సాక్షి,బళ్లారి: భర్త వేధింపుల నుంచి రక్షణ కోరుతూ పోలీసు స్టేషన్ గడప తొక్కిందామె. కానీ, అక్కడ రక్షక భటులే కీచకులయ్యారు. ఆమెను భర్త నుంచి విడగొట్టి.. ఒంటరిని చేసి మరీ లైంగిక దాడుకు దిగారు. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఇద్దరు కీచక కానిస్టేబుళ్ల గుట్టు రట్టయింది.
నగరంలోని బండిహట్టిలోని పద్మశ్రీ కాలనీకి చెందిన ఓ మహిళ 2023 ఏప్రిల్‌లో తన భర్త ప్రతి రోజు చిత్రహింసకు గురి చేస్తున్నారని, అతని బారి నుంచి రక్షణ కల్పించాలని కౌల్‌బజార్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అనే కానిస్టేబుల్ సానుభూతిగా మాట్లాడుతూ ఫోన్ నంబరు తీసుకున్నాడు. మరుసటి రోజు భర్త సతాయించడంతో ఆమె ఇమ్రాన్‌ఖాన్‌కి కాల్ చేసి చెప్పింది.
అతడు ఫోన్ చేసి ఆమె భర్తను గదమాయించాడు. అప్పటినుంచి ఆమెతో తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆమెకు డబ్బులు ఆశ చూపి, ప్రత్యేకంగా ఓ ఇల్లు బాడుగకు ఇప్పించి సహ జీవనం ప్రారంభించాడు. కొన్నాళ్లపాటు వ్యవహారం సాగించిన ఇమ్రాన్‌ఖాన్ తప్పుకున్నాడు.
కేసు నమోదు, ఒకరి అరెస్టు హిళ విషయం తెలిసి ఆజాద్ అనే మరో కానిస్టేబుల్.. ఆమెకు దగ్గరయ్యాడు. ఇంతలో ఇమ్రాన్‌ఖాన్ కూడా వారి మధ్యకు వచ్చాడు. తాము చెప్పినట్లు వినకపోతే యాసిడ్‌తో దాడి చేస్తామని కూడా బెదిరించారట. చివరకు వారి నరకయాతనను తట్టుకోలేని బాధితురాలు ఇద్దరు కానిస్టేబుళ్లు తనను నమ్మించి మోసం చేశారని మహిళా పోలీసు స్టేషన్‌లో లైంగికదాడి కేసు పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి ఒకరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ బాగోతం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment