premium bike
-
వామ్మో 1890 సీసీ ఇంజిన్.. రూ.72 లక్షల బైక్ విడుదల
దేశంలో మరో ఖరీదైన బైక్ విడుదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తన అల్ట్రా-ప్రీమియం రోడ్‌మాస్టర్ ఎలైట్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 71.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతో భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా మారింది.రోడ్‌మాస్టర్ ఎలైట్ అనేది పరిమిత-ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా 350 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. దీన్ని తయారు చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్ అనేది హై-ఎండ్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ అమెరికన్ బ్రాండ్. భారత్‌లో దీని ఉనికి పరిమితమే అయినప్పటికీ ఆకట్టుకునే లైనప్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ఇండియన్ స్కౌట్, చీఫ్టైన్, స్ప్రింగ్ఫీల్డ్, చీఫ్ వంటి మోడల్‌లు ఉన్నాయి.రోడ్‌మాస్టర్ ఎలైట్ ప్రత్యేకతలుపూర్తి స్థాయి టూరింగ్ మోటార్‌సైకిల్‌గా రూపొందిన రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్ డీప్ రెడ్, బ్లాక్ రంగులపై గోల్డ్ హైలైట్లతో ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది.ఈ బైక్‌లో 'ఎలైట్' బ్యాడ్జింగ్, గ్లోస్ బ్లాక్ డాష్, కలర్-మ్యాచ్డ్ సీట్లు ఉన్నాయి. ఇవి హీటింగ్, కూలింగ్ ఫంక్షన్లను అందిస్తాయి. అదనపు సౌకర్యం, లగ్జరీ కోసం ప్యాసింజర్ ఆర్మ్‌రెస్ట్‌లు, బ్యాక్లిట్ స్విచ్ క్యూబ్‌లు ఉన్నాయి.రోడ్‌మాస్టర్ ఎలైట్‌లో ప్రీమియం 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. 7 అంగుళాల TFT డిస్ప్లే ఇందులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే ఫీచర్లు ఉన్నాయి. సంప్రదాయ స్పీడోమీటర్, రెవ్ కౌంటర్ గేజ్‌లు ఉన్నాయి.హార్డ్‌వేర్ విషయానికి వస్తే ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, కాన్ఫిడెంట్ స్టాపింగ్ పవర్ కోసం సింగిల్ రియర్ డిస్క్ ఉన్నాయి. ఇందులో 20.8-లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.ఇందులో అతి ముఖ్యమైనది 1890 సీసీ V-ట్విన్ 'థండర్‌స్ట్రోక్' ఇంజన్. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ పవర్ఫుల్ ఇంజన్ 170 Nm టార్క్‌ను అందిస్తుంది. వీటి కలయిక శక్తివంతమైన, సరికొత్త రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. -
హీరో కొత్త వ్యూహం, రాయల్ ఎన్ఫీల్డ్కు టఫ్ ఫైట్!
మిడిల్ వెయిట్ బైక్ సెగ్మెంట్లో మార్కెట్ రారాజుగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది హీరో మోటర్ కార్ప్. దీని కోసం విదేశీ కంపెనీలతో జట్టు కట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని మరిపించేలా కొత్త బైక్‌ను డిజైన్ చేసే పనిలో తలామునకలై ఉన్నారు హీరో టీం మెంబర్స్. సాక్షి, వెబ్‌డెస్క్: ఇండియాలో బైక్ మార్కెట్లో హీరోదే అగ్ర స్థానం. హీరో గ్రూపు నుంచి వచ్చిన స్ల్పెండర్, ప్యాషన్ బైకులదే మార్కెట్లో హవా. అయితే దేశంలో నంబర్ వన్ మోటార్ బైక్ బ్రాండ్‌గా ఉన్నప్పటికీ హీరో బలమంతా ఎంట్రీ లెవల్, 100 సీసీ నుంచి 120 సీసీ బైకుల వరకే ఉంటోంది. అంతకు మించి స్పోర్ట్స్, మిడిల్ వెయిట్ సెగ్మెంట్లో హీరోకు పట్టు చిక్కడం లేదు. దశాబ్ధాల తరబడి ప్రయత్నాలు చేస్తోన్నా నిలదొక్కుకోలేక పోతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మరోవైపు రీలాంచ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇరగదీస్తోంది. 350 సీసీ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, థండర్ బర్డ్ మోడళ్ల అమ్మకాలు జోరు మీదున్నాయి. 350 సీసీ మిడిల్ వెయిట్ విభాగంలో 90 శాతం మార్కెట్ రాయల్ ఎన్ఫీల్డ్దే. దీంతో 350 సెగ్మెంట్లో వాటా కోసం హీరో కొత్త ప్రయత్నాలు చేస్తోంది. హార్లే డేవిడ్సన్ అమెరికాకు చెందిన ప్రీమియం బైకుల తయారీ కంపెనీ హర్లే డేవిడ్సన్తో జట్టు కట్టింది హీరో మోటర్ కార్ప్. గతంలో హర్లే డేవిడ్సన్ ఇండియా మార్కెట్లోకి వచ్చినా గట్టిగా నిలదొక్కుకోలేక పోయింది. దేశంలో అక్కడక్కడ తప్ప పెద్దగా అమ్మకాలు లేవు. పనులు మొదలయ్యాయి రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా మిడిల్‌వెయిట్ విభాగంలో 350 సీసీ ఇంజన్ సామర్థ్యంతో కొత్త బైకును మార్కెట్లోకి తెచ్చేందుకు హార్లే డేవిడ్సన్, హీరో కంపెనీలు చేతులు కలిపాయి. ‘ 350 సెగ్మెంట్లో బైకు తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే బైకు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని హీరో మోటర్ కార్ప్ ఫైనాన్షియల్ ఛీఫ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా ‘మనీ కంట్రోల్’కి వెల్లడించారు. ధరపై ఆసక్తి ఎంట్రీలెవల్ బైక్ మార్కెట్లో హీరో మోటర్ కార్ప్ది అగ్రస్థానమైతే, ప్రీమియం బైకులు మాత్రమే తయారు చేయడం హార్లే డేవిడ్సన్ ప్రత్యేకత. మరీ ఈ రెండు కంపెనీల కలయికలో వస్తోన్న మిడిల్ వెయిట్ సెగ్మెంట్ బైక్ ధర ఎంత ఉండవచ్చనేది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. -
ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ
న్యూఢిల్లీ, సాక్షి: మ్యాక్సి స్కూటర్.. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160కు బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు పియాజియో ఇండియా తాజాగా పేర్కొంది. విడుదలకు ముందు (ప్రీలాంచ్) బుకింగ్‌కు తెరతీసినట్లు తెలియజేసింది. రూ. 5,000 చెల్లించడం ద్వారా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్‌ను ప్రస్తుతం బారామతి ప్లాంటులో తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. బీఎస్-6 ప్రమాణాలతోపాటు.. లెడ్ స్ప్లిట్ హెడ్లైట్లు, మొబైల్ కనెక్టివిటీ, సర్దుబాటుకు వీలయ్యే వెనుక సస్పెన్షన్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌ను పొందుపరచినట్లు పియాజియో ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. కంపెనీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో లేదా డీలర్ల ద్వారా దేశవ్యాప్తంగా బుకింగ్స్‌కు వీలున్నట్లు తెలియజేసింది. (హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!) సవాళ్లున్నప్పటికీ 2020లో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ దేశీయంగా ప్రీమియం స్కూటర్ ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఉత్పత్తిని చేపట్టగలిగినట్లు పియాజియో ఇండియా చైర్మన్ డీగో గ్రాఫీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఆధునిక ఫీచర్లు, తరువాతి తరం డిజైన్‌తో రానున్న ప్రీమియం స్కూటర్ వినియోగదారులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది(2020) ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి క్యాండీ రెడ్ కలర్లో మ్యాక్సి స్కూటర్‌ను పియాజియో ప్రదర్శించింది. దేశీయంగా జపనీస్ దిగ్గజం సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వాహనానికి ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ ప్రత్యక్ష 160 పోటీనివ్వగలదని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. (కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ) ఎల్సీడీ క్లస్టర్ దేశీ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను పియాజియో ఇటలీలో రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. మూడు వాల్వ్‌ల ఫ్యూయల్ ఇంజక్ట్‌డ్ మోటార్‌తో కూడిన 160 సీసీ ఇంజిన్‌ను ఆధునీకరించి మ్యాక్సీ స్కూటర్లో వినియోగించినట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌తో స్కూటర్ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ట్విన్ క్రిస్టల్ హెడ్‌లైట్స్, 3 కోట్ హెచ్డీ బాడీ పెయింట్ ఫినిష్‌తో రూపొందుతున్నట్లు వివరించారు. ఎప్రిలియా ప్రీమియం స్కూటర్.. గ్లాసీ రెడ్, మ్యాట్ బ్లూ, గ్లాసీ వైట్ అండ్ మ్యాట్ బ్లాక్ కలర్స్‌లో లభ్యంకానున్నట్లు తెలియజేశారు. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.10-1.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. -
ప్రీమియం బైక్‌కు బీమా అప్‌గ్రేడ్
దేశంలో వాహనాల వినియోగం పెరిగిపోతోంది. ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా ఎక్కువ వృద్ధి మనదేశంలోనే. దేశీయ ఆటో పరిశ్రమ అమ్మకాల్లో 80 శాతం ద్విచక్ర వాహనాలదే ఆధిపత్యం. రవాణా పరంగా అత్యంత సౌకర్యమైనది కావడం వల్లే. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అధిక ఇంజన్ సామర్థ్యంతో కూడిన మోటారు సైకిళ్లకు డిమాండ్ పెరుగుతుండడం. ఈ విభాగంలో 300 నుంచి 500సీసీ ఇంజన్ సామర్థ్యాల బైకుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక 500సీసీ కంటే అధిక సామర్థ్యం కలిగిన బైకుల మార్కెట్ కూడా వేడెక్కుతోంది. మెట్రోలు, టైర్–1 పట్టణాల్లో ఈ బైకులకు ఆదరణ పెరుగుతోంది. ఈ బైకుల ఖరీదు ఎక్కువే అయినప్పటికీ, రుణం లభించే వెసులుబాటు ఉండడం సానుకూలం. అయితే, దురదృష్టవశాత్తూ ఈ బైకులు ప్రమాదం బారిన పడితే విడిభాగాలకు జరిగే నష్టం పెద్దగానే ఉంటుంది. ఇది పాకెట్‌కు చిల్లు పెడుతుంది. కనుక కాంప్రెన్సివ్ కవరేజీతో కూడిన మోటారు ఇన్సూరెన్స్ ఒక్కటీ ఉండే సరిపోదు. తగిన యాడ్ఆన్ కవర్లను కూడా తీసుకోవడం అవసరం. అప్పుడే పూర్తి రక్షణ లభిస్తుంది. జీరో లేదా నిల్ డిప్రిసియేషన్ కవర్, ఇంజన్ ప్రొటెక్టర్ సున్నా లేదా తరుగుదల లేని కవరేజీ అన్నది మీ బైక్‌కు తప్పనిసరి. ఎందుకంటే చిన్న విడిభాగం రిపేర్ చేయాల్సి వచ్చినా ఖర్చు ఎక్కువే అవుతుంది. మన దేశంలోకి దిగుమతి అయ్యే బైకుల్లో అధిక శాతం పూర్తిగా నిర్మించిన యూనిట్లే (సీబీయూ). వీటికి ఏదైనా నష్టం జరిగితే ఈ కవరేజీతో తగినంత పరిహారాన్ని ఏ మినహాయింపు లేకుండా పొందొచ్చు. ఇంజన్ ప్రొటెక్టర్ కూడా తప్పనిసరి. దీని కింద ఇంజన్లో చిన్న విడిభాగాలను మార్చాల్సి వచ్చినా లేదా రిపేర్ చేయాల్సి ఉన్నా కవరేజీ పొందొచ్చు. అలాగే, గేర్‌బాక్స్‌లో విడిభాగాలను మార్చాల్సి ఉన్నా కవరేజీ ఇస్తుంది. దెబ్బతిన్న ఇంజన్ ఓవర్‌హాల్, గేర్‌బాక్స్ ఓవర్‌హాల్, లేబర్ ఖర్చులను సైతం చెల్లిస్తుంది. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో బైకుల ఇంజన్లలోకి నీరు వెళితే అంతర్గత భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఈ కవరేజీ ఉపయోగపడుతుంది. కన్జ్యూమబుల్ కవర్ చిన్నవి కూడా మొత్తం ఖర్చుల్లో చేరి పెద్దవవుతాయి. వాహనంలో కన్జ్యూమబుల్స్ అంటే ఇంజన్ ఆయిల్, గేర్‌బాక్స్ ఆయిల్, పవర్ స్టీరింగ్ ఆయిల్, బైక్ ఆయిల్, బ్యాటరీ ఎలక్ట్రోలైట్, ఫ్లూయిడ్, రేడియేటర్ కూలంట్, నట్లు, బోల్టులు ఈ తరహా విడిభాగాలు. కన్జ్యూమబుల్ కవర్ అన్నది కన్జ్యూమబుల్స్కు కవరేజీనిచ్చే యాడ్ఆన్. ఇది సాధారణ మోటార్ బీమాలో భాగంగా ఉండదు. కానీ, ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన యాడ్ ఆన్ కవర్. ఎందుకంటే ఒకవేళ ప్రమాదం జరిగితే ఆయిల్తోపాటు ఇతర కన్జ్యూమబుల్స్ మార్చాల్సి వస్తే ఖర్చులు ఎక్కువే అవుతాయి. జీరో డిప్రిసియేషన్, ఇంజన్ ప్రొటెక్టర్కు టాపప్‌గా దీన్ని తీసుకోవచ్చు. పిలియన్ కవర్ లేదా ఎక్స్ట్రా యాక్సిడెంటల్ కవర్ సూపర్ బైకులన్నవి అధిక ఇంజన్ సామర్థ్యం, అధిక పవర్‌తో ఉంటాయి. వీటిని నడపడంలో, ముఖ్యంగా వెనుక ఎవరైనా కూర్చున్న సమయాల్లో నడపడంలో శిక్షణ, సాధన అవసరం. ఈ బైకులకు యాక్సిడెంట్ జరిగితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చాలా కేసుల్లో బైక్ నడిపే వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వారు కూడా మరణించే అవకాశాలు ఉంటాయి. బండిని నడిపే వ్యక్తి యజమాని కాకపోయినా, వెనుక కూర్చున్న వారికీ రూ.15 లక్షల కవరేజీ లభిస్తుంది. -
టీవీఎస్ విక్టర్ ప్రీమియం బైక్..బడ్జెట్ ధర
సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ మేకర్ టివిఎస్ మోటార్ కొత్త విక్టర్ ప్రీమియం ఎడిషన్ బైక్‌ను లాంచ్ చేసింది . మేటీ సిరీస్‌లో కొత్త విక్టర్ ప్రీమియం ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసింది. రెండు కొత్త రంగుల్లో , అదనపు ఫీచర్లతో బడ్జెట్ ధరకే అందిస్తోంది. మాటీ బ్లూ విత్ వైట్గ్రాఫిక్స్, మాటీ సిల్వర్ విత్ రెడ్ గ్రాఫిక్స్‌తో రూ. 55,890 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కి ధరకే లభిస్తుంది. 110సీసీ బైక్ సెగ్మెంట్లో విభాగంలో సెప్టెంబరు 2017 లో లాంచ్ చేసిన టివిఎస్ విక్టర్ కొత్త ప్రీమియం ఎడిషన్‌లో న్యూస్టయిల్తో కొత్త ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా మెకానికల్ పెద్దగా మార్పులేమీ చేయకపోయినప్పటికీ బైక్స్ విభాగంలో బేసిక్ ఫీచర్ఆప్షనల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో పాటు కొత్త గ్రాఫిక్స్ జోడించి అవుట్‌లుక్‌ను అప్ డేట్ చేసింది. కొత్త ప్రీమియమ్ ఎడిషన్‌లో 3 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజీన్, ఫోర్-స్పీడ్ గేర్ బాక్స్ 9.5పీఎస్ పవర్, 9.4ఎన్ఎం టార్క్‌ను తదితర ఫీచర్లను అందిస్తుంది. లీటర్‌కు 72 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. -
హీరో కొత్త ‘అచీవర్ 150’
• ప్రారంభ ధర రూ.61,800 • ప్రీమియం విభాగంపై దృష్టి గుర్గావ్: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా తన ప్రీమియం బైక్ ‘అచీవర్ 150’లో అప్డేట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త బైక్.. డ్రమ్ బ్రేక్స్, డిస్క్ బ్రేక్స్ అనే రెండు ఆప్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.61,800గా, డిస్క్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.62,800గా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. 100 సీసీ, 125 సీసీ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న హీరో ఈ కొత్త బైక్ ద్వారా ప్రీమియం విభాగంలోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. కాగా కొత్త ‘అచీవర్ 150’ బైక్‌లో బీఎస్-4 నియంత్రణలకు అనువైన ఐ3ఎస్ టెక్నాలజీతో కూడిన ఇంజిన్‌ను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది.