comedy roles
-
కామెడీ కథా పాత్రల్లో నటించాలని ఉంది
నటి సాయిపల్లవి ఈ పేరు నటనకు, డాన్స్‌కు చిరునామా అని పేర్కొనవచ్చు. మలయాళంలో ప్రేమమ్ అనే చిత్రంలో టీజర్‌గా నటించి అందరి ప్రశంసలు అందుకున్న అచ్చ తమిళ నటి సాయి పల్లవి. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈమె వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోకుండా, పాత్ర నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం తమిళంలో కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ పతాకంపై శివకార్తికేయన్ హీరోగా నిర్మిస్తున్న అమరన్ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అలాగే తెలుగులో నాగచైతన్య సరసన ఒక చిత్రం చేస్తున్న సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రామయణం చిత్రంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఒక భేటీలో సాయి పల్లవి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకూ వివిధ భాషల్లో రకరకాల పాత్రలు పోషించానన్నారు. ముఖ్యంగా తెలుగులో ఫిదా, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించానని చెప్పారు. అయితే వాటన్నింటి కంటే విభిన్నమైన కామెడీ కథా పాత్రలో నటించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాంటి చిత్రంలో అవకాశం వస్తే భాషా బేధం లేకుండా నటించడానికి రెడీ అని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. -
రవితేజ నిర్మించిన సినిమాలో హీరోగా చేయడం కలలా ఉంది: కార్తీక్ రత్నం
‘కేరాఫ్ కంచరపాలెం, నారప్ప’.. ఇలా నటుడిగా ఇప్పటివరకూ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేసిన నేను ‘ఛాంగురే బంగారురాజా’లో తొలిసారి ఓ కామెడీ రోల్ చేశాను. కామెడీ చేయడం కష్టం అంటుంటారు. కానీ మంచి స్క్రిప్ట్ ఉంటే కామెడీ చేయడం సులభమేనని నాకు అనిపించింది’ అన్నారు కార్తీక్ రత్నం. సతీష్ వర్మ దర్శకత్వంలో కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి హీరో రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక్ రత్నం మాట్లాడుతూ– ‘‘రంగస్థల నటుడిగా వందకుపైగా నాటకాలను ప్రదర్శించాను. మొదటి నాటకానికే నంది అవార్డు వచ్చింది. నాలా ఇండస్ట్రీకి వచ్చే కొత్తవారికి రవితేజ, నానీగార్లే స్ఫూర్తి. అలాంటిది రవితేజ నిర్మించిన సినిమాలో నేను హీరోగా నటించడం కలలా ఉంది. కొన్ని కొండ ప్రాంంతాల్లో లభించే విలువైన రంగు రాళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో మెకానిక్ బంగారు రాజా పాత్ర చేశాను. దర్శకుడు సతీష్వర్మగారికి రైటింగే బలం. స్పాట్లో ఆయన స్క్రిప్ట్‌ను ఇంప్రూవ్ చేస్తుంటారు. నేను నటించిన ‘శ్రీరంగ నీతులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రకాశ్‌రాజ్, దర్శకుడు ఏఎల్ విజయ్‌లు కలిసి నిర్మిస్తున్న ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ఒప్పుకున్నాను. మరో ఎగ్జైటింగ్ప్రాంజెక్ట్ను త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు. -
అలాంటి పాత్రలో నటించాలని ఉంది, కథ కోసం ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి
దక్షిణాది టాప్ హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. చేసింది కొన్ని సినిమాలే అయిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతున్నారామె. అందం, అభినయంతో పాటు అద్బుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆమె ‘ఫిదా’ చేస్తున్నారు. చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా కథా బలమున్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. స్క్రిప్ట్, పాత్ర నచ్చకపోతే పక్కన పెట్టేస్తారు. చదవండి: అయ్యో సుమ కష్టాలు చూశారా! నా వల్ల కాదంటున్న యాంకర్ మొదటి నుంచి సీరియస్ రోల్స్, బాధ్యతతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న సాయిపల్లవి ఈ సారి కొత్తగా కనిపించాలనుకుంటున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నటిగా తనతో తాను కోరుకుంటున్న కొత్త మార్పు గురించి కూడా ప్రస్తావించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నాలో కామెడీ యాంగిల్‌ను ప్రేక్షకులకు చూపించాలని ఉంది. కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్గా చూపించే సరైన కథ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్‌జెండర్.. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను’ ఇక ఇప్పటివరకు గ్లామరస్, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలతో అందరినీ పలుకరించిన సాయిపల్లవిలో కామెడీ యాంగిల్ కూడా ఉందట. అందుకే వీలైనంత కామెడీతో అందరిని నవ్వించే ప్రుయత్నం చేస్తానని సాయి పల్లవి పేర్కొన్నారు. కాగా ఇటీవల శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఆమె నటించిన లవ్‌స్టోరీ మూవీ ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నాని శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ గా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఇకపై కమెడియన్‌గానూ చేస్తాను
ఇకపై హీరోగానే కాకుండా సూర్య, శింబు, ఉదయనిధి స్టాలిన్ లాంటి హీరోల చిత్రాలలో హాస్యపాత్రలూ చేస్తానని ప్రముఖ కమెడియన్ సంతానం వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా నటించి సొంతంగా నిర్మించిన చిత్రం ఇనియే ఇప్పుడిదాన్. ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. నటి ఆస్కా జవేరి, అఖిల్ హీరోయిన్లుగా నటించారు. దర్శక ధ్వయం మురుగన్, ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి సంతానం మాట్లాడుతూ ఇనిమే ఇప్పడిదాన్ చిత్రాన్ని తొలిసారిగా తానే నిర్మించి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సినిమాలు నిర్మించడం సులభమేనని, విడుదల చేయడమే కష్టమవుతోందని అన్నారు. చిత్ర టైటిల్ నమోదు చేయడం నుంచి థియేటర్ల వద్దకు తీసుకురావడం వరకు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ చిత్రం కథ సహజత్వానికి దగ్గర ఉంటుందన్నారు. కామెడీ, సెంటిమెంట్ పుష్కలంగా ఉంటాయని తెలిపారు. కమెడియన్‌గానే తనకు గుర్తింపు వచ్చిందని, కాబట్టి కేవలం హీరో పాత్రలే వేస్తానని చెప్పనని, తనకు సౌలభ్యంగా ఉండే నటులు సూర్య, శింబు, ఉదయనిధి స్టాలిన్ చిత్రాలలో హాస్య పాత్రలు చేస్తానని చెప్పారు. డాన్స్ నేర్చుకున్నా : తాను హీరోగా నటించడానికి సిద్ధమైన తర్వాత ఆర్య సలహాతో బరువు తగ్గానన్నారు. ఎలాంటి దుస్తులు ధరించాల్సిన విషయం గురించి శింబు సూచనలు పాటించానని తెలిపారు. ఇనిమే ఇప్పడిదాన్ చిత్రంలో తాను చూసిన కొన్ని సంఘటనలు, స్నేహితుల ప్రేమ విషయాలు కొన్ని చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ చిత్రం కోసం కష్టపడి డాన్స్ నేర్చుకున్నానని, పాటలు జనరంజకంగా వచ్చాయని సంతా నం అన్నారు.