
యువతను తన వైపుకు తిప్పుకొని రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టిన టీవీఎస్ అపాచీ (Tvs Apache) మోడల్ బైకులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆ సంస్థ కొత్తగా రెండు అపాచీ మోడళ్లను లాంచ్ చేసింది. ఒకటి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160( 2022 TVS Apache RTR 160), రెండోది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 (TVS Apache RTR 180) మోడల్. RTR 160 ధర రూ 1.18 లక్షలు కాగా RTR 180 ధర 1.31 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. కొత్తగా రాబోతున్న ఈ రెండు మోటార్‌సైకిళ్లలో రిఫ్రెష్డ్ డిజైన్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (SmartXonnect) చేయబడిన టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక రెయిన్, అర్బన్, స్పోర్ట్ పేరుతో మూడు విభిన్న డైవింగ్ మోడ్‌లు ప్రత్యేక ఫీచర్‌గా చెప్పాలి.
ఫీచర్లు ఇవే:
2022 TVS Apache RTR 160.. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 159.7 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్, 16.04 PS పవర్, 13.85 Nm టార్క్ డెలివర్ చేస్తుంది.
2022 TVS Apache RTR 180.. 5-స్పీడ్ గేర్‌బాక్స్, 17PS పవర్, 15 Nm టార్క్‌తో 177.4cc ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది.
వీటిలో..ఫ్యూయల్ ఇంజెక్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్‌లతో పాటు రీడిజైన్ చేయబడిన ఎల్‌ఈడీ (LED) హెడ్‌ల్యాంప్ కూడా ఉంది. అధునాతన బ్లూటూత్‌తో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తున్నాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్, టీవీఎస్ కనెక్ట్ యాప్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 సిరీస్ గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్‌లలో లభ్యం కానుండగా, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్‌లో గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, మ్యాట్ బ్లూ, టీ-గ్రే వంటి ఐదు వేరియంట్ కలర్స్‌లో లభ్యమవుతుంది.
చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment