Reva
-
డాక్టర్ సతీష్ కత్తులకు రేవా అవార్డు
హైదరాబాద్: రేవా ఫౌండేషన్ – 2024 (రేవా – రైజింగ్ అవేర్నెస్ ఆఫ్ యూత్ విత్ ఆటిజం) ప్రతిష్టాత్మక గాలా అవార్డును డాక్టర్ సతీష్ కత్తుల (ఎఎపిఐ ప్రెసిడెంట్, యూఎస్)కు ప్రకటించింది. న్యూయార్క్ నగరంలోని ప్రెస్టీజియస్ ఫెర్రీ హోటల్ లో గురువారం ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రేవా ఫౌండేషన్ ఆటిజంతో యువతకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు మద్దతుగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆయా రంగాల్లో ఇతరులకు స్ఫూర్తినిచ్చే వారిని సత్కరిస్తూ, స్ఫూర్తిదాయక అవార్డు గాలా ను ప్రదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన ఫౌండేషన్ ఆయనకు ద ఇన్ఫిరేషనల్ అచీవర్ 2024 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది. అవార్డు గ్రహీత డాక్టర్ సతీష్ కత్తుల ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా రేవా ఫౌండేషన్ ఆటిజం బాధితులకు మద్దతుగా చేస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఫౌండేషన్ ప్రతినిధులు మణికాంబోజ్, డాక్టర్ రష్మీ శర్మలకు అభినందనలు తెలియజేశారు. తన సేవలను గుర్తించి అవార్డును బహూకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
ఈయనే లేకుంటే భారత్‌లో ఎలక్ట్రిక్ కారు పుట్టేదా? ఎవరీ చేతన్ మైని..
కేవలం డీజిల్, పెట్రోల్ కార్లను మాత్రమే వినియోగిస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం వచ్చిన ఆలోచన ఆటోమోటివ్ పరిశ్రమలో విప్లవాత్మకమైన ప్రయాణానికి నాంది పలికింది. ఈ ప్రయాణంలోనే 'రేవా' (Reva) పుట్టుకొచ్చింది. ఈ కారు ఎలా వచ్చింది, భారతదేశంలో ఎలక్ట్రిక్ కారు ప్రారంభం కావడానికి కారకులు ఎవరనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫ్యూయెల్ కార్లను వాడుతున్న కాలంలో తన దూరదృష్టితో ఎలక్ట్రిక్ కారు తయారు చేయడానికి పూనుకున్న వ్యక్తి 'చేతన్ మైని' (Chetan Maini). పచ్చని భవిష్యత్ కోసం కలలు కంటూ.. ఎలక్ట్రిక్ కారు 'రేవా'కు పునాది వేశారు. ఇదే నేడు గణనీయమైన ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలకు మార్గదర్శం అయింది. సవాళ్లకు ఏ మాత్రం భయపడకుండా.. చేతన్ మైని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇంధన వినియోగం తగ్గించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ కీలకమని తన నమ్మకానికి కట్టుబడి పనిచేశారు. అదే ఈ రోజు ప్రభుత్వం కూడా ఈవీల తయారీకి దోహదపడేలా చేస్తోంది. ఎవరీ 'చేతన్ మైని'? 1970 మార్చి 11న చేతన్ మైని బెంగళూరులో జన్మించారు. ఈయన తండ్రి సుదర్శన్ కె మైని. చేతన్ 1992లో మిచిగాన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, 1993లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత ప్రపంచం 100 శాతం ఈవీ రంగం వైపు పరుగెడుతుందని భావించి, ఇందులో భారత్ కూడా ప్రధానంగా ఉండాలని ఆశించి, బెంగళూరులో ఒక బృందాన్ని నిర్మించి దానికి నాయకత్వం వహించి.. రెండు సంవత్సరాల్లో రేవా ఎలక్ట్రిక్ కారు ప్రారంభమైంది. రేవా మహీంద్రా గ్రూప్‌తో చేతులు కలిపిన తర్వాత, మహీంద్రా రేవా ఏర్పడింది. ఇందులో 'చేతన్' టెక్నాలజీ & స్ట్రాటజీ చీఫ్‌గా పనిచేశారు. మూడు సంవత్సరాల పాటు పనిచేసి కొత్త సాంకేతికతలను నిర్మించడంపై దృష్టి సారించారు. ఆ తరువాత మహీంద్రా ఈ20 వెహికల్ పుట్టుకొచ్చింది. ఆ సమయంలోనే ఈయన కంపెనీ సీఈఓగా పదవి చేపట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత కంపెనీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈయన 'సన్ మొబిలిటీ'ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా? అచంచలమైన సంకల్పంతో స్థిరమైన ఆవిష్కరణలలో అగ్రగామిగా భారతదేశాన్ని ప్రపంచ వేదికపైకి నడిపించగలదని మైనీ విశ్వసించారు. చేతన్ మైని దూరదృష్టి అపారమైనది, ఆయన ఆలోచనలను పరిశీలిస్తే.. అత్యున్నతమైన భవిష్యత్తు ఎలా సాధ్యమవుతుందని స్పష్టంగా అవగతమైపోతుంది. -
వేతన బకాయిలు అడిగితే... చెయ్యి నరికేశాడు
రేవా: చేసిన పనికి సక్రమంగా వేతనం చెల్లించమని అడగడమే ఆ అభాగ్యుడి పాపమైంది. మధ్యప్రదేశ్‌లోని రేవ జిల్లాలోని దోల్‌మౌ గ్రామంలో గణేష్ మిశ్రా అనే మేస్త్రీ వద్ద నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు బాధితుడు అశోక్ సాకేత్. గణేష్ సక్రమంగా వేతనాలు చెల్లించకుండా ఎంతోకొంత విదిలిస్తూ వస్తున్నాడు. దీంతో విసిగిపోయిన అశోక్ సాకేత్ శనివారం సహచర కూలీతో కలిసి వెళ్లి తమకు రావాల్సిన కూలీ బకాయిలను చెల్లించాలని గట్టిగా నిలదీశాడు. ఫలితంగా వారిమధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆవేశం పట్టలేని గణేష్ మిశ్రా, అతని మిత్ర బృందం పదునైన ఆయుధంతో దాడి చేసి అశోక్ సాకేత్ చెయ్యిని నరికివేశారు. అంతేకాకుండా తెగిపడిన చెయ్యిని దాచేసే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడు అశోక్‌ను రేవాలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు అశోక్ చెయ్యిని తిరిగి అతికించారు. అయితే అధిక రక్తస్రావం కావడం మూలంగా బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. -
అమితాబ్ తాతయ్యా... మా ఇంట్లో బజ్జోవా!
-
అమితాబ్ తాతయ్యా... మా ఇంట్లో బజ్జోవా!
అమితాబ్ బచ్చన్‌కు కొన్ని లక్షల, కోట్ల మంది అభిమానులుంటారు. వాళ్లందరిలో ఆయనకు బాగా నచ్చిన నెంబర్ వన్ ఫ్యాన్ ఎవరో తెలుసా? లండన్‌కు చెందిన రేవా అనే అమ్మాయి. ఆమె వయసు నాలుగున్నరేళ్లు. అమితాబ్‌కు ఆమె అంతగా నచ్చేయడానికి కారణమేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. అమితాబ్ ఒకప్పుడు యాంగ్రీ యంగ్మాన్గా నటించిన షోలే, దీవార్ లాంటి సినిమాలు ఆమెకు తెలియవు. కానీ 2009లో విడుదలైన అల్లాదీన్ అనే సినిమాలో భూతంగా నటించిన అమితాబ్‌ను ఆమె చూసింది. దాంతో ఆ తాతయ్య తనకు చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, ఒకరోజు వచ్చి తమ ఇంట్లో పడుకుంటే తనకు అంతకంటే కావాల్సింది ఏమీ ఉండబోదని రేవా చెప్పింది. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. చిన్నారి రేవా పంపిన వీడియోను పోస్ట్ చేసి.. ''ఫ్యాన్ పిక్ ఆఫ్ ద వీక్'' అని రాశారు. అంతే.. దానికి 31వేలకు పైగా లైకులు, దాదాపు 2వేల షేర్లు, 1500 కామెంట్లు వచ్చి పడ్డాయి. ఆ వీడియోలో రేవా తండ్రి ఆమెను అమితాబ్‌లో నీకు అంత నచ్చినదేంటని అడుగుతారు. ఆమె ''ఆయన చాలా అద్భుతంగా నటిస్తారు. నాకు నిజంగా ఆయనంటే ఇష్టం'' అని చెబుతుంది. అంతేకాదు.. అల్లావుద్దీన్ అద్భుతదీపం సినిమాలో భూతంగా ఆయన చేసిన నటనను ప్రస్తావిస్తుంది. ఆయన్ను నిజంగా కలవాలనుందని తండ్రి దగ్గర మారాం చేస్తుంది. ఆయన వస్తే.. ఆయన మీదకు ఎగిరి దూకుతానని, వెంటనే చంకెక్కేస్తానని కూడా రేవా అంటోంది. బిగ్ బీని తమ ఇంటికి టీ తాగేందుకు పిలుస్తానని రేవా చెప్పినప్పుడు.. ఆయన వస్తారనే అనుకుంటున్నావా అని తండ్రి అడిగితే.. వస్తారనే భావిస్తున్నానంది. ఎలాగైనా సూపర్‌స్టార్ బచ్చన్ తాతయ్యను ఇంటికి పిలవాలని తండ్రిని కోరగా ఆయన సరేనంటారు. వీడియోలో రేవా తండ్రి అమితాబ్‌ను ఈసారి లండన్ వచ్చినప్పుడు తమ ఇంటికి రావాలని పిలుస్తుండగా.. మధ్యలో రేవా దూరి, ''మీకు కుదిరితే కాసేపు మా ఇంట్లో పడుకోరా.. ప్లీజ్'' అని అడుగుతుంది. అందుకే అమితాబ్‌కు ఆ చిన్నారి అంతగా నచ్చేసింది. -
మహీంద్రా రేవా ఈ2ఓ కారు ధర కట్
న్యూఢిల్లీ: మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ఈ2ఓ ధర రూ.1.7 లక్షల వరకూ తగ్గే ఒక కొత్త స్కీమ్‌ను మంగళవారం ప్రకటించింది. గుడ్‌బై ఫ్యూయల్, హెలో ఎలక్ట్రిక్ పేరుతో వినూత్నమైన ఈ బ్యాటరీ రెంటల్ స్కీమ్‌ను అందిస్తున్నామని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈవో చేతన్ మైణి చెప్పారు. చార్జింగ్ బ్యాటరీని కొనుగోలు చేయకుండా నెలకు రూ.2,599 చొప్పున ఐదేళ్లు చెల్లించే ఈ బ్యాటరీ రెంటల్ స్కీమ్ కారణంగా రూ. 6.69 లక్షల ధర ఉండే ఈ2ఓ కారును ఇప్పుడు రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ లిథియమ్ అయాన్ బ్యాటరీ నెలకు 800 కిమీ. చొప్పున(సగటున)ఐదేళ్లకు 50 వేల కిమీ. దూరం ప్రయాణిస్తుందని వివరించారు. బ్యాటరీ రెంటల్‌తో పాటు ఎలక్ట్రిసిటీ కంజప్షన్ చార్జీని కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఇది చాలా స్వల్పంగానే ఉండగలదని ఆయన వివరించారు. 24 గంటలూ రిపేర్ సేవలు అందుబాటులో ఉంటాయని, బ్యాటరీ రిపేర్ కాలంలో మరో కారును సమకూరుస్తామని పేర్కొన్నారు. కొత్త స్మార్ట్ పోర్ట్ టెక్నాలజీతో క్విక్2చార్జ్ డీసీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ఈ కంపెనీ ప్రారంభించింది. దీంతో ఈ2ఓ కారును ఒక్క గంటలోనే పూర్తిగా చార్జ్ చేయవచ్చు.