
కాలిపోతున్న కారు, బుల్లెట్ బైక్
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): వేర్వేరు చోట్ల కారు, ఎన్‌ఫీల్డ్ బైక్ రోడ్డు మధ్యలోనే కాలిపోయిన సంఘటన నెలమంగల తాలూకాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బెంగళూరు నాగరబావి నుంచి తుమకూరు వెళ్తున్న పాత ఇండికా కారు నెలమంగల వద్ద జాతీయ రహదారిపై ఇంజన్‌లో మంటలు చెలరేగి క్షణాల్లో రోడ్డుమధ్యలోనే కాలిపోయింది.
అందులోని చిరాగ్, నాగేశ్, నాగరాజు, మరో మహిళ బయటకు దిగి బయటపడ్డారు. ఇక కుణిగల్ జాతీయ రహదారి మార్గంలో యంటగానహళ్లి వద్ద శివమొగ్గకు చెందిన గగన్ అనే వ్యక్తి వస్తున్న బుల్లెట్ బైక్‌లో మంటలు లేచి దగ్ధమైంది. వారం క్రితమే కొనుక్కున్న ఈ బైక్‌లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేయించినట్టు బాధితుడు చెప్పాడు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి: ఆరునెలల్లో కూతురు వివాహం.. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా..