చెన్నై: తల్లి, తండ్రి, గురువు అంటారు.. వీళ్లు ముగ్గురు జీవితంలో చాల కీలకమైన వాళ్లుగా మన పెద్దలు చెబుతుంటారు. తల్లిదండ్రులు నీకు ఆలనాపాలనా చూస్తే , గురువులు నీకు విద్యా బుద్దులు నేర్పించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి గురువుకి కొందరు విద్యార్థులు ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా ఊహించిన బహుమతి ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఈ ఘటన తిరువారూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి తమ గుర్తుగా ఓ చిరు కానుకను అందజేశారు. తిరువారూరు జిల్లా ముత్తుపేట సమీపంలోని అలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రామన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన 1988 జూన్ 27న ఈ స్కూల్‌లో చేరి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
ఈ క్రమంలో రామన్ ఉద్యోగ విరమణ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని మాలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఆయనకు రూ.లక్ష విలువైన ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందజేశారు. ఉపాధ్యాయుడు రామన్‌ను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. విద్యార్థులు తనపై చూపిన ప్రేమకు ఆ ఉపాధ్యాయుడికి ఆనందంతో కంట కన్నీళ్లు ఆగలేదు.
చదవండి: బస్సు వైపు కోపంగా దూసుకొచ్చిన ఏనుగు.. ఇదే చివరి రోజు అనుకున్నారు.. కానీ ఫైనల్‌గా
Comments
Please login to add a commentAdd a comment