byke
-
టాటా చెప్పి వెళ్లొస్తా మమ్మీ అని.. చివరికి తండ్రి ముందే
బనశంకరి(బెంగళూరు): బెంగళూరు నగరంలో ఘోరం జరిగింది. బీఎంటీసీ బస్సు మృత్యుశకటమై నాలుగు సంవత్సరాల బాలికను బలిగొంది. ఈ విషాద ఘటన కుమారస్వామిలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఉత్తరహళ్లి నివాసి ప్రసన్న సిస్కో కంపెనీలో పనిచేస్తున్నాడు. కుమార్తె పూర్వీరావ్ బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీకేజీ చదువుతోంది. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు సిద్దమైంది. తల్లికి టాటా చెప్పి, వెళ్లోస్తా అని తండ్రి ప్రసన్న బైక్ ఎక్కింది. ఉత్తరహళ్లి మెయిన్‌రోడ్డు పద్మావతి సిల్క్షోరూమ్ వద్ద వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్ బైక్‌ను ఢీకొంది. తండ్రీకుమార్తె కిందపడగా చిన్నారిపై బస్సు చక్రాలు వెళ్లాయి. ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారస్వామి లేఔట్ ట్రాఫిక్ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి వివాహేతర సంబంధం.. ముందే వార్నింగ్.. ప్రియుడు ఇంట్లోకి రాగానే.. -
ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుంటే
సీతంపేట/బూర్జ(శ్రీకాకుళం): సీతంపేట ఏజెన్సీలోని గొయిది గ్రామ సమీపంలో సోమవారం ఓ బైక్, ఆటో ఢీనండంతో జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం గుత్తవల్లికి చెందిన పైడి వసంతకుమారి (17) మృతి చెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుత్తవల్లి పక్కగ్రామానికి చెందిన యువకుడు కూన వెంకటేష్, వసంతకుమారి బైక్‌పై సీతంపేట వచ్చారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై ఇద్దరూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో గాయాలపాలవగా యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇద్దరినీ 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడు వెంకటేష్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, సత్యనారాయణ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.నీలకంఠరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
ఇదేందిది.. ఒక్క బైక్‌పై ఏడుగురా?.. ఆఖరోడు అలా కూర్చున్నాడేంటి?
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ లేక్కలేనన్ని చర్యలు చేపడుతోంది. అయినా కొందరు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, వాహనాలను ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారు. తాజగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ బైక్‌పై ఒకరో, ఇద్దరో కాదు ఏకంగా ఏగుగురు కుర్రాళ్లు రయ్యిమని దూసుకుపోతున్నారు. పైగా వారు తామేదో ఘనకార్యం చేశామన్నట్టు ఫీలవుతున్నారు. ఈ వీడియో యూపీలోని హాపూర్‌కు చెందినదని తెలుస్తోంది. ఏడుగురు కుర్రాళ్లు నిర్భయంగా బైక్‌పై కూర్చుని ప్రయాణించడాన్ని వీడియోలో చూడవచ్చు. వారిలో చివరనున్న కుర్రాడు ముందునున్న కుర్రాడిపై ఎక్కి కూర్చున్నాడు. 22 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో బైక్‌పై కూర్చున్న కుర్రాళ్ల తీరు చూస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. అయితే ఆ బైక్‌పై ఉన్నవారితో కించిత్తు ఆందోళన కూడా లేకపోవడం విశేషం. ఈ వీడియోను చూసినవారంతా ఆ కుర్రాళ్లపై పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను @Akshara117 అనే ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇది కూడా చదవండి: పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా.. Video of 7 people riding a bike in #Hapur goes viral, raising questions on the working style of Hapur police. #Viralvideo pic.twitter.com/wfMfjkOkdF — Akshara (@Akshara117) August 9, 2023 -
సిగరెట్ కొనివ్వలేదని.. బాలుడిని కిరాతకంగా చంపాడు
హోసూరు(బెంగళూరు): అడిగిన వెంటనే సిగరెట్ కొనివ్వలేదని ఓ వ్యక్తి బాలుడి ప్రాణం తీసిన ఘటన క్రిష్ణగిరి తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు.. క్రిష్ణగిరి సమీపంలోని పాంచాలియూరు గ్రామానికి చెందిన ఇర్ఫాన్ (14) అదే ప్రాంతంలోని మద్యంషాపు వద్ద బుధవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడున్న ఓ మందుబాబు బాలున్ని పిలిచి దుకాణంలో సిగరెట్ కొనిపెట్టాలన్నాడు. అందుకు బాలుడు నిరాకరించాడు. ఆగ్రహంతో బాలుడిపై మందుబాబు తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడు. విషయం తెలుసుకొన్న బాలుడి బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. క్రిష్ణగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో శాంతి చర్చలు జరిపారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి.. -
Video: కారు బీభత్సం.. గాల్లో ఎగిరిపడ్డ విద్యార్థులు
బెంగళూరు: ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవరూ ఊహించలేరు. రోడ్డు ప్రమాదాలైతే మరీ దారుణం, మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినప్పటికీ అవతల వాహనదారుడి నిర్లక్ష్యం వల్ల కూడా మనం ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. తాజాగా ఓ కారు నడుపతున్న వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ని ఢీ కొట్టింది. అనంతరం అటుగా నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో చోటు చే''కుంది. అతివేగంగా వెళ్తున్న కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన ఘోర రోడ్డు ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జూలై 18న రాయచూర్‌లోని శ్రీరామ దేవాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం. నిమిషానికి పైగా నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజీలో కాలేజీ అమ్మాయిలు వాహనాలు వెళుతుండగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. కారు దూసుకువచ్చి బైక్‌ను ఢీ కొట్టి అనంతరం పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు కాలేజీ అమ్మాయిలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సహా విద్యార్థులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇంత ప్రమాదం జరిగినా కారు నడుపుతున్న వ్యక్తి కనీసం వారికి ఏమైందని కూడా చూడకుండా వేగంగా కారు నడుపుకుంటా వెళ్లిపోయాడు.ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై రాయచూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం, బైకర్ రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ರಾಯಚೂರಿನ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ರಸ್ತೆಯಲ್ಲಿ ಕಾರು ಹಾಯ್ದ ರಭಸಕ್ಕೆ ಇಬ್ಬರು ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರು ಹಾರಿ ಬಿದ್ದ ದೃಶ್ಯ#raichur pic.twitter.com/9BrsoFevc3 — Prajavani (@prajavani) July 26, 2023 చదవండి పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు.. ఆమె తండ్రి ఏమన్నాడంటే..? -
ఊహించని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు.. చూడగానే టీచర్ ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు
చెన్నై: తల్లి, తండ్రి, గురువు అంటారు.. వీళ్లు ముగ్గురు జీవితంలో చాల కీలకమైన వాళ్లుగా మన పెద్దలు చెబుతుంటారు. తల్లిదండ్రులు నీకు ఆలనాపాలనా చూస్తే , గురువులు నీకు విద్యా బుద్దులు నేర్పించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి గురువుకి కొందరు విద్యార్థులు ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా ఊహించిన బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ ఘటన తిరువారూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి తమ గుర్తుగా ఓ చిరు కానుకను అందజేశారు. తిరువారూరు జిల్లా ముత్తుపేట సమీపంలోని అలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రామన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన 1988 జూన్ 27న ఈ స్కూల్లో చేరి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ క్రమంలో రామన్ ఉద్యోగ విరమణ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని మాలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఆయనకు రూ.లక్ష విలువైన ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందజేశారు. ఉపాధ్యాయుడు రామన్‌ను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. విద్యార్థులు తనపై చూపిన ప్రేమకు ఆ ఉపాధ్యాయుడికి ఆనందంతో కంట కన్నీళ్లు ఆగలేదు. చదవండి: బస్సు వైపు కోపంగా దూసుకొచ్చిన ఏనుగు.. ఇదే చివరి రోజు అనుకున్నారు.. కానీ ఫైనల్‌గా -
నితీశ్ కుమార్ వైపు దూసుకొచ్చిన బైక్.. అప్రమత్తమై పుట్‌పాత్ పైకి దూకడంతో..
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం చోటు చేసుకుంది. సీఎం ఎప్పటిలానే తన ఇంటి నుంచి వాకింగ్ కోసమని బైటకు వచ్చారు. అంతలో అటుగా వస్తున్న ఓ బైకర్ సీఎం సెక్యూరిటీ బలగాలను దాటుకుని నితీశ్ వైపుకు దూసుకొచ్చాడు. చూస్తుండగానే సీఎంకు అత్యంత సమీపానికి వచ్చేశాడు. దీంతో అప్రమత్తమైన నితీశ్ వెంటనే రోడ్డుపై నుంచి పుట్పాతవైపు దూకాల్సి వచ్చింది. సీఎం తన నివాసం నుంచి సర్క్యులర్ రోడ్డులోని వాకింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం బైకర్‌ను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండెంట్, పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నరు. ప్రస్తుతం అధికారులు దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ‘నీట్’ని క్రాక్ చేసిన కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. -
ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా యూఎస్‌లో 63 శాతం, మరి భారత్‌లో ఎంతో తెలుసా?
ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు 2030 నాటికి భారత్‌లో 2.2 కోట్ల యూనిట్లకు చేరతాయని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. అందుబాటు ధరలో రవాణా సౌకర్యాలకు డిమాండ్, కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యం ఇందుకు కారణమని వివరించింది. ‘2022లో దేశంలో జరిగిన మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా కేవలం 3 శాతమే. అదే యూఎస్‌లో అయితే ఈవీల వాటా ఏకంగా 63 శాతం, చైనాలో 56 శాతం ఉంది. పెట్రోల్‌తో పోలిస్తే ఈవీలతో యాజమాన్య ఖర్చులు చాలా తక్కువ. అందుకే క్రమంగా కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. దిగుమతులను ఆసరాగా చేసుకుని చాలా బ్రాండ్లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. మార్కెట్ పరిపక్వత చెంది, నిబంధనలు కఠినతరం అయితే ఈ రంగం ఏకీకృతం (కన్సాలిడేట్) అవుతుంది’ అని తెలిపింది. ప్రయాణ ఖర్చు తక్కువ.. ‘కొత్త కొత్త బ్రాండ్ల చేరికతో మోడళ్లను ఎంపిక చేసుకోవడానికి కస్టమర్లకు అవకాశం ఉంటుంది. ఫీచర్లు, రోజువారీ వ్యయం, వాహన ధర ఆధారంగా ఈవీ కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ టూ వీలర్లతో పోలిస్తే ప్రయాణానికి అయ్యే ఖర్చు తక్కువ. ‘ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది’ అన్న వినియోగదార్ల ఆందోళన పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా ఉంది. ఈవీ అమ్మకాలు పెరిగేకొద్దీ సుదూర ప్రయాణాలకు బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతుంది. ప్రధానంగా వేగంగా చార్జింగ్ పూర్తి అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్ వసతులు ఉండాలి. ఈవీలు సింహ భాగం చేజిక్కించుకునే వరకు ఫేమ్, పీఎల్ఐ పథకాలు కొనసాగాలి’ అని నివేదిక వివరించింది. -
హీరో నుంచి గ్రాండ్ లాంచ్.. తక్కువ ధరకే 110 సీసీ స్కూటర్!
గురుగ్రామ్: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ కొత్తగా జూమ్ పేరిట 110 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 68,599–76,699గా ఉంటుందని సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రణ్జీవ్జిత్ సింగ్ తెలిపారు. స్కూటర్ల మార్కెట్లో 110 సీసీ వాహనాల వాటా అత్యధికంగా 60 శాతం పైగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పోర్టీ స్కూటర్ల విభాగంలో ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణమైన హీరో జూమ్‌లో పూర్తి డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలర్ ఐడీ, ఎస్ఎంఎస్ అప్డేట్స్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్, మొబైల్ చార్జర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం 2022–23 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో హీరో 2,82,169 స్కూటర్లను విక్రయించింది. చదవండి: పన్ను ప్రయోజనాలు కావాలంటే.. ఈ పోస్టాఫీస్ పథకాలపై ఓ లుక్కేయండి! -
మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయి దాటిన కేటీఎం
హైదరాబాద్: ప్రపంచంలో నెంబర్ 1 ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ కేటీఎం భారతదేశంలో మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయిని అధిగమించింది. పుణేలోని బజాజ్ చకన్ ప్లాంట్ నుండి 1 మిలియన్ కేటీఎం మోటార్ సైకిల్– కేటీఎం అడ్వెంచర్ 390 విడుదలైంది. రికార్డు బైక్ ఆవిష్కరణ కార్యక్రమంలో బజాజ్ ఆటో ఎండీ, సీఈఓ రాజీవ్ బజాజ్, పియరర్ మొబిలిటీ ఏజీ (కేటీఎం మాతృ సంస్థ) సీఈఓ స్టీఫన్ పీరర్ (ఫొటోలో ఎడమ నుంచి కుడికి) తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రియన్ బ్రాండ్ కేటీఎం తన సబ్–400 సీసీ మోటార్‌సైకిళ్ల దేశీయ, ఎగుమతి యూనిట్ల తయారీకి బజాజ్ ఆటోతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కేటీఎం ఇండియా 2014లో 1,00,000వ మోటార్‌సైకిల్‌ను, 2020లో 5,00,000వ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కేవలం మరో మూడేళ్ల వ్యవధిలోనే కీలక మిలియన్ మైలురాయికి చేరుకోవడం గమనార్హం. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
వావ్ అనిపించే ఫీచర్లతో హీరో కొత్త బైక్.. స్టైలిష్ లుక్‌తో అదరగొడుతోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా అదిరిపోయే లుక్‌తో ఓ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన ఎక్స్‌పల్స్ 200టీ మోడల్లో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ధర ముంబై ఎక్స్‌షోరూంలో రూ.1.25 లక్షలు. కొత్తగా మార్కెటలోకి తీసుకువచ్చిన ఈ అప్డేటెడ్ వెర్షన్లో బీఎస్ 6 200 సీసీ 4 వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పవర్ 19 హెచ్‌పీ, 17.3 ఎన్ఎం టార్క్‌తో రాబోతోంది. గోల్డ్, రెడ్, ఎల్లో మేట్ ఫంక్ వంటి కలర్స్ యాడ్ చేశారు. ఈ బైక్‌లో 37 ఎంఎం ఫ్రంట్ ఫోర్క్స్, వెనక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ అమర్చారు. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకున్న వారు కంపెనీ వెబ్సైట్లోకి రూ. 2,500తో ఈ బైక్‌ను ప్రి బుకింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్‌తో ఫుల్ డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్, యూఎస్బీ చార్జర్, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్లను జోడించారు. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
బైక్ కొనుగోలుదారులకు షాక్.. డుకాటీ ధరలు పెరగనున్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓ వైపు కొత్త సంవత్సరం వస్తుండగా, మరో వైపు ఆటో మొబైల్ రంగ సంస్థలు క్రమంగా తమ వాహనాల ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ సంస్థ డుకాటీ కూడా చేరింది. తమ అన్ని మోడళ్ల బైక్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఎంత శాతం సవరిస్తుందన్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. “ముడిసరుకు, ఉత్పత్తి, రవాణాలకు సంబంధించిన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కొంతకాలంగా కంపెనీ ఈ భారాన్ని భరిస్తూ వస్తోంది. అయితే వీటిని అధిగమించేందుకు, ప్రస్తుతం ధరలను సవరించాలని నిర్ణయించుకున్నట్లు” అని డుకాటీ తెలిపింది. అలాగే గ్లోబల్ మార్కెట్లోకి విడుదలయ్యే అన్ని బైక్‌లను భారత్‌కు తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ మోటర్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ. 1,500 వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. మోడల్స్, మార్కెట్లను బట్టి పెంపు పరిమాణం ఉంటుందని సంస్థ వివరించింది. ‘ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచక తప్పడం లేదు’ అని హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. ధరల భారం ప్రభావం కస్టమర్లపై ఎక్కువగా పడకుండా వినూత్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా అందించడం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పరిశ్రమ అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నట్లు గుప్తా వివరించారు. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
భారత్‌లోకి అడుగుపెడుతున్న బీఎండబ్ల్యూ సూపర్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
దేశంలో బైక్‌ల వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రత్యేకంగా యువతలో వీటికి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలు కూడా కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని కొత్త మోడల్స్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఏటా పలు రకాల మోడల్స్ బైకులు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా యువతను ఆకట్టుకునేలా ప్రముఖ సంస్థ బీఎండబ్ల్యూ తన సూపర్ స్పోర్ట్స్ బైక్‌ను లాంచ్ చేయనుంది. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ ( BMW S 1000 RR) పేరుతో ఈ బైకును డిసెంబర్ 10న భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 2023 BMW S 1000 RR ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. అయితే ఈ ఏడాది భారత్‌లోకి రానున్న ఈ మోడల్ బైక్ అప్డేటెడ్ ఇంజిన్‌తో పాటు మునుపటి కంటే లేటెస్ట్ టెక్నాలజీతో రాబోతోంది. ఈ బైక్.. మునుపటి వాటికంటే మెరుగ్గా! బీఎండబ్ల్యూ ఫ్లాగ్షిప్ బైక్‌ల కంటే కొన్ని ముఖ్యమైన మార్పులతో ఈ బైక్ మార్కెట్లోకి రాబోతోంది. అత్యంత సమగ్రంగా సవరించిన ఛాసెస్ను కలిగి ఉండటం ఈ సూపర్ బైక్ ప్రాధాన్యత. లేటెస్ట్ ఇంజిన్, సస్పెన్షన్ కంట్రెల్, ఛాసిస్, ఏరోడైనమిక్స్, డిజైన్ వంటి అప్డేట్లతో వస్తోంది. ఇది 999 సీసీ ఇన్లైన్ఫోర్ మోటార్ శక్తితో నడుస్తుంది. ఆరు గేర్లుండే ఈ బైక్ 13,750 ఆర్పీఎంతో మాగ్జిమమ్ పవర్ 206.5 బీహెచ్పీకి చేరుతుంది. ఈ బైక్ స్లయిడ్ కంట్రోల్‌ని కలిగి ఉంది. ఇందులో కొత్త డైనమిక్ బ్రేక్ కంట్రోల్ (DBC)తో వస్తుంది. దీని ఇంజిన్ స్పీడ్ పరిధి మునుపటి కంటే ఇప్పుడు విస్తృతంగా ఉంది. ఇది మోటార్‌ను 14,600 rpm వరకు పుష్ చేయడంలో సహాయపడుతుంది. ఈ బైక్ వీల్‌బేస్ 1,441 mm నుంచి 1,457 mm వరకు పెరిగింది. ఇందులో కొత్త స్లయిడ్ కంట్రోల్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఈ బైక్‌ను కంపెనీ డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా సేల్స్ జరపనున్నారు. దీని ధర ₹20-25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండచ్చని అంచనా. బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, స్టైల్ ప్యాషన్ రెడ్ నాన్-మెటాలిక్, లైట్ వైట్ నాన్-మెటాలిక్ రంగుల్లో ఈ స్పోర్ట్స్ బైక్ అందుబాటులోకి తీసుకొచ్చారు. చదవండి: షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్? -
100 పైగా షోరూమ్‌ల ఏర్పాటులో ఈవీయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ సంస్థ ఈవీయం 2023 ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 100 షోరూమ్‌లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 1,000 పైచిలుకు ఈవీ స్కూటర్లను విక్రయించినట్లు ఎలీజియమ్ ఆటోమోటివ్స్ ప్రమోటర్ ముజమ్మిల్ రియాజ్ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 11 డీలర్‌షిప్‌లు ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి 8 రాష్ట్రాల్లోని 25 నగరాలకు కార్యకలాపాలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రియాజ్ వివరించారు. కొత్త షోరూమ్‌లలో ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, ఫైనాన్సింగ్ సేవలు, యాక్సెసరీలు మొదలైనవన్నీ అందుబాటులో ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థ మెటా4 గ్రూప్‌లో భాగమైన ఎలీజియం ఆటోమోటివ్స్ .. ఈవీయం బ్రాండ్ కింద మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు తయారు చేస్తోంది. చదవండి: ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాట్ ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో.. -
బైక్ చోరీ ఫిర్యాదు.. బాధితుడికి షాకిచ్చిన కానిస్టేబుల్!
తిరువొత్తియూరు: చోరీకి గురైన బైక్‌ను పోలీసు నడుపుతుండడంతో బాధితుడు ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలో వేట్టై గుడికి చెందిన వెట్రివేల్ (40) వ్యవసాయ కార్మికుడు. ఇతను తంజావూరు సర్కిల్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తాను 2018లో ఓ ఎరుపు రంగు ద్విచక్ర వాహనాన్ని కొన్నానని, అది 2021 డిసెంబర్ 10వ తేదీ రాత్రి చోరీకి గురైందని పేర్కొన్నాడు. అయితే ఇటీవల తాను హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నానంటూ రూ.100 జరిమానాకు సంబంధించిన చలానా తన మొబైల్‌కు మెసేజ్ రూపంలో వచ్చిందన్నారు. బైక్ చోరీకి గురై.. ఫిర్యాదు చేసినా తనకు చలానా రావడంపై విచారణ జరపగా.. తన బైక్‌ను నాగై జిల్లాలో ఉన్న ఒక పోలీసు స్టేషన్లో ఓ కానిస్టేబుల్ నడుపుతున్నట్లు తెలిందన్నారు. ఇప్పటికైనా తన బైక్‌ను తనకు ఇప్పించి.. చోరీపై నిందితుడైన కానిస్టేబుల్‌ను ప్రశ్నించాలని కోరారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డీజీపీ కయల్ విళి ఆదేశించారు. చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూలీ.. 10,000 రూపాయి నాణేలతో.. -
ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి హిందుస్తాన్ మోటార్స్
సి.కె.బిర్లా గ్రూప్ కంపెనీ అయిన హిందుస్తాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2023–24లో ఈవీలు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఇందుకోసం యూరప్‌నకు చెందిన ఓ సంస్థతో కలిసి సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉత్తరపర ప్లాంటును ఆధునీకరించి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇరు సంస్థలు కలిసి తొలుత రూ.600 కోట్లు వెచ్చిస్తాయి. జేవీ ఏర్పాటైన తర్వాత పైలట్ రన్‌కు ఆరు నెలల సమయం పట్టనుందని హిందుస్తాన్ మోటార్స్ చెబుతోంది. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టే అవకాశం ఉంది. అంబాసిడర్ కార్లకు డిమాండ్ లేకపోవడంతో ఉత్తరపర ప్లాంటు 2014లో మూతపడింది. 314 ఎకరాల స్థలం ఇతర అవసరాలకు విక్రయించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంపెనీకి ఇప్పటికే అనుమతించింది. చదవండి: బంగారమా? ఇల్లా? పెట్టుబడికి ఏది బెటర్? ఈ విషయాలు తెలుసుకోండి! -
టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా!
యువతను తన వైపుకు తిప్పుకొని రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టిన టీవీఎస్ అపాచీ (Tvs Apache) మోడల్ బైకులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆ సంస్థ కొత్తగా రెండు అపాచీ మోడళ్లను లాంచ్ చేసింది. ఒకటి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160( 2022 TVS Apache RTR 160), రెండోది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 (TVS Apache RTR 180) మోడల్. RTR 160 ధర రూ 1.18 లక్షలు కాగా RTR 180 ధర 1.31 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. కొత్తగా రాబోతున్న ఈ రెండు మోటార్‌సైకిళ్లలో రిఫ్రెష్డ్ డిజైన్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (SmartXonnect) చేయబడిన టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక రెయిన్, అర్బన్, స్పోర్ట్ పేరుతో మూడు విభిన్న డైవింగ్ మోడ్లు ప్రత్యేక ఫీచర్‌గా చెప్పాలి. ఫీచర్లు ఇవే: 2022 TVS Apache RTR 160.. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 159.7 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్, 16.04 PS పవర్, 13.85 Nm టార్క్ డెలివర్ చేస్తుంది. 2022 TVS Apache RTR 180.. 5-స్పీడ్ గేర్‌బాక్స్, 17PS పవర్, 15 Nm టార్క్‌తో 177.4cc ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. వీటిలో..ఫ్యూయల్ ఇంజెక్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్‌లతో పాటు రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ (LED) హెడ్‌ల్యాంప్ కూడా ఉంది. అధునాతన బ్లూటూత్‌తో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తున్నాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్, టీవీఎస్ కనెక్ట్ యాప్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 సిరీస్ గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుండగా, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్‌లో గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, మ్యాట్ బ్లూ, టీ-గ్రే వంటి ఐదు వేరియంట్ కలర్స్‌లో లభ్యమవుతుంది. చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే! -
షాకింగ్ వీడియో: ఒకే బైక్‌పై ఏడుగురు ప్రయాణం
ద్విచక్రవాహనంపై ఇద్దరు వెళ్లేందుకే అనుమతి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ముగ్గురు వెళ్తారు. బైక్ ముగ్గురు కూర్చుంటేనే కష్టంగా ఉంటుంది.. ఏకంగా ఏడుగురు ప్రయాణిస్తే..! ఆలోచిస్తే.. అసాధ్యం అనుంకుటున్నారు కదా? అయితే ఒకే బైక్‌పై ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు(నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి) వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాటల్లేవ్.. అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన బైక్‌పై ముందు ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకోగా.. వెనకాల ఇద్దరు మహిళలు కూర్చున్నారు. వారి ఒడిలో ఇద్దరు పిల్లలను పట్టుకున్నారు. కుటుంబం మొత్తాన్ని ఒకే బైక్‌పై తీసుకెళ్లి ఔరా అనిపించాడు ఆ వ్యక్తి. అయితే, బైక్‌పై ఉన్న ఏ ఒక్కరికీ హెల్మెట్ లేకపోవటం గమనార్హం. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.2 మిలయన్ల మంది చూశారు. ఈ విధంగా ప్రయాణించి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు సరైన రవాణా సౌకర్యం లేకపోవటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందేమోనని మద్దతు తెలుపుతున్నారు. ఏడుగురిని ఒకే బైక్‌పై తీసుకెళ్లిన వ్యక్తిని అరెస్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. Speechless 😶 pic.twitter.com/O86UZTn4at — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022 ఇదీ చదవండి: Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు.. -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇంటింటికి తప్పనిసరిగా మారింది
సాక్షి,హైదరాబాద్: వాహన విస్ఫోటనం గ్రేటర్ హైదరాబాద్‌ను బెంబేలెత్తిస్తోంది. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ఏకంగా 71 లక్షలు దాటింది. ఇందులో ప్రజా రవాణా వాహనాలు పట్టుమని పది లక్షలు కూడా లేవు. సింహభాగం వ్యక్తిగత వాహనాలే. రోజురోజుకూ వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న వాహనాలతో రహదారులు స్తంభించిపోతున్నాయి. ఇంచుమించు రెండేళ్ల పాటు కోవిడ్ కాలంలో స్తంభించిన ప్రజారవాణా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తారస్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ రెండేళ్లలోనే 5 లక్షలకుపైగా కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. రహదారులను విస్తరించి, ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు కోవిడ్ కంటే ముందు నుంచే ప్రజా రవాణా ప్రాధాన్యం తగ్గింది. 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు దాటాయి. ఇంటింటికీ సొంత బండి... సొంత బండి ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మారింది. రోజురోజుకూ నగరం విస్తరిస్తోంది. ఔటర్‌ను దాటి పెరిగిపోతోంది. ఇందుకు తగినట్లుగా ప్రజా రవాణా పెరగడం లేదు. దీంతో నగరానికి దూరంగా ఉండి, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించాల్సినవాళ్లు సొంత వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నగర శివార్ల నుంచి, కాలనీల నుంచి ప్రధాన మార్గాలకు అనుసంధానం చేసే రవాణా సదుపాయాలు లేకపోవడంతో సొంత ఇల్లైనా, అద్దె ఇంట్లో ఉంటున్నా సరే బండి తప్పనిసరిగా మారింది. మొబైల్ ఫోన్ ఉన్నట్లే బైక్.. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక మొబైల్ ఫోన్ అనివార్యమైన అవసరంగా మారింది. ఇంచుమించు యువతలో 80 శాతం మందికి బైక్ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో నిమిత్తం లేకుండా ఒక వయసుకు రాగానే పిల్లలకు బండి కొనివ్వడాన్ని తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు. రవాణాశాఖలో నమోదైన 71 లక్షల వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. ప్రజా రవాణా పెరగాలి వాహన విస్ఫోటనాన్ని అరికట్టేందుకు ప్రజా రవాణా విస్తరణ ఒకటే పరిష్కారం. వ్యక్తిగత వాహనాలను నియంత్రించలేకపోతే రానున్న కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్య కోటి దాటే అవకాశం ఉంది. – పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ చదవండి: అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు! -
దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ చౌరస్తా నుంచి ఆదివారం అర్ధరాత్రి హెల్మెట్ ధరించకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తూ మద్యం సేవిస్తూ దూసుకుపోతున్న ఓ బైక్‌ను అదే రోడ్డు వెంట వెళ్తున్న ఓ వాహనదారుడు ఫొటోలు తీసి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశాడు. అంతే కాకుండా ముగ్గురు యువకులు హెల్మెట్ లేకుండా చేతుల్లో బీరు సీసాలతో రోడ్డువెంట వెళ్లేవారిని న్యూసెన్స్ చేస్తూ పోతున్నారంటూ ఆ వాహనదారుడు ట్వీట్ చేశాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమై ఈ ఘటన ఎక్కడ జరిగిందంటూ ఆరా తీశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఎల్వీ ప్రసాద్ విగ్రహం పక్క నుంచి అంటూ సమాచారం రావడంతో హైదరాబాద్ పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. సదరు వాహనాన్ని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. స్కూటర్ నెంబర్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బైక్ నెంబర్ ఆధారంగా చిరునామా పట్టుకున్నట్లుగా తెలిసింది. వీరిని అదుపులోకి తీసుకొని విచారించే దిశలో పోలీసులు యత్నిస్తున్నారు. పట్టాపగ్గాలు లేకుండా రోడ్డుపై మద్యం సేవిస్తున్న యువకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. Beverage na kodukulu. Triple ride with beers. Scooty meeda kanipinche ammailni kelikkuntaa potnaru ❌ @hydcitypolice pic.twitter.com/3Tw98tI56c — Joyyyyy (@JacksonBr0) May 1, 2022 చదవండి: వనస్థలిపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్ -
18 రోజులు.. 12వేల కిలోమీటర్ల బైక్ ప్రయాణం
మందస: కొండలు దాటారు.. కోనలు దాటారు.. లోయలు చూశారు.. శిఖరాల పక్క నుంచి ప్రయాణించారు... ‘ఏడుగురు అక్కచెల్లెళ్లు’ను పలకరించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. ఒకటా రెండా.. పన్నెండు రాష్ట్రాలు.. పన్నెండు వేల కిలోమీటర్ల దూరా న్ని 18 రోజుల్లో పూర్తి చేశారు. సైని కులు తలపెట్టిన బృహత్తర సాహస యాత్ర ఇది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా కోవిడ్, వైద్యంపై అవగాహన కల్పించడానికి 12 మంది సోల్జర్ల బృందం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించా రు. ఈ బృందంలో ఓ సిక్కోలు సైనికుడు కూడా ఉన్నాడు. మందస గ్రామానికి చెందిన డుంకురు సతీష్‌కుమార్ ఈ సాహస బృందంలో ఓ సభ్యుడు. ఈయన నాయక్ క్యాడర్లో పనిచేస్తున్నారు. సెవెన్ సిస్టర్స్‌గా ముద్దుగా పిలిచే ఈశాన్య రా ష్ట్రాలో బైక్ రైడింగ్ అంత ఈజీ కాదు. సులభమైన పనులు చేస్తే వారు సైనికులు ఎందుకవుతారు. అందుకే ఈ 12 మంది బృందం ఈ రాష్ట్రాల మీదుగా బైక్‌లతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేశ్ అడావ్ ఆధ్వర్యంలో నలుగురు డాక్టర్లు, నలుగురు ఆర్మీ అధికారులు, నాయక్ కేడర్ కలిగిన ఇద్దరు సైనికులు, హవల్దార్ కేడరు ఇద్దరు మొత్తం 12 మందితో కూడిన బృందం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి ఈ నెల 9న బయలుదేరింది. ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరాంఛల్ రాష్ట్రాల మీదుగా 18 రోజుల పాటు 12వేల కిలో మీటర్లు మోటారు వాహనాలతో సాహస యాత్ర సాగింది. దారిలో 78 ఆర్మీ మెడి కల్ యూనిట్లలో ఈ బృందం అవగాహన కల్పించింది. యాత్ర ఈ నెల 27తో ముగియగా, ఆర్మీ ఉన్నతాధికారులు ఈ బృందాన్ని అభినందించారు. సాహస యా త్రలో పాల్గొ న్న సతీష్‌కుమార్‌కు మందస ప్రజలు అభినందనలు తెలిపారు. గర్వంగా ఉంది 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆర్మీ సాహస యాత్ర చేయడానికి నిర్ణయించింది. 12 మందితో కూడిన బృందం, 12 రాష్ట్రాల మీదు గా 18వేల కిలోమీటర్లు యాత్ర చేయడానికి సంకల్పించాం. వివిధ రాష్ట్రాల్లోని వాతావరణాలను తట్టుకున్నాం. నిజంగా సాహసంగానే యాత్ర జరిగింది. పెద్ద లక్ష్యం, రోజూ వందల కిలోమీటర్ల ప్రయాణం. సమస్యలు ఎన్ని వచ్చినా అధిగమించాం. చైనా బోర్డరును దాటాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం గర్వకారణంగా ఉంది. ఈ యాత్రతో మందసకు పేరు రావడం ఆనందంగా ఉంది. – డుంకురు సతీష్‌కుమార్, సాహస బృందం సభ్యుడు, మందస -
బైక్‌కు వేసిన తెల్ల రంగు.. స్నాచర్లను పట్టించింది
సాక్షి,బంజారాహిల్స్: మత్తు పదార్థాలకు అలవాటుపడిన ముగ్గురు యువకులను బైక్ ఆధారంగా పట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడి బస్తీలో నివసించే ఖాజా పాషా ఇంటర్ చదువుతూ తన స్నేహితులు సబిల్, సొహైల్‌తో కలిసి గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి మద్యం తాగుతూ బైక్‌పై దూసుకెళ్తూ స్థానికంగా హల్చల్ చేసేవాడు. ప్రత్యేకతను చాటుకోవాలని తన బైక్ వీల్ రిమ్ముకు తెల్ల రంగు వేసి బండిపై తిరిగేవాడు. మూడు రోజుల క్రితం ఇదే బైక్‌పై తన స్నేహితులను కూర్చోబెట్టుకొని వరుసగా ఆరు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. సీసీ ఫుటేజీలో బైక్ వీల్ తెల్ల రంగులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అన్ని పోలీస్ స్టేషన్ల క్రైం విభాగానికి ఈ సీసీ ఫుటేజీలను పంపించారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు బైక్ ఫొటోల ఆధారంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లా పలువురిని వాకబు చేస్తుండగా స్థానికులు ఖాజాపాషా ఇంటిని చూపించారు. పోలీసులు వెళ్లేసరికి ఇంటి ముందు తెల్ల రంగు వీల్‌తో స్నాచర్లు ఉపయోగించిన బైక్ పార్కింగ్ చేసి ఉంది. రాత్రిపూట గంజాయి మత్తులో చేతుల్లో కత్తులు, బ్లేడ్లు పట్టుకొని స్వైర విహారం చేసే ఈ ముగ్గురూ స్నాచర్లని తెలుసుకున్న స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. బైక్‌కు వేసిన తెల్ల రంగే స్నాచర్లను పట్టించిందని పోలీసులు తెలిపారు. -
ఆడుకుంటున్న చిన్నారిని.. నాన్నను చూపిస్తామని తీసుకెళ్లి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కీర్తనను.. గుర్తుతెలియని వ్యక్తులు మీ నాన్నను చూపిస్తామంటూ మాయమాటలు చెప్పారు. ఆ తర్వాత పాపను బైక్‌మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు. స్థానికురాలు ఒకరు బాలికను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌మీద తీసుకెళ్లినట్లు గమనించింది. ఆ తర్వాత వెంటనే.. చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చదవండి: ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!! -
బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి
సాక్షి, కోరుట్ల(కరీంనగర్): బంధువుల ఇంట్లో గృహ ప్రవేశానికి హాజరై.. తెల్లవారుజామున పెరుగు తెస్తామని ఇద్దరు మైనర్లు మోటర్‌సైకిల్‌పై వెళ్లగా ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఆడెపు ప్రసాద్ గృహాప్రవేశానికి అతని దగ్గరి బంధువుల అబ్బాయి ఆడెపు రోహిత్(16) హాజరయ్యాడు. బుధవారం తెల్లవారుజామున గృహాప్రవేశం ముగియగా సత్యనారాయణ వ్రతం కోసం పెరుగు అవసరం పడింది. అక్కడే ఉన్న ఆడెపు రోహిత్, మరో బంధువుల అబ్బాయి మనోజ్(14)తో కలిసి మోటార్‌సైకిల్‌పై తెల్లవారుజామున 5 గంటలకు పైడిమడుగు శివారులోని పెరుగు విక్రయ కేంద్రం వద్దకు వెళ్దామని బైక్‌పై బయలుదేరారు. ఊరు దాటి కొంత దూరం వెళ్లగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్, మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటర్‌సైకిల్ నడుపుతున్న రోహిత్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే చనిపోయాడు. మనోజ్‌కు తీవ్రగాయాలు కాగా, కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దొంగచాటుగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి కారణమైనట్లుగా భావిస్తున్నారు. మనోజ్‌ది మహారాష్ట్రలోని భీవండి కాగా శుభకార్యం కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. రోహిత్ తల్లి వందన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ కల్లూర్ మాడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. రోహిత్ తండ్రి సత్యనారాయణ ఉపాధి కోసం గల్ప్ దేశాల్లో ఉంటున్నాడు. చదవండి: కంప్యూటర్ ఆపరేటర్‌కు వేధింపులు.. మాతృ సంస్థకు ఉన్నతాధికారి -
మాటిమాటికీ సెల్‌ఫోన్, బైక్ అడిగేవాడు.. కాదనడంతో క్షణికావేశంలో..
సాక్షి,కరీంనగర్‌క్రైం: సెల్‌ఫోన్, బైక్ కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని సిక్‌వాడీకి చెందిన బాలుడు(16) ఇంటర్ చదువుతున్నాడు. తన తల్లిదండ్రులను మాటిమాటికీ సెల్‌ఫోన్, బైక్ కొనివ్వమని అడిగేవాడు. కానీ బైక్ నడిపే వయసు, డ్రైవింగ్ లైసెన్స్ లేదని వారు తిరస్కరించారు. క్షణికావేశంలో శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో... చింతకుంట కెనాల్లో గుర్తుతెలియని శవం కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామ శివారులోని పోచమ్మ గుడి వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్లో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు ఎస్సై బి.ఎల్లయ్యగౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మత్స్యకారులు చేపలు పడుతుండగా కెనాల్లో మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వగా పోలీసులు మోఖాపైకి వెళ్లి చూడగా 35–45 ఏళ్ల వయస్సు వ్యక్తి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు తెలిపారు. మృతుడి శరీరంపై బ్లూ, వైట్ లైన్స్ కలిగిన హాఫ్ షర్ట్, నలుపు రంగు లోయర్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎడమ చేతి పైభాగంలో నితిన్ అని హిందీలో పచ్చబొట్టు రాసి ఉందన్నారు. కుళ్లిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నందున ఆచూకీ తెలిస్తే కొత్తపల్లి ఎస్సై–94409 00974, కరీంనగర్ రూరల్ సీఐ–94407 95109, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్: 94944 90268 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య -
మహిళా జర్నలిస్టుతో క్యాబ్ డ్రైవర్ పిచ్చి వేషాలు.. ఫోటో తీసి..
కోల్‌కతా: రోడ్ల పై ఒంటరి మహిళలు కనపడితే కొందరు ఆకతాయిలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వారిని వేధిస్తుంటారు. ఈ తరహాలోనే ఓ మహిళా జర్నలిస్టును క్యాబ్ డ్రైవర్ వేధించడమే గాక తన స్నేహితురాలిపై దాడి చేసి చివరికి జైలు పాలయ్యాడు. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలోని బెహలాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ టీవీ న్యూస్ ఛానెల్లో పనిచేస్తున్న మహిళ, సాల్ట్ లేక్ సెక్టార్ 5లోని తన కార్యాలయం నుంచి స్కూటర్‌పై స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా సత్యన్ రాయ్ రోడ్-జేమ్స్ లాంగ్ రోడ్ క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగిందీ. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ గురువారం రాత్రి మహిళను రోడ్డుపైకి నెట్టడానికి తన స్కూటర్‌ను పలుమార్లు ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. చివరకు అతని ఆగడాలను భరించలేక ఆమె సత్యేన్ రాయ్ రోడ్-జేమ్స్ లాంగ్ రోడ్ క్రాసింగ్ వద్ద తన స్కూటర్‌ను ఆపి అతన్ని వారించింది. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్ మహిళపై దాడి చేసి వేధించడమే గాక ఆమె స్నేహితురాలితో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ అతని వాహనాన్ని ఫోటో తీసుకుని బెహలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. చదవండి: పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది.. కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు.. -
రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లా చిత్తూరు మదనపల్లె బైపాస్ మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆలీమాబాద్ వీధికి చెందిన షేక్ అక్రమ్(16) అక్కడిక్కడే మృతి చెందాడు. రాయుడు కాలనీకి చెందిన శ్రీను(50) పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు వెంటనే బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ప్రయాణికుడి వద్ద బంగారం పట్టివేత -
సిటీలో స్పోర్ట్స్ బైకుల క్రేజు.. అయితే, ఇక్కడో విషయం గమనించాలి..
‘సిటీ రహదారులు స్పోర్ట్స్ బైక్స్ వినియోగానికి అనుకూలంగా లేవు. రోడ్ల విస్తీర్ణం, వాహనాల రాకపోకలు రేసింగ్‌కు ఏ మాత్రం తగవు. కొన్ని ప్రత్యేక నిబంధనలతో కూడిన ప్రాంతాల్లోనే స్పోర్ట్స్ బైక్‌లు, కార్లు వినియోగించాలి. అందుకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సౌకర్యాలూ ఉండాలి...’ అని చెబుతున్నారు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగా నాయక్. తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైకు ప్రమాదానికి గురై..ఆయన గాయపడిన నేపథ్యంలో నగర రహదారులపై స్పోర్ట్స్ బైకుల వినియోగం, రాత్రి వేళల్లో బైకు రేసింగ్‌ల అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సాక్షి, హైదరాబాద్: నగర రహదారులపై స్పోర్ట్స్ బైకులు గంటకు 120 నుంచి 150 కి.మీ వేగంతో పరుగులు తీస్తున్నాయి. ఇవి ఇప్పుడు యువతలో క్రేజ్‌గా మారాయి. ఏటా వేల కొద్ది హై ఎండ్ కార్లు, బైకులు రోడ్డెక్కుతున్నాయి. వీటి ఖరీదు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటోంది. వీటి సంఖ్య ప్రస్తుతం 10,500 వరకు ఉన్నట్లు ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవలి కాలంలోనే 3 వేలకు పైగా హై ఎండ్ కార్లు ఆర్టీఏలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న హై ఎండ్ మోజు.. నగరంలో ఏటేటా హై ఎండ్ వాహనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 500 నుంచి 2000 సీసీల సామర్థ్యం కలిగిన స్పోర్ట్స్ వాహనాలు నగరంలో భారీ సంఖ్యలో వాడుతున్నారు. సినీ తారలు, సంపన్నుల పిల్లలు ఈ బైక్స్‌పై దూసుకెళ్తూ బెంబేలెత్తిస్తున్నారు. ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కొంత కాలంగా కోవిడ్ దృష్ట్యా బైక్ రేసింగ్‌లు సద్దుమణిగినా ఇటీవలి కాలంలో తిరిగి మొదలయ్యాయని తెలుస్తోంది. జాగ్రత్తలు లేకే.. బైక్ రేసింగ్‌లో పాల్గొనే యువత సరైన జాగ్రత్తలు పాటించడం లేదు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీంతోనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ బైకు రేసింగ్ ప్రమాదాల్లో పలువురు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అదుపు తప్పి... సినీ హీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఐకియా వద్ద ప్రమాదానికి గురైన ఉదంతంలో వేగాన్ని అదుపు చేయలేకపోవడం వల్లనే ఘటన జరిగినట్లు ఆర్టీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. తను వాహనం నడుపుతున్న మార్గంలో ఆటో, మరో కారు కూడా వెళుతున్నట్లు గమనించారు. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఆయన బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. ఆ ప్రాంతంలో ఇసుక, మట్టి ఉండడం వల్ల కూడా బైకు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. రూ.కోట్లు కుమ్మరించినా... ► గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో బల్దియా కొత్త రోడ్ల నిర్మాణం.. నిర్వహణల కోసం దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు చేసింది. అయినా చినుకుపడితే గుంతలతో ప్రమాదాలు తప్పడం లేవు. రోడ్లపై గుంతలున్నా, కంకర ఉ న్నా, ఇసుక ఉన్నా పట్టించుకుంటున్నవారు లేరు. ►జీహెచ్ఎంసీ ఇంజనీర్ల కంటే ప్రైవేటు ఏజెన్సీలైతే ఎప్పటికప్పుడు నిర్వహణ బాగుంటుందని భావించి ప్రధాన రహదారుల్లోని 709 కి.మీ.ల మేర నిర్వహణకు ప్రైవేటుకిచ్చారు. అయినా ఫలితం కన్పించడం లేదు. ప్రధాన రోడ్లయినా, గల్లీ రోడ్లయినా, నిర్వహణ ఎవరిదైనా రోడ్డెక్కితే చాలు ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లే ని పరిస్థితులు నెలకొన్నాయి. వేగంగా వెళ్లే వాహనాలతోపాటు నెమ్మదిగా వెళ్లేవారు సైతం గుంతల్లో పడి ఆస్పత్రుల పాలయ్యే పరిస్థితి ఉంది. ► కొత్త రోడ్లు, రోడ్ల నిర్వహణ పేరిట గడచిన ఐదేళ్లలో రూ.2520 కోట్లు ఖర్చు చేశారు. అయినా అదే దుస్థితి. ఏళ్లు గడుస్తున్నా, కోట్లు ఖర్చవుతునా భాగ్యనగర రహదారుల దుస్థితి మారడం లేదు. ► గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో వెరసి 70 లక్షలకు పైగా వాహనాలుండగా, వీటిల్లో 70 శాతానికి పైగా ద్విచక్రవాహనాలే. వాహనాలు పెరుగుతున్నాయి. కానీ రోడ్లు బాగుపడటం లేవు. ► రోడ్లు అద్దాల్లా ఉంచుతామని స్వీపింగ్ మెషిన్లను వినియోగిస్తూ ఏటా దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. -
క్షణాల్లో కళ్లముందే కొత్త బుల్లెట్, పాత కారు దగ్ధం
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): వేర్వేరు చోట్ల కారు, ఎన్ఫీల్డ్ బైక్ రోడ్డు మధ్యలోనే కాలిపోయిన సంఘటన నెలమంగల తాలూకాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బెంగళూరు నాగరబావి నుంచి తుమకూరు వెళ్తున్న పాత ఇండికా కారు నెలమంగల వద్ద జాతీయ రహదారిపై ఇంజన్లో మంటలు చెలరేగి క్షణాల్లో రోడ్డుమధ్యలోనే కాలిపోయింది. అందులోని చిరాగ్, నాగేశ్, నాగరాజు, మరో మహిళ బయటకు దిగి బయటపడ్డారు. ఇక కుణిగల్ జాతీయ రహదారి మార్గంలో యంటగానహళ్లి వద్ద శివమొగ్గకు చెందిన గగన్ అనే వ్యక్తి వస్తున్న బుల్లెట్ బైక్‌లో మంటలు లేచి దగ్ధమైంది. వారం క్రితమే కొనుక్కున్న ఈ బైక్‌లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేయించినట్టు బాధితుడు చెప్పాడు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఆరునెలల్లో కూతురు వివాహం.. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా.. -
అసలే ఆదివారం, అందులోనూ అమావాస్య.. చెప్పినా వినలేదు..
సాక్షి, ధర్మపురి(కరీంనగర్): అతివేగం, అజాగ్రత్త ఇద్దరు యువకుల నిండుప్రాణాల్ని బలితీసుకుంది. అసలే ఆదివారం, అందులోనూ అమావాస్య, ఇంట్లోంచి బయటకు వెళ్లొద్దని తల్లిదండ్రులు వారించినా వినకుండా బయటకు వెళ్లిన ప్రాణస్నేహితులు అక్షయ్(17), అంజి(20) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వడ్డెరకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం బూరుగుపల్లెకు చెందిన అలకుంట సాంబయ్య – తిరుపతమ్మ దంపతుల కుమారుడు అక్షయ్, సంపంగి లచ్చయ్య– పద్మ దంపతుల కుమారుడు అంజి ప్రాణ స్నేహితులు. మంచిర్యాలకు చెందిన మరో స్నేహితుడు ఓ ఆటోను అక్షయ్ ఇంటివద్ద ఉంచి వెళ్లాడు. దీంతో అక్షయ్ వారం రోజులుగా ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. ఆదివారం అక్షయ్ అంజితో కలిసి ఆటోలో ధర్మపురికి వెళ్లారు. ఆదివారం, అమావాస్య మంచిదికాదని తల్లిదండ్రులు వద్దని చెప్పినా వినలేదు. దీంతో తిరుగు ప్రయాణంలో ధర్మపురి వడ్డెరకాలనీ వద్ద ఎదురుగా అతివేగంగా వస్తున్న మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో మూడు ఫల్టీలు కొట్టింది. ఆటో నడుపుతున్న అక్షయ్, అందులో కూర్చున్న అంజి తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో యువకుల మృతదేహాలు గుర్తుపట్టనంతగా ఛిద్రమయ్యాయి. సీఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటోను రోడ్డుపైనుంచి తొలగించారు. బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్షయ్ తల్లి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అమావాస్య వద్దని చెప్పినా వినలేదు ‘అమావాస్య.. ఆదివారం.. ఆటో బయటకు తీయకు బిడ్డా.. అని చెప్పిన. నా మాట వినకుండా ధర్మపురికి వెళ్లివస్తానని చెప్పిండు. తిరి గిరాని లోకానికి పోయిండు’ అని తిరుపతమ్మ కన్నీటి పర్యంతమైంది. మృతులిద్దరూ నిరుపేద కుటుంబానికి చెందిన వారే. అక్షయ్ తండ్రి సాంబయ్య బతుకు దెరువు కోసం ముంబాయి వెళ్లి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కొ డుకు, కూతురు ఉంది. అంజి తండ్రి లచ్చయ్య కులవృత్తిలో భాగంగా బండరాళ్లు పగులగొడుతూ ఉంటాడు. వీరికి ఒక్కగానొక్క కొడుకు. – తిరుపతమ్మ, అక్షయ్ తల్లి మరణంలోనూ వీడని స్నేహం అక్షయ్, అంజి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. చిన్ననాటి నుంచి ప్రాణస్నేహితులు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. అక్షయ్ ఇంటర్ చదువుతుండగా అంజి బండరాళ్లు కొడుతూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. -
హృదయ విదారకర ఘటన: తండ్రి కళ్లెదుటే కొడుకు, కూతురు మృతి
సాక్షి, ఉండవెల్లి (మహబూబ్‌నగర్): ముక్కుపచ్చలారని చిన్నారులు.. తండ్రితో కలిసి నాన్నమ్మ, తాతయ్యలను చూసేందుకు బైక్‌పై ఎంతో ఆనందంగా బయలుదేరారు. మరికొద్దిసేపట్లో వారిని చేరుకుంటామనగా. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన డీసీఎం వారి ఆశలను ఆవిరి చేసింది. క్షణకాలంలో ఊపిరిని అనంత వాయువులో కలిపేసింది. కళ్లెదుటే కన్నబిడ్డలు ఇద్దరూ కాలం చెందడంతో ఆ తండ్రి విలవిలలాడిపోయాడు. ఈ హృదయ విదారకరమైన సంఘటన పుల్లూరు శివారులో చోటుచేసుకుంది. ట్రాక్టర్ ఎదురుగా రావడంతో.. మానవపాడు మండలం చెన్నిపాడుకు చెందిన రవికుమార్, పుష్పలత దంపతులకు ముగ్గురు సంతానం. అఖిల్(12), రిషి(10), దీక్షిత(6) ఉన్నారు. వీరిలో చిన్నకొడుకు రిషి, దీక్షితలను రవికుమార్ తల్లిదండ్రులు ఉన్న ఈ.తాండ్రపాడులో వదిలిపెట్టి.. తాను ఉద్యోగానికి వెళ్లేందుకు శనివారం ఉదయం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతుండగా ట్రాక్టర్ ఎదురుగా వచ్చింది. దీంతో ట్రాక్టర్‌కు కుడివైపు బైక్‌ను తిప్పడంతో డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న చిన్నారులు కింద పడటంతో వారి తలపై డీసీఎం టైర్లు పోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రికి ఎలాంటి గాయాలు కాలేదు. నేషనల్ హైవే సిబ్బంది మృతదేహాలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను చెన్నిపాడుకు తరలించారు. ఈ ఘటనపై రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. -
ఐదు నిమిషాల్లో ఇంటికి.. అంతలోనే మృత్య ఒడిలోకి
సాక్షి, పాతపట్నం(శ్రీకాకుళం): మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరనున్న వ్యక్తిని మృత్యువు వెంటాడింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతను ఆటోను తప్పించబోయి ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం గ్రామ సమీపంలో చోటుచేసుకోగా.. ఆదే గ్రామానకి చెందిన సెంటరింగ్ మీస్త్రి బైపోతు ప్రేమకుమార్(27) మృతి చెందినట్లు ఎస్ఐ వి.సందీప్‌కుమార్ తెలిపారు. ప్రేమ్‌కుమార్ రోజులాగే ఆదివారం ఉదయం సెంటరింగ్ పనికోసం ద్విచక్ర వాహనంపై హిరమండలం మండలం ధనుపురం గ్రామానికి వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా పెద్దపద్మాపురం గ్రామ సమీపంలో ఆటోను తప్పించబోయి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి క్షతగాత్రుడ్ని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. అయితే ప్రేమ్‌కుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు శ్రీధర్ ధ్రువీకరించారు. మృతునికి భార్య నీరజ, కుమారై శరణ్య (1) ఉన్నారు. భర్త మృతదేహంపై పడి భార్య రోదించిన తీరు స్థానికులను కలచి వేసింది. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
మరికొద్ది రోజుల్లో పెళ్లి.. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా..
సాక్షి, కాగజ్‌నగర్(ఆదిలాబాద్): ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదం కాగజ్‌నగర్ పట్టణంలోని జెడ్పీ పాఠశాల ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బాలాజీనగర్ కాలనీకి చెందిన జె.వినోద్(31) సిర్పూర్ (టి)లోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి రాత్రి కాగజ్‌నగర్‌కు వస్తున్నారు. సిర్పూర్(టి)– కాగజ్‌నగర్ ప్రధాన రహదారి(జెడ్పీ స్కూల్ సమీపంలో) వద్ద ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న వినోద్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఆసిఫాబాద్‌లోని ఎంపీడీపీవో కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. బాలాజీనగర్‌లోని శంకర్– సంగీత దంపతుల రెండవ కుమారుడు వినోద్ నిత్యం పేపర్ మిల్లు క్రీడా మైదానంలో క్రికెట్ ఆడేవాడని తోటి స్నేహితులు తెలిపారు. సిర్పూర్(టి)కి చెందిన బంధువుల అమ్మాయితో మూడు నెలల క్రితమే వినోద్‌కు నిశ్చితార్థం జరిగింది. అయితే అనుహ్యంగా రోడ్డు ప్రమాదంలో ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరగనుండగా ఇలా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ డి.మోహన్ ప్రమాదస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బొలెరో వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెంకటేష్ వెల్లడించారు. -
మామ అని బైక్ ఇప్పిస్తే.. ఎంత పనిచేశాడు..
సాక్షి, భిక్కనూరు(నిజామాబాద్): మేనమామకు తన పేరు మీద బైక్ ఇప్పిస్తే ఆయన కనబడకుండా పోయాడు. ఫైనాన్స్ వారు తనకు ఫోన్ చేయడంతో డబ్బు ఎలా కట్టాలని మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మండలంలోని పెద్దమల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాలు..పెద్దమల్లారెడ్డికి చెందిన నడిపొల్ల బాలయ్య(29)కు బీబీపేటకు చెందిన శ్యాగ రాజు మేనమామ అవుతాడు. శ్యాగ రాజు బాలయ్య పేరిట ఫైనాన్స్‌లో ద్విచక్రవాహనం తీసుకున్నాడు. తీసుకున్న అప్పును సగం మాత్రమే రాజు చెల్లించాడు. మిగతా డబ్బులు చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్ వారు బాలయ్యకు డబ్బులు చెల్లించాలని ఫోన్ చేస్తున్నారు. బైక్ తీసుకున్న రాజు కనించకపోవడం, ఆయన ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుండటంతో బాలయ్య ఆందోళనకు గురయ్యాడు. 15 రోజులుగా ఈ విషయమై తీవ్రంగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం గ్రామశివారులోని డబులు బెడ్ రూం ఇళ్ల సమీపంలో చెట్టుకు బాలయ్య ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలయ్య భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
వామ్మో.. కొంపముంచిన బైక్ స్టంట్.. వైరల్ వీడియో..
బెంగళూరు: కొంత మంది యువకులు అర్ధరాత్రికాగానే రోడ్డుపై వచ్చి ఇష్టమోచ్చినట్లు వాహనాలను నడుపుతుండటం మనకు తెలిసిందే. ఈ క్రమంలో వీరు అత్యధిక వేగంతో తమ బైక్‌లను నడుపుతూ.. రకారకాల స్టంట్లు చేస్తుంటారు. కొంత మంది యువకులు బైక్ నడుపుతున్నప్పుడు హ్యండిల్‌ను వదిలేస్తే.. మరికొందరు ఆకతాయిలు ముందు టైర్‌ను లేదా వెనుక టైర్‌ను గాల్లో అమాంతం పైకి ఎత్తి వెరైటీ డ్రైవ్ చేస్తుంటారు. అయితే, ఇలాంటి స్టంట్లు చేసే క్రమంలో ఒక్కొసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కాగా, ఒక యువకుడు తన మోటర్‌బైక్‌తో చేసిన స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో యువకుడు రోడ్డుపై బైక్ స్టంట్ చేస్తున్నాడు. అక్కడ రోడ్డంతా వర్షం నీరుతో నిండి ఉంది. అతను ఏమాత్రం భయపడకుండా.. అలాగే బైక్‌ను స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా.. బైక్‌ను వేగంగా నడిపిస్తూ ముందు టైర్‌ను అమాంతం గాల్లో పైకి లేపాడు. అతగాడి విన్యాసాన్ని చుట్టుపక్కల వారు వింతగా చూస్తున్నారు. అయితే, ఆ యువకుడు తొలుత బైక్‌ను బాగానే నడిపినా ఆ తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో అతను పక్కనే ఉన్న ఒక ప్రహరీ గొడను ఢీకొడుతూ ముందుకు వెళ్లిపోయాడు. ఈ షాకింగ్ ఘటనతో అక్కడి వారంతా దూరంగా పారిపోయారు. మోటర్ బైక్ ఢీకొని గోడంతా కూలిపోయింది. ఆ యువకుడు హెల్మెట్ పెట్టుకొని ఉండటంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. దీన్ని.. స్ప్లెండర్ బుల్లెట్ లవ్ అనే యూజర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్.. ఏమన్న స్టంటా..’, ‘కొంచెంలో మిస్ అయ్యాడు..’, ‘ఇలాంటి ప్రమాదకర స్టంట్లు అవసరమా..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by splendor_bullet_love (@splendor_bullet_love) -
మహిళల క్రూరత్వం, రోదిస్తున్నా వినకుండా..
చండీగడ్: అక్కడ ఏం జరిగిందో తెలీదగానీ ఓ మూగజీవి పై మహిళలు వారి క్రూరత్వాన్ని ప్రదర్శించారు. చివరికి దాని ఆర్తనాదాలు కూడా వారి చెవినపడలేదు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్యాలా కి చెందిని ఇద్దరు మహిళలు క్రూరంగా ఓ కుక్కని వారి స్కూటీ వెనకాల కట్టి ఈడ్చుకెళ్లారు. ఆ జంతువు అరుస్తున్న కనీసం కనికరం కూడా లేకుండా దానీ అలా రోడ్డుపై కొంత దూరం లాక్కెళ్లి విడిచి పెట్టారు. దీని ఫలితంగా కుక్క తీవ్రంగా గాయపడింది. కాగా సమీపంలో కొందరు ఆ కుక్క దీనావస్థని చూసి వైద్యం చేయగా అప్పటికే తీవ్రంగా గాయలపాలవడంతో ఆ కుక్క మృతి చెందింది. ఈ ఘటన జూన్ 20న జరగగా, జున్ 24 మరణించింది. ఇదంతా పరిసరాల్లోని సీసీటీవిలో రికార్డ్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా తాజాగా ఈ వీడియో వైరల్ అయ్యింది. మరో వైపు జంతు ప్రేమికులు ఆ మహిళల క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు కూడా స్పందించి వారిపై కేసు నమోదు చేశారు. చదవండి: దారుణం: నడిరోడ్డుపైనే ప్రాపర్టీ డీలర్‌ను.. -
విషాదం: పంక్చర్... ప్రాణం తీసింది
సాక్షి, గుడిహత్నూర్(ఆదిలాబాద్): వేగంగా వెళ్తున ద్విచక్రవాహనం పంక్చర్ కావడంతో అదుపుతప్పింది. దానిపై ప్రయాణిస్తున్న భార్యా భర్తలు రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో భార్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఇంద్రవెల్లి మండలం సీతాగోంది వద్ద మంగళవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలం సట్వాజీగూడ సబ్ సెంటర్లో రెండో ఏఎన్ఎం బోథ్ మండలంలోని పార్డీ చంపక్‌నాయక్ తాండాకు చెందిన రాథోడ్ సునీత (38) విధులు నిర్వహిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా సట్వాజీగూడ గ్రామానికి చెందిన గర్భిణి జె.చాంగునాబాయిని చికిత్స నిమిత్తం మంగళవారం అంబులెన్సులో రిమ్స్ తరలించింది. ఇచ్చోడలోని నర్సాపూర్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భర్త ఉత్తంసింగ్‌తో కలిసి మోటార్ సైకిల్‌పై రిమ్స్‌కు బయల్దేరింది. సీతాగోంది గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44పై మోటార్ సైకిల్ వెనుక టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. వెనుక కూర్చున్న సునీత ఒక్కసారిగా తారు రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయమై సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఉత్తంసింగ్ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. స్థానికులు హైవే అంబులెన్సులో వీరిని రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
చెల్లెలు పెళ్లి కుదిరిందని తండ్రి ఫోన్.. కానీ అంతలోనే..
సాక్షి, గీసుకొండ(వరంగల్): చెల్లెలు పెళ్లి కుదిరిందని తండ్రి ఫోన్ చేసి చెప్పాడు.. దీంతో మాటముచ్చట కోసం ఆమె భర్తతో కలిసి బయలుదేరింది. ఈ మేరకు భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ప్రమాదవశాత్తు వివాహిత కింద పడి మృతి చెందిన ఘటన ఇది. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన సిరబోయిన గణేశ్ రెండో కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఇదే విషయాన్ని నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లిలో అత్తవారింటి వద్ద ఉండే తన పెద్దకూతురు నరెట్ల ఉషారాణికి తెలిపిన గణేష్ వివరాలు మాట్లాడుకునేందుకు రమ్మని చెప్పాడు. దీంతో మంగళవారం ఉదయం ఆమె తన భర్త రమేశ్‌తో కలిసి బైక్‌పై తూర్పుకోటకు బయలుదేరింది. ఉదయం 6.30 గంటలకు గీసుకొండ మండలంలోని వంచనగిరి రోడ్డు సాయిబాబా గుడి వద్ద బైక్ పైనుంచి ఉషారాణి కింద పడగా తల వెనక భాగంలో బలమైన గాయాలయ్యాయి. వెంటనే 108 వాశనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా తన అల్లుడు అజాగ్రతగా, అతివేగంగా బైక్ నడపడం వల్లే ఉషారాణి మృతి చెందిందని ఆమె తండ్రి గణేశ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు గీసుకొండ పోలీసులు తెలిపారు. చదవండి: ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వివాదం.. కారణం ఏంటంటే.. -
నిర్లక్ష్యం ఎవరిది? చూస్తుండగానే గాల్లో కలిసిన ప్రాణాలు..
సాక్షి, జన్నారం(ఖానాపూర్): అతివేగం ప్రమాదానికి దారి తీస్తుంది. ఒక్కోసారి మృత్యువూ కబళిస్తుంది. అతివేగంగా దూసుకువస్తున్న మోటార్‌సైకిల్‌ను ఆపాలని చెక్‌పోస్టు వద్ద అధికారులు సూచించినా ఆగకుండా వెళ్లడం వల్లే ప్రమాదం సంభవించి వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన తెలిసిందే. లక్సెట్టిపేట మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సుదగోని వెంకటేశ్‌గౌడ్(32) శనివారం తపాలపూర్ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద చెక్‌పోస్టు గేట్‌కు ఢీకొని మృతిచెందిన వీడియో వైరల్‌గా మారింది. వేగంగా వస్తున్న మోటార్‌సైకిల్‌ను ఆపాలని చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న బీట్ అధికారి చేతితో సూచించినా ఆగలేదు. అతివేగంగా వస్తుండడాన్ని గమనించి గేట్‌ను ఎత్తే ప్రయత్నం చేస్తుండగా వాహన చోదకుడు క్షణాల్లో గేట్‌ను దాటి పోవాలని ప్రయత్నించాడు. వాహనం నడిపే వ్యక్తి ముందుకు వంగడంతో వెనుక కూర్చన్న వెంకటేశ్‌గౌడ్ గేట్‌కు ఢీకొని తలకు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ వీడియో ఆదివారం వైరల్ అయింది. అతివేగంగా నడిపిన చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్‌రావు తెలిపారు. -
ఆ నిండు ప్రాణాలు పోవడానికి కారణం అదే!
తిరుత్తణి: బైకును, కారు ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ కొడుకు ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుత్తణి శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపంలోని మురుక్కంపట్టు గ్రామానికి చెందిన లోకనాథన్(42) ప్రభుత్వ బస్సు కండెక్టర్. మంగళవారం రాత్రి తిరుత్తణి నుంచి గ్రామానికి బైకులో తండ్రి దేశప్పరెడ్డితో కలిసి వెళ్తుండగా చెన్నై – తిరుపతి జాతీయ రహదారి మురుక్కంపట్టు వద్ద తిరుపతి నుంచి తిరుత్తణి వైపు వేగంగా వెళ్తున్న కారు బైకును ఢీకొంది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తండ్రీ కొడుకులిద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. అయితే తమ గ్రామం వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడంతోనే రెండు ప్రాణాలు పోయాయని, వెంటనే కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. దీంతో చెన్నై–తిరుపతి జాతీయ రహదారిలో దాదాపు రెండు గంటల పాటు వాహన రాకపోకలు స్తంభించాయి. పోలీసుల హామీతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
మృత్యువులోనూ వీడని బంధం
చొప్పదండి: ఇంటి నుంచి బయలుదేరిన నిమిషం వ్యవధిలోనే ఆటోరూపంలో దంపతులను మృత్యువు కబళించిన సంఘటన చొప్పదండి మండలం రాగంపేట శివారులో గురువారం జరిగింది. సీఐ కదిర నాగేశ్వర్రావు కథనం ప్రకారం..రెవెళ్లి గ్రామానికి చెందిన వొడ్నాల సంపత్‌కు పక్కనే ఉన్న రాగంపేటకు చెందిన స్వప్నతో ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి అయిదేళ్ల కుమారుడు, మూడేళ్ల కూతురు ఉన్నారు. సంపత్ స్థానికంగా కూలి పని, వ్యవసాయ పనులు చేసుకుంటుండగా స్వప్న నగునూరులోని ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. గురువారం స్వప్నను ఆసుపత్రికి పంపించేందుకు బైక్‌పై (టీఎస్ 02 ఈఎక్స్ 5625) ఇంటి నుంచి బయలుదేరారు. రెవెళ్లి శివారు దాటి రాగంపేట శివారులోని పెద్దమ్మ గుడి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటో (ఏపీ 15 టీఏ 9012)ను అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చిన డ్రైవర్ బైక్‌ని బలంగా ఢీకొట్టాడు. బండిపై నుంచి ఎగిరిపడ్డ స్వప్న అక్కడికక్కడే, సంపత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. సంపత్ తల్లి వొడ్నాల లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
హీరో కరిజ్మా మళ్లీ వచ్చింది
సాక్షి, ముంబై: భారత మోటారుసైకిల్ తయారీ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్ తన పాపులర్ మోడల్ బైక్‌ను తిరిగి లాంచ్ చేసింది. కరిజ్మా జెడ్‌ఎంఆర్ బైక్‌ను ఇండియన్ మార్కెట్లో తీసుకువచ్చింది. ఈ బైక్ స్టాండర్డ్ వెర్షన్‌ను 1.08 లక్షల రూపాయల ధరతో, డ్యూయల్-టోన్ మోడల్ బైక్నురూ. 1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్ ) ధర వద్ద అందుబాటులో ఉంచింది.భారతీయ విఫణిలో మొట్టమొదటి 225 సిసి సింగిల్ సిలిండర్ బైక్ గా గుర్తింపు పొందిన కరిజ్మా బైక్‌ను పేలవమైన విక్రయాల కారణంగా ఇండియన్ మార్కెట్లో సేల్స్‌నిలిపివేసింది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు మెరుగ్గానే ఉన్నాయి. మెకానికల్ మార్పులు చేయనప్పటికీ, కాస్మొటిక్అప్డేట్స్తో సరికొత్తగా లాంచ్ చేసింది. 223సీసీ సింగిల్ ఇంజీన్, 20బీహెచ్పీ పవర్, 19.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ , 5 మాన్యువల్ గేర్ బాక్స్ ఈ బైక్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. నాలుగు రంగుల్లో ఆకర్షణీయంగా అందుబాటులోకి వచ్చింది. -
ఆటో, బైక్ ఢీకొని వ్యక్తి మృతి
నలుగురికి తీవ్రగాయాలు ఈపూరు: ఆటో, బైకు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిగా నలుగురు తీవ్రగాయాలు పాలయ్యారు. ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామ సమీపంలో సోమవారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం నుంచి వినుకొండకు వెళ్తున్న ఆటో, వినుకొండ నుంచి గోపువారిపాలెం వెళ్తున్న ద్విచక్రవాహనం కొండ్రముట్ల గ్రామం వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న ముక్కపాటి హనుమంతరావు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో అతని కాలు తెగిపోయి రోడ్డుపై పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న కొత్త యేహాను, పుష్ప, ఆటో డ్రైవరు కొమరిగిరి సురేష్, వెంకటకుమారి, ఆషాలకు తీవ్రగాయాలు కాగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు హనుమంతరావుకు భార్య, ఇరువురు సంతానం ఉన్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల నివారణకు తమ వంతు సహకారం అందించాలన్నారు. -
ఆటో, బైక్ డీకిని వ్యక్తి మృతి
నలుగురికి తీవ్రగాయాలు ఈపూరు: ఆటో, బైకు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిగా నలుగురు తీవ్రగాయాలు పాలయ్యారు. ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామ సమీపంలో సోమవారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం నుంచి వినుకొండకు వెళ్తున్న ఆటో, వినుకొండ నుంచి గోపువారిపాలెం వెళ్తున్న ద్విచక్రవాహనం కొండ్రముట్ల గ్రామం వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న ముక్కపాటి హనుమంతరావు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో అతని కాలు తెగిపోయి రోడ్డుపై పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న కొత్త యేహాను, పుష్ప, ఆటో డ్రైవరు కొమరిగిరి సురేష్, వెంకటకుమారి, ఆషాలకు తీవ్రగాయాలు కాగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు హనుమంతరావుకు భార్య, ఇరువురు సంతానం ఉన్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల నివారణకు తమ వంతు సహకారం అందించాలన్నారు. పోటోరైటప్26వియన్‌కె35.మృతుడు హనుమంతరావు పోటోరైటప్26వియన్‌కె36.రోడ్డుపైన విరిగిపడిన హనుమంతరావు కాలు పోటోరైటప్26వియన్‌కె37.బోల్తాపడిన ఆటో పోటోరైటప్26వియన్‌కె39.సంఘటనా స్థలంలో ద్విచక్రవాహనం -
బైక్ ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు
కనగల్ : ప్రమాదవశాత్తు బైక్ ఢీకుని బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలుడు నీలకంఠం అభిరామ్ రోడ్డు దాటుతుండగా మండల కేంద్రంకు చెందిన పాలకూరి నగేశ్ నల్లగొండ వైపు నుంచి బైక్‌పై వస్తూ ఢీకొట్డాడు. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నల్లగొండ తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
బైక్‌లు ఢీకొని యువకుడి మృతి
వెనిగండ్ల(పెదకాకాని): రోడ్డుపై వస్తున్న బైక్‌ను మరో బైక్ వేగంగా ఢీ కొనడంతో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని వెనిగండ్ల పొలిమేర సెంటర్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రమేష్ కుటుంబం కొన్నేళ్లుగా హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు నరసింహ. గురువారం సాయంత్రం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల రోడ్డులో బైక్‌పై నరసింహ వస్తుండగా ఎదురుగా వెళుతున్న మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కుడి మోచేతికి, కన్ను వద్ద గాయాలైన ఆ యువకుడిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నరసింహ (20) ఎక్కువగా ఒత్తిడికి గురై బీపీ పెరిగి గుండెనొప్పి రావడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చేతికంది వచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మతి చెందడంతో రమేష్ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మృతుడు గత కొంతకాలంగా పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. నరసింహ బైక్‌ను ఢీ కొట్టిన వారు పరారీ కాగా స్థానికులు బైక్‌ను నిలిపివేసినట్లు సమాచారం. -
బైక్ అదుపు తప్పి ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
–మరొకరి పరిస్థితి విషమం గూడూరు : స్నేహితుడి బస్సు ఎక్కించేందుకు ఒకే మోటార్ బైక్‌పై నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అతి వేగంగా వెళ్తు మలుపు వద్ద అదుపు తప్పి ఒకరు మతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని పంబలేరు చప్టా వద్ద జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. ఆదిశంకరా ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ఈ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి హాసిఫ్ గూడూరు నుంచి స్నేహితులైన శివ, క్రాంతితో కలిసి అనికేపల్లికి చెందిన ప్రవీణ్‌ను బస్సు ఎక్కించేందుకు జాతీయ రహదారిపై ఆదిశంకర కూడలి ప్రాంతానికి బయలుదేరారు. వారు అతి వేగంగా మోటార్ బైక్‌పై వస్తుండగా పంబలేరు చప్టా వద్దకు చేరుకునే సరికి మలుపు వద్ద అదుపు తప్పింది. దీంతో ఆ చప్టా వద్ద ఉన్న రాళ్లకు ఢీకొని పడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన నాయుడుపేట మండలం అన్నమేడుకు చెందిన శివ, హాసిఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలిస్తుండగా వారిలో శివ మార్గమధ్యలో మతి చెందాడు. శివ గూడూరులో గదిని అద్దెకు తీసుకుని చదువుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రాణం తీసింది ఆ నలుగురు విద్యార్థులు విపరీతమైన వేగంగా మోటార్‌సైకిల్‌పై కేకలు వేస్తూ, ఎస్ కటింగ్స్ ఇస్తూ వెళ్లారని, అప్పుడే ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనుకున్నామని ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపారు. క్షణాల్లోనే అటు వైపు నుంచి వచ్చిన వారు మోటర్‌సైకిల్ బోల్తాపడిందని చెప్పడం.. అంతలోనే ఆటోలో క్షతగాత్రులను తీసుకురావడం చూశామని స్థానికులు చెబుతున్నారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి
సూర్యాపేటరూరల్ : రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట మండలంలోని రామచంద్రాపురం, సోలిపేట గ్రామాల మధ్య రోడ్డుపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన అంతటి నర్సయ్య(33) అర్వపల్లి మండలంలో బంధువుల ఇంటికి పండుగకు వెళ్లాడు. తిరిగి 7 గంటల సమయంలో స్వగ్రామానికి బైక్‌పై వస్తున్నాడు. ఇదే క్రమంలో తుంగతుర్తి మండలం శాంతినగర్‌కు చెందిన కలీం రామచంద్రాపురం వైపు నుంచి తుంగతుర్తికి బైక్‌పై వెళ్తూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అంతటి నర్సయ్య అక్కడిక్కడే మృతి చెందగా, కలీంకు చెయ్యి విరగడంతో పాటు తీవ్ర గాయాలపాలయ్యాడు. బైక్‌లు రెండు దెబ్బతిన్నాయి. వెంటనే 108 సిబ్బంది గాయాలపాలైన కలీంను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య మృతదేహాన్ని పోలీసులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
బస్సు, బైక్ ఢీ.. ఒకరి దుర్మరణం
భువనగిరి అర్బన్ వలిగొండ మండలం గురునాధపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్(35) గ్రామ ఉపసర్పంచ్‌గా ఉన్నాడు. మంగళవారం అతని బాబాయి తోట హరిచంద్రతో కలిసి బైక్‌పై హైదరాబాద్ నుంచి భువనగిరికి వస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని టీచర్స్ కాలనీ సమీపంలో ఉన్న బైపాస్ రోడ్డు వద్దకు రాగానే భువనగిరి నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు క్రాస్ చేస్తుండగా ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శేఖర్ మతిచెందాడు. మతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పట్టణ ఎస్ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. -
స్కూల్ బస్సు-బైక్ ఢీ.. ముగ్గురు మృతి
చిట్యాల(నల్లగొండ): వేగంగా వెళ్తున్న బైక్, ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లెంల గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. పలివేల గ్రామానికి చెందిన గోసుకొండ బిక్షం(50), గోసుకొండ నర్సింహ(28), వెంకటేషం(40) తాపి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో పలివెల నుంచి చిట్యాల వైపు ద్విచక్రవాహనం పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న త్రివేణి విద్యా మందిర్‌కు చెందిన స్కూల్‌బస్సును ఢీకొట్టారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.