Achiever 150
-
డాక్టర్ సతీష్ కత్తులకు రేవా అవార్డు
హైదరాబాద్: రేవా ఫౌండేషన్ – 2024 (రేవా – రైజింగ్ అవేర్నెస్ ఆఫ్ యూత్ విత్ ఆటిజం) ప్రతిష్టాత్మక గాలా అవార్డును డాక్టర్ సతీష్ కత్తుల (ఎఎపిఐ ప్రెసిడెంట్, యూఎస్)కు ప్రకటించింది. న్యూయార్క్ నగరంలోని ప్రెస్టీజియస్ ఫెర్రీ హోటల్ లో గురువారం ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రేవా ఫౌండేషన్ ఆటిజంతో యువతకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు మద్దతుగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆయా రంగాల్లో ఇతరులకు స్ఫూర్తినిచ్చే వారిని సత్కరిస్తూ, స్ఫూర్తిదాయక అవార్డు గాలా ను ప్రదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన ఫౌండేషన్ ఆయనకు ద ఇన్ఫిరేషనల్ అచీవర్ 2024 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది. అవార్డు గ్రహీత డాక్టర్ సతీష్ కత్తుల ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా రేవా ఫౌండేషన్ ఆటిజం బాధితులకు మద్దతుగా చేస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఫౌండేషన్ ప్రతినిధులు మణికాంబోజ్, డాక్టర్ రష్మీ శర్మలకు అభినందనలు తెలియజేశారు. తన సేవలను గుర్తించి అవార్డును బహూకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
హీరో కొత్త ‘అచీవర్ 150’
• ప్రారంభ ధర రూ.61,800 • ప్రీమియం విభాగంపై దృష్టి గుర్గావ్: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా తన ప్రీమియం బైక్ ‘అచీవర్ 150’లో అప్డేట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త బైక్.. డ్రమ్ బ్రేక్స్, డిస్క్ బ్రేక్స్ అనే రెండు ఆప్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.61,800గా, డిస్క్ బ్రేక్స్ వేరియంట్ ధర రూ.62,800గా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. 100 సీసీ, 125 సీసీ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న హీరో ఈ కొత్త బైక్ ద్వారా ప్రీమియం విభాగంలోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. కాగా కొత్త ‘అచీవర్ 150’ బైక్‌లో బీఎస్-4 నియంత్రణలకు అనువైన ఐ3ఎస్ టెక్నాలజీతో కూడిన ఇంజిన్‌ను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది.