
యశవంతపుర: వేగంగా ఘాట్ రోడ్డులో వెళ్తున్న కారు అదుపుతప్పి కింద ఉన్న ఇంటి మీద పడింది. చిక్కమగళూరు జిల్లా కళస తాలూకా గంగనకుడికె గ్రామం వద్ద జరిగింది. బెంగళూరుకు చెందిన ఐదు మంది భక్తులు శుక్రవారం రాత్రి హొరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయానికి బయలుదేరారు.
శనివారం ఉదయం గంగనకుడికె వద్ద కారు అదుపుతప్పి దిగువన ఉన్న ఇంటిపై పడింది. కారులోని ఐదు మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బతింది.