నితీశ్‌ కుమార్‌ వైపు దూసుకొచ్చిన బైక్.. అప్రమత్తమై పుట్‌పాత్‌ పైకి దూకడంతో.. | Nitish Kumar Morning Walk, Biker Caught Security Breach Bihar | Sakshi
Sakshi News home page

నితీశ్‌ కుమార్‌ వైపు దూసుకొచ్చిన బైక్.. అప్రమత్తమై పుట్‌పాత్‌ పైకి దూకడంతో..

Published Thu, Jun 15 2023 3:01 PM | Last Updated on Thu, Jun 15 2023 4:06 PM

Nitish Kumar Morning Walk, Biker Caught Security Breach Bihar - Sakshi

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం చోటు చేసుకుంది. సీఎం ఎప్పటిలానే తన ఇంటి నుంచి వాకింగ్‌ కోసమని బైటకు వచ్చారు. అంతలో అటుగా వస్తున్న ఓ బైకర్‌ సీఎం సెక్యూరిటీ బలగాలను దాటుకుని నితీశ్ వైపుకు దూసుకొచ్చాడు. చూస్తుండగానే సీఎంకు అత్యంత సమీపానికి వచ్చేశాడు. దీంతో అప్రమత్తమైన నితీశ్‌ వెంటనే రోడ్డుపై నుంచి పుట్‌పాతవైపు దూకాల్సి వచ్చింది.

సీఎం తన నివాసం నుంచి సర్క్యులర్‌ రోడ్డులోని వాకింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం బైకర్‌ను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండెంట్,  పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నరు. ప్రస్తుతం అధికారులు దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చదవండి: ‘నీట్‌’ని క్రాక్‌ చేసిన కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement