కొవ్వూరు పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కవల అన్నదమ్ములు కానిస్టేబుళ్లు
వారిద్దరూ కవలలు. పైగా ఒకే చోట పోలీసులుగా ఉద్యోగాలు. దీంతో రోజూ చూస్తున్నా సరే.. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో పాటు అధికారులు కూడా ఒకింత కన్ఫ్యూజన్ అవ్వాల్సిందే. యూనిఫాం వేశారంటే ఎవరు.. ఎవరో గుర్తుపట్టడం అంత ఈజీ కాదు మరి. ఇద్దరూ ఒకేసారి జననం, కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరడం, పెళ్లిళ్లూ ఒకేసారి కావడం.. ఇలా వీరి జీవితం అద్భుతాలమయంగా సాగుతోంది.
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసు స్టేషన్‌లో ఈ ఇద్దరు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఒకరి పేరు యు.లక్ష్మణకుశ, మరొకరి పేరు యు.రాములవ. వీరి స్వస్థలం తాళ్లపూడి. ఊబా సన్యాసిరావు, సావిత్రి దంపతులకు ఆరుగురు మగపిల్లలు సంతానం. వీరు మూడు, నాలుగో సంతానంగా జన్మించారు. వీరి కంటే మరో ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ పుట్టి చనిపోయారు.
తర్వాత నాలుగో కాన్పులో వీరు జన్మించారు. దీంతో రామ్, లక్ష్మణ్‌ల పేర్లు కలిసేలా వీరికి పేర్లు పెట్టారు. మరో విశేషం ఏమిటంటే ఈ అన్నదమ్ములు ఒకేరోజు పోలీసు, రైల్వే కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఇద్దరూ పోలీసు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరడం, వీరిద్దరి పెళ్లిళ్లు సైతం ఒకే రోజు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment