![Matte Series TVS Victor Premium Edition launched at Rs 55,890 - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/9/tvs-victor.jpg.webp?itok=3YGXxFAC)
సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ మేకర్ టివిఎస్ మోటార్ కొత్త విక్టర్ ప్రీమియం ఎడిషన్ బైక్‌ను లాంచ్ చేసింది . మేటీ సిరీస్‌లో కొత్త విక్టర్ ప్రీమియం ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసింది. రెండు కొత్త రంగుల్లో , అదనపు ఫీచర్లతో బడ్జెట్ ధరకే అందిస్తోంది. మాటీ బ్లూ విత్ వైట్‌గ్రాఫిక్స్, మాటీ సిల్వర్ విత్ రెడ్ గ్రాఫిక్స్‌తో రూ. 55,890 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కి ధరకే లభిస్తుంది.
110సీసీ బైక్ సెగ్మెంట్‌లో విభాగంలో సెప్టెంబరు 2017 లో లాంచ్ చేసిన టివిఎస్ విక్టర్ కొత్త ప్రీమియం ఎడిషన్‌లో న్యూస్టయిల్‌తో కొత్త ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా మెకానికల్ పెద్దగా మార్పులేమీ చేయకపోయినప్పటికీ బైక్స్ విభాగంలో బేసిక్ ఫీచర్‌ఆప్షనల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో పాటు కొత్త గ్రాఫిక్స్ జోడించి అవుట్‌లుక్‌ను అప్ డేట్ చేసింది. కొత్త ప్రీమియమ్ ఎడిషన్లో 3 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజీన్, ఫోర్-స్పీడ్ గేర్ బాక్స్ 9.5పీఎస్ పవర్, 9.4ఎన్‌ఎం టార్క్‌ను తదితర ఫీచర్లను అందిస్తుంది. లీటర్‌కు 72 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
![1](/gallery_images/2018/01/9/tvs-victor-1.jpg)
Comments
Please login to add a commentAdd a comment