ఐటీడీఏలో ఏసీబీ సోదాలు | ACB RIDES ON ITDA | Sakshi
Sakshi News home page

ఐటీడీఏలో ఏసీబీ సోదాలు

Published Tue, Nov 1 2016 11:20 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

అదుపులోకి తీసుకున్న పైళ్లు, ఆబరణాలు - Sakshi

అదుపులోకి తీసుకున్న పైళ్లు, ఆబరణాలు

సీతంపేట: ఆదాయానికి మించీ ఆస్తులు ఉన్నాయని ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు ఉంటున్న సీతంపేట ఐటీడీఏ బంగ్లాలో మంగళవారం విస్త్రతంగా సోదాలు జరిగాయి. ఉదయం ఐదున్నర గంటలకే ఏసీబీ డీఎస్‌పీ రంగరాజు నేతృత్వంలో బృందం రంగంలోకి దిగి సాయింత్రం 5 గంటల వరకు విచారణ చేశారు. ముందుగా ఐటీడీఏ కార్యాలయంలో తనికీలు జరిపిన అనంతరం పీవో ఉంటున్న బంగ్లాను ఏసీబీ తన ఆదీనంలోకి తీసుకుని తనికీలు జరిపింది.
 
ఇంట్లో ఉన్న పైళ్లు,ఇతర పత్రాలు, వెండి, బంగారు ఆబరణాలు వంటì  వాటిని స్వాదీనం చేసుకుని లెక్కకట్టారు. ఈసందర్బంగా డీఎస్‌పీ రంగరాజు మాట్లాడుతూ అన్ని చోట్ల తనికీల అనంతరం మొదటి రోజు కోటి పది లక్షలు వరకు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు గుర్తించామని తెలిపారు. ఇంకా విచారణ సాగుతుందన్నారు. శ్రీకాకుళం,ఆముదాలవలసలలో రెండు ప్లాట్లు, విశాఖపట్నం సీతమ్మదారలో ఒక ప్లాట్, ఆరిలోవకాలనీలో మరో ఇల్లు, ఆముదాలవలసలో ఒక ఇళ్లు, ఒక కారు ఉన్నట్టు గుర్తించామన్నారు. రాజాంలో రెండు ప్లాట్లుకు రియల్‌ ఎస్టేట్‌ కడుతున్నట్టు తమ పరిశీలినలో వెల్లడైందన్నారు.
 
బంగారం, వెండి వస్తువులు ఉన్నాయని వాటి వెల కడుతున్నట్టు తెలిపారు. విశాఖపట్టణంలో ఉన్న  రెండు లాకర్లు ఓపెన్‌ చేయాల్సి ఉందన్నారు. ఏకకాలంలో 8 బృందాలు సోదా చేస్తున్నట్టు తెలిపారు. శ్రీకాకుళం, ఆముదాలవలస, రాజాం, పాలకొండ, విజయనగరం, విశాఖపట్నం ఏలూరు తదితర చోట్ల బందువుల ఇళ్లల్లో ఒక డీఎస్‌పీతో పాటు మరో 9 మంది ఇన్స్‌పెక్టర్‌లు సోదా చేస్తున్నట్టు తెలిపారు. తనికీలు పూర్తి అయిన తర్వాత పీవోను అదుపులోకి తీసుకుంటామని డీఎస్‌పీ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో పీవోను విచారించి స్టేట్‌ మెంట్‌ తీసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. కాగా కొన్ని ఫైల్లను కూడా పరిశీలించి వాటిని కూడా ఏసీబీ అధికారులు సీజ్‌చేసినట్టు తెలియవచ్చింది.  తనికీల్లో సీఐ లక్ష్మోజి, ఎస్‌ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 
 
ఉలిక్కిపడిన ఐటీడీఏ...
మునుపెన్నడూ లేని విధంగా ఐటీడీఏలో ఏసీబీ సోదాలు జరిగాయనే వార్త దావనంలో వ్యాపించడంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఎప్పుడు లేని విదంగా దాడులు జరగడంతో అంతాచర్చనీయంశమైంది. మంగళవారం అంతా ఇదే చర్చనీయంశమైంది. ఐటీడీఏ ఏర్పడి మూడు దశాబ్దాలైంది. ఇప్పటి వరకు ఏ పీవో కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన లేదని అధికారులు, సిబ్బంది గుసగుసలాడడం కనిపించింది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement