ఖలీల్‌వాడి (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మహేశ్‌పై పోక్సో కేసు నమోదైంది. కానిస్టేబుల్ మహేశ్ ఓ కేసు విషయమై నిందితుడికి సమన్లు అందించడానికి ఆదివారం నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామానికి వెళ్లాడు. ఇంట్లో నిందితుడు లేకపోవడంతో పక్కింట్లో ఉన్న బాలికతో మాట్లాడి నిందితుడి వివరాలను తెలుసుకున్నాడు. ఈ క్రమంలో బాలికతో మహేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు.
తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చాక బాలిక వారికి విషయం చెప్పింది. దీంతో వారు సోమవారం ఉదయం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని ఎస్సై మహేశ్ నిజామాబాద్ సౌత్ సీఐ వెంకటనారాయణకు వివరించారు. ఆయన సీపీ కల్మేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు శుక్రవారం మహేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మహేశ్ గతంలో ఓ కేసు విషయంలో సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ఎత్తేశాక మళ్లీ అదే స్టేషన్‌లో విధుల్లో కొనసాగుతున్నారు. పోక్సో కింద కేసు నమోదు కావడంతో సదరు కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment