఓ మేకపై కూర్చుని ఆ గుంపుకు మేస్త్రీ తరహాలో చిరంజీవిలా తెగఫీలైపోతోంది. ప్రతిరోజూ ఓ మేకపై కూర్చొని మంద వెంట పొలానికి వెళ్లడం, తిరిగి ఇంటికి రావడం ఈ వానరానికి పెద్ద ఫ్యాషనైపోయింది. గోస్పాడు మండలం రాయపాడు వద్ద ఈ దృశ్యం సాక్షి కెమెరాకు దొరికింది. బనగానపల్లె మండలం టంగుటూరుకు చెందిన గుర్రప్పతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ వానరం నిత్యం అతని గొర్రెల మంద వెంటే ఉంటుంది. ప్రతిరోజూ అతనితోపాటు మేకలపై కూర్చొని పొలానికి వెళ్తుంది. తిరిగి మేకలపై కూర్చొని ఇంటికి వస్తుంది. ఈ దృశ్యాన్ని గమనించిన జనం ‘అహా.. ఏమీ ఈ వానరుని దర్జా ’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఐటీడీఏలో ఏసీబీ సోదాలు
సీతంపేట: ఆదాయానికి మించీ ఆస్తులు ఉన్నాయని ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు ఉంటున్న సీతంపేట ఐటీడీఏ బంగ్లాలో మంగళవారం విస్త్రతంగా సోదాలు జరిగాయి. ఉదయం ఐదున్నర గంటలకే ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో బృందం రంగంలోకి దిగి సాయింత్రం 5 గంటల వరకు విచారణ చేశారు. ముందుగా ఐటీడీఏ కార్యాలయంలో తనికీలు జరిపిన అనంతరం పీవో ఉంటున్న బంగ్లాను ఏసీబీ తన ఆదీనంలోకి తీసుకుని తనికీలు జరిపింది. ఇంట్లో ఉన్న పైళ్లు,ఇతర పత్రాలు, వెండి, బంగారు ఆబరణాలు వంటì వాటిని స్వాదీనం చేసుకుని లెక్కకట్టారు. ఈసందర్బంగా డీఎస్పీ రంగరాజు మాట్లాడుతూ అన్ని చోట్ల తనికీల అనంతరం మొదటి రోజు కోటి పది లక్షలు వరకు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు గుర్తించామని తెలిపారు. ఇంకా విచారణ సాగుతుందన్నారు. శ్రీకాకుళం,ఆముదాలవలసలలో రెండు ప్లాట్లు, విశాఖపట్నం సీతమ్మదారలో ఒక ప్లాట్, ఆరిలోవకాలనీలో మరో ఇల్లు, ఆముదాలవలసలో ఒక ఇళ్లు, ఒక కారు ఉన్నట్టు గుర్తించామన్నారు. రాజాంలో రెండు ప్లాట్లుకు రియల్ ఎస్టేట్ కడుతున్నట్టు తమ పరిశీలినలో వెల్లడైందన్నారు. బంగారం, వెండి వస్తువులు ఉన్నాయని వాటి వెల కడుతున్నట్టు తెలిపారు. విశాఖపట్టణంలో ఉన్న రెండు లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉందన్నారు. ఏకకాలంలో 8 బృందాలు సోదా చేస్తున్నట్టు తెలిపారు. శ్రీకాకుళం, ఆముదాలవలస, రాజాం, పాలకొండ, విజయనగరం, విశాఖపట్నం ఏలూరు తదితర చోట్ల బందువుల ఇళ్లల్లో ఒక డీఎస్పీతో పాటు మరో 9 మంది ఇన్స్పెక్టర్లు సోదా చేస్తున్నట్టు తెలిపారు. తనికీలు పూర్తి అయిన తర్వాత పీవోను అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో పీవోను విచారించి స్టేట్ మెంట్ తీసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. కాగా కొన్ని ఫైల్‌లను కూడా పరిశీలించి వాటిని కూడా ఏసీబీ అధికారులు సీజ్‌చేసినట్టు తెలియవచ్చింది. తనికీల్లో సీఐ లక్ష్మోజి, ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉలిక్కిపడిన ఐటీడీఏ... మునుపెన్నడూ లేని విధంగా ఐటీడీఏలో ఏసీబీ సోదాలు జరిగాయనే వార్త దావనంలో వ్యాపించడంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఎప్పుడు లేని విదంగా దాడులు జరగడంతో అంతాచర్చనీయంశమైంది. మంగళవారం అంతా ఇదే చర్చనీయంశమైంది. ఐటీడీఏ ఏర్పడి మూడు దశాబ్దాలైంది. ఇప్పటి వరకు ఏ పీవో కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన లేదని అధికారులు, సిబ్బంది గుసగుసలాడడం కనిపించింది. -
నాడు తండ్రి, నేడు కుమారుడు..
జంబూ సవారీని విజయవంతంగా నడిపించిన మావటి మహేష్ నాడు తండ్రి జంబూ సవారీని విజయవంతంగా నడిపించగా నేడు కుమారుడు అదే బాధ్యతను తన భుజనపై వేసుకుని 2016 జంబూ సవారీని మావటి మహేష్ విజయవంతంగా నడిపించాడు. 750 కిలోల బరువున్న బంగారు అంబారీని మోస్తున్న అర్జున తొలి అడుగు వేసే ముందు తన తండ్రి దొడ్డమాస్తిని గుర్తుకు చేసుకుని ధైర్యంగా అర్జునను నడిపించానని మహేష్ అన్నారు. మావటిగా తొలి అనుభవాన్ని ఆయన మీడియాతో మాట్లాడారు. జంబూ సవారీలో పాల్గొనే ముందు అర్జున గుణ గణాలను తన తండ్రి ద్వారా తెలుసుకుని, ఏడాదిగా అర్జునను గమనిస్తున్నట్లు చెప్పారు. కొన్నేళ్లుగా తన తండ్రి సంరక్షణలో అర్జున నడిచిందని, జంబు సవారీలో తొలి అనుభవాన్ని తాను మరిచిపోలేనని మహేష్ అన్నారు. -
బెజవాడ రెస్టారెంట్లలో సీటీవోల తనిఖీలు
విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖాధికారులు గురువారం నగరంలోని 15 రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. విజయవాడ రాజధానిగా మారినప్పటికీ రెస్టారెంట్ల నుంచి పన్నుల రాబడి పెరగకపోవడంతోపాటు పుష్కరాల సందర్భంగా ఆశించిన రాబడి రాకపోవడంతో ఆగ్రహించిన ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు సీటీవో స్థాయి అధికారుల్ని 15 బృందాలుగా ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించారు. బందరురోడ్డు, ఏలూరురోడ్డు, మొగల్రాజపురంలోని రెస్టారెంట్లతో పాటు రెండు మూడు బ్రాంచీలు కలిగిన రెస్టారెంట్లపైన అధికారులు దృష్టిసారించినట్లు తెలిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు జరిగాయి. పుష్కరాల్లో అంత సీన్ లేదు పుష్కరాల సందర్భంగా రెస్టారెంట్లలో ఆశించిన స్థాయిలో వ్యాపారం సాగలేదని నిర్వాహకులు చెబుతున్నారు. పుష్కరాల రోజుల్లో అక్షయప్రాత, టీటీడీ, దుర్గగుడి వంటి ధార్మిక సంస్థలు పెద్దఎత్తున అన్నదాన ప్రసాదాలు వితరణ చేశాయని, అనేక స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేయడంతో కొన్ని రెస్టారెంట్లు సాధారణ రోజుల్లో కంటే తక్కువ వ్యాపారాలు చేసినట్లు తెలిసింది. అందువల్లనే పన్నులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ కట్టలేదు. ఇదిలా ఉండగా అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న ఒకటి, రెండు రెస్టారెంట్ల జోలికి అధికారులు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఢిల్లీ ఇండియగేట్ వద్ద బైక్ రైడింగ్
-
యు ముంబా డబుల్ హ్యాట్రిక్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు దూకుడు కనబరుస్తోంది. గురువారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39-18తో ఘనవిజయం సాధిం చింది. ఈ జట్టుకు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. దీంతో ఆడిన పది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలందుకున్న ముంబా 40 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రథమార్ధంలో 16-5తో ఆధిక్యంలో ఉన్న ముంబాకు ఆ తర్వాత కూడా ప్రత్యర్థి నుంచి ఎలాంటి అడ్డంకి ఎదురుకాలేదు. కెప్టెన్ అనూప్ కుమార్, రిశాంక్ దేవడిగ ఆరేసి రైడింగ్ పాయింట్లు సాధించారు. బెంగళూరు నుంచి పవన్ కుమార్ నాలుగు రైడింగ్ పాయింట్లు సాధించాడు. పట్నా జోరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమ అగ్రస్థానాన్ని పట్నా పైరేట్స్ జట్టు మరింత పటిష్టం చేసుకుంది. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిన ఈ జట్టు... గురువారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 67-34 తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. లీగ్‌లో అట్టడుగున ఉన్న ఢిల్లీ ఆటగాళ్లు ఏస్థాయిలోనూ ఆకట్టుకోలేకపోయారు. ప్రారంభం నుంచే చెలరేగిన పట్నా ఆటగాళ్లు వరుసగా పాయింట్లు సాధిస్తూ ఢిల్లీపై పైచేయి సాధించారు. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి 37-17తో జోరు మీదుంది. పట్నా తరఫున కెప్టెన్ రోహిత్ కుమార్ అత్యధికంగా 15 రైడ్ పాయింట్లు సాధించగా ఢిల్లీ జట్టులో సుర్జీత్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించాడు. -
30 రోజుల్లో అధ్యక్షుడిని అంతం చేస్తాం!
మాల్దీవులు: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్‌ను 30 రోజుల్లో హత్య చేస్తామని ఓ వీడియో యూట్యూబ్‌లో హల్ చల్ చేసింది. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు వెంటనే స్పందించి దానిని పోస్ట్ చేసిన 'సాంగు టీవీ' అనే ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌పై రైడింగ్ నిర్వహించాయి. ఆ చానెల్లోని ఉద్యోగుల్లో ఎవరో ఒకరు దానిని పోస్ట్ చేసి ఉంటారని, ఉగ్రవాద కార్యకలాపాలకు వారు సహకరిస్తున్నారని అనుమానంతో సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా మొత్తం 27 కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నాయి. అత్యవసర పరిస్థితి విధించిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అక్కడ సంచలనంగా మారింది. ఈ ఘటనపై టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రహీం వహీద్ స్పందిస్తూ ఈ వీడియోను తాము అప్లోడ్ చేయలేదని, అనవసరంగా తమ చానెల్‌పై బలగాలు దాడులు నిర్వహించి సోదాలు చేసి ప్రసార కార్యక్రమాలు ఆపేశాయని చెప్పారు. 'ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనుకకు తీసుకోవాలి. ఈ మేరకు చేసిన చట్టాన్ని కూడా రద్దు చేయాలి. లేదంటే 30 రోజుల్లోగా అధ్యక్షుడు, టూరిజం మంత్రులపై దాడులు చేస్తాం. హత్యలు చేస్తాం. ఉగ్రవాద కార్యకలాపాలతో హోరెత్తిస్తాం' అంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పేరిట యూట్యూబ్‌లో మాల్దీవుల అధ్యక్షుడిని బెదిరిస్తూ ఓ వీడియో సంచలనం రేపింది. దీని గురించి పోలీసులు కోర్టు అనుమతితో ఆరా తీయగా అది 'స్లావరీ స్లేవ్' అనే పేరుతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సంకేతంతో పోస్ట్ చేశారు. ఇది సాంగు టీవీ పేరిట యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసినట్లుగా ఉంది. -
ధర్మభేరి
కోసలరాజుకు ఏనుగుల మీద స్వారీ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన గజశాలలో మంచి మంచి ఏనుగుల్ని పెంచేవారు. వాటిలో ఒక అందమైన ఏనుగుంది. అది ఎంతో ఉల్లాసంగా, బలంగా ఉండేది. యుద్ధరంగంలో విజృంభించేది. ఒరోజు అది ఒక కొలనులో దిగి, అనుకోకుండా బురదలో దిగబడి పోయింది. ఎంత ప్రయత్నించినా ఒడ్డుకు రాలేకపోయింది. ఆ కొలను ఆవలి గట్టు మీద బుద్ధుడు తన శిష్యులతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. భటులు బుద్ధుని దగ్గరకు వెళ్లి, గజరాజం ఒడ్డుకు చేరే మార్గం బోధించమన్నారు. బుద్ధుడు వారితో ‘వెంటనే పోయి యుద్ధభేరీలు తెచ్చి మోగించండి’’ అన్నాడు. భటులు వెళ్లి- భేరీలు తెచ్చి మోగించారు. ఆ భేరీనాదం విన్న వెంటనే ఏనుగులో ఉత్సాహం పెల్లుబుకింది. ఒక్కసారిగా ముందుకు కదిలింది. బురదలోనుండి ఒక్క ఉదుటున ఒడ్డుకు ఎక్కి ఘీంకరించింది. రాజభటులు సంతోషపడ్డారు. వినమ్రంగా బుద్ధునికి నమస్కరించి వెళ్లిపోయారు. అప్పుడు బుద్ధుడు తన శిష్యులతో ‘‘చూశారా! భేరీ నాదంతో ఆ గజరాజం క్లేశాలనుంచి బైటపడింది. అలాగే మనం కూడా అనేక క్లేశాల బురదలో దిగబడిపోతాం. వీటినుండి బైటపడాలంటే మనం ధర్మం అనే భేరీనాదం వినాలి. అప్పుడు మాత్రమే ఈ ఊబినుండి బైటపడగలం.’’ అని హెచ్చరించాడు. శ్రద్ధగా విని భిక్షువులు బుద్ధునికి నమస్కరించారు. - బొర్రా గోవర్ధన్ -
180 కోట్లతో తెరకెక్కుతున్న ఐ