
తిరువొత్తియూరు: చోరీకి గురైన బైక్‌ను పోలీసు నడుపుతుండడంతో బాధితుడు ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలో వేట్టై గుడికి చెందిన వెట్రివేల్ (40) వ్యవసాయ కార్మికుడు. ఇతను తంజావూరు సర్కిల్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తాను 2018లో ఓ ఎరుపు రంగు ద్విచక్ర వాహనాన్ని కొన్నానని, అది 2021 డిసెంబర్ 10వ తేదీ రాత్రి చోరీకి గురైందని పేర్కొన్నాడు.
అయితే ఇటీవల తాను హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నానంటూ రూ.100 జరిమానాకు సంబంధించిన చలానా తన మొబైల్‌కు మెసేజ్ రూపంలో వచ్చిందన్నారు. బైక్ చోరీకి గురై.. ఫిర్యాదు చేసినా తనకు చలానా రావడంపై విచారణ జరపగా.. తన బైక్‌ను నాగై జిల్లాలో ఉన్న ఒక పోలీసు స్టేషన్లో ఓ కానిస్టేబుల్ నడుపుతున్నట్లు తెలిందన్నారు. ఇప్పటికైనా తన బైక్‌ను తనకు ఇప్పించి.. చోరీపై నిందితుడైన కానిస్టేబుల్‌ను ప్రశ్నించాలని కోరారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డీజీపీ కయల్ విళి ఆదేశించారు.
చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూలీ.. 10,000 రూపాయి నాణేలతో..
Comments
Please login to add a commentAdd a comment