హీరో కొత్త ‘అచీవర్ 150’ | Hero MotoCorp launches premium bike Achiever 150 | Sakshi
Sakshi News home page

హీరో కొత్త ‘అచీవర్ 150’

Published Tue, Sep 27 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

హీరో కొత్త ‘అచీవర్ 150’

హీరో కొత్త ‘అచీవర్ 150’

ప్రారంభ ధర రూ.61,800  
ప్రీమియం విభాగంపై దృష్టి

 గుర్గావ్: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా తన ప్రీమియం బైక్ ‘అచీవర్ 150’లో అప్‌డేట్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త బైక్.. డ్రమ్ బ్రేక్స్, డిస్క్ బ్రేక్స్ అనే రెండు ఆప్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.61,800గా, డిస్క్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.62,800గా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. 100 సీసీ, 125 సీసీ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న హీరో ఈ కొత్త బైక్ ద్వారా ప్రీమియం విభాగంలోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. కాగా కొత్త ‘అచీవర్ 150’ బైక్‌లో బీఎస్-4 నియంత్రణలకు అనువైన ఐ3ఎస్ టెక్నాలజీతో కూడిన ఇంజిన్‌ను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement