Satish
-
జస్ట్ రూ.50 కోట్లు!!
మనకు జస్ట్ కాకపోవచ్చు కానీ బెంగళూరుకు చెందిన ప్రముఖ డాగ్ బ్రీడర్ ఎస్.సతీశ్ మాత్రం జస్ట్ రూ.50 కోట్లేగా అని అనుకున్నారు. వెంటనే డబ్బులిచ్చేసి.. కొనేశారు.దీని పేరు చెప్పలేదు కదూ.. ఒకామి.. వినడానికి చైనా, జపానోళ్ల పేరులాగా ఉంది గానీ.. ఇది పుట్టింది మాత్రం అమెరికాలో.. తోడేలు, కాకేషన్ షెపర్డ్ జాతి కుక్క క్రాస్ బ్రీడ్. ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమట. అందుకే ఇంత రేటు అని చెబుతున్నారు. ఏదైతేనేం ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్క. వయసు కేవలం 8 నెలలు.. బరువు మాత్రం ఇప్పటికే 75 కిలోలు ఉంది. అంటే.. ఒకామి మన మీద ఒక్కసారి పడిందంటే.. కాలో చేయో విరగాల్సిందే.ఇంత డబ్బిచ్చి ఎందుకు కొన్నట్లు..సతీశ్.. 1990 నుంచి ఈ డాగ్స్ బ్రీడింగ్ బిజినెస్‌లో ఉన్నారు. ఆయన దగ్గర 150 రకాల జాతుల కుక్కలు ఉన్నాయట. ఇవి చాలా పోటీల్లో పాల్గొని.. ప్రైజులు గెలుచుకున్నాయి. గత పదేళ్ల నుంచి బ్రీడింగ్‌ను ఆపేసిన సతీశ్.. ఇలాంటి అరుదైన కుక్కలను కొని.. వాటిని షోలలో ప్రదర్శించడం ద్వారా సంపాదిస్తున్నారు. 30 నిమిషాలకు రూ.2.5 లక్షలు చార్జ్ చేస్తారు. గతేడాది కూడా ఆయన పాండాలా కనిపించే చౌచౌ జాతి కుక్కను.. జస్ట్ రూ.29 కోట్లే కదా అని కొన్నారు. ‘వీటిని చూడటానికి చాలా మంది ఆసక్తి చూపు తారు. టికెట్లు కొనుక్కొని మరీ వస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. నేను, నా డాగ్స్ సినిమా యాక్టర్లలాగా బాగా పాపులర్ అయి పోయాము’ అని సతీశ్ చెప్పారు. 7 ఎకరాల ఫామ్‌హౌస్‌లో ఈ శునకాలు ఉంటాయి. ఖరీదై నవి కావడంతో ఎవరూ ఎత్తుకుపోకుండా సీసీటీవీ పహారా ఉంటుంది. కుక్కల సంరక్షణ బాధ్యతలను చూసుకోవడానికి ఆరుగురు సిబ్బంది ఉంటారు. కనకపు సింహాసనం వేయలేదు కానీ.. దాదాపుగా అలాంటి సదుపాయాలే ఉంటాయి. రేయ్.. ఎవర్రా అంది.. ఛీ కుక్క బతుకని..మమ్మీ, డాడీ సంగతి.. తోడేలు ఎంత క్రూరమైనదో మనకు తెలిసిందే. ఇక కాకేషన్ షెపర్డ్ జాతి కుక్కల గురించి చెప్పాలంటే.. శీతల దేశాల్లో ఉండే ఈ శునకాలు చాలా బలంగా ఉంటాయి. గొర్రెలు, పశువుల మందలను తోడేళ్ల బారి నుంచి కాపాడటానికి వీటిని వాడతారు. ఈ లెక్కన.. ఈ రెండింటినీ మిక్సీలో వేసి తీసినట్లు ఉండే ఒకామి.. ఇంకెంత స్పెషలో చూడండి మరి.. రోజుకు కనీసం 3 కిలోల చికెన్ తిననిదే నిద్ర కూడా పోదట. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
యమ రిచ్ దొంగ..! మూడు ఫ్లాట్లు భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు..!
తన కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఫ్లాట్లు; భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు రెండు ఇండిపెండెంట్ ఇళ్లు; పెంపుడు శునకం మెడలో ఇండోనేసియా నుంచి రూ.3 లక్షలకు! కొన్న గంట; పబ్‌కు వెళితే కనీసం రూ.లక్ష, స్పాకు వెళితే కనీసం రూ.2 లక్షల బిల్లు– ఇవన్నీ ఎవరో బిజినెస్మ్యాన్కో, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తికో చెందిన విలాసాలు అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే! విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్‌గా ఉండి దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని ప్రముఖుల ఇళ్లల్లో చోరీలు చేసిన యమ రిచ్ దొంగ కర్రి సతీష్ అలియాస్ స్పైడర్ సతీష్ వ్యవహారం. ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఒడిశాల్లో వందకు పైగా కేసులు ఉన్నాయి. ఇతణ్ణి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఒడిశా రాజధాని భువనేశ్వర్ అధికారులు కటకటాల్లోకి పంపారు. విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. వాహనాల చోరీలతో పాటు ఓ ఇంట్లో దొంగతనం చేసి తొలిసారిగా 2005లో వైజాగ్ పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. దోపిడీ కేసులో విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేశారు. ఇన్ని కేసులున్నా, సత్తిబాబు విశాఖ నుంచి పాస్‌పోర్ట్ పొంది, 2010లో సింగపూర్ వెళ్లిపోయాడు. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉండి వెల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేశాడు. తర్వాత తిరిగి వచ్చేసి, 2012 వరకు మొత్తం 16 చోరీలు చేశాడు. సత్తిబాబు కేవలం సంపన్నులు, ప్రముఖుల ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుంటాడు. పగలు రెక్కీ చేసి అర్ధరాత్రి వేళ అపార్ట్మెంట్స్ గోడలు ఎగబాకి ఇళ్లలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఇతడిని స్పైడర్ సతీష్ అని పిలుస్తుంటారు. పోలీసు నిఘా పెరగడంతో సతీష్ వైజాగ్ వదిలి, 2013లో హైదరాబాద్‌కు వచ్చి చందానగర్‌లో స్థిరపడ్డాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వీఐపీల ఇళ్లల్లో చోరీలు చేయడంతో ఇతడిపై 12 కేసులు నమోదయ్యాయి. ఈ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బుతో కేపీహెచ్‌బీ కాలనీలో ఇల్లు, ఓ కారు, ప్రొక్లైనర్ కొని సెటిలైపోయాడు. తర్వాత 2014లో ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకు చిక్కాడు. దీంతో వారికి భారీగా లంచాలు ఇచ్చి, అరెస్టును తప్పించుకున్నాడు. దీనికోసం ఇంటితో పాటు అన్నీ అమ్మేసుకున్నాడు. కొంత లంచం సొమ్మును పోలీసుల బ్యాంకు ఖాతాల్లో కూడా జమ చేశాడు. ఉన్నదంతా పోవడంతో మళ్లీ నేరాలు మొదలెట్టిన సతీష్ 2014లో సూర్యాపేట పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడి వద్ద దొరికిన ఓ బ్యాంకు రసీదు విషయం ఆరా తీస్తే, పోలీసులతో చేసుకున్న సెటిల్మెంట్ వెలుగులోకి వచ్చింది. సతీష్ 2018లో హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖుల ఇళ్లల్లో చోరీలకు పాల్పడి, బెంగళూరుకు ఉడాయించాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 9న బెంగళూరులోని కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం చెవులు దొంగిలించి పార్క్ చేసి ఉన్న కారు పట్టుకుపోయాడు. ఆ కారు నంబర్ తొలగించి, బోగస్ నంబర్ ప్లేట్ తగిలించాడు. అదే నెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన ఇంట్లో సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్ పెట్రోలింగ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. చోరీ సమయంలో సత్తిబాబు సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా గ్లౌజ్ ధరిస్తుంటాడు. బెంగళూరు పోలీసుల విచారణలోనే తన టార్గెట్‌లో జూబ్లీహిల్స్‌లోని సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇల్లు ఉందని వెల్లడించాడు. అరెస్టు అయినప్పుడల్లా కొత్త పేరు చెప్పే సతీష్‌కు సత్తిబాబు, సతీష్‌రెడ్డి, స్టీఫెన్ తదితర పేర్లు కూడా ఉన్నాయి. ఇతడి భార్య మాత్రం ముద్దుగా బుజ్జి అని పిలుస్తుంది. సత్తిబాబుపై హైదరాబాద్ పోలీసులు 2016లో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు పంపారు. అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్ నరేంద్ర నాయక్, కడపకు చెందిన పి.శ్రీనివాస్‌లతో ముఠా కట్టాడు. ఆ ఇద్దరూ చిల్లర దొంగలు కావడంతో ‘థింక్ బిగ్’ అంటూ వారికి నూరిపోశాడు. 2018 మార్చ్‌లో జైలు నుంచి విడుదలైన ఈ త్రయం వరుసపెట్టి చోరీలు చేసింది. శ్రీకాకుళం, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, బంజారాహిల్స్ల్లో పంజా విసిరి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. దీనికి ముందే శ్రీకాకుళం, బెంగళూరు కేసుల్లో అక్కడి అధికారులకు దొరికినా, బయటి ప్రాంతాల్లో చేసిన నేరాల వివరాలు మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ ఏడాది జనవరి 26న ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిరంజన్ పట్నాయక్ ఇంటి నుంచి రూ.50 లక్షల విలువైన సొత్తు చోరీ చేశాడు. ఈ కేసులో ఫిబ్రవరి 13న భువనేశ్వర్ పోలీసులకు చిక్కాడు. విశాఖపట్నంలో కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు ఇంట్లోను, హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డాక్టర్ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లోను, ఫిలింనగర్ సినార్ వ్యాలీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఎస్ శర్మ ఇంట్లోనూ చోరీలు చేసిన చరిత్ర ఇతడిది. -శ్రీరంగం కామేష్(చదవండి: ఉద్యోగం, వివాహం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే సివిల్స్ సత్తా చాటింది..!) -
క్రిమినల్ కేసులో హైకోర్టు అరుదైన తీర్పు
సాక్షి, అమరావతి : ఓ క్రిమినల్ కేసులో హైకోర్టు అరుదైన తీర్పు వెలువరించింది. నిందితుల వాదన వినకుండా, వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా, కనీసం వారికి న్యాయ సాయం (లీగల్ ఎయిడ్) కూడా అందించకుండా కేసు విచారణ (ట్రయల్) మొదలు పెట్టి, నెల రోజుల్లో వారికి శిక్ష విధిస్తూ ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ట్రయల్ నిష్పాక్షికంగా జరగనప్పుడు న్యాయానికి విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఆ తీర్పును రద్దు చేసింది. తిరిగి మొదటి నుంచి (డీ నోవో) విచారణ మొదలు పెట్టాలని, 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల ఆరోపణల ప్రకారం.. ఏలూరుకు చెందిన బోడ నాగ సతీష్ తన స్నేహితులైన బెహరా మోహన్, బూడిత ఉషాకిరణ్‌లతో కలిసి 2023 జూన్ 13న ఓ వివాహితపై యాసిడ్ దాడి చేశారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో పోలీసులు వీరితో పాటు మరో ముగ్గురిపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 15న నాగ సతీష్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో జూలై 7న చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఆగస్టు 16న ట్రయల్ మొదలుపెట్టింది. అక్టోబర్ 10న తీర్పు వెలువరించింది. నాగ సతీష్, మోహన్, ఉషాకిరణ్లకు జీవిత ఖైదు విధించింది. మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నాగ సతీష్ తదితరులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపి, పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. -
డాక్టర్ సతీష్ కత్తులకు రేవా అవార్డు
హైదరాబాద్: రేవా ఫౌండేషన్ – 2024 (రేవా – రైజింగ్ అవేర్నెస్ ఆఫ్ యూత్ విత్ ఆటిజం) ప్రతిష్టాత్మక గాలా అవార్డును డాక్టర్ సతీష్ కత్తుల (ఎఎపిఐ ప్రెసిడెంట్, యూఎస్)కు ప్రకటించింది. న్యూయార్క్ నగరంలోని ప్రెస్టీజియస్ ఫెర్రీ హోటల్ లో గురువారం ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రేవా ఫౌండేషన్ ఆటిజంతో యువతకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు మద్దతుగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆయా రంగాల్లో ఇతరులకు స్ఫూర్తినిచ్చే వారిని సత్కరిస్తూ, స్ఫూర్తిదాయక అవార్డు గాలా ను ప్రదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన ఫౌండేషన్ ఆయనకు ద ఇన్ఫిరేషనల్ అచీవర్ 2024 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది. అవార్డు గ్రహీత డాక్టర్ సతీష్ కత్తుల ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా రేవా ఫౌండేషన్ ఆటిజం బాధితులకు మద్దతుగా చేస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఫౌండేషన్ ప్రతినిధులు మణికాంబోజ్, డాక్టర్ రష్మీ శర్మలకు అభినందనలు తెలియజేశారు. తన సేవలను గుర్తించి అవార్డును బహూకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
మందేసి చిందేసిన బాపట్ల ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పీకలదాకా మద్యం తాగి చిందేశారు. కైపులో తీన్మార్ డాన్స్‌లు చేస్తూ, పార్టీ ఇచి్చన బీజేపీ నేతకు లిప్‌కిస్‌లు ఇచ్చి మరీ ఊగిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10న పాండురంగాపురం యాగంటి రిసార్ట్‌లో మందు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సతీష్ అనుచరులు హాజరయ్యారు. అందరూ మద్యం తాగి తందనాలాడారు.బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం ఆ పారీ్టకి హాజరయ్యారు. మద్యం మత్తులో అన్నం సతీష్ ప్రభాకర్ భీమ్లానాయక్ పాట పెట్టించుకుని డాన్స్ చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం సతీష్‌తో కలిసి బెల్లీడాన్స్, తీన్మార్ స్టెప్పులు వేశారు. అంతటితో ఆగకుండా సతీష్ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ కైపుగోల సోషల్ మీడియాల్ యమ ట్రెండింగ్‌గా మారింది. -
అశ్విని–తనీషాలకు డబుల్స్ టైటిల్
గువాహటి: సొంతగడ్డపై జరిగిన గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో చివరిరోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మూడు విభాగాల్లో భారత ప్లేయర్లు ఫైనల్ చేరుకోగా... రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం టైటిల్ దక్కించుకోగా... పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కరుణాకరన్ విజేతగా అవతరించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ తీవ్రంగా పోరాడినా చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో సతీశ్ 21–17, 21–14తో చైనీస్ క్వాలిఫయర్ జు జువన్ చెన్పై అలవోకగా గెలిచాడు. 44 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి విజేతగా నిలిచాడు. సతీశ్‌కు 7500 డాలర్ల (రూ. 6 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మహిళల డబుల్స్ టైటిల్ పోరులో ప్రపంచ 16వ ర్యాంక్ జోడీ అశ్విని పొన్నప్ప–తనీషా (భారత్) ద్వయం 21–18, 21–12తో లి హువా జౌ–వాంగ్ జి మెంగ్ (చైనా) జంటను కంగుతినిపించింది. తొలి గేమ్‌లో చైనా జోడీ నుంచి కాస్త పోటీ ఎదురైనప్పటికీ... రెండో గేమ్‌లో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశమివ్వకుండా అశ్విని–తనీషా 43 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించారు. అశ్విని–తనీషా జోడీకి 7900 డాలర్ల (రూ. 6 లక్షల 68 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్మోల్ 21–14, 13–21, 19–21తో కాయ్ యన్ యన్ (చైనా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌ను అవలీలగా గెలుచుకున్న భారత షట్లర్‌కు రెండో గేమ్ నుంచి సవాల్ ఎదురైంది. చైనా క్రీడాకారిణి పుంజుకొని రెండో గేమ్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడోగేమ్ హోరాహోరీగా జరిగింది. ఇద్దరు ప్రతీ పాయింట్ కోసం దీటుగా పోరాడారు. అయితే కీలకదశలో చైనీస్ ప్లేయర్ పాయింట్లు నెగ్గి విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. రన్నరప్ అన్మోల్కు 3800 డాలర్ల (రూ. 3 లక్షల 21 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4680 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
OTT: తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సట్టమ్ ఎన్ కైయిల్’ రివ్యూ
చట్టమనేది ఎవ్వరి చుట్టమూ కాదు. అదే చట్టాన్ని వ్యక్తిగతంగా ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. కాని దీనికి విరుద్ధంగా ఓ తమిళ సినిమా పేరు వచ్చింది. అదే సట్టమ్ ఎన్ కైయిల్. అంటే చట్టం నా చేతుల్లో అని అర్ధం. సెన్సార్ వాళ్ళు ఈ పేరును ఎలా ఓకే చేశారో కాని సినిమా మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమాకి చాచి దర్శకుడు. సినిమా ప్రధాన పాత్రైన గౌతమ్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు సతీష్ నటించడం విశేషం. మామూలుగా హాస్య పాత్రలతో ఇప్పటిదాకా అలరించిన సతీష్ ఈ సినిమాలో సీరియస్ పాత్రతో ప్రేక్షకులను అలరించాడనే చెప్పాలి.ఇక సట్టమ్ ఎన్ కైయిల్ కథాంశానికొస్తే తమిళనాడు లోని మారుమూల ప్రాంతమైన ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కి తన బిడ్డ మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బంది మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఓ వ్యక్తి రావడంతో సినిమా ప్రారంభమవుతుంది. నిజానికి ఈ సన్నివేశం ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్సపెక్టర్ బాషా అవినీతిని చూపించడం కోసం రూపొందించారు. దాని తరువాత గౌతమ్ తన కారులో ప్రయాణిస్తూ ఓ వ్యక్తిని ఢీ కొడతాడు. ఈ యాక్సిడెంట్ లో తాను ఢీ కొట్టిన వ్యక్తి చనిపోవడంతో తన కారు డిక్కీలో ఆ వ్యక్తి బాడీని పెట్టుకుని తిరిగి ప్రయాణిస్తుంటాడు. ఇంతలో పోలీస్ చెక్ పోస్టులో అనూహ్యంగా పోలీసులకు కారుతో సహా చిక్కి ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటాడు గౌతమ్. తన పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి స్టేషన్ కి తీసుకువస్తారు. కాని తన కారులో ఉన్న శవం గురించి పోలీసులకు తెలియదు. ఇక అక్కడినుండి కథ అనేక అనూహ్య మలుపులు తిరిగి ఉత్కంఠభరితంగా నడుస్తుంది సినిమా. ముఖ్యంగా ఆఖరి సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఎలాగూ నచ్చుతుంది, అలాగే మామూలు వాళ్ళకి కూడా ఒక్కసారి కథలోకి లీనమైతే సినిమాలో వచ్చే ట్విస్టులకు వీస్తూ పోతూ కుర్చీలకు అతుక్కుపోతారు. సట్టమ్ ఎన్ కైయిల్ మాత్రం రొటీన్ థ్రిల్లర్ అయితే కాదు. వర్త్ టు వాచిట్. (ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది)-ఇంటూరు హరికృష్ణ -
ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్‌కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్‌తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది. బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
జీరో టు హీరో అయ్యే ఓ అబ్బాయి కథే ‘సోలో బాయ్’: నిర్మాత సతీష్
‘‘కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. గతంలో నేను తీసిన ‘బట్టల రామస్వామి బయోపిక్, అందరి బంధువయా’ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. త్వరలోనే ‘కాఫీ విత్ ఏ కిల్లర్, సోలో బాయ్’ సినిమాల విడుదలను ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాలూ ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు నిర్మాత ‘సెవెన్ హిల్స్’ సతీష్. బుధవారం (అక్టోబరు 23) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా మంగళవారం సతీష్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమాకు ఆర్పీ పట్నాయక్‌గారు దర్శకత్వం వహించారు. ఇక జీరో నుంచి హీరో అయ్యే ఓ అబ్బాయి కథగా ‘సోలో బాయ్’ సినిమా ఉంటుంది. ఇందులో గౌతమ్ కృష్ణ హీరోగా నటించారు. శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రక టిస్తాం’’ అని తెలిపారు. -
పవన్ నవ్వుల పాలు!
సాక్షి ఇంటర్నెట్ డెస్క్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సెప్టెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. లడ్డూలో ఉపయోగించిన నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని చెబుతూ.. ‘కొవ్వు’ కామెంట్లు చేశారాయన. దానికి కొనసాగింపుగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత టీటీడీ బోర్డు చైర్మన్లతోపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పనిలో పనిగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు.ఏపీలో లడ్డూ రాజకీయంపై హైడ్రామా కొనసాగుతున్న తరుణంలోనే.. సుప్రీం కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై స్వతంత్ర దరాప్తు జరిపించాలని కోరారు పిటిషనర్లు. వీటన్నింటిని కామన్‌గా విచారణకు స్వీకరించింది ద్విసభ్య ధర్మాసనం. తొలిరోజు విచారణలో చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: దేవుడికే ఆగ్రహం తెప్పించిన ప్రభుత్వమిది! తిరుపతి లడ్డూ ప్రచారంలో తొలుత జాతీయ మీడియా ఛానెల్స్ సైతం చంద్రబాబు వ్యాఖ్యలనే ప్రముఖంగా ప్రస్తావించాయి. ఆనక.. ఆ వ్యాఖ్యలను నిపుణులతో విశ్లేషించి.. బాబు రాజకీయాల్ని గ్రహించి.. దిద్దుబాటు కథనాలు ఇచ్చాయి. మరోవైపు ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య లడ్డూ వ్యవహారంపై తన బ్రష్‌కు పని చెప్పారు. తొలి నుంచి జరుగుతున్న పరిణామాలను.. చంద్రబాబు, పవన్‌లకు ఎదురవుతున్న అనుభవాలను ఆయన తన కార్టూన్లలో భలేగా చూపించారు. అందులో కొన్నింటిని ఫస్ట్‌పోస్ట్ పబ్లిష్ చేయగా.. మరికొన్నింటిని ఆయన ఓన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశారు. మొత్తంగా.. ఈ లడ్డూ రాజకీయంలో చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంటే, నవ్వులపాలైంది పవనే అనే కామెంట్ ఎక్కడ చూసినా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Satish Acharya (@cartoonistsatish) View this post on Instagram A post shared by Satish Acharya (@cartoonistsatish) Images Courtesy: Satish Acharya -
పోరాడి ఓడిన సతీశ్
జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ సతీశ్ కుమార్ కరుణాకరన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. యోకోహామాలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 47వ ర్యాంకర్ సతీశ్ 21–18, 18–21, 8–21తో ప్రపంచ 40వ ర్యాంకర్ కాంతాపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సతీశ్ తొలి గేమ్‌ను దక్కించుకొని రెండో గేమ్‌లో 18–15తో ఆధిక్యంలోకి వెళ్లి విజయం దిశగా సాగాడు. అయితే థాయ్‌లాండ్ ప్లేయర్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను 21–18తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సతీశ్ తడబడ్డాడు. సతీశ్‌కు 2,550 డాలర్ల (రూ. 2 లక్షల 14 వేలు) ప్రైజ్‌మనీ, 4,320 పాయింట్లు లభించాయి. -
కోల్‌కతా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలి
హైదరాబాద్: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థినిపై ఇటీవల జరిగిన హత్యాచార ఘటనను ఎ.ఎ.పి.ఐ. (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్) ప్రెసిడెంట్ డాక్టర్ సతీష్ కత్తుల ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, కేసు దర్యాప్తును వేగవంతం చేసి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో డాక్టర్లకు తగినంత భద్రతా చర్యలను ఏర్పాటు చేయాలని కోరారు. పిజి మెడికల్ విద్యార్థినిపై క్రూరమైన ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
న్యూస్ ఫొటో కాంపిటీషన్లో ఉత్తమ చిత్రాల ఎంపిక
కాచిగూడ (హైదరాబాద్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం నిర్వహించిన రాష్ట్రస్థాయి న్యూస్ ఫొటో కాంపిటీషన్–2024లో 31 జిల్లాల నుంచి 100 ఎంట్రీలు వచ్చాయని సంఘం అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, కార్యదర్శి కేఎన్ హరి చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్, ముఖ్యమంత్రి సీపీఆర్ఓ బి.అయోధ్య రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ సుశీల్ రావు, సీనియర్ ఫొటో జర్నలిస్టు హెచ్.సతీష్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి వివిధ కేటగిరీల్లో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. సాక్షి ఫొటోగ్రాఫర్లు పి.మోహనాచారి (హైదరాబాద్), బి.శివప్రసాద్ (సంగారెడ్డి), వి.భాస్కరాచారి (మహబూబ్‌నగర్) తీసిన చిత్రాలు కన్సొలేషన్ విభాగంలో విజేతలుగా నిలిచాయన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈ ఛాయా చిత్ర ప్రదర్శనను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. -
లోకేష్‌ను కలిసిన జగన్‌పై దాడి కేసు నిందితుడు
విజయవాడ, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ1 నిందితుడు వేముల సతీష్, మంత్రి నారా లోకేష్‌ను కలిశాడు. శనివారం ఉదయం లోకేష్ నిర్వహించే ప్రజాదర్బాకు వెళ్లి.. ఆయనతో ఫొటో దిగాడు. వైఎస్ జగన్ హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్‌కు టీడీపీతో లింకులు ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అయితే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచాక.. సతీష్ లోకేష్‌ను కలిసేందుకు యత్నించాడు. అయితే ఎందుకనో అది కుదరలేదు. తాజాగా ఓ టీడీపీ నేత సహకారంతోనే ఈ అపాయింట్మెంట్ దక్కినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా నాటి సీఎం జగన్‌పై దాడి జరిగింది. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో అదృష్టతవశాత్తూ ఆయన కంటికి పైన భాగంలో మాత్రమే గాయమైంది. ఈ కేసులో ఏప్రిల్ 18వ తేదీన వేముల సతీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. నెల్లూరు జైలుకు తరలించారు. అయితే ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని పోలీసులు సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు జగన్‌ను హత్య చేయాలనే కుట్రతోనే వేముల సతీష్ పదునైన రాయితో దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత మే 28వ తేదీన విజయవాడ కోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో సతీష్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతనికి పలువురు టీడీపీ నేతలు మద్దతుగా నిలవడం విశేషం. -
కోడుమూరు గడ్డ వైఎస్ జగన్ అడ్డా: ఆదిమూలపు సతిష్
-
ముందస్తు కుట్రతోనే సీఎం జగన్‌పై హత్యాయత్నం!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాయి దాడి పక్కాప్లాన్, ముందస్తు కుట్రతో జరిగిందని మరోసారి తేటతెల్లమైంది. ఏ2 పోద్బలంతోనే సీఎం జగన్‌పై రాయితో దాడిచేసినట్లు ప్రధాన నిందితుడు (ఏ1) వేముల సతీష్‌కుమార్ పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. వివేకానంద స్కూల్ వద్ద కంటే ముందు డాబా కొట్ల కూడలిలోనే రాయి విసిరేందుకు మొదట ప్రయత్నించినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. న్యాయస్థానం ప్రత్యేక అనుమతితో విచారణ నిమిత్తం ఈ నెల 25వ తేదీన నిందితుడు సతీష్ ను పోలీసులు మూడురోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూడు రోజులు సతీష్‌ను అతడి తండ్రి దుర్గారావు, అతడి న్యాయవాది సమక్షంలో సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. శనివారం కస్టడీ ముగిసిన వెంటనే నిందితుడిని పోలీసులు సబ్‌జైలులో అప్పగించారు. మూడురోజుల విచారణ, సీన్ రీ కన్స్ట్రక్షన్కు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సీల్డ్ కవర్లో న్యాయాధికారికి అందజేశారు. విచారణలో నిందితుడు పూర్తిగా సహకరించలేదని, అతడు ఇంకా ఏదో దాస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా నిందితుడిని విచారించాల్సి ఉందని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మూడురోజుల విచారణలో దాడికి సంబంధించిన పలు కుట్రపూరిత అంశాలను సతీష్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఈ నెల 13వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ వద్ద సీఎం జగన్‌పై హత్యాయత్నం వెనుక ఏ2తో పాటు, మరికొందరి కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ఆ రోజు ఉదయం నిందితుడు వేముల సతీష్‌కుమార్ కూలిపనికి వెళ్లాడు. అదేరోజు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సెంట్రల్ నియోజకవర్గంలో ఉండటంతో హత్యాయత్నానికి వారు కూలిపని చేస్తున్న ప్రదేశంలోనే స్కెచ్ వేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఎలా దాడిచేయాలి? ఎలా తప్పించుకోవాలి? దాడిచేస్తే ఎంత డబ్బు చెల్లిస్తారు? వంటి అంశాలను ఏ1తో కలిసి ఏ2 చర్చించాడు. ప్రధానంగా పోలీసులు ఏ2గా అనుమానిస్తున్న వ్యక్తి ప్రోద్బలంతోనే ఏ1 సతీష్ హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారు నివసించే వడ్డెర కాలనీ అరుగు మీద ఆ రోజు సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర గంటల వరకు ఈ కుట్ర ఎలా అమలు చేయాలనే అంశంపై వారు చర్చించారు. అనంతరం సతీష్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ సింగ్‌నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో సీఎం జగన్ బస్సుయాత్ర గవర్నమెంట్ ప్రెస్ కూడలి దాటి ఫ్లైఓవర్‌పై వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మరో రెండు నిమిషాల్లో యాత్ర తాను నిలబడిన (డాబాకొట్లు) సెంటర్ వద్దకు చేరుకుంటుందని గ్రహించిన నిందితుడు సతీష్ వంతెన వద్దే ఓ కాంక్రీట్ రాయిని సేకరించాడు. ఆ సమయంలో సతీష్‌తో పాటు అతడి స్నేహితుడు ఉన్నాడు. బస్సుయాత్ర డాబాకొట్లు సెంటర్‌కు చేరుకోగానే అప్పుడే సీఎం జగన్‌పై రాయి విసేరేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ వద్దని, ఎవరైనా చూస్తే దొరికిపోతామని సతీష్‌ను అతడి స్నేహితుడు వారించి నిలువరించాడు. భయపడిన ఆ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బస్సుయాత్ర వివేకానంద స్కూల్ వద్దకు చేరడానికి ముందే సతీష్ వేగంగా స్కూల్, గంగానమ్మ గుడి మధ్యనున్న చీకటి ప్రాంతానికి చేరుకున్నాడు. ముందే సేకరించిన కాంక్రీట్ రాయితో ఆ ప్రదేశం నుంచే సీఎం జగన్‌పై దాడిచేశాడు. రాయి బలంగా విసరడంతో సీఎం జగన్‌తో పాటు ఆయన పక్కనే ఉన్న సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాడిచేసిన వెంటనే తన ఇంటికెళ్లిన సతీష్ అక్కడే ఉన్న టీడీపీ నాయకులను కలిశాడు. తరువాత వారంతా అక్కడ టపాసులు కాల్చారు. ఈ విషయాలన్నీ పోలీసులు నిర్వహించిన సీన్ రీ కన్స్ట్రక్షన్లో నిర్ధారణ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
A2 ఎవరు ...?
-
‘టీ టైమ్’ దెబ్బకు ‘సానా’ ఔట్ ఆశ పెట్టి.. జెల్ల కొట్టి..
ఎంపీ సీటు ఇస్తామంటూ తొలి నుంచీ ఆశ పెట్టారు. పార్టీ కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయించేశారు. బలి తీసుకునే వాడినే గొర్రె నమ్ముతుందన్నట్టు.. చంద్రన్న మాటలు నమ్మిన ఆ వ్యాపారవేత్త.. ఆయన బుట్టలో పడ్డారు. బాబుగారు చెప్పినట్టల్లా తలాడించారు. సీన్ కట్ చేస్తే.. చివరాఖరుకు చంద్రన్న ఖాతాలో మరో కరివేపాకుగా మారారు. అవసరానికి వాడుకోవడం.. ఆనక విసిరి పారేయడంలో ఆరితేరిన చంద్రబాబు చేతిలో.. టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ టికెట్టు ఆశించిన సానా సతీష్.. రాజకీయంగా ఖర్చయిపోయారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీ, జనసేన పార్టీల్లో ఆశావహులను అయిన కాడికి వాడేసుకుని ఆనక కరివేపాకుల్లా తీసిపారేస్తున్నారు. ఎన్నికల్లో సీట్లు ఇస్తామంటూ ఆశలు కలి్పంచి, పార్టీ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టించేస్తున్నారు. ఇక్కడ కాకపోతే ఇంకో సీటు వచ్చేస్తుందనే గంపెడాశతో ఆశావహులు కూడా భారీగానే చేతిచమురు వదిలించేసుకుంటున్నారు. ఈ తతంగమంతా పూర్తయి.. అభ్యర్థుల ప్రకటన దగ్గరకు వచ్చేసరికి లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్న వారిని అధినేతలు బకరాలను చేసేస్తున్నారు. వారికి మాటమాత్రంగానైనా చెప్పకుండా వేరేవారికి సీట్లు అప్పగించేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ సీటు ఆశించిన సానా సతీష్‌ను రాజకీయంగా బలి తీసుకున్నారని ఆ పార్టీలోని సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారు. పవన్ ప్రకటనతో.. పిఠాపురం నుంచి తాను, కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి టీ టైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ తనను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్‌షా వంటి వారు ఒత్తిడి తెస్తే తాను, ఉదయ్ శ్రీనివాస్ తమ స్థానాలను మార్చుకుంటామని మళ్లీ కొద్ది రోజుల్లోనే చెప్పారు. దీనిపై అటు పిఠాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ఆయన అనుచరులు మాటల మంటలు రేపుతూండగా.. ఇటు తనకు టీడీపీ నుంచి సానా సతీష్‌కు ఎంపీ సీటు గల్లంతైనే విషయం స్పష్టమైంది. టీ టైమ్ దెబ్బకు సానా సతీష్ టికెట్టు గోవిందా అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాటవరసకైనా చెప్పకుండా.. కాకినాడకు చెందిన సానా సతీష్ ఏపీ ఈపీడీసీఎల్‌లో పని చేస్తూ.. ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి, మద్యం తదితర వ్యాపారాల్లో ఉన్నారు. ఆయనపై చంద్రబాబు వల వేశారు. కాకినాడ ఎంపీ సీటు ఇస్తామంటూ ఊరించారు. ఆయన మాటలు నమ్మిన సతీష్.. విపక్ష కూటమిలో ఎవరికి అవకాశం వచ్చినా కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉండేది తానేనని ప్రచారం చేపట్టారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోస్టర్లు, స్టిక్కర్లతో తన అనుచరుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. వాస్తవానికి టీడీపీ, జనసేన పొత్తులు తేలడానికి ఆరు నెలల ముందు నుంచే సతీష్ రూ.కోట్లు తగలేసుకున్నారని అంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు జిల్లా పర్యటనలకు వచ్చిన సందర్భంలో ఆయా కార్యక్రమాలకు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇంత చేసినా చివరకు సతీష్ ఆశలకు గండి కొట్టారని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇరు పారీ్టలూ ఒకే రకమైన పంథాలో తమను అవసరానికి వాడేసుకుని, సీట్లు ఇవ్వాల్సి వచ్చేసరికి కరివేపాకులను చేశారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు సీటు ఎందుకు ఇవ్వడం లేదో కనీసం మాటవరసకైనా పిలిచి చెబుతారని సతీష్ ఆశించారు. కానీ, అలా జరగకపోవడాన్ని ఆయన వర్గం అవమానంగా భావిస్తోంది. ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఎటువంటి సంబంధమూ లేని కాకినాడ ఎంపీ సీటు కేటాయించడం అవివేకమే అవుతుందని అంటున్నారు. ఆయన కోసం తామెందుకు త్యాగాలు చేయాలని వారు ప్రశి్నస్తున్నారు. ఈ సీటును హఠాత్తుగా జనసేనకు కట్టబెట్టేస్తే ఇంత కాలం ఇరు పారీ్టల కోసం పని చేసిన సతీష్ వంటి వారు ఏమైపోతారని ప్రశి్నస్తున్నారు. వ్యాపారాలన్నీ పక్కన పెట్టేసి, అనుచరగణాన్ని అంతా కాకినాడలో మకాం చేయించి, గడచిన ఆరు నెలలుగా టీడీపీ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టిన తనకు సీటు సితార చేసేసి, తగిన బహుమతే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్యాగం పేరుతో తనను దూరం పెట్టడం బాధిస్తోందంటున్న సతీష్ వర్గీయులు.. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. -
కారును ఓవర్టేక్ చేస్తుండగా.. విద్యార్థి విషాదం!
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ శివారులోని సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. వీర్నపల్లి మండలం భావ్‌సింగ్‌తండాకు చెందిన భూక్య సతీశ్(19), భూక్య సాయిరాం బైక్‌పై మాచారెడ్డి నుంచి రాచర్లగొల్లపల్లికి వస్తున్నారు. రాచర్లబొప్పాపూర్ శివారులో ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను తప్పించబోయి బైక్‌తోపాటు కిందికి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో సతీశ్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరొకరు సాయిరాం తీవ్రంగా గాయపడగా.. స్థానికులు, బ్లూకోర్టు కానిస్టేబుల్ సతీశ్ కలిసి ఆస్పత్రికి తరలించారు. సతీశ్ మరణంతో భావ్‌సింగ్‌తండాలో విషాదం అలుముకుంది. మృతునికి తల్లితండ్రులు మంజుల–రాజు, సోదరి జ్యోతి ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రమాకాంత్ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చదవండి: పెళ్లింట విషాదం! -
పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ సతీశ్ సస్పెండ్
రంగారెడ్డి: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్గా కె.సతీశ్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడవక ముందే భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. 2004 బ్యాచ్‌కు చెందిన సతీశ్ 2023 జూన్ 14న పహాడీషరీఫ్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆరు మాసాల్లో స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల అంశం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సీపీ విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. ఈ వివాదంలో ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారా...? మరెవరైనా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారా అని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. ఏడాది గడవకుండానే.. రెండు నుంచి మూడేళ్లపాటు విధులు నిర్వహించాల్సిన ఎస్ఎహెచ్ఓలు పహాడీషరీఫ్ పీఎస్‌లో మాత్రం ఏడాది కూడా పనిచేయడం లేదు. రకరకాల కారణాలతో బదిలీలు, సస్పెండ్ అవుతున్నారు. ►2020 జూలై 23న సీఐగా బాధ్యతలు చేపట్టిన విష్ణువర్ధన్‌రెడ్డి ఏడాది తిరగకుండానే 2021 జూలై 15న అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ►2021 ఆగస్టు 4న బాధ్యతలు చేపట్టిన సి.వెంకటేశ్వర్లు 14 నెలలు పనిచేసి 2022 అక్టోబర్ 4న అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. ► అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ 2023 మార్చిలో రాజకీయ ఫిర్యాదులతో బదిలీ అయ్యారు. మూడు నెలల పాటు డీఐ కాశీ విశ్వనాథ్ ఇన్చార్జి ఎస్హెచ్ఓగా కొనసాగారు. ► 2023 జూన్ 14న బాధ్యతలు చేపట్టిన సతీశ్ ఆరు నెలలు గడవక ముందే భూ వివాదం ఆరోపణలతో 2024 జనవరి 7న సస్పెండ్ అయ్యారు. స్నేక్ గ్యాంగ్ ఉదంతం నుంచి స్నేక్ గ్యాంగ్ లాంటి ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన పహాడీషరీఫ్ పీఎస్‌పై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా ఉంటుంది. ఒకవైపు హత్యలు, హత్యాయత్నాల లాంటి నేరాలకు ఆస్కారం ఉండడం.. ఆపై నగర శివారు కావడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్న ఈ ఠాణా పరిధిలో విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. పై స్థాయి అధికారుల ఆదేశాల కోసం భూ వివాదాలలో తలదూర్చి స్థానిక పోలీసులు తమ మెడకు చుట్టుకున్న సందర్భాలు సైతం గతంలో వెలుగు చూశాయి. ఏదేమైనా తరచూ ఎస్హెచ్ఓలు మారుతుండడంతో నేరాల నివారణ, ఈ ప్రాంతంపై పట్టు సాధించడం కొత్తగా వచ్చిన అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. -
లక్షలు పోసినా.. దక్కని ప్రాణం!
ధర్మపురి: ఆడుతూ.. పాడుతూ ఆనందంగా ఉన్న కొడుకు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించి లక్షలు వెచ్చించినా ప్రాణం దక్కలేదు. నాడు భర్త.. నేడు కొడుకు మృతితో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన దూడ శంకరమ్మ భర్త 2012లో అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి కూలీపని చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లు, కొడుకు సతీశ్(20)ను పోషిస్తోంది. డిగ్రీ చదువుతూనే జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో ఎంఎల్‌టీగా పనిచేస్తున్న సతీశ్ ఈనెల 1న జ్వరంతో జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీ, లివర్ చెడిపోయాయని తెలిపారు. కొడుకును బతికించుకోవడం కోసం శంకరమ్మ రూ.3లక్షల వరకు అప్పుచేసింది. ఐదు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన సతీశ్ శుక్రవారం ఆస్పత్రిలో చనిపోయాడు. ‘తండ్రి లేని తమకు అండగా ఉంటాడని అనుకుంటే నువ్వూ అక్కడికే వెళ్లావా’ అంటూ కుటుంబసభ్యులు రోదించిన తీరు కన్నీరు పెట్టించింది. శనివారం సతీశ్ అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. ఇవి చదవండి: పెళ్లి రోజే.. సొంత ముఠా చేతిలో గ్యాంగ్‌స్టర్ హతం.. -
బాలికపై లైంగిక దాడి! బీఆర్ఎస్ యువ నేతపై పోక్సో కేసు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల సమయంలో భద్రాచలంలో అధికార బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కందిమల్ల సతీశ్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పట్టణంలోని దిగువ చప్టా ప్రాంతానికి చెందిన సతీశ్ అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను మాయమాటలతో లోబరుచుకుని స్థానికంగా ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు నేరుగా అక్కడికి వెళ్లి సతీశ్ చేస్తున్న మోసాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడే అతడికి దేహశుద్ధి చేశాక బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన కందిమల్ల సతీశ్‌ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇప్పటికే సెటిల్మెంట్ సతీశ్‌గా భద్రాచలంలో అతడి అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. గతంలో పెళ్లి చేసుకుని, ఆ మహిళ మరణానికి కారణమయ్యాడని, ఇలాంటి వారికి బీఆర్ఎస్ అండగా నిలవడం దారుణమని విమర్శించాయి. పార్టీతో సంబంధం లేదు.. ప్రైవేటు లాడ్జిలో బాలికతో ఉన్న సతీష్ బీఆర్ఎస్ యువజన నాయకుడని ఇతర పార్టీల వారు చెప్పడాన్ని తాము ఖండిస్తున్నామని బీఆర్ఎస్ భద్రాచలం మండల అధ్యక్షుడు అరికలె తిరుపతిరావు ప్రకటించారు. ఆయనకు బీఆర్ఎస్లో ఎలాంటి పదవీ లేదని, పార్టీతో సంబంధం లేదని అన్నారు. అయితే నిందితుడు సతీశ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి దిగిన ఫొటోలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన భద్రాచలంలో రాజకీయ దుమారానికి కారణమైంది. పోక్సో కేసు నమోదు చేశాం.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని భద్రాచలం సీఐ నాగరాజు తెలిపారు. బాలికకు మాయమాటలు చెప్పి లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. -
అత్తా.. కోడళ్ల మధ్య గొడవ.. వీఆర్ఏ తీవ్ర నిర్ణయం!
హనమకొండ: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన గురువారం మండలంలోని వెంకటాపూర్‌లో జరిగింది. ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఇజ్జగిరి సతీష్(36) దామెర తహసీల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సతీష్ భార్య లిఖితకు, తల్లి లక్ష్మికి గొడవ జరిగింది. దీంతో ఇద్దరిని సముదాయించి సతీష్ తన కూతురుతో ఒక గదిలో నిద్రించేందుకు వెళ్లాడు. ఇంట్లో జరిగిన గొడవను తలుచుకుంటూ మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురు ఉదయం లేచి చూసి కేకలు వేయగా బంధువులు వచ్చి చూసేసరికి సతీష్ అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. ఇటీవలే ఉద్యోగ భద్రత పొందిన సతీష్.. సతీష్.. ఏపీపీఎస్సీ ద్వారా 2012లో వీఆర్ఏగా ఎంపికై ఉమ్మడి ఆత్మకూరు, దామెర మండలాల తహసీల్ కార్యాలయంలో 11 సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 10, 2023న వీఆర్ఏలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించగా, సతీష్ దామెర తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. పోరాడి సాధించుకున్న ఉద్యోగంలో చేరి 2 నెలలు గడవకముందే సతీష్ మృతి చెందడం పలువురిని కలిచివేసింది. దామెర, గీసుకొండ, నడికూడ తహసీల్దార్లు జ్యోతివరలక్ష్మీదేవి, రియాజుద్దీన్, నాగరాజు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు.. సతీష్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
రూరల్ రోడ్ల పనుల నాణ్యత భేష్
సాక్షి, అమరావతి: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సహాయంతో చేపట్టిన ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఆ బ్యాంకు ప్రతినిధి బృందం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బ్యాంకు సహాయంతో చేపట్టిన ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఇంప్లిమెంటేషన్ సపోర్టు మిషన్ బృందం 5 రోజులపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించింది. జిల్లా స్థాయి పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశమై పనుల ప్రగతిని, నాణ్యతను పరిశీలించింది. తదనంతరం మంగళవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డితో ఈ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించి పనులపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు తమ బ్యాంకు ఆర్థిక సహాయంతో జరుగుతున్న గ్రామీణ రహదారి పనుల్లో నాణ్యతతో కూడిన ఒక ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. రూ.5,026 కోట్లతో పనులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణ ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించడంతోపాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణ సహాయంతో ఏపీ రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.5,026 కోట్లు కాగా.. ఏఐఐబీ రూ.3,418 కోట్లను రుణంగా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,608 కోట్లను సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3,665 పనులు చేపట్టి 7,213 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పటికే కాంపొనెంట్–1ఏ కింద 6,215 కిలోమీటర్ల పొడవున 3,231 పనులు చేపట్టగా.. ఇప్పటికే 2,450 కి.మీ. పొడవు గల 1,201 పనులు పూర్తయ్యాయి. మరో 3,765 కి.మీ. పొడవు గల 2,030 పనులు ప్రగతిలో ఉన్నాయి. కాంపొనెంట్–1బీ కింద 364 కి.మీ. పొడవు గల 142 పనులు చేపట్టగా.. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఎన్సీ బాలూనాయక్, ఏఐఐబీ ప్రతినిధి బృందం లీడర్ ఫర్హద్ అహ్మద్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్‌కుమార్, పర్యావరణ, సోషల్ ఎక్స్పర్ట్ శివ, ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్ ప్రదీప్, ట్రాన్స్పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ తౌషిక్ పాల్గొన్నారు. -
రవితేజ నిర్మించిన సినిమాలో హీరోగా చేయడం కలలా ఉంది: కార్తీక్ రత్నం
‘కేరాఫ్ కంచరపాలెం, నారప్ప’.. ఇలా నటుడిగా ఇప్పటివరకూ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేసిన నేను ‘ఛాంగురే బంగారురాజా’లో తొలిసారి ఓ కామెడీ రోల్ చేశాను. కామెడీ చేయడం కష్టం అంటుంటారు. కానీ మంచి స్క్రిప్ట్ ఉంటే కామెడీ చేయడం సులభమేనని నాకు అనిపించింది’ అన్నారు కార్తీక్ రత్నం. సతీష్ వర్మ దర్శకత్వంలో కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి హీరో రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక్ రత్నం మాట్లాడుతూ– ‘‘రంగస్థల నటుడిగా వందకుపైగా నాటకాలను ప్రదర్శించాను. మొదటి నాటకానికే నంది అవార్డు వచ్చింది. నాలా ఇండస్ట్రీకి వచ్చే కొత్తవారికి రవితేజ, నానీగార్లే స్ఫూర్తి. అలాంటిది రవితేజ నిర్మించిన సినిమాలో నేను హీరోగా నటించడం కలలా ఉంది. కొన్ని కొండ ప్రాంంతాల్లో లభించే విలువైన రంగు రాళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో మెకానిక్ బంగారు రాజా పాత్ర చేశాను. దర్శకుడు సతీష్వర్మగారికి రైటింగే బలం. స్పాట్లో ఆయన స్క్రిప్ట్‌ను ఇంప్రూవ్ చేస్తుంటారు. నేను నటించిన ‘శ్రీరంగ నీతులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రకాశ్‌రాజ్, దర్శకుడు ఏఎల్ విజయ్‌లు కలిసి నిర్మిస్తున్న ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ఒప్పుకున్నాను. మరో ఎగ్జైటింగ్ప్రాంజెక్ట్ను త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు. -
పాతకక్షలతోనే సతీశ్ హత్య
హైదరాబాద్: సంచలనం సృష్టించిన కన్నం సతీశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవీందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఇందిరానగర్‌కు చెందిన కన్నం సతీశ్ ఈనెల 20న రాత్రి 10.58 గంటల సమయంలో తన స్నేహితుడు నిఖిల్‌తో కలిసి పట్టణ శివారులోని శక్తి బార్ వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న శివాజీనగర్‌కు చెందిన జక్కం రాజేశ్.. సతీశ్‌తో మాటలు కలిపాడు. బార్ సమీపంలోని సందిలోకి తీసుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక సతీశ్ తలపై రాజేశ్‌తోపాటు పాతర్ల నవీన్ కర్రలతో దాడి చేశారు. అక్కడే ఉన్న నేరవేణి రమేశ్ ఇటుకతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన సతీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. 2015లో రాజేశ్, సతీశ్ మధ్య ఓ విషయంలో వివాదం తలెత్తింది. ఈక్రమంలో సతీశ్.. రాజేశ్‌పై దాడిచేశాడు. కొద్దిరోజుల తర్వాత ఇద్దరి మధ్య రాజీకుదిరింది. ఆ తర్వాత వీరి మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకొనే సతీశ్‌ను హతమార్చారు. దాడిలో పాల్గొన్న ముగ్గురు పారిపోయేందుకు, డబ్బులు సమకూర్చే తదితర విషయాల్లో మెట్‌పల్లికి చెందిన తాటికొండ రామకృష్ణ, గుండు గోపాల్, మిట్టపల్లి రాంమోహన్, కోరుట్లకు చెందిన చింతకింది హరీశ్ సహకరించారు. హత్యలో ముగ్గురు పాలుపంచుకోగా, వారికి సహకరించిన నలుగురిని మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీరిపై 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురి రికార్డు పరిశీలించాక నేరచరిత్ర ఉంటే పీడీ యాక్ట్ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని డీఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో మెట్పల్లి సీఐ లక్ష్మీనారాయణ, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ఎస్ఐలు ఉమాసాగర్, నవీన్ పాల్గొన్నారు. -
నమ్మించి పిలిచి.. చంపారు! హత్యపై పలు అనుమానాలు!
జగిత్యాల: ఆదివారం రాత్రి సుమారు 11.30గంటల సమయం.. మెట్పల్లి పట్టణ శివారులోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ అది.. దాని చెంతనే నిర్మానుష్య ప్రదేశం.. ఇద్దరు స్నేహితులు కన్నం సతీశ్, నిఖిల్ అక్కడ కూర్చొని ఏదోవిషయంపై మాట్లాడుకుంటున్నారు.. సరిగ్గా అనెంనడు ఇద్దరు అక్కడకు చేరుకున్నారు.. సతీశ్‌ను తమ వద్దకు రావాలని పిలిచారు. వారి వద్దకు వెళ్లిన సతీశ్ భుజంపై చెయ్యి వేసి కొద్దిదూరం నడుచుకుంటూ తీసుకెళ్లారు.. ఆ వెంటనే ఒక్కసారిగా దాడికి దిగారు.. అప్రమత్తమైన సతీశ్.. వారిబారి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు.. నిఖిల్ అడ్డుకునేందుకు యత్నిచంగా.. దుండగులు చంపుతామని బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. గాయాలతో పారిపోతున్న సతీశ్‌ను వెంబడించి మరీ పట్టుకొని కట్టెలు, ఇటుకలతో విచక్షణ రహితంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న సతీశ్‌ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. నాలుగు రోజుల క్రితమే కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకుడు రజాక్ కూడా హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సమయంలోనే సతీశ్ హత్యకు గురికావడం అలజడి సృష్టించింది. ప్రశాంతంగా ఉన్న పట్టణంలో వరుస హత్యలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహంతో కాలనీవాసుల ఆందోళన.. సతీశ్ మరణవార్త తెలుసుకున్న కాలనీవాసులు పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన ఇన్చార్జి డీఎస్పీ వెంకటస్వామి.. కోరుట్ల, మెట్పల్లి సీఐలతోపాటు పలువురు ఎస్ఐలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యాక అంబులెన్స్‌లో మృతుడి ఇంటికి తరలిస్తున్నారు. అయితే, మార్గమధ్యంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై కాలనీవాసులు ఆందోళనకు దిగారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సంఘటనే కారణమా? ► పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన సతీశ్(27)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరి వయసు ఏడాదిన్నర కాగా, మరొకరి వయసు రెండు నెలలు. ► జక్కం రాజేశ్, నవీన్ కలిసి సతీశ్‌పై దాడిచేసి చంపారని ఇన్చార్జి డీఎస్పీ వెంకటస్వామి సోమవారం విలేకరులకు తెలిపారు. ► అయితే.. పాత పగతోనే రాజేశ్ తన మిత్రుడు నవీన్‌తో కలిసి సతీశ్‌ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ► ఐదేళ్ల క్రితం స్థానిక మినీస్టేడియంలో రాజేశ్, సతీశ్ వర్గాల మధ్య ఓ విషయంలో ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ► చాలారోజుల తర్వాత రాజేశ్ కోలుకున్నాడు. అప్పటి నుంచి సతీశ్‌పై కక్ష పెంచుకున్నాడు. అదను చూసి హతమార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ► కేవలం ఈ గొడవేనా.. ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. హంతకులను పట్టుకోవడానికి రెండు బృందాలు ► మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటస్వామి తెలిపారు. ► దోషులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ► సతీశ్‌ను కొట్టి చంపిన బార్ అండ్ రెస్టారెంట్ వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ► వాటిలో ఈ దృశ్యాలు నిక్షిప్తమై ఉంటాయని భావించిన పోలీసులు.. సీసీ ఫుటేజీలు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
సుమన్, గరీమా చౌహాన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. రాచాల యుగంధర్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ పోచంపల్లిలో మొదలైంది. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా చివరి షెడ్యూల్లో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో 100 మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
భారత్‌తో రాస్‌నెఫ్ట్ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఇంధన దిగ్గజం రాస్‌నెఫ్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మాజీ డైరెక్టర్ జీకే సతీష్ (62)ను బోర్డులో నియమించింది. రాస్‌నెఫ్ట్ బోర్డులో ఒక భారతీయుని నియా మకం ఇదే తొలిసారి. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని సంస్థ భావిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా నియామకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఓసీలో బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా 2021లో జీకే సతీష్ పదవీ విరమణ చేశారు. 11 మంది డైరెక్టర్ల బోర్డులో నియమితులైన ముగ్గురు కొత్తవారిలో జీకే సతీష్ ఒకరని రష్యన్ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. రష్యాలోని చమురు, గ్యాస్ క్షేత్రాలకు సంబంధించి రాస్‌నెఫ్ట్‌కు సతీష్ గతంలో పనిచేసిన ఐఓసీతో భాగస్వామ్యం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇతర సంస్థలకు రాస్‌నెఫ్ట్ క్రూడ్ ఆయిల్‌నూ విక్రయించింది. ఇటీవలి కాలంలో సంస్థ గుజరాత్ రిఫైనరీలకు నాఫ్తా విక్రయాలనూ ప్రారంభించింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) అమ్మకంసహా భారత్ సంస్థలతో భాగస్వామ్యం విస్తృతం చేసుకోడానికి రాస్‌నెఫ్ట్ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. -
కరీంనగర్లో లేడీ రియల్టర్ దారుణ హత్య
కరీంనగర్ క్రైం: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు ఒక వివాహిత నిండు ప్రాణాలు బలిగొన్నాయి. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ భగత్‌నగర్‌లోని క్రిస్టల్ ప్లా జా అపార్ట్మెంట్లో వివాహిత గుండా సరిత (35) దారుణ హత్యకు గురైంది. గోదావరిఖని 8 ఇన్‌క్లైన్ కాలనీకి చెందిన ఆకుల ఓదెలు–లక్ష్మిల రెండో కుమార్తె సరిత మంచిర్యాల జి ల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గుండా శ్రీపాల్‌రెడ్డిని 2001లో ప్రేమ వివాహం చేసుకుంది. గోదావరిఖనిలో నివసిస్తున్న వారికి ఆస్మిత్‌రెడ్డి, మణిత్‌రెడ్డి సంతానం. గోదావరిఖనిలో సరిత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటం నచ్చని శ్రీపాల్‌రెడ్డి అందుకు అభ్యంతరం తెలిపాడు. ఈ వ్యవహారం ఇద్దరి మధ్య గొడవలకు దారితీయడంతో ఏడాది నుంచి సరిత భర్తకు దూరంగా ఉంటోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పనిమీద అప్పుడప్పుడూ కరీంనగర్‌కు వెళ్తుండే ది. ఈ క్రమంలో భగత్‌నగర్‌లోని క్రిస్టల్ అపార్ట్మెంట్ 203 ఫ్లాట్‌లో ఉంటున్న వెంకటేశ్ అనే వ్యక్తితో సరితకు పరిచయం ఏర్పడింది. దీంతో సరిత సుమారు రూ. 20 లక్షలకుపైగా డబ్బును వెంకటేశ్‌కు ఇచ్చింది. సరిత తమ్ముడు ఆకుల సతీశ్ నగరంలోని రాంనగర్లో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు ఉండటంతో కుమారులతో సహా సరితత మ్ముడి ఇంట్లోనే ఉంది.జూన్ 28న కొడుకులను గోదావరిఖని పంపిన సరిత అదేరోజు సాయంత్రం వెంకటేశ్‌తో కలసి రియల్ ఎస్టేట్ పనులపై వరంగల్‌కు వెళుతున్నానని చెప్పింది. ఆమె సోదరుడు మర్నాడు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. శుక్రవారం సరిత ఫోన్ నుంచి ఆకుల సతీశ్‌కు వెంకటేశ్ వాట్సాప్ కాల్ చేశాడు. సరిత తల గోడకు కొట్టుకుందని, ఫ్లాట్ లోపలే ఉందని, ఆమెను తాళం పగలగొట్టి తీసుకెళ్లాలని చెప్పి పరారయ్యాడు. దీంతో కంగారుపడిన సరిత సోదరి స్వాతి, తమ్ముడు సతీశ్... హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తాళం పగలగొట్టి లోనికి వెళ్లిచూడగా రక్తపు మడుగులో, ముఖం, తలపై తీవ్రగాయాలతో సరిత పడి ఉంది. ఆమె మెడకు చున్నీ బిగించి ఉంది. సతీశ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రవికుమార్, సిబ్బంది, క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రధా న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీలే కారణం... సరిత మృతికి వ్యాపార లావాదేవీలే కా రణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్రమంలో దాదాపు రూ. 25 లక్షలను పెట్టుబడి కింద వెంకటేశ్‌కు సరిత ఇచ్చిందన్నారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వా లని అడగడంతో వెంకటేశ్ ఇవ్వలేదని.. దీనిపై ఇద్దరికీ గొడవలు జరిగేవని సతీశ్ తెలిపాడు. వెంకటేశ్ నివసిస్తున్న అపార్ట్మెంట్ సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు అతన్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. -
వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోస్‌చంద్రారెడ్డిపై శనివారం రాత్రి కొందరు దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీటీసీ సభ్యుడిని కత్తితో పొడిచేందుకు యత్నించడంతోపాటు అతని కారును కాల్చివేసేందుకు వేసిన పథకం విఫలమైంది. ఈ ఘటనలో కత్తితో సహా ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన వ్యక్తి పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాజీ పీఆర్వో సతీష్, ఓ సినీ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్‌చక్రవర్తి సూచనల మేరకే ఈ ఘటనకు పాల్పడినట్లు పట్టుబడిన వ్యక్తి మీడియాతో చెప్పడం విశేషం. బాధితుడు బోస్‌చంద్రారెడ్డి తెలిపిన వివరాలు.. సతీష్, సునీల్‌చక్రవర్తి గతంలో బోస్‌చంద్రారెడ్డి, రంగంపేట ఉప సర్పంచ్ మౌనిష్రెడ్డితో గొడవపడ్డారు. ఓ భూమి, షాపు విషయంలోనూ ఎంపీటీసీ, ఉప సర్పంచ్‌తో సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో బోస్‌చంద్రారెడ్డిపై కక్ష పెంచుకున్న సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన హేమంత్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో శనివారం రాత్రి హేమంత్ మరో ఐదుగురు కలిసి రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాటిల్స్‌తో మారుతీనగర్‌లోని బోస్‌చంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించి.. జన సంచారం ఉండటంతో ఆఖరి నిమిషంలో పరారయ్యారు. అనంతరం మళ్లీ రాత్రి 11 గంటలకు ఇలానే దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆదివారం వేకువజామున 3 గంటలకు మళ్లీ కత్తులు, రాడ్లు, పెట్రోల్‌తో దాడికి రావడంతో వారిపై బోస్‌చంద్రారెడ్డి అనుచరులు తిరగబడ్డారు. హేమంత్ కత్తితో సహా పట్టుబడగా.. మిగిలినవారు పారిపోయారు. అతన్ని పట్టుకుని విచారించిన బోస్‌చంద్రారెడ్డి వర్గీయులు, రంగంపేటలోనూ మరో బ్యాచ్ ఉన్నారని చెప్పడంతో కారులో అతన్ని ఎక్కించుకుని రంగంపేటకు వచ్చారు. అప్పటికే వారు కూడా పారిపోయారు. ఈ హత్యాయత్నానికి సతీష్ కీలకసూత్రధారి అని, అతనే బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలపై దాడి చేయమన్నారని, దీనిలో సునీల్‌చక్రవర్తి పాత్ర కూడా ఉందని హేమంత్ మీడియాకు తెలిపాడు. హత్యచేయడం లక్ష్యం కాదని, కారును కాలి్చవేసి భయపెట్టాలని యత్నించినట్టు చెప్పాడు. నిందితులకు సతీష్ ఫోన్‌పే ద్వారా నగదు పంపించడం, అర్ధరాత్రిళ్లు కూడా సునీల్‌చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతుండటంతో బాధితులు నిజనిర్ధారణకు వచ్చారు. హేమంత్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగిన ప్రదేశం తిరుపతి యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో బోస్‌చంద్రారెడ్డి అక్కడే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, కొన్ని మీడియాల్లో సినీనటులు మోహన్‌బాబు, విష్ణువర్ధన్బాబుపై అసత్య ప్రచారం చేయడాన్ని బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలు ఖండించారు. చంద్రగిరిలో విలేకరుల సమావేశం పెట్టి జరిగిన ఘటనలతో వారికి ఎలాంటి సంబంధం లేదని, అసత్యప్రచారాలు మానుకోవాలని స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డితోపాటు గ్రామస్తులు ధర్నా చేశారు. -
జగిత్యాల సీఎం కప్ పోటీల్లో దొంగల హల్చల్..
జగిత్యాల: సీఎం కప్ లైటింగ్ నిర్వహణ చూస్తున్న సతీష్ అనే వ్యక్తి నుంచి లక్ష రూపాయలు కొట్టేసిన దొంగలు.. మంత్రి కొప్పుల, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు హాజరైన కార్యక్రమంలో లక్ష రూపాయలు అపహరణకు గురి కావడంతో కలకలం.. పోలీస్ సెక్యూరిటీ కళ్ళు కప్పి ఉడాయించిన దొంగ.. మైక్ లో అనౌన్స్ మెంట్ చేసిన నిర్వాహకులు. -
నేను స్టూడెంట్ సార్ అనేవాణ్ణి
‘‘నేను ప్రతిరోజూ విద్యార్థిలానే భావిస్తాను. ‘నేను స్టూడెంట్ సర్’ టైటిల్ విన్నప్పుడు నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. ఏదైనా తింగరి పని చేసి పోలీసులకు దొరికినప్పుడు ‘నేను స్టూడెంట్ సార్’ అనేవాణ్ని’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. బెల్లంకొండ గణేశ్ హీరోగా రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘24/7 ఒకటే ధ్యాస..’ అనే పాటని విశ్వక్ సేన్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నేను స్టూడెంట్ సర్’ టీజర్ బాగుంది. సినిమా మంచి హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఫోన్ కొనడానికి కష్టపడే సమయంలో వచ్చే మాంటేజ్ సాంగ్ ‘24/7 ఒకటే ధ్యాస..’’ అన్నారు బెల్లంకొండ గణేశ్. ‘‘మా సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాఖీ ఉప్పలపాటి. ‘‘హీరో క్యారెక్టర్ ఏంటో ఈ పాట ద్వారా చెప్పాం’’ అన్నారు సతీష్ వర్మ. కథారచయిత కృష్ణ చైతన్య, పాటల రచయిత హర్ష, హీరోయిన్లు అవంతిక, రితిక మాట్లాడారు. -
తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ప్రైవేటు కాలేజీల నిర్వహణ కష్టంగా ఉందని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడి సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు స్థాపించిన కాలేజీలపట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. తమ కాలేజీల్లో 9.40 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 2021–22 సంవత్సరానికి రూ.86.55 కోట్లు ట్రెజరీకి విడుదలైనా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వలేదని, 2022–23 సంవత్సరానికి రూ.226 కోట్లు ఇంకా విడుదల చేయలేదన్నారు. దీనివల్ల అధ్యాపకులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులులేవని వేధించే ప్రభుత్వం, తమకు రావాల్సిన బకాయిలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. గడచిన ఎనిమిదేళ్లలో కాలేజీలపై వివిధ రకాల ఫీజులను 10 నుంచి 50 శాతం పెంచారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం ఆ నిష్పత్తిలో పెంచలేదన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘం నేతలు ఇంద్రసేనరెడ్డి, ఉస్మాన్, ఎస్ఎన్ రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ ఇకలేరు..
హైదరాబాద్: మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్(77) తుదిశ్వాస విడిచారు. కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న పీవీ సతీష్.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేసినందుకు గానూ ఈయనను మిల్లెట్ మ్యాన్‌గా పిలుస్తారు. అయితే, 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన పీవీ సతీష్.. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పని చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపించారు. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీశ్ కుమార్ విశేషంగా కృషి చేశారు. అలాగే, వాతావరణ మార్పుల నేపథ్యంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా.. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా.. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై తొలి మిల్లెట్స్ కేఫ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు. 30 సంవత్సరాల కిందట మొదటిసారిగా ప్రపంచవ్యాప్త చర్చలో.. చిరుధాన్యాలను ప్రవేశపెట్టడంలో సఫలీకృతమయ్యారు.సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేశారు. ప్రత్యేకించి చిన్న కమతాల్లో పెట్టుబడి లేకుండా.. చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, వినియోగం పెంపు కోసం కృషి చేశారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడంలో.. 2018 సంవత్సరాన్ని కేంద్రం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీరి కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఇక, సతీష్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జహీరాబాద్‌లో జరుగనున్నాయి. -
వీఆర్వోల ఆందోళనను పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు విధులకు దూరంగా ఉన్నా ప్రభుత్వంలో చలనంలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కనీసం ఐదు నిమిషాల పాటు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమని గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. వీఆర్వోలు 14 ఏళ్లుగా ఒకే క్యాడర్లో ఉద్యోగం నిర్వహించడం బాధాకరమని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యోగుల మనోభావాలు సీఎస్‌కు తెలియవని, సీఎం కేసీఆర్‌ను ఆయన తప్పదోవ పట్టిస్తున్నారని జేఏసీ ఆరోపించింది. శనివారం సీసీఎల్ఏలో వీఆర్వోల జేఏసీ సమావేశం అయింది. జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, అదనపు సెక్రెటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, కో చైర్మన్ రవి నాయక్, వైస్ చైర్మన్లు మౌలానా, నూకల శంకర్, రవీందర్, ప్రతిభ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణాగౌడ్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖను రద్దు చేయాలని ప్రయత్నం జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ ఏకం కావాలని కోరారు. పెద్ద సంఖ్యలో ఉన్న వీఆర్వోలు, వీఆర్ఏలు విధులకు దూరంగా ఉండడం వల్ల పాలన కుంటుపడిపోయిందని అన్నారు. ప్రభుత్వం వీఆర్వోల సర్వీసును గుర్తించి రెవె న్యూ శాఖలోనే మరో పేరుతో కొనసాగించాలని కోరుతున్నామన్నారు. వీఆర్ ఏలకు స్కేలు మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
సర్దుబాటుపై ససేమిరా!
సాక్షి, హైదరాబాద్: గ్రామరెవెన్యూ అధికారు(వీఆర్వో)లకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వీఆర్వోల జేఏసీ స్పష్టం చేసింది. గురువారం ఇక్కడి సీసీఎల్ఏ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్ మాట్లాడుతూ వీఆర్వోలను వివిధ శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందన్న వార్తలతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు. వీఆర్వోల జేఏసీని సంప్రదించిన తర్వాతే సర్దుబాటు ప్రక్రియపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను ఏ ఒక్క వీఆర్వో కూడా స్వీకరించబోరని స్పష్టం చేశారు. అశాస్త్రీయ పద్ధతిలో వీఆర్వో పోస్టులను రద్దు చేయడం అమానుషమన్నారు. ఏకపక్ష నిర్ణయంతో ఇతర శాఖల్లోకి వీఆర్వోలను బదిలీ చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సమానహోదాతో సర్దుబాటు చేయాలని, అర్హులైన వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, సమస్యల పరిష్కారానికే న్యాయ పోరాటం చేస్తున్నామని రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్‌రావు అన్నారు. గురువారం రామచంద్రాపురంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర శాఖల్లోకి వీఆర్వోలను బలవంతంగా సర్దుబాటు చేస్తే సర్వీస్ పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
పాన్ ఇండియా చిత్రంగా ‘ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’
జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల దర్శకత్వంలో శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. మిథున ఎంటర్టైన్మెట్స్ ప్రై.లి సమర్పణలో సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎం. అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్నఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాటను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.ఎం. అర్జున్ మాట్లాడుతూ.. యూనివర్సల్ పాయింట్‌తో సతీష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. ‘‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ చిత్రం డిఫరెంట్ లవ్ ఎంటర్టైనర్. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. మేకింగ్‌లో మల్లికార్జున్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కార్తీక్ మ్యూజిక్, ఆరీఫ్ సినిమాటోగ్రఫీ ఇలా మంచి టెక్నీషియన్స్ కుదిరారు.సినిమా చాలా బాగా వచ్చింది’ అని దర్శకుడు సతీష్ బత్తుల అన్నారు. -
విషాదం: పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థికి గుండెపోటు
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో పెనువిషాదం చోటుచేసుకుంది. గూడూరు డీఆర్‌డబ్యూ్ల ఎగ్జామ్ సెంటర్ వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్ విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యపరీక్షలు నిర్వహించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. మృతి చెందిన విద్యార్థి సైదాపురంకు చెందిన సతీష్‌గా గుర్తించారు. చదవండి: (ఆర్టీసీ బస్సు బోల్తా.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు) -
బ్యాంకుల ప్రైవేటీకరణే పరిష్కారమా?
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల రాబడి రావచ్చు గానీ, దీన్నుంచి స్థూలంగా దేశానికి ఏం ప్రయోజనం కలుగుతుందన్నది ప్రశ్న. ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాలకు సేవలు వంటి లాభదాయకం కాని సేవలనుంచి తప్పుకోవచ్చు. లాభం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై పని ఒత్తిడి, ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది, ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు తిరోగమిస్తోంది. మొత్తంమీద చూస్తే బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది సర్వరోగనివారిణి అయితే కాదు. నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు అనే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించబోతోంది. 2021 ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్లో, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒక ప్రభుత్వ బీమా కంపెనీని 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీ కరించాలనే లక్ష్యాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటీకరణ ప్రక్రియను ముగించడానికి, ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావలసి ఉంది. అందుచేత, ప్రభుత్వం బ్యాంకింగ్ లాస్ (సవరణ) బిల్లు, 2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ కనీసం వాటా 51 నుంచి 26 శాతానికి కుదించబడుతుంది. ప్రస్తుతానికి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ వాటాలు దాదాపు రూ. 44 వేల కోట్ల వరకు ఉండవచ్చని లెక్కించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 31,641 కోట్లు కాగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ. 12,359 కోట్లు. ఈ రీతిన ఈ బ్యాంకుల్లో ఉన్న తన వాటాను ప్రభుత్వం అమ్ముకోవడం ద్వారా తానుపెట్టిన మూల ధనాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం తన వాటాని అమ్ముకోవడానికి ఎంత సమయం పడుతుందని చెప్పడం కష్టమవు తుంది. ఈ మూలధనం విలువ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సమయంలో మార్కెట్ పరిస్థితులపైనా, బ్యాంక్ బలంపైనా అంటే బ్యాంకు శాఖలు, కస్టమర్లు, అలాగే బ్యాంక్ బిజినెస్ స్థాయి, నిరర్థక ఆస్తులు (ఎన్పీఎలు) తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులను ప్రైవేటీకరించిన తర్వాత, ఈ బ్యాంకుల్లోకి మూలధనాన్ని మళ్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. పైగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వంటి ప్రభుత్వ విభాగాలు ఈ సంస్థలను పర్యవేక్షించాల్సిన అవసరం ఇకపై ఉండదు. అయితే ఈ రెండు ప్రభుత్వ బ్యాంకులకు చెందిన వాటాలను కొను గోలు చేసిన వారు బ్యాంకును మరింత స్వేచ్ఛగా నిర్వహించు కోగలుగుతారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 95.8 శాతం వాటాలు ఉన్నాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ వాటా 92.4 శాతం వరకు ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన వాటాను ప్రభుత్వం మొదట 51 శాతానికి తగ్గించుకుంటుందనీ, తర్వాత దాన్ని 50 శాతంకంటే తక్కువకు కుదించి ఆ బ్యాంకుల అమ్మకం సజావుగా జరిగేందుకు వీలు కల్పిస్తుందనీ భావిస్తున్నారు. ప్రైవేటీకరణ తర్వాత, ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవచ్చు. దీనివల్ల ప్రభు త్వానికి ఉన్న సంక్షేమ ముద్రపై ప్రతికూల ప్రభావం కలుగుతుంది. భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా ఉద్యోగులు తమ పనిలో చురుకు దనం చూపలేకపోవచ్చు. ఇది ఈ బ్యాంకుల పనితీరునే దెబ్బ తీయవచ్చు. పైగా ఈ రెండు బ్యాంకుల సేవా రుసుములు పెరుగు తాయి. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడం నుంచి ఈ బ్యాంకులు తప్పుకోవచ్చు. ప్రభుత్వ పథకాలను అమలు చేయ డానికి ఇవి ఆసక్తి చూపకపోవచ్చు. పైగా పెన్షన్ పంపిణీ, అటల్ పెన్షన్ యోజన, సుకన్యా సమృద్ధి యోజన వంటి తక్కువ ప్రతిఫలం లభించే తరహా సేవలకు సంబంధించిన పనులు చేయడంపై ఇవి ఆసక్తి చూపకపోవచ్చు. అదే సమయంలో తమ రాబడిని పెంచు కోవడానికి మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి బ్యాంకింగేతర సేవలను అందించడానికి ఈ బ్యాంకులు పూనుకోవచ్చు. ప్రైవేటీకరణ జరిగిన తర్వాత, ఈ బ్యాంకుల పట్ల కస్టమర్లు మనస్సుల్లో ఉండే పరపతి స్థాయి తగ్గిపోవచ్చు. ఇటీవలే యస్ బ్యాంక్, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో–ఆపరేటివ్ బ్యాంక్ (పీఎమ్‌సీ)లు మునిగిపోవడం చూశాం. ప్రభుత్వ పథకాలకు ఒక రూపమివ్వడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై తీవ్రమైన భారం పడవచ్చు. ప్రైవేటీకరణ కోసం ప్రతిపాదించిన బ్యాంకుల పరిమాణం చిన్నది. సెంట్రల్ బ్యాంక్‌లో 33 వేలమంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 2021 ఆర్థిక సంవ త్సరంలో ఆరేళ్ల తర్వాత రూ. 831 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2020 సంవత్సరంలో ఈ బ్యాంకు రూ. 8,527 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 887.58 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 20 శాతం పెరిగి రూ. 161 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలానికి గానూ బ్యాంకు 134 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 6,703.71 కోట్లకు నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 2 శాతం పెరిగి రూ. 6,833. 94 కోట్లకు చేరింది. బ్యాంకు నిర్వహణాత్మక లాభం 42.16 శాతం వృద్ధితో రూ. 1,458 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలా నికి బ్యాంకు లాభం రూ. 1,026 కోట్లు మాత్రమే. గత సంవత్సరం బ్యాంకు నిరర్థక ఆస్తులు 19.89 శాతంగా ఉండగా, ఈ సంవత్సరం అవి 17.36కి తగ్గాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నికరలాభం గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 148 కోట్లు కాగా ఈ సంవత్సరం ఇదే కాలానికి అది రెట్టింపై రూ. 376 కోట్లకు చేరింది. బ్యాంక్ ఇచ్చిన మొత్తం అడ్వాన్సులలో నికర ఆస్తుల వాటా 2.77 శాతం కాగా, గత సంవత్సరం ఇదే కాలానికి అది 4.30 శాతంగా ఉండింది. బ్యాంక్ మొత్తం నిరర్థక ఆస్తులు గత సంవత్సరంలో రూ. 5,291 కోట్లు కాగా, ఈ సంవత్సరం అవి రూ. 3,741 కోట్లకు తగ్గి పోయాయి. 2017 మార్చి నెలలో, దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. విలీన ప్రక్రియ మొదలైన తర్వాత 2020 ఏప్రిల్ నాటికి వీటి సంఖ్య 12కి పడిపోయింది. దేశంలో ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 21కి చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 10కి తగ్గిపోతుంది. అదే సమయంలో ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య 23కి పెరుగుతుంది. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి కాదు. ఇటీవలికాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు తిరోగ మిస్తోంది. అనేక ప్రైవేట్ బ్యాంకులు మునిగిపోయాయి. యస్ బ్యాంక్, పీఎమ్‌సీ దీనికి తాజా ఉదాహరణ. కరోనా మహమ్మారి కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎలా పనిచేశాయనన్నది అందరికీ తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రభు త్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల రాబడి రావచ్చు కానీ, దీన్నుంచి ప్రభుత్వం ఎలా ప్రయోజనం పొందుతుందన్నది పరిశీలించాల్సిన విషయమే. లాభం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై పని ఒత్తిడి, ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంతిమ పరిణామం ఏంట న్నది వేచి చూడాల్సిందే. – సతీష్ సింగ్ సీనియర్ జర్నలిస్టు -
పృథ్వీ ఐటీ సొల్యూషన్స్ ఎండీ ఉప్పలపాటి సతీష్ అరెస్ట్
హైదరాబాద్: పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండీ ఉప్పలపాటి సతీష్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బ్యాంకుల దగ్గర నుంచి రూ.3,316 కోట్ల మేర రుణాలు తీసుకుని మోసం చేసినట్లు ఆయనపై అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలో... కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు కోర్టు ఆదేశాలమేరకు ఉప్పలపాటి సతీష్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. -
నాలుగు భాషల్ ఫ్రెండ్షిప్
క్రికెటర్ హర్భజన్‌సింగ్ హీరోగా నటిస్తోన్న తొలి చిత్రం ‘ఫ్రెండ్షిప్’. ఈ చిత్రంలో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ‘యాక్షన్ కింగ్’ అర్జున్, సతీష్ ప్రధాన పాత్రధారులు. దర్శక ద్వయం జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమాను జేపీఆర్, స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హర్భజన్ ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా కనిపిస్తారని సమాచారం. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్మురుగన్, రాబిన్. -
పసిడి కోసం వికాస్, సిమ్రన్ పోరు
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఇద్దరు భారత బాక్సర్లు ఫైనల్ చేరగా... మరో ఆరుగురు సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలతో ముగించారు. పురుషుల 69 కేజీల విభాగంలో వికాస్ కృషన్... మహిళల 60 కేజీల విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీస్‌లో వికాస్ 3–2 తేడాతో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అబ్లైఖన్ జుసుపొవ్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. బౌట్లో ఎడమ కంటి దిగువభాగంలో గాయమైనా... పట్టుదల ప్రదర్శించిన వికాస్ తుది పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో అతను ఈషా హుస్సేన్ (జోర్డాన్)తో తలపడతాడు. ఒకవేళ వికాస్ కంటి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతనికి ఫైనల్లో పోటీపడే అవకాశం ఇవ్వరు. సిమ్రన్‌జిత్‌కు సెమీస్‌లో విజయం సులువుగానే దక్కింది. సిమ్రన్‌జిత్ 4–1తో ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత షి యి వు (చైనీస్ తైపీ)ని ఓడించింది. ఫైనల్లో సిమ్రన్ రెండుసార్లు ఆసియా విజేతగా నిలిచిన ఓ యెన్ జీ (దక్షిణ కొరియా)ను ఎదుర్కొంటుంది. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (52 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు)... మహిళల విభాగంలో మేరీకోమ్ (51 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) సెమీస్‌లో ఓటమి పాలయ్యారు. అమిత్ 2–3తో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జియాంగ్వాన్ హు (చైనా) చేతిలో, ఆశిష్ 1–4తో మార్సియల్ ఇముర్ (ఫిలిప్పీన్) చేతిలో... సతీశ్ 0–5తో బఖోదిర్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... మేరీకోమ్ 2–3తో యువాన్ చాంగ్ (చైనా) చేతిలో, లవ్లీనా 0–5తో హోంగ్ గు (చైనా) చేతిలో, పూజ రాణి 0–5తో ఖియాన్ లి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ టోర్నీ ద్వారా ఇప్పటికే ఎమిమిది మంది భారత బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. పురుషుల 81 కేజీల విభాగంలో భారత బాక్సర్ సచిన్ కుమార్ ఫైనల్ బాక్స్ ఆఫ్ బౌట్‌కు అర్హత సాధించాడు. నేడు జరిగే ఫైనల్ బాక్స్ ఆఫ్ బౌట్లో షబ్బోస్ నెగ్మతులోయెవ్ (తజికిస్తాన్)పై సచిన్ గెలిస్తే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాడు. -
‘సతీష్‌ను హత్య చేసింది హేమంతే’
-
ప్రియాంక కోసమే సతీష్‌ను హత్య చేశాడు
-
‘టీడీపీ నుంచి బీజేపీలోకి అందుకే చేరికలు’
సాక్షి, విజయవాడ: రాబోయే రోజుల్లో ఏపీలో తమ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి, ఏపీ ఇన్‌ఛార్జి సతీశ్ వెలాంకర్ అన్నారు. ఇతర పార్టీల నుంచి చాలామంది నాయకులు బీజేపీలో చేరటానికి సిద్దంగా వున్నారని చెప్పారు. గాంధీనగర్ కందుకూరి కళ్యాణమండపంలో అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఆవిర్భావించిందో వాటిని చంద్రబాబు నాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని, జన్మభూమి కమిటీలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని, అందుకే టీడీపీ నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని సతీశ్ వ్యాఖ్యానించారు. యోగ దినోత్సవంలో సతీశ్‌తో పాటు ఏపీ సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్, వంగవీటి నరేంద్ర, తదితర నాయకలు పాల్గొని యోగాసనాలు వేశారు. (చదవండి: బీజేపీలోకి బాబు కోవర్టులు!) -
ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావ్
హైదరాబాద్: నా మీద కేసులు ఉన్నాయని చెబుతున్నావ్..అవి నువ్వు(పుట్టా మధు), నీ అనుచరులు పెట్టిన కేసులేనని మంథని మాజీ ఉప సర్పంచ్, పుట్టా మధు బాధితుడు సతీష్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సతీష్ విలేకరులతో మాట్లాడుతూ..అడవిలో ఉన్న ఎమ్మెల్యే అంటున్నావ్..ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావ్ అని పుట్టా మధుని సతీష్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాను పుట్టా మధుపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. మధు మీద ఫిర్యాదు చేసి 3 నెలలు అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని అడిగారు. మంథనిలో ఉన్న మీడియాను తన కనుసన్నల్లో మేనేజ్ చేస్తున్నారని..అందుకే హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే తనకు పుట్టా మధుతో ప్రాణ హాని ఉందన్నారు. అందుకే హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నట్లు వెల్లడించారు. బీసీ ఎమ్మెల్యే ముసుగులో ఎంతో మందిని అణచివేశారని ఆరోపించారు. పుట్టా మధుపై 6 కేసులు నమోదయ్యాయని, ప్రజలందరూ చూస్తుండగానే ఎస్ఐపై కండువా వేశారని, అది తప్పుకాదా అని ప్రశ్నించారు. గుండా నాగరాజు కేసులో పుట్టా మధు ముమ్మాటికీ నిందితుడేనని, గుండా బలిదానం వల్లే పుట్టా మధు ఎమ్మెల్యే అయ్యాడని చెప్పారు. అప్పటి స్థానిక ఎస్ఐ వల్ల కేసు నుంచి పుట్టా మధు తప్పించుకున్నాడని, అదే ఎస్ఐ ఇప్పుడు మంథని సీఐగా ఉన్నాడని వెల్లడించారు. పుట్టా మధు చెబుతున్నట్లు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పుట్టా మధుకు రూ.900 కోట్ల ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నించారు. తన వెనక మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారన్నది అవాస్తవమన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతికి లైసెన్స్ ఇస్తుందని విమర్శించారు. -
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి కోనరావుపేటవాసి ఆత్మహత్య
కోనరావుపేట (వేములవాడ): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన ఓ యువ కుడు అక్కడ సరైన పనిలేక.. చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్తాపం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన చెన్నమేని అంజయ్య–ఎల్లవ్వ దంపతుల ఏకైక కుమారుడు సతీశ్(30). తండ్రీకొడుకులు గతంలో మూడుసార్లు ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి సరైన పని దొరకక ఇంటికి తిరిగొచ్చారు. అంజయ్య అప్పులు చేసి కూతురు పెళ్లి చేశాడు. మొత్తంగా అప్పు రూ.12 లక్షలకు చేరింది. అప్పుచేసి ఆరునెలల క్రితం సతీశ్ బహ్రెయిన్ వెళ్లగా, తండ్రి దోహాఖతార్ వెళ్లాడు. తండ్రి కూడా తక్కువ వేతనానికే పని చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు ఎలా తీరుతాయని తల్లి, భార్యకు తరచూ ఫోన్ చేసి మథనపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వీడియో(ఐఎంవో)కాల్ చేసి తల్లి, భార్య రాజ మణి, ఇద్దరు కొడుకులు చూస్తుండగానే గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. వారు వద్దని వారించినా వినలేదు. కళ్లెదుటే ఆత్మహత్య చేసుకుంటున్న సతీశ్‌ను ఎలా కాపాడాలో తెలియక కుటుంబం రోదిస్తూ ఉండిపోయింది. -
సెక్స్‌రాకెట్.. సీఎం సన్నిహితుడి విచారణ!
సాక్షి, అమరావతి: సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అమెరికాకు సినీతారలను తరలించి వ్యభిచారం ఊబిలోకి దింపిన వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును అమెరికాలోని చికాగో పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో తీగ లాగితే డొంక కదులుతోంది. తొలుత ఇది కేవలం సినీతారలకు సంబంధించిన అంశంగానే భావించినప్పటికీ ఈ రాకెట్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ వేమనను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా విచారించడం కలకలం రేపుతోంది. తానా నుంచి సినీతారలకు ఆహ్వానాలు, మెయిల్స్ పంపడంతోపాటు సతీష్ వేమన బ్యాంకు ఖాతా నుంచి సినీతారలకు పెద్ద మొత్తంలో డబ్బులు మళ్లాయని ఎఫ్‌బీఐ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించినట్టు తెలిసింది. టీడీపీలో సతీష్ చురుకైన పాత్ర తొలుత ఎఫ్‌బీఐ విచారణకు హాజరైన సతీష్ వేమన తరువాత ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలిసింది. అయితే తానా ప్రతినిధులపై పోలీసులు ఒత్తిడి తేవడంతో సతీష్ విచారణకు హాజరై సహకరించారని చెబుతున్నారు. సినీతారల సెక్స్ రాకెట్‌కు సంబంధించి సతీష్ వేమన ప్రమేయంపై ఈ సందర్భంగా ఎఫ్‌బీఐ ఆరా తీసినట్టు సమాచారం. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే సతీష్ గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు హీరోయిన్లను అమెరికా తీసుకెళ్లి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే సెక్స్ రాకెట్లో తన ప్రమేయం లేదని సతీష్ వేమన ముందు జాగ్రత్తగా కొన్ని మీడియా సంస్థలకు వివరణ ఇచ్చుకోవడంపై తానా ప్రతినిధుల్లో భిన్న వాదనలు వ్యక్తమైనట్టు తెలిసింది. తప్పు చేయనప్పుడు మీడియాకు ముందే వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని పలువురు సహచరులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. చికాగో కోర్టుకు ‘సెక్స్ రాకెట్’ దంపతులు... సినీతారల సెక్స్ రాకెట్ కేసులో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను ఎఫ్‌బీఐ గురువారం ఇల్లినాయిస్ కోర్టులో హాజరు పరిచింది. గురువారం నుంచి ఈ కేసు విచారణ ప్రారంభం అయినందున కిషన్ దంపతులు అప్రూవర్‌గా మారి నోరు విప్పితే పలువురు ప్రముఖుల గుట్టు రట్టు అవుతుందని భావిస్తున్నారు. కిషన్ దంపతులకు రెండేళ్ల క్రితమే వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటూ సినీతారలు, ప్రముఖులను తరలించి సెక్స్ రాకెట్ నడపటాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం నాలుగేళ్ల నుంచి జరుగుతున్నట్లు భావించినా పదేళ్ల నుంచి కొనసాగుతున్నట్టు ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలిందని విశ్వసనీయ సమాచారం. అమెరికాకు సినీతారలు, ప్రముఖులు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు తీసుకొచ్చారు, ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించారు తదితర వివరాలు చంద్రకళ డైరీలో రాసి ఉన్నట్టు చెబుతున్నారు. ఆ డైరీ ఇప్పుడు ఎఫ్‌బీఐ చేతికి చిక్కడంతో ఎవరి జాతకాలు బయటపడతాయోననే కలవరం మొదలైంది. తీవ్ర నేరంగా పరిగణిస్తున్న ఎఫ్‌బీఐ దాదాపు ఆరు నెలల క్రితం దొరికిన ఒక కాగితం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ పలు కీలక ఆధారాలు సేకరించి సెక్స్ రాకెట్లో పాత్రధారులైన మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను అదుపులోకి తీసుకుంది. వీరిపై కేసు నమోదు చేసిన చికాగో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టి దీని వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. సాంస్కృతిక ప్రదర్శనల పేరుతో వ్యభిచారం చేయడం తీవ్రమైన నేరంగా ఎఫ్‌బీఐ పేర్కొంటోంది. అమెరికాలో ఇష్టపూర్వకంగా జరిగే వ్యభిచారంపై పెద్దగా ఆంక్షలు లేనప్పటికీ మారుపేర్లతో విదేశీయులను తరలించి వ్యభిచారంలోకి దించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించినట్టు తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్లో దాదాపు రూ.40 కోట్ల మేర చేతులు మారినట్టు చెబుతున్నారు. -
‘నాకిదే చివరిరోజు.. బాబుని నువ్వే చూసుకో’
బెంగళూరు : వరకట్నం వేధింపులకు మరో యువతి బలైపోయింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న రష్మీ (28) ఆదివారం రాత్రి తన ఫ్లాట్‌లో బలవన్మరణానికి పాల్పడింది. చనిపోవడానికి ముందు.. అమెరికాలో ఉంటున్న తన సోదరికి ‘నాకిదే చివరిరోజు, బాబును చూసుకో’ అని మెసేజ్ చేసింది. బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాలివి.. కెంపెగౌడా రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో నివసించే రష్మీ.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత అమెరికాలో ఉన్న తన సోదరికి మెసేజ్ చేసింది. ఇదే తన చివరి రోజని, బాబును జాగ్రత్తగా చూసుకోవాలన్నది మెసేజ్ సారాంశం. దీంతో కంగారుపడ్డ సోదరి.. బెంగళూరులోనే నివాసం ఉంటున్న తల్లి భాగ్యమ్మకు విషయాన్ని చెప్పి, తక్షణమే రష్మీ ఫ్లాట్‌కు వెళ్లాలని సూచించింది. ఎంతసేపు తట్టినా తలుపు రష్మీ తీయకపోవడంతో ఆమె తల్లి.. సతీష్(రష్మీ భర్త)కు ఫోన్ చేసింది. అతను ఊళ్లో లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది. తలుపులు పగులగొట్టి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న రష్మీ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వేధింపుల పరంపర : కోలార్ జిల్లాకు చెందిన సతీష్, బెంగళూరుకు చెందిన రష్మీలకు మూడేళ్ల కిందట వివాహమైంది. ఈ ఇద్దరూ స్థానిక మాన్యతా టెక్ పార్కులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. కాగా, అదనపు కట్నం తేవాలంటూ రష్మీని సతీష్ వేధించేవాడు. శారీరక, మానసిక హింసకు గురిచేసేవాడు. భర్త వేధింపులు తాళలేని స్థితిలో రష్మీ రెండు వారాల కిందటే ఉద్యోగానికి రాజీనామా చేసింది. 16 నెలల వయసున్న కొడుకును తల్లి భాగ్యమ్మకు అప్పగించింది. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకునేముందు సోదరికి మెసేజ్‌లు పంపింది. ఫిర్యాదుబమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సతీష్ ను, అతని తల్లి గాయత్రిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. రష్మీ, ఆమె భర్త సతీష్ (ఫైల్ ఫొటో) -
యువతి వేధిస్తోందంటూ యువకుడి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా సెల్ఫోన్లో తమను పురుషులు వేధిస్తున్నారంటూ మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే తనను ఓ యువతి సెల్ఫోన్లో వేధిస్తున్నదంటూ ఓ యువకుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -14లో నివసించే ఎన్. సతీష్ అనే యువ వ్యాపారికి గత రెండేళ్ల నుంచి ఫోన్లో నెట్ కాలింగ్ ద్వారా అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఫోన్లు వస్తున్నాయి. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకుంటే పరువు తీస్తానంటూ ఆ యువతి బెదిరింపులకు పాల్పడుతోంది. ఇంతకూ మీరెవరంటూ సతీష్ ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆమె సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో విసుగు చెందిన అతడు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించడంతో సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీవీ నటి కిరాతకం
బెంగళూరు : టీవీ సీరియళ్లకు ఏమాత్రం తీసిపోని కథ ఇది. బుల్లితెరపై నటిస్తున్న ఒక మహిళ సీరియళ్లలోని కుట్రలనే ఒంటబట్టించుకుంది. సహచరునితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్తను పరలోకాలకు పంపించింది. ఆ మహిళను, ఆమె ప్రియుడిని నిన్న యశ్వంతపుర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు తుమకూరు నగరానికి చెందిన సతీష్ (36). అతని భార్య, టీవీ నటి కల్పన (27), ప్రియుడు జావేద్‌ను అరెస్టు చేశారు. సతీష నగరంలో ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో సూపర్వైజర్. భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి యశ్వంతపురలోని సుబేదార్ పాళ్యలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కల్పన కన్నడ సీరియల్స్‌లో నటిస్తోంది. అక్కడే పరిచయమైన జావేద్‌తో అక్రమ సంబంధం కొనసాగుతోంది. దీనిపై సతీష్ ఆమెను పలుమార్లు మందలించాడు. దాంతో ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. 25వ తేదిన రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. తిన్న వెంటనే సతీష్ మత్తులో పడిపోయాడు. ప్రియుడు జావేద్‌ను పిలిపించి ఇద్దరూ కలిసి సతీష్‌ను సుత్తితో తలపైన కొట్టిచంపారు. తన భర్తను ఎవరో వచ్చి హత్య చేశారని విలపించింది. పోలీసులు అనుమానంతో కల్పనను అదుపులోకి తీసుకుని విచారించగా, సోమవారం అసలు విషయం బయట పెట్టింది. దాంతో పోలీసుల ఈ జంటకు బేడీలు తగిలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మనోజ్, కవీందర్, సతీశ్ అర్హత
తాష్కెంట్: అందివచ్చిన ఏకైక అవకాశాన్ని సద్విని యోగం చేసుకున్న భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (69 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), కవీందర్ సింగ్ బిష్త్ (52 కేజీలు) ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో భాగంగా చివరి రోజు జరిగిన ‘బాక్స్ ఆఫ్ బౌట్’లలో మనోజ్ 3–2తో లియు వీ (చైనా)పై... సతీశ్ 5–0తో ము హైపెంగ్ (చైనా)పై గెలుపొందగా... కవీందర్‌కు తన ప్రత్యర్థి సలామ్ అబ్దుల్ (మలేసియా) నుంచి వాకోవర్ లభించింది. ఇంతకుముందే శివ థాపా, సుమీత్ సాంగ్వాన్, వికాస్ కృషన్, అమిత్ ప్రపంచ చాంపియన్‌షిప్ బెర్త్ సాధించారు. -
ల్యాప్‌టాప్ చోరీ.. ఐటీ ఇంజనీరుకు సంకెళ్లు
బెంగళూరు: అతడు ఐటీ ఇంజనీరు. అయినా ఎందుకో తప్పుదారి ఎంచుకున్నాడు. తన స్నేహితుడి ల్యాప్ టాప్ ను చోరీ చేశాడు. ల్యాప్‌టాప్ చోరీ చేసిన ఆ యువకుడిని మంగళవారం బెంగళూరు మారతహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన స్నేహితులు సతీశ్, వెంకటశేషారెడ్డిలు నగరంలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఇటీవల సతీశ్... వెంకటశేషారెడ్డికి చెందిన ల్యాప్‌టాప్‌ను తస్కరించాడు. పైగా తనకేమీ తెలియదన్నట్టు వ్యవహరించాడు. ఈ విషయంపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో సతీశే ల్యాప్‌టాప్‌ను చోరీ చేసినట్లు తేలింది. దాంతో మంగళవారం అతన్ని అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
మేయర్ హత్య కేసులో సాక్షి హత్యకు కుట్ర
సతీష్‌ను టార్గెట్ చేసినట్లు పోలీసుల గుర్తింపు న్యాయవాదుల బేరాలు.. రూ.5 లక్షల సుపారి? కేసు నమోదుపై ఖాకీల దృష్టి చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన సాక్షిని మట్టుబెట్టడానికి నిందితులు కుట్ర పన్నినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగా బేరానికి ఓ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో మరో వ్యక్తి కొన్ని రోజులు రెక్కీ నిర్వహించినట్లు పేర్కొంటున్నారు. ఈ విషయంపై నిందితులపై కేసు నమోదు చేయడానికి దృష్టి సారించినట్టు సమాచారం. 2015 నవంబరు 17న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోకి వచ్చిన దుండగులు మేయర్ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్‌ను హత్య చేశారు. ఇందులో చింటూ సహా 22 మంది నిందితులు ఉన్నారు. హత్య జరిగిన సమయంలో దుండగుల్ని అడ్డుకున్న కొంగారెడ్డిపల్లెకు చెందిన సతీష్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. అతను తృటిలో తప్పించుకున్నాడు. ఈ కేసులో ఏకైక ప్రత్యక్ష సాక్షి ఇతనే. అతన్ని మట్టుబెడితే కేసులో సాక్ష్యం చెప్పే వారు ఎవరూ ఉండరని నిందితులు భావించారని, దీంతో సతీష్‌ను హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. గత ఏడాది బంగారుపాళ్యంలో దారి దోపిడీలు చేస్తూ పట్టుబడ్డ రాజేష్, మురళి అనే వ్యక్తులు పీడీ యాక్టు కింద కడప సెంట్రల్ జైలు ఉన్నారు. సతీష్‌ను చంపడానికి కొందరు వీరిని సంప్రదించగా తాము చిన్నపాటి దోపిడీలు చేసుకుంటున్నామని, హత్యలు చేయలేమని చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కొందరు తవణంపల్లెకు చెందిన బత్తల రామచంద్రను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఓ హత్య కేసులో కడప జైలులో శిక్ష అనుభవిస్తూ పారిపోయిన బత్తల రామచంద్రను కాణిపాకం పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సమయంలో సతీష్‌ను చంపడానికి రామచంద్ర రెక్కీ నిర్వహించాడని, ఇతనితో ఇద్దరు న్యాయవాదులు బేరసారాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి పూతలపట్టుకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త సుపారీగా రూ.5 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. -
ప్రాణం తీసిన పాలిషింగ్ యంత్రం
మునగపాక: పాలిషింగ్ మిషన్ మీద పడ డంతో గాజువాక దరి వడ్లపూడికి చెందిన మద్దాల సత్యారావు (సతీష్)(35) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. సత్యారావు మార్బుల్ పాలిషింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలోని ఒంపోలు గ్రామానికి చెందిన దాసరి వెంకటరావు నివాసంలో మంగళవారం పాలిషింగ్ పనులు చేస్తుండగా ఆ మిషన్ సత్యారావుపై పడింది. దీంతో సత్యారావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సత్యారావు కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబానికి ఆధారమైన సత్యారావు మృతి చెందడంతో తమకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సత్యారావుకు భార్య లక్ష్మి ఉంది. సత్యారావు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఏఎస్ఐ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంటగలుస్తున్న పెద్దల సభ గౌరవం !
-
తెలుగు రాష్ట్రాల్లో విస్తృత కార్యక్రమాలు
‘తానా’ అధ్యక్షుడు సతీష్ వేమన రాజమహేంద్రవరం సిటీ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు రాష్ట్రాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నదని ఈ సంఘం అధ్యక్షుడు (2017) సతీష్ వేమన పేర్కోన్నారు. బుధవారం చైతన్యస్రవంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన టీడీపీ నాయకుడు గన్ని కృష్ణ ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ తానా 2017 మే 28తో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. ఏటా జూలైలో నిర్వహించే ఉత్సవాలను ఈసారి మే 28నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాలలో తానా కార్యాక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. గన్ని సతీష్‌కు మొక్కను అందజేశారు. ఆయన వెంట సినీ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఉన్నారు, -
సిబిరాజ్‌తో రమ్యానంబీశన్ రొమాన్స్
యువ నటుడు సిబిరాజ్‌తో రొమాన్‌సకు సిద్ధం అవుతున్నారు నటి రమ్యానంబీశన్. ఈ మలయాళీ భామ నటించిన చిత్రాలు విజయం సాధిస్తున్నా కోలీవుడ్‌లో అవకాశాలు మాత్రం అడపాదడపానే వరించడం గమనార్హం. అయితే తమిళంతో పాటు మలయాళంలోనూ నటించడంతో రమ్యానంబీశన్ బిజీగానే ఉన్నారని చెప్పవచ్చు. ఆ అమ్మడు కోలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం సేతుపతి. ఇది మంచి విజయాన్నే అందుకుంది. కాగా సమీపకాలంలో మోహన్‌లాల్‌కు జంటగా నటించిన పులిమురుగన్ ఘన విజయాన్ని సాధించింది. ఇకపోతే యువ నటుడు సిబిరాజ్ కట్టప్పావ కానోం చిత్రాన్ని పూర్తి చేసి తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. తన తదుపరి చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తికి దర్శకత్వం అవకాశం కల్పించారు. ఈయన విజయ్ అంటోని హీరోగా నటించిన సైతాన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారన్నది గమనార్హం. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. సిబిరాజ్ హీరోగా నటించే చిత్రం తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన క్షణం చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కనుందన్నది గమనార్హం. ఇందులో సిబిరాజ్‌కు జంటగా నటి రమ్యానంబీశన్ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు సతీష్ ముఖ్య పాత్రను పోషించనున్నారు. దీన్ని నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. -
నయీం వార్తలు చదివి..
- వ్యాపారులకు బెదిరింపులు కల్వకుర్తి: ఈజీ మనికోసం ఓ యువకుడు గ్యాంగ్ స్టర్ నయూం ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీంకు సంబంధించిన వార్తలు చదివి అదే స్థాయిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. అనుకున్న వెంటనే పలువురు వ్యాపారులను డబ్బు ఇవ్వాలని బెదిరించాడు. ప్రసారమాధ్యమాల్లో నయీం ప్రధాన అనుచరుడిగా వినిపించిన శేషన్న పేరును వ్యాపారులను బెదిరించడానికి ఉపయోగించుకున్నాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాలకు చెందిన సతీష్ సులభంగా డబ్బు సంపాదించడం కోసం చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. నయీం అనుచరుడు శేషన్న పేరుతో మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు వ్యాపారులను బెదిరించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన కల్వకుర్తి పోలీసులు గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈతకెళ్లి ఇద్దరు యువకుల మృతి
కోహిర్ మండలం మద్రి గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సతీష్(18), శ్రీనివాస్(19) అనే ఇద్దరు యువకులు నారింజవాగులో ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చలివాగులో యువకుడు గల్లంతు
-
చలివాగులో యువకుడు గల్లంతు
మొగుళ్లపల్లి మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన వంగా సతీష్(19) అనే యువకుడు టేకుమట్ల చలివాగు దాటుతుండగా గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం బంధువులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సదాశివపేట: మెదక్ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని సదాశివపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పద్మనాభ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని(19)ని అదే ప్రాంతానికి చెందిన సతీష్ గత కొంత కాలంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. అతన్ని ప్రేమించేందుకు యువతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఆమెపై కక్ష కట్టాడు. ఈ రోజు కళాశాలకు వెళ్తున్న సమయంలో అదును చూసుకొని కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు నిందితున్ని పట్టుకోవడానికి యత్నించేలోపే అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యల చేపడుతున్నారు. -
వాగులో పడి వ్యక్తి గల్లంతు
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలంలోని ముత్యాలంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా మండల పరిధిలో భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వదర ప్రవాహ చేరికతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పాలెంవాగు గ్రామానికి చెందిన సతీష్ గల్లంతయ్యాడు. కాగా.. ఇదే మండలంలోని చందంపేటలో పిడుగుపాటుకు ఐదు మేకలు మృతిచెందాయి. -
ఈ దొంగ కోటీశ్వరుడు..
- 6 కిలోల బంగారం - రూ.5 కోట్ల వజ్రాలు - రూ.2 కోట్ల డబ్బు బంజారాహిల్స్ ఆరు కిలోల బంగారు ఆభరణాలు.. రూ.5 కోట్ల విలువ చేసే వజ్రాభరణాలు.. రూ.2 కోట్ల నగదు.. మొత్తం 28 దొంగతనాలు.. ఇదీ గజదొంగ కర్రి సతీష్‌రెడ్డి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోరి చేసిన సొత్తు. పోలీసుల దర్యాప్తులో విస్మయం గొలిపే కేసులు వెలుగు చూసున్నాయి. విశాఖకు చెందిన కర్రి సతీష్‌రెడ్డి 2007లో మొదలుపెట్టి.. 2013 వరకు స్థానికంగానే దొంగతనాలకు పాల్పడ్డాడు. 2014లో మకాంను హైదరాబాద్‌కు మార్చాడు. సంపన్నులు నివాసం ఉండే బంజారాహిల్స్ రోడ్ నంబర్ -14లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ చీఫ్ సెక్రటరీ హరిహరన్ నివాసంలో మొట్టమొదటి దొంగతనం చేశాడు. ఆ ఇంట్లో రూ.5కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు దొంగిలించి 2016 వరకు దొరక్కుండా పోలీసులకు సవాల్ విసిరాడు. సూర్యాపేట పోలీసులకు ఇటీవల సతీష్ చిక్కడంతో ఈ దొంగతనం కేసులన్నీ వెలుగు చూశాయి. బంజారాహిల్స్పోలీస్స్టేషన్ పరిధిలోనే మొత్తం ఎనిమిది ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డాడు. రోడ్ నంబర్ -12లోని ఎమ్మెల్యేకాలనీలో నాలుగు దొంగతనాలు చేశాడు. మొత్తం 13 దొంగతనం కేసుల్లో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై చిట్టా రూపొందించారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు దొంగతనం కేసుల్లో నిందితుడు. చోరీ చేసిన సొత్తును వైజాగ్‌లో ఓ రిసీవర్‌కు ఇచ్చేవాడు. అడ్డికి పావుశేరు చందంగా సదరు రిసీవర్ ఈ దొంగ తెచ్చిన సొత్తులో పావుశాతానికి ధర కట్టి మిగతాది నొక్కేసేవాడు. ముఖ్యంగా ఖరీదైన వజ్రాలకు లేకుండానే నొక్కేసినట్లు తేలింది. పోలీసులతో చెట్టాపట్టాల్... దొంగతనాల్లో ఆరితేరిన సతీష్ పోలీసులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాడు. వైజాగ్‌లో ఓ ఏఎస్ఐతో సంబంధాలు పెట్టుకొని చోరీలకు పాల్పడ్డట్లు తేలడంతో ఆ ఏఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. తరచూ దొంగతనాలు చేస్తూ చెడ్డపేరు తెచ్చుకుంటున్న సతీష్‌ను జనజీవన స్రవంతిలో కలపాలని ఏలూరుకు చెందిన ఓ సీఐ చేరదీశాడు. తన పోలీసు జీపుకు డ్రై వర్గా పెట్టుకున్నాడు. ఓ రోజు రాత్రి ఒంటిగంట సమయంలో ఆ సీఐ కుటుంబ సభ్యులను ఇంటి వద్ద దింపి వస్తూ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మనవరాలు ఇంటికే కన్నం వేశాడు. చోరీ చేసిన సొత్తును పోలీస్ జీపులోనే వేసుకొని పరారయ్యాడు. అంతేకాదు మొన్న సూర్యాపేటలో కారు దొంగతనం చేసి, తిరిగి ఆ కారును పెట్టే క్రమంలో పోలీసు జీపు సైరన్ విని వారిని తప్పించుకునే క్రమంలో పక్కింట్లోకి దూకాడు. ఊరికే ఉండటం ఎందుకనుకున్నాడో ఏమో ఆ ఇంటికి కూడా కన్నం వేసి బంగారు ఆభరణాలు తస్కరించాడు. పోలీసులను తప్పించుకునే క్రమంలోనూ సతీష్ దొంగతనాలకు పాల్పడ్డట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాహనానికి ప్రెస్... సతీష్ తన హోండా ఆక్టీవా వాహనానికి ప్రెస్ అని స్టికర్ తగిలించుకున్నాడు. దీంతో పోలీసులు ఎక్కడా ఆపేవారు కాదు. దొంగతనాలకు వెళ్లినప్పుడు మాత్రం ఆ బైక్‌ను తీసుకెళ్లేవాడుకాదు. ఎక్కడ దొంగతనం చేసినా ఆటోలో వెళ్లడం అలవాటు. అంతేకాదు అర్ధరాత్రి ఒంటిగంటకు తెరిచి ఉన్న కిటికీలను లక్ష్యంగా చేసుకునేవాడు. తనతోపాటు తెచ్చుకునే మూడు పనిముట్లతో కిటికీ ఊచలు తొలగించి లోనికి ప్రవేశించి గ్లౌజ్‌లు తొడక్కొని చోరీలకు పాల్పడుతూ ఒక్క ఆధారం కూడా పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడం సతీష్ అలవాటు. ఈ ఘరానా దొంగకు సెంటిమెంటు కూడా ఎక్కువే. ఎక్కడ దొంగతనానికి వెళ్లినా తెల్లవారుజామున 4 గంటలకు చోరీ చేసిన వస్తువులతో ఆ ఇంట్లో నుంచి బయట పడతాడు. ముందే చోరీ వస్తువులు మూటకట్టుకున్నా సరే 4గంటలయ్యే వరకు అక్కడే ఉండిపోవడం ఇతడి సెంటిమెంట్ అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. -
పోలీసుల అదుపులో సినార్‌వ్యాలీ కేసు నిందితుడు
కిటికి గ్రిల్స్ తొలగించి భారీ దొంగతనాలకు పాల్పడుతూ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులకు మూడేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న గజ దొంగ ఎట్టకేలకు నల్లగొండ పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో సంచలనం సృష్టించిన పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా తేలింది. దీంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకొని రెండు రోజుల నుంచి విచారిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు చెందిన సతీష్(27) గత ఏప్రిల్ 28వ తేదీన ఫిలింనగర్ సమీపంలోని సినార్‌వ్యాలీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఎస్.శర్మ నివాసంలోకి చొరబడి రూ.కోటి విలువ చేసే ఆభరణాలతోపాటు రూ.5 లక్షల నగదు తస్కరించాడు. ఇందులో పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతూనే నల్లగొండలో ఓ కారును ఎత్తుకుపోయాడు. అయితే, అందులో అతడు వదిలిపెట్టిన చిన్న స్లిప్‌తో పోలీసులు అతడిని పట్టుకోగలిగారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 దొంగతనం కేసుల్లో నిందితుడని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. చదివింది నాలుగో తరగతే.. సతీష్ చదివింది నాలుగో తరగతి. చోరీ సొత్తును వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఆ సొమ్ముతో జల్సాలకు పాల్పడుతున్నట్లు తేలింది. పటాన్‌చెరువులో భూములు కొనుగోలు చేసినట్లు తె లుస్తోంది. విచారణలో మరిన్ని దొంగతనాల గుట్టు రట్టయ్యే అవకాశాలున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలడంతో క్రైం పోలీసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. -
కార్డులు పంచేందుకు వెళ్తూ పెళ్లి కొడుకు మృతి
నర్సింహులపేట: వారం రోజుల్లో పెళ్లి.. అంతా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.. పెళ్లికి అతిధులను ఆహ్యానించేందుకు స్వయంగా పెళ్లి కొడుకే బందువుల ఇంటికి వెళ్లాడు.. అంతలోనే ఆ పెళ్లింట పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కార్డులు పంచేందుకు బంధువుల ఇంటికి వెళ్తున్న పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దముప్పారం సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన సతీష్(24) వివాహం ఈనెల 27వ తేదీన జరగాల్సి ఉంది. శుభ లేఖలు పంచేందుకు సతీష్, స్నేహితుడు సురేష్(24)తో కలిసి బైక్‌పై వరంగల్ జిల్లా నర్సింహులపేటకు వచ్చాడు. పెద్దముప్పారం సమీపంలో వారి వాహనాన్ని తొర్రూర్ డిపోనకు చెందిన బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. -
‘సినీటీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్‌లో అవినీతి’
తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్‌లో రూ.2 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని సంఘ సభ్యులు సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనియన్‌కు చెందిన రూ.2 కోట్లు క్యాన్సిలేషన్ చేసి యూనియన్ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి ఎల్ రాజేంద్రప్రసాద్, కోశాధికారి పీవీవీ ప్రసాద్ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. రూ.2 కోట్లతో నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామం వద్ద 35 ఎకరాల కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి ఎకరం విలువ రూ.3.30 లక్షలు మాత్రమే ఉండగా వారు మాత్రం రూ.5.30 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. యూనియన్ డబ్బును ఈ విధంగా దుర్వినియోగం చేశారని చెప్పారు.ఈ మేరకు ఫిర్యాదు పత్రంపై సంఘం సభ్యులు 60 మంది సంతకాలు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పోలీసులను కలిసిన వారిలో ఉన్నారు. -
ప్రేమ వివాహం
ప్రేమ సమాజంలో ఎదిగిన సతీష్ సింహాచలం దేవస్థానంలో శ్యామలతో కల్యాణం రూ. 25వేలు నగదు అందించిన సమాజం పెద్దలు డాబాగార్డెన్: ప్రేమ సమాజం.. ఎంతో మంది అనాథల జీవితాల్లో వెలుగులు పంచుతోంది. జీవితంలో వారికి ఎదగటానికి అవకాశాలు కల్పిస్తోంది. వారి వివాహం దగ్గరుండి చేయించి అండగా నిలబడుతోంది. అలా రెండేళ్ల ప్రాయంలో ప్రేమ సమాజంలో చేరి జీవితంలో ఎదిగిన ఓ యువకుడి వివాహం గురువారం రాత్రి జరగనుంది. అతనికి ప్రేమ సమాజం పెద్దలు, ప్రముఖుల ఆశీర్వాదాలు బలంగా ఉన్నాయి. రెండేళ్ల వయసున్న మగబిడ్డ, నెలల వయసున్న ఆడ శిశువు(అతని సోదరి)ను 1993లో ఓ కానిస్టేబుల్ ప్రేమ సమాజంలో చేర్పించారు. ప్రేమ సమాజం పెద్దలు వారికి సతీష్, ఆషా అని నామకరణం చేశారు. అప్పటి నుంచి వారు అక్కడే పెరిగారు. సతీష్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న, పొందిన పిల్లల్లో సతీష్ ఒక్కడే పీజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం సిరిపురం వరుణ్‌మోటార్స్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 7వ తేదీ వరకు ప్రేమ సమాజంలోనే తలదాచుకున్న సతీష్‌కు గురువారం రాత్రి 10.10 గంటలకు సింహాచలం దేవ స్థానంలో బొబ్బిలికి చెందిన శ్యామలతో వివాహం కానుంది. ఏజ్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రతినిధి డాక్టర్ ఎన్ఎస్ రాజు వద్ద నర్సింగ్ అసిస్టెంట్‌గా ఆమె పనిచేస్తోంది. సతీ ష్కు ప్రేమ సమాజం అధ్యక్షుడు కంచర్ల రాం బ్రహ్మం, కార్యదిర్శ ఎంవీ రమణ, మాజీ కార్యదర్శి గణపతిరావు, కార్యవర్గ సభ్యులు రూ.25 వేల నగదు, ప్రేమసమాజం కార్యవర్గ సభ్యుడు, రిటైర్డ్ వుడా పరిపాలనాధికారి ఎస్కే త్రిపాఠి వివాహ సామగ్రి అందజేశారు. -
సీపీఎం నేతలపై దుండగుల దాడి
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. సుందరయ్యనగర్‌కు చెందిన సీపీఎం నేతలు ఆంజనేయులు, సతీష్‌పై మంగళవారం దుండగులు గొడ్డళ్లతో దాడి చేశారు. గమనించిన స్థానికులు ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచ్చారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్థల వివాదమే హత్యకు కారణమై ఉంటుందని తెలుస్తుంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ జిల్లా సీపీఎం నాయకులు ఆస్పత్రి ఎదుట ధర్నాకి దిగారు. -
జల్సాలకు అలవాటుపడి...
కరీంనగర్: జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టిన ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 6 తులాల బంగారు ఆభరణాలతో పాటు 250 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్లో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వరపర్తి సతీష్(30) కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే జల్సాలకు అలవాటు పడిన సతీష్ దొంగతనాల బాట పట్టాడు. ఈ నెల 5 న కరీంనగర్లో జరిగిన దొంగతనం కేసులో అతన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టి అతన్ని అరెస్ట్ చేశారు. -
కొడుకును రైలు కింద పడేశాడు
ధర్మవరం: తాగిన మత్తులో కన్నకొడుకును రైలు కింద విసిరాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో చిన్నారి తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ రైల్వేస్టేషన్లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని కదిరి రైల్వేగేట్ సమీపంలో నివాసముంటున్న మురళి, శంకరమ్మ దంపతులు ఇనుప వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు . ఈ క్రమంలో ఇనుప వస్తువలను ఏరుకోవడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చిన వారు తమతో పాటు నాలుగేళ్ల చిన్నారి సతీష్‌ను కూడా వెంట తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న మురళి రైలు కదులుతున్న సమయంలో సతీష్‌ను రైలు కింద పడేశాడు. ఈ ప్రమాదంలో చిన్నారి చేతి వేళ్లు తెగిపోయి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన రైల్వే పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరించారు. మురళిని అదుపులోకి తీసుకున్నారు. -
సెమీస్‌లో సతీశ్ ఆసియా సీనియర్ బాక్సింగ్
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత బాక్సర్లకు మిశ్ర మ ఫలితాలు ఎదురయ్యాయి. సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... మదన్‌లాల్ (52 కేజీలు), కుల్దీప్ సింగ్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. సెమీస్‌కు చేరిన సతీశ్ కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. సియోవుష్ జుకురోవ్ (తజకిస్తాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సతీశ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయం సాధించాడు. సతీశ్ పంచ్‌ల ధాటికి తట్టుకోలేని జుకురోవ్ పోటీపడకుండా తప్పించుకోవడంతో రిఫరీ అతనికి రెండుసార్లు హెచ్చరించారు. అయినా జుకురోవ్ అదే విధంగా వ్యవహరించడంతో రిఫరీ మూడో రౌండ్ పూర్తికాకుం డానే బౌట్‌ను నిలిపివేసి సతీశ్‌ను విజేతగా ప్రకటించారు. మదన్‌లాల్ 0-3తో షఖోబిదిన్ జోయ్‌రోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో; కుల్దీప్ 1-2తో కిమ్ హ్యోంగ్కు (కొరియా) చేతిలో ఓడిపోయారు. శుక్రవారం సెమీఫైనల్స్ జరుగుతాయి. -
సంపాదనలో 10 శాతం రైతుల సంక్షేమానికి...
మండ్య : తాను నటించిన సినిమాల ద్వారా అందుతున్న ఆదాయంలో పది శాతాన్ని రైతుల సంక్షేమానికి వెచ్చించనున్నట్లు శాండిల్‌వుడ్ నటుడు నీనాసం సతీష్ తెలిపారు. మంగళవారం మండ్యలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తాను నటించిన రాకెట్ సినిమాలో వచ్చే లాభంలో పది శాతాన్ని ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు అందించనున్నట్లు చెప్పారు. ఇకపై తన ఆదాయంలో పది శాతాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తానని పేర్కొన్నారు. మండ్య జిల్లాలో నెలకొన్న కరువు కారణంగా పంటలు సక్రమంగా పంటలు పండక, పండిన పంటలు చేతికి రాక, వచ్చినా పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధకరమని అన్నారు. ఒక రైతు బిడ్డగా. తాను ఇక్కడే పుట్టి పెరిగానని, రైతుల కుటుంబంలో ఎన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో తాను అనుభవించానని, అందు కోసమే తనకు వచ్చే లాభంలో 10 శాతాన్ని ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇస్తానని అన్నారు. పరభాషా చిత్రాలను కన్నడలోకి డబ్బింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. -
భయపెడుతూ.. కవ్విస్తూ...
‘మంత్ర’ చిత్రంలో ‘మాహా..మాహా...’అంటూ ఒక పక్క తన అందంతో కవ్విస్తూనే మరోవైపు భయపెట్టారు చార్మి. మళ్లీ ‘మంత్ర-2’తో ఆమె ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. గ్రీన్ మూవీస్ పతాకంపై పి.శౌరిరెడ్డి, వి.యాదగిరిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.వి.సతీశ్ దర్శకుడు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఇప్పటి వరకూ వచ్చిన హారర్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుంది. స్క్రిప్ట్‌ను నమ్మి చార్మి ఈ చిత్రంలో నటించారు. ఆద్యంతం సాగే సస్పెన్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది’’ అని నిర్మాత తెలిపారు. చార్మికి మంచి పేరు తీసుకువచ్చే చిత్రమిదని, ఆమె అభినయం ఈ చిత్రానికి హైలైట్ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, ఛాయాగ్రహణం: తనికెళ్ల రాఘవేంద్ర, సహ నిర్మాతలు: బోనాల శ్రీకాంత్, రవితేజ, కె.సురేశ్, సమర్పణ: శ్రీనివాసనాయుడు చామకూరి. -
ఆరేళ్ల వనవాసం...
రోజూ కనబడే కథలు లింగుబాయి వయసు 50. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని కొమ్ముగూడలో ఆమె నివాసం. ఆరేళ్ల క్రితం ‘ఊరి నుంచి వెళ్లిపొమ్మ’ని ఊళ్లో జనాలు గగ్గోలు పెట్టడంతో తప్పక ఊరికి మైలు దూరంలో చెట్ల కిందే తలదాచుకుంది. లింగుబాయి చేసిన నేరమేమిటంటే.. కుష్టువ్యాధి బారిన పడటం. జబ్బు చేసిందని జాలి తలచడం మాని, సాటి మనుషులే ఆమెను ఉన్న ఇంటి నుంచి, ఊరి నుంచి దూరంగా వెళ్లగొట్టారు. వేరే గత్యంతరం లేక ఊరికి దూరంగా పొలాల్లో బిక్కుబిక్కు మంటూ ఆరేళ్లపాటు బతుకుతో పోరాడుతూ... ఇటీవలే ఊరు చేరింది. లింగుబాయి ఏం చేస్తోందో చూడ్డానికి వెళితే.. పూర్తిగా పాడుబడ్డ ఇంటిని బాగు చేసుకుంటూ కనిపించింది. యోగక్షేమాలు అడిగితే.. ‘‘పెద్ద సార్ల పుణ్యాన ఇన్నాళ్లకు ఇల్లు చేరాను. ఇల్లు చూడండ్రి ఎట్లా పడావు పడిందో.. ఊరికి దూరమైనంక నా భర్తను పోగొట్టుకున్నాను. కొడుకు సదువు ఆగమైపోయింది. పరాయి వాళ్లకు కూడా నాలాంటి కష్టం రాకూడద’ని కన్నీరు పెట్టుకుంది. ఊరొదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని అడిగితే.... ‘‘ఆరేళ్ల క్రితం చేతులకు పుండ్లు అయినవి. ఎంతకు తగ్గేవి కాదు. అందరు పెద్దరోగం అంటే, దావఖాన్లకు పోయిన. మందులు ఇచ్చిండ్రు. తక్కువ కాలేదు. ఈ రోగం ఎందుకొచ్చిందని బాధపడుతుంటే... ఊళ్ల ఇంకో బాధ మొదలైంది. మా గూడెం నుంచి పిల్లను ఎవ్వరూ చేసుకోవడం లేదని, పిల్లను చూడ్డానికి వచ్చి, ఊళ్లో నాకీ రోగం ఉందని తిరిగిపోతున్నారని, అక్కడి పిల్లను ఇక్కడికి ఎవ్వరు ఇస్తలేరని ఊరొళ్లు అన్నరు. నీకు రోగం ఉన్నందునే మా గూడెంలో పెండ్లిళ్లు అయితలేవన్నరు. వేరే ఎక్కడికైన పోయి ఉండమన్నారు. కండ్లకు నీళ్లచ్చినవి.. కాని ఊరి కోసం తప్ప లేదు. నాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్త, నా పెద్ద బిడ్డ గంగుబాయి పొలం దగ్గర ఒక గుడిసె వేసిండ్రు. అక్కడే పడుకునేదాన్ని. రోజూ నా బిడ్డ గంగు సద్ది నా కొడుకుతో పంపేది. అది తిని అక్కడ్నే గడిపేదాన్ని. నా ఇంటికి పోవాలనిపిచ్చేది. కాని ఊరోళ్లు ఏమన్న అంటరేమో అనే భయంతో పోయేదాన్ని కాదు. పొర్లి పొర్లి ఏడ్చిన... నేను ఊరి నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి నా భర్త లచ్చు నా మీద బెంగ పెట్టుకున్నడో ఏమో.. అప్పటి నుంచి కల్లు తెగ తాగేవాడంట. నేను అడవి పట్టిన రెండు నెలలు కూడా గడవకముందే నా భర్త చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు ఊరోళ్లను బతిమాలుకున్న. ఒక్కసారి చూసిపోతా.. అని ఏడ్చిన. ఆళ్లు ఒప్పుకుంటే చూసెటందుకు వచ్చిన. ఏందీ మాకీ కష్టం అని చాల ఏడ్చిన. నా భర్త శవాన్ని చూసినంక, వెంటనే వెళ్లి పొమ్మన్నరు. ఆయన్ను మట్టి చేశాక, కర్మ చేసి వెళ్లిపోతానన్న. వినలా... (కన్నీరు తుడుచుకుంటూ) ఏం జేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక్కదాన్నే గుడిసెలో కూర్చుని ఏడ్చేదాన్ని. అదిలబాద్ సార్లకు ఎవ్వరు చెప్పిండ్రో ఎమో గాని వాళ్లు నా దగ్గరికి వచ్చినారు. అన్నం తినిపించారు. నాతో కలిసి తిన్నారు. వాళ్లు ఇంకా పెద్ద సార్లను తీసుకొ చ్చిండ్రు. ఎవరెవరో వచ్చి నన్ను ఊర్లకు తీసుకుపోయిండ్రు. ఆరేళ్ల తర్వాత మల్ల నాయింటి లోపలికి అడుగుపెట్టిన. మూలన పడ్డ ఇల్లును మంచిగా చేసుకుంటున్న. గా సార్ల మేలు ఎన్నటికి మరువనయ్యా. వాళ్లు రాకుంటే నేను చచ్చేదాక ఆ ఊరవతలనే పడి ఉండేదాన్ని. నా బిడ్డ కష్టం సుఖం చూసుకోవడానికి కూడా నోచుకోకపోయేదాన్ని. నా గోస ఎవ్వరికి రావద్దు బిడ్డా...’’ అంటూ ఇంటిని బాగు చేసుకోవడంలో మునిగిపోయింది లింగుబాయి. - సతీష్, జన్నారం, అదిలాబాద్ జిల్లా -
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
గోదావరిఖని: గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట 2010 నవంబర్ 6న రాత్రి పవర్‌హౌస్‌కాలనీకి చెందిన మాజీ నేరస్తుడు, రౌడీషీటర్ పిడుగు సతీశ్ (24)ను కత్తులతో పొడిచి హత్య చేసిన నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం జిల్లా 6వ అదనపు న్యాయమూర్తి వెంకటకృష్ణయ్య తీర్పు చెప్పారు. సతీష్ హత్య కేసులో మొత్తం ఏడుగురిపై 302, 324, 148 సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా ఏ1గా ఉన్న కట్టెకోల సుధీర్ 2012 జూన్ 10వ తేదీన పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఏ4గా ఉన్న నరేందర్‌పై నేరం రుజువు కాలేదు. ఏ6గా ఉన్న టీకే శ్రీనివాస్ అనే మాజీ నేరస్తుడు కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్నాడు. మిగిలిన నీలపు రవిబాబు, ఆయన సోదరుడు నీలపు వంశీకృష్ణ, ధనాల శేఖర్, దాసరి ప్రేమ్‌కుమార్‌పై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ఒక్కోక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. హతుడు, హంతకులు స్నేహితులే.. పిడుగు సతీష్ ను పథకం ప్రకారం నమ్మించి హత్య చేసింది అతని స్నేహితులే. సతీష్, అతని స్నేహితులు గొడవలు, ఘర్షణలతో కా లం గడిపేవారు. 2010 జనవరి 8వ తేదీన కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గోదావరిఖని పవర్‌హౌస్‌కాలనికి చెందిన నాగరాజు, ఆయన తండ్రి శంకర్‌ను దారుణంగా హత్య చేశారు. తర్వాత బెయిల్‌పై వచ్చిన సతీష్ లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. ఓ రోజు సతీష్‌కు చెందిన బంధువు విషయంలో స్నేహితుడైన కట్టెకోల సుధీర్ అసభ్యంగా ప్రవర్తించడంతో సహించ ని సతీష్ సుధీర్‌ను హెచ్చరించాడు. దీంతో సుధీర్ తన స్నేహితులను పిలిపించుకుని సతీష్‌తో కలిసి గోదావరిఖని బస్టాండ్ కాలనీ వద్ద మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న సతీష్‌ను దారుణం గా హత్యచేశారు. -
వేధిస్తున్నాడని.. భర్త మర్మాంగం కోసింది!
హైదరాబాద్: అనుమానంతో వేధిస్తున్న భర్తను అంతమొందించేందుకు ఏకంగా అతని మర్మాంగాన్ని కోసిందో భార్య. బాధితుడు ప్రస్తుతం చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు. సోమవారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ బి.మహేందర్ కథనం ప్రకారం... మెహిదీపట్నం అంబేద్కర్‌నగర్ లో సతీష్(35), భార్య (30), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. సతీష్ కూలీ కాగా.. భార్య ప్రైవేటు ఆస్పత్రిలో హౌస్‌కీపింగ్ పని చేస్తోంది. సతీష్ భార్యను అనుమానించడంతో పాటు మద్యానికి బానిసై వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక భార్య అతడిని అంతమొదించాలనుకుంది. ఆదివారం రాత్రి పీకలదాక తాగివచ్చి నిద్రలోకి జారుకున్న భార్తను చంపేందుకు ఇంట్లోని కొడవలితో మర్మాంగాన్ని కోయడానికి యత్నించింది. గాయపడ్డ సతీష్ కేకలు వేయడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకొని అదే రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి మూలుగుతున్న శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తాళాలు పగులగొట్టి చూడగా సతీష్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే 108కు పోలీసులు సమాచారం ఇచ్చి అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
నా భర్త నాకు కావాలి
అత్తవారింటి ముందు బైఠాయించిన వివాహిత గుంటూరు రూరల్ : ఓ వివాహితను అత్తింటి వారు కొట్టి ఇంట్లో నుంచి గెంటెయ్యడంతో గత నాలుగు రోజులుగా అత్తింటి ముందు బైఠాయించి నిరసనకు దిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పొన్నూరు ప్రాంత పరిధిలోని గాజులవారి వీధికి చెందిన రాజ్యలక్ష్మికి గుంటూరు పాతగుంటూరు బాలాజీనగర్ 8వ లైన్‌కు చెందిన కేదారి సతీష్‌తో పెద్దల సమక్షంలో 2008 ఆగస్టు 24న వివాహం జరిగింది. సతీష్ అదే ప్రాంతంలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహించేవాడు. రాజ్యలక్ష్మి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటుంది. వివాహానంతరం భార్య, భర్తలు సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. మూడు నెలల తరువాత భర్త సతీష్ అన్న కేదారి రమేష్ నిత్యం మద్యం తాగి తల్లిదండ్రులైన సాంబశివరావు, భిక్షావతిలను వేధిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో సతీష్ గుంటూరులోని తల్లి దండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. అప్పటినుంచి సతీష్ పాతగుంటూరులో ఇంటర్నెట్ సెంటర్ నడుపుకుంటూ ఉండగా, భార్య రాజ్యలక్ష్మి హైదరాబాద్‌లోనే ఉంటోంది. భర్త సతీష్ హైదరాబాద్‌కు వచ్చి వెళుతుండేవాడు. ఆరు నెలల క్రితం భర్తకు ఫోన్‌చేయగా, తాను ఇక హైదరాబాద్ రానని, తనకు విడాకులు కావాలని అనడంతో అవాక్కయింది. ఈ క్రమంలోనే తన భార్య కాపురానికి రావడం లేదంటూ సతీష్ కోర్టు ద్వారా నోటీసును పంపించాడు. ఈనెల 3న సతీష్ అన్న రమేష్ మద్యం బాగా తాగి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి రాజ్యలక్ష్మి హుటా హుటిన గుంటూరులో అత్తగారింటికి వచ్చేసరికి అక్కడ గుడి ఆదిలక్ష్మి అనే యువతి ఉంది. ఆమె ఎవరు అని ప్రశ్నించడంతో సతీష్ భార్య అని, రెండో వివాహం చేసుకుంటున్నట్టు చెప్పారు. దీంతో రాజ్యలక్ష్మి పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 5న రాజ్యలక్ష్మి తిరిగి అత్తింటికి వెళ్లగా అత్త భిక్షావతి, మామ సాంబశివరావు, ఆడపడుచులైన చింతల శ్రీలత, చింతల శ్రీను ఆమెను బయటకు గెంటేశారు. దీంతో రాజ్యలక్ష్మి గత నాలుగు రోజులుగా అత్తింటి ముందే బైఠాయించి నిరసనకు దిగింది. నాలుగురోజులుగా అత్తింటి ముందు బైఠాయించిన రాజ్యలక్ష్మి విషయం తెలిసి పాతగుంటూరు సీఐ మొయిన్ సోమవారం అక్కడకు వెళ్లి రాజ్యలక్ష్మిని కలిసి మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రేమ పెళ్లికి నిరాకరించారని ఆత్మహత్య
చెన్నారావుపేట: ప్రేమ.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వలచిన యువతి దక్కదని ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ఉప్పరపల్లికి చెందిన తాటికాయుల సతీష్(22) బీటెక్ పూర్తి చేశాడు. హన్మకొండలోని ఓ ప్రైవేటు చిట్‌ఫండ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటి సమీపంలోని అమ్మయితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. రెండు నెలల క్రితం ఇద్దరి కుటుంబాల్లో విషయం తెలిసింది. అమ్మయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. అమ్మయి తనకు దక్కదని సతీష్ మనస్తాపం చెందాడు. హన్మకొండ నుంచి సోమవారం రాత్రి ఉప్పరపల్లికి వచ్చాడు. గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిం చాడు. స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యలో సతీష్ వుృతి చెందా డు. అవ్మూరుు అన్నదవుు్మలు, వారి బంధువు లు సతీష్‌ను కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సతీష్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. -
సతీష్‌ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
-
హర్షవర్థన్ మృతికి సంతాపంగా శాంతి ర్యాలీ
-
హర్షవర్థన్ మృతికి సంతాపంగా శాంతి ర్యాలీ
హైదరాబాద్ : సీనియర్ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌రావు మృతికి సంతాపంగా సోమవారం విద్యార్థులు శాంతి ర్యాలీ చేపట్టారు. విద్యార్థినిని ర్యాగింగ్ చేయొద్దన్న పాపానికి హనుమాన్ టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో రాంకోఠికి చెందిన హర్షవర్థన్‌పై సతీష్ కోడ్కర్ అనే విద్యార్థి దాడి చేయటంతో హర్షవర్థన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా హర్షవర్థన్ అంతిమ యాత్రలో నిన్న వందలాదిమంది విద్యార్థులు, బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం వైఖరిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల గేట్లు తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థి మృతి పట్ల తమకు ఆవేదన, ఆందోళన ఉందని కళాశాల అధ్యాపకులు తెలిపారు. కాగా హర్షవర్థన్‌పై దాడి చేసి అతడి మృతికి కారణమైన సీనియర్ విద్యార్థి సతీష్ కోడ్కర్ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతడిని రహస్య ప్రాంతాలకు తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే సతీష్ అరెస్ట్‌ను పోలీసులు ధ్రువీకరించలేదు. నిందితుడిని ఇవాళ లేదా మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. -
ప్రశ్నించినందుకు ప్రాణం తీశాడు
అమ్మాయిని ఎందుకు టీజ్ చేస్తున్నావన్న జూనియర్‌పై పిడిగుద్దులు కురిపించిన సీనియర్ విచక్షణరహితంగా కొట్టడంతో క్లాస్‌రూంలో అపస్మారక స్థితిలో పడిపోయిన హర్షవర్ధన్‌రావు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య నాలుగు గంటలు పోరాడి మృత్యుఒడిలోకి.. నగరంలోని ప్రగతి మహా విద్యాలయలో ఘటన సాక్షి, హైదరాబాద్: అమ్మాయిని ఎందుకు టీజ్ చేస్తున్నావని అడిగిన పాపానికి పిడిగుద్దులు కురిపించాడు.. సీనియర్‌నన్న తలబిరుసుతో జూనియర్ విద్యార్థిని ఇష్టానుసారం కొట్టాడు.. చివరికి ఆ విద్యార్థి 4 గంటలపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి ప్రాణాలు వదిలాడు! నగరం నడిబొడ్డున సుల్తాన్‌బజార్ లోని ప్రగతి మహా విద్యాలయలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాంకోఠికి చెందిన ఆటోమొబైల్ వ్యాపారి నర్సింగ్‌రావు రెండో కుమారుడు కోట హర్షవర్ధన్ రావు(18) ప్రగతి మహా విద్యాలయంలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కాలేజీలో జియాగూడకు చెందిన సతీశ్ కోడ్కర్(19) బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామ సమయంలో విద్యార్థులు క్లాస్ రూమ్‌లోంచి బయటికి వచ్చారు. తరగతి గదిలో హర్షవర్ధన్, మరో విద్యార్థిని ఉన్నారు. ఇదే సమయంలో రూమ్ నంబర్ 211లో ఉన్న సతీశ్... 203 రూమ్‌లో ఉన్న హర్షవర్ధన్ తరగతి గదికి వచ్చాడు. వస్తూనే విద్యార్థినిని తన మాటలతో వేధించాడు. ‘‘ఆమెను ఎందుకు కామెంట్ చేస్తున్నావు’’ అని హర్షవర్ధన్ నిలదీశాడు. దీంతో సీనియర్లనే ప్రశ్నిస్తావా.. అంటూ హర్షవర్ధన్‌పై సతీశ్ విచక్షణరహితంగా పిడిగుద్దులు కురిపించాడు. మెడ, తల వెనుక భాగం, ఛాతీపై బలంగా గుద్దడంతో హర్షవర్ధన్ అక్కడే అపస్మారక స్థితిలో పడి పోయాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆయనను బయటికి తీసుకువచ్చి, ఆటోలో సమీపంలోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్ చేశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్సకు నిరాకరించారు. వెంటనే హర్షవర్ధన్‌ను నాంపల్లి కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా చికిత్సకు నిరాకరించారు. చివరికి పోలీసుల జోక్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. సుమారు 4 గంటల పాటు ఆయన్ని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హర్షవర్ధన్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జరిగిన వివాదంపై ఆరా తీశారు. తెలివైన విద్యార్థి.. హర్షవర్ధన్‌కు తెలివైన విద్యార్థిగా పేరుంది. తండ్రి సంపాదనకు చేదోడువాదోడుగా ఉండేం దుకు పగటి పూట చదువుకుంటూ.. రాత్రి పూట అపోలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు. హర్షవర్ధన్ తల్లి ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు హుటాహుటిన కేర్ ఆసుపత్రికి చేరుకుని గుండెలు పగిలేలా రోదించారు. హర్షవర్ధన్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. సతీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మేమేం చేస్తాం: కాలేజీ కరస్పాండెంట్ విద్యార్థుల ఘర్షణపై కాలేజీ కరస్పాండెంట్ రాజేశ్ సి షాను వివరణ కోరగా.. ‘ఇద్దరు కొట్టుకుంటే మేమేం చేస్తాం..’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. గతంలో కూడా ఈ కాలేజీలో గొడవలు జరిగాయి. ఇటీవల ఓ విద్యార్థి ఈవ్ టీజింగ్ కేసులో జైలుకు వెళ్లాడు. గతంలో ర్యాగింగ్ కేసు సంచలనం సృష్టించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళనలు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. -
అమ్మాయిలపై కామెంట్లు.. అడ్డుకున్నందుకు హత్య!
అమ్మాయిలను ఏడిపించడం వల్ల విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణ.. ఓ విద్యార్థి మరణానికి కారణమైంది. హైదరాబాద్ కోఠి ప్రాంతంలోని డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థి హత్య కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. సతీష్ అనే విద్యార్థి అదే కళాశాలకు చెందిన కొంతమంది అమ్మాయిలపై కామెంట్లు చేశాడని, బీకాం రెండో సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ రావు అనే విద్యార్థి అతడిని అడ్డుకున్నాడని సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్ తెలిపారు. ఇలా అడ్డుకున్నందుకు సతీష్‌కు కోపం వచ్చి, హర్షవర్ధన్ రావుపై దాడి చేశాడన్నారు. ఛాతీపైన, మెడమీద బలమైన గాయాలు కావడంతో హర్షవర్ధన్ మృతిచెందినట్లు ఏసీపీ వివరించారు. మృతుడు హర్షవర్ధన్ రావు రాంకోఠి నివాసి కాగా, నిందితుడు సతీష్ హైదరాబాద్‌లోని జియాగూడ ప్రాంతానికి చెందినవాడని వివరించారు. ఈ ఘటనపై పోలీసులకు హర్షవర్ధన్ రావు తండ్రి ఫిర్యాదు చేశారు. -
ప్రాణాలు తీసిన సరదా
సాలూరు: ఎంతో ఆనందంగా దీపావళి జరుకోవాలని ఆ పిల్లలు ఆశించారు. దానికి కోసం ముందుగానే బాణసంచా తయారీ ప్రారంభించారు. వారు తయారు చేసుకుంటున్న బాంబులకే బలైపోవడంతో ఆ ఇళ్లలో విషాదం అలుముకుంది. పట్టణంలోని చిన్నవీధిలో బిరుసు అప్పలస్వామి పక్క ఇంటి మేడపైకి అతని కుమారుడు బిరుసు కామేశ్వరరావు, అతని స్నేహితుడు గోక సతీష్ శనివారం ఉదయం దీపావళి బాంబులు తయారు చేసుకునేందుకు వెళ్లారు. గోడబాంబు తయారు చేసేందుకు కామేశ్వరరావు అధిక మొత్తంలో మందుగుండును కట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో అతని రెండు చేతులూ ఛిద్రమైపోయాయి. పక్కనే ఉన్న అతని తమ్ముడు బిరుసు గణేష్(9)కు ముఖం, ఛాతీలపై గాయాలయ్యాయి. బాలుడిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అలాగే బాంబుల తయారీ చూద్దామన్న ఆసక్తితో వెళ్లిన మాచర్ల అనిల్‌కుమార్(16)కు కూడా ముఖం, ఛాతీలపై గాయాలయ్యాయి. వైద్యుల సూచన మేరకు అతన్ని విశాఖపట్నం తరలిస్తుండా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనలో ఐదో తరగతి చదువుతోన్న గోక సతీష్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అలాగే అక్కడే ఉన్న పల్లికల సుధీర్, రాకూరి ప్రదీప్, గోలిపల్లి రాజేష్‌కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం క్షతగాత్రుల వైద్యానికి అవసరమైన మందులను బయట కొనుక్కోవాలని చెప్పడంతో బాధితుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజన్నదొరతో చెప్పారు. అలాగే 108 వాహనంలో డీజిల్ వేయించమంటున్నారని, పేదలమైన తమకు అదెలా సాధ్యమవుతుందని బాధితుల తరఫున వార్డు కౌన్సిలర్ మజ్జి అప్పరావు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే రాజన్నదొర నేరుగా జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మృతు డు గణేష్ తల్లి దండ్రులు అప్పలస్వామి, కళావతిలను పరామర్శించారు. వీరి మరో కుమారుడు బిడ్డ కామేశ్వరరావు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన వైద్యసేవలు అందేలా చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పరామర్శిం చిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు ఉన్నారు. విచారణ జరిపిన ఏఎస్పీ విషయం తెలుసుకున్న పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ చిన్నవీధిలోని ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి, విచారణ జరిపారు. పట్టణ ఎస్ఐ మారూఫ్, సీఐ దేముళ్లు ఘటన జరిగిన తీరుతెన్నులను వివరించారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మందుల కొరత, వైద్యుల తీరుపై విచారణ జరిసిస్తాం పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడికి ప్రభుత్వాస్పత్రి వైద్యులను రప్పిం చారు. ఆస్పత్రిలో మందులు లేవని చెప్పడంపై, వైద్యుల పనితీరుపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయని మండిపడ్డారు. చిన్నపాటి ప్రమాదానికి కూడా కనీస ప్రథమ చికిత్స కూడా చేయకుండా రిఫర్ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని ఈ విషయమై విచారణ జరిపిస్తామన్నారు. రూ 5.లక్షలు పరిహారం ఇవ్వాలి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహా రం ఇవ్వాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్య సేవలు అందివ్వాలని వైద్యులను ఆదేశించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పరిహారం అందివ్వాల్సిన అవసరముందన్నారు. వయసు తక్కువగా ఉందని సాయమందించేందుకు వెనుకాడకూడదని, ఆపద్భం ధు పథకంతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందేలా చూస్తామన్నారు. ఆడుకుంటున్నాడనుకుని... నీటికి వెళ్లాను...’ మృతుడు గణేష్ తల్లి కళావతి రోదన చూసి అక్కడి వారు చలించిపోయారు. ‘ఆడుకుంటున్నాడని.. నీటికి వెళ్లా ను..’ ఇంతలో ఘోరం జరిగిపోయిందంటూ ఆమె రోది స్తున్న తీరు అందరికీ కంట నీరు తెప్పించింది. మరోబిడ్డ కామేశ్వరరావునైనా కాపాడండయ్యా అంటూ ఆ దంపతులు రోదించడం కలిచివేసింది. వీరికి మరో ముగ్గురు పిల్లలుండగా అందులో పెళ్లీడు వయసున్న ఆడపిల్ల ఉంది. అందొచ్చాడనుకుంటే... అలాగే మరో మృతుడు అనిల్‌కుమార్ తల్లి మరియమ్మ వేదన వర్ణనాతీతంగా మా రింది. ‘భర్త దూరమైనా నిబ్బరంతో పిల్లలను పెంచుకున్నాను. అందుకొచ్చావనుకుంటే అందనంత దూరం వెళ్లిపోయావా’ అంటూ ఆమె గుండెలవిసేలా రోదించా రు. ఆమెకు ఇద్దరు కుమారులు. -
ఫొటోగ్రాఫర్ దారుణహత్య
బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం రాత్రి ఓ ఫొటోగ్రాఫర్ దారుణ హత్యకు గురయ్యాడు. వాహన క్లచ్ వైరుతో ఉరేసి కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సీఐ బానోతు బాలాజీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెల్లంపల్లి : తాండూర్ మండల కేంద్రానికి చెందిన ఎల్లేరి సతీశ్, తన భార్య శుక్లతో కలిసి రెండున్నర నెలల క్రితం బెల్లంపల్లికి వలసవచ్చాడు. ఓ వాహన షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్న సతీశ్ పట్టణంలోని అశోక్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. తాండూర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ కొడిపే నర్సింహులు(25)తో కొంతకాలం నుంచి సతీశ్‌కు పరిచయం ఉంది. తాండూర్‌లో పక్కపక్క ఇళ్లలోనే నివసించడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పాత పరిచయం దృష్ట్యా నర్సింహులును సతీశ్ ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన ఇంటికి రమ్మన్నాడు. స్నేహితుడు పిలవడంతో అదేరాత్రి అతడి ఇంటికి నర్సింహులు చేరుకున్నాడు. చీకటి పడడంతో నర్సింహులు రాకను ఎవరూ గమనించలేదు. అప్పటికే చుట్టుపక్కల నివసిస్తున్నవారు నిద్రలోకి జారుకోవడం, బస్తీ పరిసరాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారడంతో అదే అదునుగా భావించిన సతీశ్, అతడి భార్య శుక్ల, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కలిసి పథకం ప్రకారం వాహన క్లచ్ వైరుతో నర్సింహులు మెడకు ఉరేసి దారుణంగా హత్య చేశారు. అప్పటికే మెలకువ వచ్చి ఇంటి యజమాని దుర్గం బాపు బయటకురాగా గమనించిన సతీశ్, శుక్ల, మరో ఇద్దరు ఇంట్లో నుంచి చాకచక్యంగా పారిపోయారు. అనుమానంతో బాపు వెళ్లి చూడగా నర్సింహులు మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అదే రాత్రి సీఐ బా లాజీ, వన్‌టౌన్ ఎస్సై ఎన్.సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ప్యాంట్ జేబులో కండోమ్స్ ప్యాకెట్లు లభించాయి. దీం తో వివాహేతర సంబంధం నేపథ్యంలో నర్సిం హులు హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం డీఎస్పీ కె.ఈశ్వర్రావు హత్య జరిగిన స్థలాన్ని పరిశీ లించారు. నిందితులు పరారీలో ఉన్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
సరికొత్త కథనంతో...
‘‘మా చిత్రకథ రొటీన్‌గా ఉంటుంది. కానీ, కథనం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది’’ అని నరేన్ చాలా నిజాయతీగా చెబుతున్నారు. ఆయనను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ సాయిరత్న ఆర్ట్స్ సమర్పణలో అభినవ ఆర్ట్ ఫిలింస్ పతాకంపై ఓబులమ్మ నిర్మిస్తున్న చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో హీరోను ఎంపిక చేయాల్సి ఉంది. హీరోయిన్గా ముంబయ్‌కి చెందిన మోడల్ అర్షిఖాన్ని తీసుకున్నారు. మోహన్, చిన్ని సతీష్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. చిత్రవిశేషాలను నరేన్ తెలియజేస్తూ -‘‘దర్శకత్వం, ప్రొడక్షన్ శాఖలో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ నెలాఖరున షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో టాకీ పూర్తి చేస్తాం’’ అని చెప్పారు. -
కన్నబిడ్డకు కష్టమొచ్చిందని..
కరెంట్ షాక్‌కు గురైన కుమారునికి కాలు, చేయి తీసేశారని మనస్తాపం తిండీతిప్పలు మాని ప్రాణాలు విడిచిన తల్లి యాదమరి: ఒక్కగానొక్క కుమారు డు కావడంతో అల్లారుముద్దుగా పెం చుకుంది. ఆశలన్నీ అతనిపైనే పెట్టుకుంది. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తున్న తరుణంలో కరెంట్ తీగల రూపంలో పిడుగులాంటి కష్టమొచ్చి పడింది. విద్యుత్ షాక్‌కు గురైన కొడుకుకు కాలు, చేయి తీసేయడంతో తట్టుకోలేకపోయింది. తిండీ తిప్పలు మానే సి చివరకు తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన యాదమరి మండలం కోణాపల్లెలో చోటుచేసుకుంది. కోణాపల్లె గ్రామానికి చెందిన మలర్‌కుడి, మైకల్ దంపతులకు సతీష్(15), బేబిషాలిని పిల్లలున్నారు. గ్రామంలో ఇటీవల కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. కొత్త ఇంట్లో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటున్నా రు. ఈ తరుణంలో గత నెల 12వ తేదీ సతీష్ మిద్దెపై ఆడుకుంటుం డగా చేతికందే ఎత్తులో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమంగా ఉండడం తో వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ఎడమకాలు, కుడి చెయ్యి తొలగించారు. దీన్ని చూసి మలర్‌కుడి మనస్తానానికి గురైంది. ఆ రోజు నుంచి తిండీ తిప్పలు మానే సింది. పది రోజుల క్రితం కళ్లు తిరిగి పడిపోయింది. ఆస్పత్రిలో చేర్పిం చినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో ఆమెను జీడీనెల్లూరు మండలం నెల్లెపల్లెలో ఉన్న అమ్మగారింటికి పంపా రు. జ్వరం వస్తుండడంతో మంగళవారం మధ్యాహ్నం తిరుపతికి తీసుకెళుతుండగా దేవళంపేట వద్దకు రాగానే పడిపోయి ప్రాణాలు వది లింది. కోణాపల్లెలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే.. ఇంటిపై 11 కేవీ విద్యుత్ తీగలు ఉండడంతో వాటిని తొలగించాలని మలర్‌కుడి దంపతులు పలుమార్లు ట్రాన్స్‌కో అధికారులను కోరారు. వారు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రాసలీలలు
-
జీలుగుమిల్లిలో కానిస్టేబుల్ రాసలీలలు
- పోలీస్ క్వార్టర్స్ అడ్డగా శృంగార కార్యకలాపాలు - కెమెరాలో బంధించిన స్థానికులు - క్వార్టర్స్‌ను పరిశీలించిన డీఎస్పీ సుబ్బరాజు జంగారెడ్డిగూడెం : జీలుగుమిల్లి పోలీస్ క్వార్టర్స్ అడ్డాగా ఒక కానిస్టేబుల్ సాగిస్తున్న రాసలీలలు వెలుగులోకి రావడం సంచలనం రేకెత్తించింది. జీలుగుమిల్లి నుంచి కామయ్యపాలెం వైపు రహదారిలో రోడ్డు పక్కనే ఉన్న ఈ క్వార్టర్స్‌లో పట్టపగలే కానిస్టేబుల్ పి.సతీష్ రాసలీలలు సాగిస్తున్నాడని తెలుసుకున్న స్థానికులు కొందరు రహస్యంగా కెమెరాతో చిత్రీకరించారు. దీంతో వ్యవహారం గుప్పుమంది. గతంలో ఇతని తీరుపై ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో తాజా ఘటనపై డీఎస్పీ సుబ్బరాజు స్పందించి శనివారం పోలీసు క్వార్టర్స్‌ను పరిశీలించారు. కానిస్టేబుల్ వ్యవహారశైలిపై విచారణ చేశారు. అతనిపై స్థానికులు ఇటువంటివే అనేక ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చన్నారు. ఇవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై విచారణాధికారిగా జంగారెడ్డిగూడెం సీఐ అంబికా ప్రసాద్‌ను నియమించినట్టు చెప్పారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. కాగా సదరు కానిస్టేబుల్ పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తూ జీలుగుమిల్లికి బదిలీపై వచ్చారు. కానిస్టేబుల్ వ్యవహారంపై గ్రామస్తుల్లో కూడా కొంత అసహనం ఏర్పడినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే రాసలీలలు సాగిస్తున్న సతీష్‌పై నిఘా పెట్టి గుట్టురట్టు చేశారని చెబుతున్నారు. క్వార్టర్స్‌ను పరిశీలించిన డీఎస్పీ సుబ్బరాజు -
పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రాసలీలలు
-
పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రాసలీలలు
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కానిస్టేబుల్ కీచకుడిగా మారాడు. ఓ మహిళతో రాసలీలలు చేస్తూ పట్టుబడ్డాడు. జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సతీష్.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను పోలీస్ క్వార్టర్స్‌కు పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారాన్ని వీడియోలో చిత్రీకరించడంతో పై అధికారులు విచారణకు ఆదేశించారు. మహిళల పట్ల సతీష్ ప్రవర్తన సరిగాలేదని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అతని ఆగడాలు భరించలేక ఒకరు ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జంగారెడ్డి గూడెం డీఎస్పీ సుబ్బరాజు.. సతీష్ రాసలీలల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారించి పైఅదికారులకు నివేదిక పంపిస్తామని, సతీష్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాని చెప్పారు. -
అల్లుడి చేతిలో మామ హత్య
హత్యపై ఏఎస్పీ విచారణ.. కోల్‌సిటీ : గోదావరిఖనిలో అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన ఘటనపై ఏఎస్పీ పకీరప్ప బుధవారం విచారణ చేపట్టారు. వివరాలు వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక గంగానగర్‌కు చెందిన వేమ అంకూస్(50) ఆర్జీ-1లోని 11ఏ గనిలో జనరల్ మజ్దూర్‌గా పని చేస్తున్నాడు. అంకూస్‌కు భార్య సరోజన, నలుగురు కూతుళ్లు. రెండో కూతురు సుమలతను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలోని సీసీసీకి చెందిన నరెడ్ల సతీశ్‌కు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. సతీశ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తొలి ఏకాదశి పండుగకు రెండో కూతరు, అల్లుడు అంకూస్ ఇం టికొచ్చారు. అయితే సతీశ్ కొద్ది రోజులుగా ఆటో నడపకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ విషయమై మా మ, అల్లుడిని మంగళవారం రాత్రి నిలదీశాడు. కోపోద్రిక్తుడైన సతీశ్ మామపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన అత్త, భార్య, మరదలును గదిలో బంధించి.. మామ తలపై ఇటుకలతో దాడి చేయడంతో అంకూస్ అక్కడిక్కడే ప్రాణాలొది లాడు. నిందితుడి ని ఎస్సై మురళీ అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదుతో సతీశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి సీఐ నారాయణ తెలిపారు. -
బీజేపీ అధ్యక్ష పదవిపై ఊహాగానాలకు తెర సారథి సతీష్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఆ పార్టీ సీని యర్ నాయకుడు సతీష్ ఉపాధ్యాయను అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన చేసింది. ఉపాధ్యాయ ప్రస్తుతం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) స్థాయీసమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు . దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్ నియోజకవర్గం నుంచి ఆయన కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికల నాటినుంచి రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా ఉన్న డా. హర్షవర్ధన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి కేంద్ర మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రి పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ పదవికి రాజీనామా చేస్తారని, ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తారని పార్టీ వర్గాలు భావించా యి. అధ్యక్ష పదవి రేసులో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకుల పేర్లు వినిపించాయి. అయితే పలువురు కేంద్ర నేతలతో పాటు ఆర్.ఎస్.ఎస్.తో ఉన్న సత్సంబంధాల కారణంగా సతీష్‌ను ఈ పదవి వరించింది. ఢిల్లీలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో సతీష్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. సతీష్ 1981 వరకు ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా ఉన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) పోటీచేసి విజయకేతనం ఎగురవేశారు. అప్పటినుంచీ ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. 1984-85లో ఆయన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆ తరువాత బీజేపీ యువ మోర్చా కార్యదర్శి, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తదితర పదవీ బాధ్యతలను నిర్వర్తించారు. 2012 మున్సిపల్ ఎన్నికలలో ఆయన మాలవీ యనగర్ నుంచి పోటీచేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. సౌత్ ఎమ్సీడీ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్‌గా పని చేసిన తరువాత స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం ఈ సందర్భంగా సతీష్ మీడియాతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ దేశ ప్రజలు బీజేపీకి ఇచ్చిన తీర్పును ముందుకు తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశముందని ప్రశ్నించగా ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుందన్నారు. భవిష్య కార్యాచరణను కేంద్ర అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. కాగా సతీష్ ఉపాధ్యాయ నియామకం పట్ల బీజేపీ రాష్ర్ట శాఖ హర ్షం వ్యక్తంచేసింది. ఇదిలాఉంచితే సతీష్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా. వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడతారు సతీష్ ఉపాధ్యాయను బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నియమించడంపట్ల ఆ పార్టీ నాయకుడు, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ)లో సభానాయకుడు సుభాష్ ఆర్య హర్షం వ్యక్తంచేశారు. సతీష్ పార్టీలో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడతారన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సామాజిక మీడియా గొప్పదనం ఆయనకు తెలుసన్నారు. వాటిని వినియోగించుకోవడంద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. -
అయిదు వందల రూపాయల పాకెట్ మనీతో...
‘‘అయిదువందల రూపాయల పాకెట్‌మనీతో వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్లాను. కష్టాల్ని కూడా ఇష్టంగా స్వీకరించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాను. భవిష్యత్తులో సినీ రంగంలో కూడా రాణిస్తాను’’ అని డా. కేవీ సతీష్ చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘యమలీల 2’ చిత్రం ద్వారా ఆయన హీరోగా పరిచయమవుతున్నారు. నేడు సతీశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘ఎప్పటికైనా నా సొంత డబ్బుతో సినిమా తీసి, హీరో కావాలనేది నా లక్ష్యం. కుటుంబ కథాచిత్రాలు తీయడంతో మంచి నేర్పు ఉన్న కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందనుకున్నా. ఆయన ఇప్పుడు కుదరదన్నా, కన్విన్స్ చేశాను. ఆయన మూడు, నాలుగు కథలు చెబితే, నాకు ‘యమలీల 2’ నచ్చింది. ఇందులో యమధర్మరాజుగా మోహన్‌బాబు, చిత్రగుప్తుడుగా బ్రహ్మానందం అయితేనే బాగుంటుందని కృష్ణారెడ్డి అన్నారు. లక్కీగా వీళ్లు కూడా ఒప్పుకోవడంతో ఈ చిత్రం ప్రారంభమైంది. అందరి సహకారంవల్ల బాగా నటించగలుగుతున్నా. ఎడిటర్ గౌతంరాజుగారైతే ‘పది సినిమాల అనుభవం ఉన్నవాడిలా చేశావ్’ అని ప్రశంసించారు. మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఇకనుంచి ప్రతి ఏడాదీ నేను హీరోగా మా సంస్థ నుంచి ఓ సినిమా వస్తుంది’’ అని చెప్పారు. కర్నాటకలో నేను స్థాపించిన కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల దాదాపు 60 మందికి కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని, కేన్సర్ రోగులకు సహాయం చేస్తున్నామని, హెచ్ఐవి సోకిన పిల్లల కోసం అనాథ శరణాలయం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సతీష్ తెలిపారు. తన మాతృభాష తెలుగు కాబట్టి, తెలుగువారి కోసం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలన్నదే తన ఆశయం అని ఆయన పేర్కొన్నారు. -
సెన్సార్ చేతి రాత
చేతిరాతను చూసి తలరాతను నిర్ణయిస్తారు చాలామంది... ప్రస్తుతం చేతిరాతను చాలామంది మర్చిపోయారు. వరంగల్‌కి చెందిన సతీశ్ మాత్రం వందల కొద్దీ పేజీలు చేతితోనే రాస్తున్నారు. అది కూడా అచ్చంగా ప్రింట్లో అక్షరాల్లాగ. డిగ్రీ చదువుతుండగానే చలనచిత్రరంగంలోకి ప్రవేశించారు సతీశ్. ‘‘నా అక్షరాలు బాగున్నాయని ప్రశంసించిన చిత్రదర్శకుడు ఆదినారాయణరావు, చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించారు. చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేస్తూ, నా చేతిరాతకు పనికి వచ్చే పని చేయడానికి ప్రయత్నించాను. సినిమా సెన్సార్‌కి స్క్రిప్ట్ రైటర్లు చాలా తక్కువమంది ఉంటారు. నాకు చిత్ర పరిశ్రమలో అంతగా అవకాశాలు కలిసిరాని సమయంలో, అల్లాణి శ్రీధర్ గారి ఫిల్మీ మీడియా సంస్థలో సెన్సార్ స్క్రిప్ట్ వర్క్ పని అప్పచెప్పారు. నేను ఆ వర్క్ అంతా చేతితో రాసి ఇచ్చాను. ఆది చూసి ఆయన నన్నెంతగానో ప్రోత్సహించారు’’ అని తన సినీరంగ ప్రవేశం గురించి తెలిపారు సతీశ్. దర్శకత్వశాఖలో అవకాశాలు లభించక, ఆర్థికం ఇబ్బందుల నుంచి బయటపడటానికి సతీశ్ ఎంచుకున్న మార్గం సెన్సార్ స్క్రిప్ట్‌ను స్వయంగా చేతితో రాయడం. సతీశ్చేతిరాత చూసిన ‘7్టజి సెన్స్’ చిత్ర దర్శకుడు పెద్ది కె. ఈశ్వర్ ఆ సినిమాకి సెన్సార్ స్క్రిప్ట్ రాయమని కోరటంతో సతీశ్ మొట్టమొదటిసారి సెన్సార్ స్క్రిప్ట్ రాశారు. ఒక సినిమాకి సుమారు 100 - 150 పేజీల వరకు స్క్రిప్ట్ ఉంటుంది. సతీశ్ అదంతా చేతితో రాశారు. ‘‘సతీశ్ చేతి రాత చూసిన తర్వాత ఎన్నో పెద్దపెద్ద సినిమా స్క్రిప్ట్స్ అతనితోనే రాయించాను. అతని చేతి రాత అచ్చు డిటిపి చేసినట్టుగా ఉంటుంది’’ అని ప్రశంసించారు ఎఫ్‌డిసిలో పని చేస్తున్న అనంత్. ‘‘నా చేతిరాత చూసిన దర్శకుడు చంద్రసిద్ధార్థ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా సెన్సార్ స్క్రిప్ట్ పని నాకు అప్పగించారు. సాహసం, అత్తారింటికి దారేది, డికెబోస్, ప్రతినిధి, జెండాపై కపిరాజు, వెల్కమ్ ఒబామా, వీడికి దూకుడెక్కువ... ఇలా అనేక చలనచిత్రాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశాను’’ అంటున్నారు సతీశ్. సతీశ్ చేతిరాత కంప్యూటర్ అక్షరాలు అందంగా ఉండడం వల్ల రెండేళ్లలోనే వందకు పైగా సినిమాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశారు. ఒకవైపు దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే మరో వైపు సెన్సార్ స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉంటున్నారు సతీశ్. ‘‘దర్శకత్వ శాఖలో అవకాశాలు లభించక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అటువంటి వారికి డిటిపి వర్క్ అప్పచెబుతున్నాను. ఒకవేళ నా జీవితంలో నేను సెన్సార్ స్క్రిప్ట్ రాయకుండా ఉండి ఉంటే పరిశ్రమ నుండి తప్పుకునేవాడినేమో!’’ అని చెబుతున్న సతీశ్లోని ఆశావాదాన్ని అందరూ అనుసరిస్తే, ఎప్పటికైనా ఉన్నతస్థాయికి ఎదుగుతారనడంలో సందేహం లేదు. - డా.వైజయంతి -
న్యాయం కోసం నిరాహార దీక్ష
{పేమించి పెళ్లి చేసుకున్నాడు తల్లిదండ్రుల ఒత్తిడితో ముఖం చాటే శాడు పరారీలో అత్తింటివారు భర్త కోసం వివాహిత పోరాటం మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: వారిద్దరూ నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అతను భార్యను పుట్టింటి దగ్గర వదిలి వెళ్లాడు. ఆ తర్వాత భర్త తనను తీసుకెళ్లేందుకు ఇంటికి రాకపోవడం, ఫోను పనిచేయకపోవడంతో ఆమె అత్తారింటికి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇరుగుపొరుగు వారిని విచారించారు. తన భర్త వేరే వివాహం చేసుకుంటున్నాడని తెలి సి పోలీసులను ఆశ్రయించారు. భర్త కోసం మదనపల్లెలోని అత్తారింటి ముం దు రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. చావనైనా చస్తాను కాని ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని బాధితురాలు స్పష్టం చేస్తున్నారు. ఆమె కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు హరిజనవాడకు చెందిన దొరస్వామి, సావిత్రమ్మ దంపతుల కుమార్తె వెంకటలక్ష్మి(25) 2009లో ఎం బీఏ పూర్తి చేశారు. బెంగళూరులో స్నేహితుల వద్ద ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా అదే సమయంలో మదనపల్లె అయోధ్యనగర్‌లో నివాసముంటున్న గుర్రప్ప, లలితమ్మ దంపతుల కుమారు డు సతీష్(30) ఎంసీఏ పూర్తి చేసుకుని బెంగళూరులో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. 2010లో వెంకటలక్ష్మి, సతీ ష్ పరిచయమయ్యారు. వారు అప్పటి నుంచే ప్రేమలో పడ్డారు. తర్వాత ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. వెంకటలక్ష్మి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. సతీష్ వీకెండ్లో హైదరాబాద్‌కు వెళ్లి వెంకటలక్ష్మితో కలసి వచ్చేవాడు. తర్వాత ఆమె తిరుపతిలో ఉద్యోగంలో చేరారు. ఇదిలా ఉండగా పెద్దల అంగీకారంతోనే పెళ్లి జరగాలని భావిం చి రెండిళ్లలో ప్రేమ విషయాన్ని చెప్పారు. ఇద్దరూ బాగా చదువుకున్నవారు కావడం, ఉద్యోగాలు చేస్తుండడంతో ఇరువైపులా పెద్దలు పెళ్లికి అంగీకరించా రు. ఈ ఏడాది మార్చి 17వ తేదీన పుత్తూరులోని సాయిబాబా ఆలయంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వెంకటలక్ష్మి దళితవర్గానికి చెందిన వారని సతీష్ తల్లిదండ్రులకు తెలిసింది. అమ్మాయిని ఎటువంటి పరిస్థితిలో కాపురానికి తీసుకురాకూడదని, వదిలి వచ్చేయాలని సతీష్‌పై తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. దీంతో అతను వెంకట లక్ష్మిని పుట్టింటిలోనే వదిలి ఉద్యోగానికి వెళ్లిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళతానని మాయమాటలు చెప్పి నమ్మిం చా డు. పదిరోజుల నుంచి ఫోన్ కూడా పనిచేయక పోవడంతో వెంకటలక్ష్మి గురువారం మదనపల్లెలోని భర్త ఇంటి కి చేరుకున్నారు. భర్త, అత్తమామలు ఎవరూ లేరు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో షాక్‌కు గురయ్యారు. ఇరుగుపొరుగు వారిని విచారిస్తే చాలా రోజులుగా ఇక్కడ లేరని, సతీష్‌కు రెండో పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారిస్తామని చెప్పి పంపా రు. అయితే ఆమె నేరుగా భర్త ఇంటికి వెళ్లి నిరాహారదీక్షకు పూనుకున్నారు. భర్త వచ్చేవరకు ఇక్కడే ఉంటానని, చావనైనా చస్తాను కాని ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తేలేదని ప్రతినబూనారు. ఈ విషయమై ఎస్ఐ హనుమంతప్పను వివరణ కోరగా వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయి తే ఆమె నిరాహారదీక్షకు పూనుకున్న విషయం తెలియదన్నారు. విషయాన్ని ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆమెకు తగిన భద్రత ఏర్పాటు చేసి మోసం చేసిన భర్త సతీష్, వారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలించి సమస్య ను పరిష్కరిస్తామన్నారు. -
చున్నీయే ఉరితాడైంది
మెడకు బిగుసుకోవడంతో బాలిక మృతి చున్నీ ఆ బాలిక పాలిట ఉరి తాడైంది. మెడకు బిగుసుకుపోవడంతో తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు. పిల్లి అంజిలయ్య, శాంతమ్మ దంపతుల పిల్లల్లో శివాని(8) స్థానికంగా ఉన్న చైతన్య మోడల్ స్కూల్లో రెండో తరగతి, సతీష్(6) ఎల్కేజీ చదువుతున్నారు. ఒంటిపూట బడులవడంతో మధ్యాహ్నం అక్కాతమ్ముడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు పొలానికి వెళ్లడంతో పిల్లలు ఇంటి వద్దే ఆడుకుంటున్నారు. ఈక్రమంలో శివాని చున్నీని తన మెడకు చుట్టుకోగా.. ఏమైందో ఏమోగానీ.. ఒక్కసారిగా అది బిగుసుకుపోయింది. దీంతో శివాని ఊపిరాడక కిందపడిపోయింది. అక్కను గమనించిన సతీష్ పరుగెత్తుకు వెళ్లి పక్కింట్లో ఉండే పెద్దమ్మ విజయలక్ష్మిని తీసుకొచ్చాడు. ఆమె చున్నీని విప్పగా అప్పటికే శివాని అపస్మారక స్థితికి చేరుకుంది. హుటాహుటిన ఆటోలో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆ బాలిక మృతి చెందిందని వైద్యులునిర్ధారించారు. -
అందమైన మాయ
సతీష్, శీను, కిరణ్, బాలరాజ్ తదితరులు ముఖ్య తారలుగా మణీంద్రన్ దర్శకత్వ పర్యవేక్షణలో నాగరాజు కొట్టె నిర్మించిన చిత్రం ‘అందమైన మాయ’. ఇటీవలే టాకీపార్ట్ పూర్తయ్యింది. ఇందులో ఓ ప్రముఖ హీరోయిన్ ప్రత్యేక పాత్ర చేశారని, పోలూర్ ఘటికాచలం ఇచ్చిన డైలాగ్స్ హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలు చెప్పారు. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య సోమేష్, కథ-దర్శకత్వం: దినకరన్. -
వీఆర్వో టాపర్ సతీష్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఈ ఫలితాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వీఆర్వో విభాగంలో మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన కోటగిరి సతీష్ (హాల్‌టికెట్ నంబర్ 122129713) 97 మార్కులతో జిల్లాస్థాయిలో ప్రథముడిగా నిలిచారు. వీఆర్ఏ కేటగిరీలో కూసుమంచి మండల కేంద్రానికి చెందిన కొమ్ము బాబూరావు (హాల్‌టికెట్ నం. 222100093) 93 మార్కులతో ప్రథమస్థానం పొందారు. చర్ల మండలం ఆర్.కొత్తగూడెంకు చెందిన తిప్పనబోయిన విష్ణునారాయణ వీఆర్వో విభాగంలో రెండో ర్యాంకు, తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన సౌజన్య మూడో ర్యాంకు, బయ్యారం మండలం కొత్తపేట వాసి పాతూరి సందీప్ నాల్గో ర్యాంకు, తల్లాడ మండలం నారాయణపురానికే చెందిన మరో అభ్యర్థి వి. అంకిరెడ్డి ఐదోర్యాంకు సాధిం చారు. తీవ్ర పోటీ నెలకొన్ని వీఆర్వో కేటగిరీలో తొలి 20 ర్యాంకులు సాధించిన వారిలో అత్యధికులు బీసీ-డీ కేటగిరీకి చెందిన వారే ఉన్నారు. టాప్‌లో 20లో బీసీ-డీకి చెందినవారు ఎనిమిది మంది ఉండటం గమనార్హం. వీఆర్ఏ కేటగిరీ లో కూసుమంచికి చెందిన బాబూరావు ప్రథమస్థానంలో నిలిచారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాస్థాయి ర్యాంకులు ఉండవని, గ్రా మాలు యూనిట్‌గా తీసుకుని మెరిట్ లిస్టును ప్రకటిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. తుదిజాబితా కోసం కసరత్తు.. జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ శనివారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో వీఆర్వో, వీఆర్ఏ ఫలితాల సీడీని ఆవిష్కరించారు. వీటి ఆధారంగా ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులు త్వరలో ఉద్యోగ నియామకపత్రాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆది లేదా సోమవారం ఉద్యోగాాలు పొందినవారి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయి. మైదాన, షెడ్యూల్ ఏరియాలో వేర్వేరుగా... ఈ నెల 2న నిర్వహించిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 73,260 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 65,480 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 78 వీఆర్వో పోస్టులకు 62,752 మంది హాజరయ్యారు. 105 వీఆర్ఏ పొఓస్టులకు 2,752 మంది హాజరయ్యారు. అర్హత సాధించిన అభ్యర్థుల వీఆర్వో ఉద్యోగాలకు మైదానప్రాంతంలో ఒక్కో పోస్టుకు ఒకరి చొప్పున (1:1), షెడ్యూల్ ఏరి యాలో 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. వీఆర్ఏ ఉద్యోగాలకు 1:5 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను తయారు చేస్తారు. పనిచేయని సర్వర్లు.. జిల్లాలో ఇంటర్నెట్ సర్వర్లు పనిచేయకపోవడంతో వీఆర్వో, వీఆర్ఏ ఫలితాలు తెలుసుకోవడం కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో అత్యధిక మార్కుల జాబితాను తెలుసుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరకు త్రీజీ సెల్‌ఫోన్స్ సహాయంతో జాబితాను తెలుసుకోవాల్సి వచ్చింది. -
బళ్లారిలో ముసుగు దొంగల బీభత్సం
వైద్యుడి ఇంట్లో రెండు గంటల హల్చల్ 40 తులాల బంగారం, 5 లక్షల నగదు దోపిడీ సాక్షి, బళ్లారి : ముసుగు దొంగలు బళ్లారిలో బీభత్సం సృష్టించారు. వైద్యుడి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో భయబ్రాంతులకు గురి చేసి రెండు గంటపాటూ నిర్బంధంలో ఉంచారు. 40 తులాల బంగారు నగలు, రూ. 5లక్షల నగదు దోచుకొని ఉడాయించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కీళ్లు, ఎముకల వ్యాధి నిపుణుడు, అరుణోదయ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సతీష్ కందుల నగరంలోని హవంబావిలో నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారు జామున 10 మందికి పైగా ముసుగులు ధరించిన దుండగులు కాంపౌండ్ గోడ దూకి వంట గది కిటికీ పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. సతీష్ కందుల తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి సతీష్ కందుల ఉన్నారా? అని ప్రశ్నిస్తూ రాడ్లు, కత్తులు చూపి భయభ్రాంతులకు గురి చేశారు. అరిచినా, ఫోన్ చేసినా చంపుతామంటూ హెచ్చరించారు. తాము ఎలా చెబితే అలా చేయాలని సూచించారు. సెల్ఫోన్లు నీళ్లలో పడవేశారు. బీరువా తాళం తీసుకొని 40 తులాల బంగారం, రూ.5 లక్షలు నగదు దోచుకున్నారు. పక్క గదిలో నిద్రిస్తున్న సతీష్ సోదరుడు సురేష్ గదిలోకి చొరబడి అతన్ని బెదిరించారు. ఇంట్లో ఏమైనా నగదు, బంగారు ఉన్నాయా అని ఆరా తీశారు. తర్వాత వైద్యుడి వదిన ప్రసన్నలక్ష్మి మెడలో ఉన్న మంగళ సూత్రం లాక్కున్నారు. అనంతరం మొదటి అంతస్తులో నిద్రిస్తున్న సతీష్ కందుల గది తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమై ఉడాయించారు. జిల్లా ఎస్పీ చేతన్‌సింగ్ రాథోడ్ , ఏఎస్పీ సీ.కే.బాబా, డీఎస్పీలు రుద్రముని, మురగణ్ణ, సీఐలు, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. జాగీలం చోరీ జరిగిన ఇంటి నుంచి సిరుగుప్ప రోడ్డులో కిలోమీటర్ వరకు వెళ్లి ఆగిపోయింది. అదేవిధంగా నిపుణులు నిందితుల వేలిముద్రలు సేకరించారు. బళ్లారి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం నాల ుగు బృందాలు రంగంలోకి దిగినట్లు ఎస్పీ తెలిపారు. దొంగలు వెళ్లిన తర్వాత తెలిసింది : రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి ఎవరిగదుల్లో వారు నిద్రించారు. నాన్న గది, సోదరుడు గదిలోకి దుండగులు ప్రవేశించి బంగారు, నగదు మొత్తం దోచుకున్నారు. నా గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దొంగలు వెళ్లిపోయే వరకు ఏమి జరిగిందో తెలియలేదు. సెక్యూరిటీని పెట్టుకోలేదు. -డాక్టర్ సతీష్ కందుల -
వ్యాపారులే అతని టార్గెట్
ఒంగోలు, న్యూస్‌లైన్ : బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వారిని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాలనుకున్న మోసగాడి వ్యూహం ఫలించలేదు. పోలీసులకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకోవడంతో బాధితులు ఆర్థికంగా నష్టపోలేదు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా ఆర్ వెల్లూరు గ్రామానికి చెందిన క్రిష్ణం సతీష్ అలియాస్ భద్రాచలం వ్యాపారులను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పెళ్లూరులో అరెస్టు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాసన్ తన చాంబర్లో శుక్రవారం సాయంత్రం మీడియాకు వివరించారు. ఇదీ..జరిగింది క్రిష్టం సతీష్ ఆర్వల్లూరు గ్రామంలో 2001లో ఇంటర్ పూర్తిచేశాడు. ఓ ఫైనాన్స్ వ్యాపారి వద్ద పనిచేస్తూ * 4 లక్షలతో ఉడాయించాడు. అక్కడి నుంచి సేలం సమీపంలోని మేటూరు చేరుకున్నాడు. అక్కడ ఫైనాన్స్ వ్యాపారిగా పరిచయం చేసుకొని *40 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు. అక్కడ పోలీసుస్టేషన్లో ఇతనిపై కేసు నమోదైంది. ఈసారి నెల్లూరు వచ్చాడు. అక్కడ మూడు నెలల పాటు నివాసం ఉన్నాడు. లాభం లేదనుకుని ప్రకాశం జిల్లా న్యూ పెళ్లూరు కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దానికి కేటీఆర్ అండ్ సీఎంఎల్ ఫైనాన్స్, కెమికల్ కంపెనీ అని బోర్డు తగిలిచ్చాడు. కేఆర్టీ, సీఎంఎల్ అనే ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు ఇప్పిస్తుంటానని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను కలిశాడు. విదేశాల్లో చదువుకునేందుకు రుణం ఇప్పించమని కొందరు ఇతడిని వేడుకున్నారు. వారికి ఎంత రుణం కావాలో అడిగి తెలుసుకున్నాడు. వాటికి హామీగా అవసరమైన ఆస్తుల తాలూకా బాండ్లు, ఫైనాన్స్ కంపెనీలకు రాసిచ్చే ఒప్పంద పత్రాలు తీసుకున్నాడు. రుణం మంజూరు కావాలంటే ముందుగా తీసుకునే మొత్తానికి కనీసం రెండు ఇన్స్టాల్మెంట్లు అడ్వాన్సుగా చెక్కులు ఇవ్వాలని నమ్మించాడు. ఇన్స్టాల్మెంట్ మొత్తాన్ని సంస్థ నిర్ణయిస్తుందంటూ ఖాళీ చెక్కులు తీసుకున్నాడు. ఇలా ఇతని వలలో చిక్కుకున్నవారిలో జిల్లాకు చెందిన ఒక టీడీపీ నేత, రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఓ హాస్పిటల్ డెరైక్టర్, తూర్పుగోదావరి జిల్లాలోని ఓ విద్యాసంస్థ యజమాని ఇలా అనేక మంది ఉన్నారు. తమ ఫైనాన్స్ కంపెనీలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తాలూకా బ్లాక్‌మనీ ఉందంటూ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న బిగ్‌షాట్స్‌కు వివరించేవాడు. గుట్టురట్టు ఇలా.. నెలలు గడుస్తున్నా రుణం అందకపోవడం, తమ పత్రాలన్నీ అతని చేతిలో ఇరుక్కుపోవడంతో ఏం చేయాలో పాలుపోని పలువురు తాలూకా సీఐని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సీఐ శ్రీనివాసన్ పెళ్లూరులోని సతీష్ ఇంటిపై తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ పలువురికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 10 సూట్‌కేసుల్లోని పత్రాలను సీజ్ చేశారు. ఖాళీ చెక్కులు కూడా లభ్యమయ్యాయి. అనంతరం నిందితుడిని విచారించగా అసలు విషయాలు బహిర్గతమయ్యాయి. గతంలో కేసులతో పాటు తాను ఏం చేయాలనుకున్నది వివరించాడు. రుణాలు కావాలనుకున్నవారి నుంచి ప్రాసెసింగ్ ఫీజు కింద రుణాన్ని బట్టి * 2 నుంచి * 10 లక్షలు చొప్పున వసూలు చేసుకోవాలనే అతని పన్నాగం బయటపడింది. వారం రోజుల్లో కనీసం పదిమంది నుంచి * 50 లక్షలు వసూలు చేసుకొని పరారీ కావాలనేది నిందితుని ఉద్దేశం. అదృష్టవశాత్తు ఇంతవరకు నిందితుని చేతికి ఒక్క రూపాయి కూడా చేరలేదని సీఐ స్పష్టం చేశారు. కేసును ఛేదించి ప్రజల్లో పోలీసుశాఖకు మంచి పేరు తీసుకొచ్చారంటూ సీఐతో పాటు ఆయన సిబ్బందిని ఒంగోలు టౌన్ డీఎస్పీ పల్లె జాషువా అభినందించారు. ఈ సందర్భంగా బాధితులు పలువురు తాలూకా సీఐ వద్దకు చేరుకుని తమ పేర్లను బయటపెట్టొద్దంటూ వేడుకోవడం గమనార్హం. పోలీసులు స్పందించకుంటే.. పోలీసులు సకాలంలో స్పందించకుంటే కొంతకాలం తరువాత బాధితులే నిందితులుగా మారేవారని కూడా పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఖాళీ చెక్కులపై తన ఇష్టం వచ్చినట్లుగా నగదు రాసుకొని నిందితుడు జిల్లా మార్చి ఎక్కడో ఒకచోట క్యాష్ చేసుకునేందుకు యత్నించేవాడు. చెక్కులు బౌన్స్ అయితే బాధితుల మీదే పోలీసులకు ఫిర్యాదు చేసేవాడు. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను పరిశీలించిన పోలీసులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి
చిగురుమామిడి, న్యూస్‌లైన్ : టాక్టర్ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొన్నాడు. శుక్రవారం మండలంలోని కొండాపూర్‌లో డ్రైవర్ సతీశ్ ట్రాక్టర్‌ను వేగంగా నడిపి గ్రామానికి చెందిన గంట సంధ్య(5)ను ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. గంగిరెద్దులకాలనీలో ఆ చిన్నారి సాయంత్రం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ట్రాక్టర్లో పెళ్లి బృందాన్ని అక్కడ దించిన సతీశ్ తిరిగి గ్రామానికి వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఆడుకుంటున్న సంధ్యను ఢీకొట్టాడు. ఆమె తల పగిలి అక్కడికక్కడే మరణింది. దీంతో పాప తల్లిదండ్రులు సమ్మవ్వ, వెంకటేశ్ వచ్చి చిన్నారి మృతదేహంపై పడి రోదించారు. డ్రైవర్ పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ దేవారెడ్డి తెలిపారు. ట్రాక్టర్‌పై నుంచి పడి... జగిత్యాల రూరల్ : ట్రాక్టర్‌పై నుంచి పడి ఓ వలస కూలీ దుర్మరణం చెందాడు. శుక్రవారం మండలంలోని మోరపల్లిలో మధ్యప్రదేశ్‌కు చెందిన దేవత్ఖాన్(30) ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌పై నుంచి కింద పడి మృతిచెందాడు. ఆరు నెలల క్రితం ఆయన మోరపల్లికి వచ్చి ఇటుక బట్టీల్లో పనికి కుదిరాడు. పొద్దంతా పని చేయగా వచ్చే డబ్బులతో పొట్టపోసుకుంటున్నాడు. ఉదయమే ట్రాక్టర్లో ఇటుక నింపి గ్రామానికి తీసుకువస్తున్నాడు. మూల మలుపు వద్ద ట్రాక్టర్ వేగంగా తిరగడంతో డ్రైవర్ పక్కనే కూర్చున్న దేవత్ఖాన్ అదుపు తప్పి కింపడిపోయాడు. దీంతో ఆయనపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను స్థానికులు జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సరిలాల్ తెలిపారు.