
నాడు తండ్రి, నేడు కుమారుడు..
జంబూ సవారీని విజయవంతంగా నడిపించిన మావటి మహేష్
నాడు తండ్రి జంబూ సవారీని విజయవంతంగా నడిపించగా నేడు కుమారుడు అదే బాధ్యతను తన భుజనపై వేసుకుని 2016 జంబూ సవారీని మావటి మహేష్ విజయవంతంగా నడిపించాడు. 750 కిలోల బరువున్న బంగారు అంబారీని మోస్తున్న అర్జున తొలి అడుగు వేసే ముందు తన తండ్రి దొడ్డమాస్తిని గుర్తుకు చేసుకుని ధైర్యంగా అర్జునను నడిపించానని మహేష్ అన్నారు. మావటిగా తొలి అనుభవాన్ని ఆయన మీడియాతో మాట్లాడారు.
జంబూ సవారీలో పాల్గొనే ముందు అర్జున గుణ గణాలను తన తండ్రి ద్వారా తెలుసుకుని, ఏడాదిగా అర్జునను గమనిస్తున్నట్లు చెప్పారు. కొన్నేళ్లుగా తన తండ్రి సంరక్షణలో అర్జున నడిచిందని, జంబు సవారీలో తొలి అనుభవాన్ని తాను మరిచిపోలేనని మహేష్ అన్నారు.