london girl
-
లండన్ అమ్మాయి.. మంచిర్యాల అబ్బాయి
మంచిర్యాల: లండన్ అమ్మాయి.. బెల్లంపల్లి అబ్బాయి పరిచయం ప్రేమగా మారింది.. ఒకరి నొకరు ఇష్టపడ్డారు.. దేశాలు వేరైనా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన కర్రె రాజు కొన్నాళ్ల క్రితం లండన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ షాపింగ్ మాల్లో పని చేస్తుండగా డయానా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఆచారాలు, సంప్రదాయాలు వేరైనా పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. బెల్లంపల్లిలోని ఏఆర్ కన్వెన్షన్‌లో గురువారం రాజు డయానాకు తాళి కట్టి తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. చీరకట్టుతో పెళ్లిపీటలపై కూర్చున్న వధువు డయానా అందరి దృష్టిని ఆకర్శించింది. వీరి పెళ్లికి వధువు తల్లిదండ్రులు రాకపోవడంతో రాజు కుటుంబీకులు అన్నీ తామై వ్యవహరించి పెళ్లి జరిపించారు. -
లండన్ యువతితో హీరో వివాహం!
హీరో రణ్‌బీర్ కపూర్ పెళ్లివార్త ఇప్పుడు బాలీవుడ్లో చక్కెర్లు కొడుతోంది. రణ్‌బీర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట.లండన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లాడబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రణబీర్ తన తల్లి నీతూతో కలిసి వెళ్లి పెళ్లికూతుర్ని కూడా చూసివచ్చాడట. ఈ విషయాన్ని నీతూ సన్నిహితులు వెల్లడించారు. యువతి కుటుంబసభ్యులతో కూడా చర్చలు కొనసాగినట్లు తెలిపారు. కాగా చిత్ర పరిశ్రమకు చెందినవారిని తన కోడలుగా చేసుకునేందుకు రణబీర్ తల్లికి మొదటి నుంచి ఇష్టం లేదు. రణ్‌బీర్ గతంలో హీరోయిన్లు దీపిక పదుకొనె, కత్రినా కైఫ్‌లతో ప్రేమ వ్యవహారానికి కూడా ఆమె విముఖంగానే ఉన్నారు. అయితే రణబీర్ దీపికాతో బ్రేక్ అప్ చెప్పిన తర్వాత కత్రీనా కైఫ్‌తో లవ్ స్టోరీ పెళ్లివరకూ వెళ్లింది. వీళ్లిద్దరూ ముంబైలోని ఓ ఫ్లాట్‌లో పెళ్లికి ముందే సహజీవనం కూడా చేశారు. అయితే ఏమైందో ఏమో అంతలోనే ఇద్దరు బ్రేకప్ అయ్యారు. అప్పటి నుంచి రణ్‌బీర్ సింగిల్‌గానే ఉంటున్నాడు. దీంతో అతడి తల్లి కొడుకుని త్వరలోనే ఓ ఇంటివాడిని చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే కోడలు కోసం వేట మొదలుపెట్టారు. దీంతో త్వరలోనే రణ్‌బీర్ పెళ్లి చర్చలు ఓ కొలిక్కి రానున్నట్లు సమాచారం. -
అమితాబ్ తాతయ్యా... మా ఇంట్లో బజ్జోవా!
-
అమితాబ్ తాతయ్యా... మా ఇంట్లో బజ్జోవా!
అమితాబ్ బచ్చన్‌కు కొన్ని లక్షల, కోట్ల మంది అభిమానులుంటారు. వాళ్లందరిలో ఆయనకు బాగా నచ్చిన నెంబర్ వన్ ఫ్యాన్ ఎవరో తెలుసా? లండన్‌కు చెందిన రేవా అనే అమ్మాయి. ఆమె వయసు నాలుగున్నరేళ్లు. అమితాబ్‌కు ఆమె అంతగా నచ్చేయడానికి కారణమేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. అమితాబ్ ఒకప్పుడు యాంగ్రీ యంగ్మాన్గా నటించిన షోలే, దీవార్ లాంటి సినిమాలు ఆమెకు తెలియవు. కానీ 2009లో విడుదలైన అల్లాదీన్ అనే సినిమాలో భూతంగా నటించిన అమితాబ్‌ను ఆమె చూసింది. దాంతో ఆ తాతయ్య తనకు చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, ఒకరోజు వచ్చి తమ ఇంట్లో పడుకుంటే తనకు అంతకంటే కావాల్సింది ఏమీ ఉండబోదని రేవా చెప్పింది. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. చిన్నారి రేవా పంపిన వీడియోను పోస్ట్ చేసి.. ''ఫ్యాన్ పిక్ ఆఫ్ ద వీక్'' అని రాశారు. అంతే.. దానికి 31వేలకు పైగా లైకులు, దాదాపు 2వేల షేర్లు, 1500 కామెంట్లు వచ్చి పడ్డాయి. ఆ వీడియోలో రేవా తండ్రి ఆమెను అమితాబ్‌లో నీకు అంత నచ్చినదేంటని అడుగుతారు. ఆమె ''ఆయన చాలా అద్భుతంగా నటిస్తారు. నాకు నిజంగా ఆయనంటే ఇష్టం'' అని చెబుతుంది. అంతేకాదు.. అల్లావుద్దీన్ అద్భుతదీపం సినిమాలో భూతంగా ఆయన చేసిన నటనను ప్రస్తావిస్తుంది. ఆయన్ను నిజంగా కలవాలనుందని తండ్రి దగ్గర మారాం చేస్తుంది. ఆయన వస్తే.. ఆయన మీదకు ఎగిరి దూకుతానని, వెంటనే చంకెక్కేస్తానని కూడా రేవా అంటోంది. బిగ్ బీని తమ ఇంటికి టీ తాగేందుకు పిలుస్తానని రేవా చెప్పినప్పుడు.. ఆయన వస్తారనే అనుకుంటున్నావా అని తండ్రి అడిగితే.. వస్తారనే భావిస్తున్నానంది. ఎలాగైనా సూపర్‌స్టార్ బచ్చన్ తాతయ్యను ఇంటికి పిలవాలని తండ్రిని కోరగా ఆయన సరేనంటారు. వీడియోలో రేవా తండ్రి అమితాబ్‌ను ఈసారి లండన్ వచ్చినప్పుడు తమ ఇంటికి రావాలని పిలుస్తుండగా.. మధ్యలో రేవా దూరి, ''మీకు కుదిరితే కాసేపు మా ఇంట్లో పడుకోరా.. ప్లీజ్'' అని అడుగుతుంది. అందుకే అమితాబ్‌కు ఆ చిన్నారి అంతగా నచ్చేసింది. -
లండన్ అమ్మాయి.. నిజామాబాద్ అబ్బాయి
లింగంపేట : ముస్తాపూర్ గ్రామానికి చెందిన ముక్కర అర్జున్‌రెడ్డి లండన్‌కు చెందిన హెలెన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన వీరి వివాహానికి హైదరాబాద్‌లోని గోల్డెన్ ఆర్కిడ్ రిసార్ట్స్ వేదికైంది. వారి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముస్తాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి 2009లో మాస్టర్ అఫ్ సైన్స్(ఎంఎస్) చదవడానికి లండన్ వెళ్లాడు.అక్కడ చదువుకుంటున్న సమయంలోనే హెలెన్ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. 2011లో చదువు పూర్తవడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయినా ప్రణయం కొనసాగింది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులూ పెళ్లికి అంగీకరించడంతో ఆదివారం రాత్రి పెళ్లి జరిపించారు. -
ఆంధ్రా అబ్బాయి.. లండన్ అమ్మాయి
నుదుటున కల్యాణ తిలకం.. తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించిన లండన్‌కు చెందిన అమ్మాయి ఆంధ్రా కుర్రాడి చిటికిన వేలు పట్టుకుని ద్వారకాతిరుమలలోని చినవెంకన్న సాక్షిగా ఏడడుగులు వేసింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన రమణమూర్తి కొన్నేళ్లుగా లండన్‌లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న లండన్ అమ్మాయి జెబేలాతో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి పెద్దల అంగీకారంతో శనివారం వారిద్దరూ శ్రీవారి ఆలయంలో వివాహం చేసుకున్నారు. - న్యూస్‌లైన్/ద్వారకాతిరుమల