బెంగళూరు: ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవరూ ఊహించలేరు. రోడ్డు ప్రమాదాలైతే మరీ దారుణం, మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినప్పటికీ అవతల వాహనదారుడి నిర్లక్ష్యం వల్ల కూడా మనం ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. తాజాగా ఓ కారు నడుపతున్న వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ని ఢీ కొట్టింది. అనంతరం అటుగా నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో చోటు చే''కుంది.
అతివేగంగా వెళ్తున్న కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన ఘోర రోడ్డు ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జూలై 18న రాయచూర్‌లోని శ్రీరామ దేవాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం. నిమిషానికి పైగా నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజీలో కాలేజీ అమ్మాయిలు వాహనాలు వెళుతుండగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. కారు దూసుకువచ్చి బైక్‌ను ఢీ కొట్టి అనంతరం పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు కాలేజీ అమ్మాయిలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సహా విద్యార్థులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.
ఇంత ప్రమాదం జరిగినా కారు నడుపుతున్న వ్యక్తి కనీసం వారికి ఏమైందని కూడా చూడకుండా వేగంగా కారు నడుపుకుంటా వెళ్లిపోయాడు.ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై రాయచూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం, బైకర్ రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ರಾಯಚೂರಿನ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ರಸ್ತೆಯಲ್ಲಿ ಕಾರು ಹಾಯ್ದ ರಭಸಕ್ಕೆ ಇಬ್ಬರು ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರು ಹಾರಿ ಬಿದ್ದ ದೃಶ್ಯ#raichur pic.twitter.com/9BrsoFevc3
— Prajavani (@prajavani) July 26, 2023
చదవండి పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు.. ఆమె తండ్రి ఏమన్నాడంటే..?
Comments
Please login to add a commentAdd a comment