అమితాబ్ తాతయ్యా... మా ఇంట్లో బజ్జోవా!
అమితాబ్ బచ్చన్కు కొన్ని లక్షల, కోట్ల మంది అభిమానులుంటారు. వాళ్లందరిలో ఆయనకు బాగా నచ్చిన నెంబర్ వన్ ఫ్యాన్ ఎవరో తెలుసా? లండన్కు చెందిన రేవా అనే అమ్మాయి. ఆమె వయసు నాలుగున్నరేళ్లు. అమితాబ్కు ఆమె అంతగా నచ్చేయడానికి కారణమేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. అమితాబ్ ఒకప్పుడు యాంగ్రీ యంగ్మాన్గా నటించిన షోలే, దీవార్ లాంటి సినిమాలు ఆమెకు తెలియవు. కానీ 2009లో విడుదలైన అల్లాదీన్ అనే సినిమాలో భూతంగా నటించిన అమితాబ్ను ఆమె చూసింది. దాంతో ఆ తాతయ్య తనకు చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, ఒకరోజు వచ్చి తమ ఇంట్లో పడుకుంటే తనకు అంతకంటే కావాల్సింది ఏమీ ఉండబోదని రేవా చెప్పింది.
ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. చిన్నారి రేవా పంపిన వీడియోను పోస్ట్ చేసి.. ''ఫ్యాన్ పిక్ ఆఫ్ ద వీక్'' అని రాశారు. అంతే.. దానికి 31వేలకు పైగా లైకులు, దాదాపు 2వేల షేర్లు, 1500 కామెంట్లు వచ్చి పడ్డాయి. ఆ వీడియోలో రేవా తండ్రి ఆమెను అమితాబ్లో నీకు అంత నచ్చినదేంటని అడుగుతారు. ఆమె ''ఆయన చాలా అద్భుతంగా నటిస్తారు. నాకు నిజంగా ఆయనంటే ఇష్టం'' అని చెబుతుంది. అంతేకాదు.. అల్లావుద్దీన్ అద్భుతదీపం సినిమాలో భూతంగా ఆయన చేసిన నటనను ప్రస్తావిస్తుంది. ఆయన్ను నిజంగా కలవాలనుందని తండ్రి దగ్గర మారాం చేస్తుంది.
ఆయన వస్తే.. ఆయన మీదకు ఎగిరి దూకుతానని, వెంటనే చంకెక్కేస్తానని కూడా రేవా అంటోంది. బిగ్ బీని తమ ఇంటికి టీ తాగేందుకు పిలుస్తానని రేవా చెప్పినప్పుడు.. ఆయన వస్తారనే అనుకుంటున్నావా అని తండ్రి అడిగితే.. వస్తారనే భావిస్తున్నానంది. ఎలాగైనా సూపర్స్టార్ బచ్చన్ తాతయ్యను ఇంటికి పిలవాలని తండ్రిని కోరగా ఆయన సరేనంటారు. వీడియోలో రేవా తండ్రి అమితాబ్ను ఈసారి లండన్ వచ్చినప్పుడు తమ ఇంటికి రావాలని పిలుస్తుండగా.. మధ్యలో రేవా దూరి, ''మీకు కుదిరితే కాసేపు మా ఇంట్లో పడుకోరా.. ప్లీజ్'' అని అడుగుతుంది. అందుకే అమితాబ్కు ఆ చిన్నారి అంతగా నచ్చేసింది.