హైదరాబాద్: రేవా ఫౌండేషన్ – 2024 (రేవా – రైజింగ్ అవేర్నెస్ ఆఫ్ యూత్ విత్ ఆటిజం) ప్రతిష్టాత్మక గాలా అవార్డును డాక్టర్ సతీష్ కత్తుల (ఎఎపిఐ ప్రెసిడెంట్, యూఎస్)కు ప్రకటించింది. న్యూయార్క్ నగరంలోని ప్రెస్టీజియస్ ఫెర్రీ హోటల్ లో గురువారం ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రేవా ఫౌండేషన్ ఆటిజంతో యువతకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు మద్దతుగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆయా రంగాల్లో ఇతరులకు స్ఫూర్తినిచ్చే వారిని సత్కరిస్తూ, స్ఫూర్తిదాయక అవార్డు గాలా ను ప్రదానం చేస్తున్నారు.
ఇందులో భాగంగా నగరానికి చెందిన డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన ఫౌండేషన్ ఆయనకు ద ఇన్ఫిరేషనల్ అచీవర్ 2024 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది. అవార్డు గ్రహీత డాక్టర్ సతీష్ కత్తుల ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా రేవా ఫౌండేషన్ ఆటిజం బాధితులకు మద్దతుగా చేస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఫౌండేషన్ ప్రతినిధులు మణికాంబోజ్, డాక్టర్ రష్మీ శర్మలకు అభినందనలు తెలియజేశారు. తన సేవలను గుర్తించి అవార్డును బహూకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment