7 Boys Riding a Bike Last One Sat on the Shoulder - Sakshi
Sakshi News home page

ఇదేందిది.. ఒక్క బైక్‌పై ఏడుగురా?.. ఆఖరోడు అలా కూర్చున్నాడేంటి?

Published Thu, Aug 10 2023 1:36 PM | Last Updated on Thu, Aug 10 2023 3:02 PM

7 boys riding a bike last one sat on the shoulder - Sakshi

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ లేక్కలేనన్ని చర్యలు చేపడుతోంది. అయినా కొందరు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, వాహనాలను ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారు. తాజగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ బైక్‌పై ఒకరో, ఇద్దరో కాదు ఏకంగా ఏగుగురు కుర్రాళ్లు రయ్యిమని దూసుకుపోతున్నారు. పైగా వారు తామేదో ఘనకార్యం చేశామన్నట్టు ఫీలవుతున్నారు. 

ఈ వీడియో యూపీలోని హాపూర్‌కు చెందినదని తెలుస్తోంది. ఏడుగురు కుర్రాళ్లు నిర్భయంగా బైక్‌పై కూర్చుని ప్రయాణించడాన్ని వీడియోలో చూడవచ్చు. వారిలో చివరనున్న కుర్రాడు ముందునున్న కుర్రాడిపై ఎక్కి కూర్చున్నాడు. 22 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో బైక్‌పై కూర్చున్న కుర్రాళ్ల తీరు చూస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. అయితే ఆ బైక్‌పై ఉన్నవారితో కించిత్తు ఆందోళన కూడా లేకపోవడం విశేషం. ఈ వీడియోను చూసినవారంతా ఆ కుర్రాళ్లపై పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను @Akshara117 అనే ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. 
ఇది కూడా చదవండి: పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్‌ ఇలా..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement