‘కేరాఫ్ కంచరపాలెం, నారప్ప’.. ఇలా నటుడిగా ఇప్పటివరకూ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేసిన నేను ‘ఛాంగురే బంగారురాజా’లో తొలిసారి ఓ కామెడీ రోల్ చేశాను. కామెడీ చేయడం కష్టం అంటుంటారు. కానీ మంచి స్క్రిప్ట్ ఉంటే కామెడీ చేయడం సులభమేనని నాకు అనిపించింది’ అన్నారు కార్తీక్ రత్నం.
సతీష్ వర్మ దర్శకత్వంలో కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి హీరో రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక్ రత్నం మాట్లాడుతూ– ‘‘రంగస్థల నటుడిగా వందకుపైగా నాటకాలను ప్రదర్శించాను. మొదటి నాటకానికే నంది అవార్డు వచ్చింది.
నాలా ఇండస్ట్రీకి వచ్చే కొత్తవారికి రవితేజ, నానీగార్లే స్ఫూర్తి. అలాంటిది రవితేజ నిర్మించిన సినిమాలో నేను హీరోగా నటించడం కలలా ఉంది. కొన్ని కొండ ప్రాంంతాల్లో లభించే విలువైన రంగు రాళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో మెకానిక్ బంగారు రాజా పాత్ర చేశాను. దర్శకుడు సతీష్‌వర్మగారికి రైటింగే బలం. స్పాట్‌లో ఆయన స్క్రిప్ట్‌ను ఇంప్రూవ్ చేస్తుంటారు.
నేను నటించిన ‘శ్రీరంగ నీతులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రకాశ్‌రాజ్, దర్శకుడు ఏఎల్ విజయ్‌లు కలిసి నిర్మిస్తున్న ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ఒప్పుకున్నాను. మరో ఎగ్జైటింగ్‌ప్రాంజెక్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment