
మంచిర్యాల: లండన్ అమ్మాయి.. బెల్లంపల్లి అబ్బాయి పరిచయం ప్రేమగా మారింది.. ఒకరి నొకరు ఇష్టపడ్డారు.. దేశాలు వేరైనా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన కర్రె రాజు కొన్నాళ్ల క్రితం లండన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తుండగా డయానా అనే యువతితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఆచారాలు, సంప్రదాయాలు వేరైనా పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. బెల్లంపల్లిలోని ఏఆర్ కన్వెన్షన్‌లో గురువారం రాజు డయానాకు తాళి కట్టి తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. చీరకట్టుతో పెళ్లిపీటలపై కూర్చున్న వధువు డయానా అందరి దృష్టిని ఆకర్శించింది. వీరి పెళ్లికి వధువు తల్లిదండ్రులు రాకపోవడంతో రాజు కుటుంబీకులు అన్నీ తామై వ్యవహరించి పెళ్లి జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment