
నేపియర్: న్యూజిలాండ్ గడ్డపై శుభారంభం చేసిన టీమిండియా మంచి ఊపుమీద ఉంది. బుధవారం జరిగిన మొదటి వన్డేలో కివీస్‌ను చిత్తుగా ఓడించి కోహ్లి సేన భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మెక్‌లీన్ మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని కాసేపు సందడి చేశారు. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టూవీలర్ ‘సెగ్‌వే’పై చక్కర్లు కొట్టారు. (కివీస్ గడ్డపై తొలి వన్డే మనదే!)
ముందుగా కోహ్లి దీనిపై హుషారుగా ప్రయాణించాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ అక్కడున్నవారిని అలరించాడు. తర్వాత ధోని కూడా తనదైన శైలిలో కూల్‌గా చక్కర్లు కొట్టాడు. బీసీసీఐ ట్వీట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా మైదానం సిబ్బంది సులువుగా ప్రయాణించేందుకు ‘సెగ్‌వే’ను వినియోగిస్తారు. కాగా, భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే ఈనెల 26న జరగనుంది.
Post-game shenanigans courtesy @msdhoni & @imVkohli
— BCCI (@BCCI) 23 January 2019
This looks fun 😁😁😁#TeamIndia #NZvIND pic.twitter.com/0EXXHYh2v7
Comments
Please login to add a commentAdd a comment