ఇకపై కమెడియన్‌గానూ చేస్తాను | i am acting comedian santhanam comedy roles | Sakshi
Sakshi News home page

ఇకపై కమెడియన్‌గానూ చేస్తాను

Published Wed, Jun 3 2015 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

ఇకపై కమెడియన్‌గానూ చేస్తాను

ఇకపై కమెడియన్‌గానూ చేస్తాను

 ఇకపై హీరోగానే కాకుండా సూర్య, శింబు, ఉదయనిధి స్టాలిన్ లాంటి హీరోల చిత్రాలలో హాస్యపాత్రలూ చేస్తానని ప్రముఖ కమెడియన్ సంతానం వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా నటించి సొంతంగా నిర్మించిన చిత్రం ఇనియే ఇప్పుడిదాన్. ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. నటి ఆస్కా జవేరి, అఖిల్ హీరోయిన్లుగా నటించారు. దర్శక ధ్వయం మురుగన్, ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి సంతానం మాట్లాడుతూ ఇనిమే ఇప్పడిదాన్ చిత్రాన్ని తొలిసారిగా తానే నిర్మించి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సినిమాలు నిర్మించడం సులభమేనని, విడుదల చేయడమే కష్టమవుతోందని అన్నారు.
 
  చిత్ర టైటిల్ నమోదు చేయడం నుంచి థియేటర్ల వద్దకు తీసుకురావడం వరకు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ చిత్రం కథ సహజత్వానికి దగ్గర ఉంటుందన్నారు. కామెడీ, సెంటిమెంట్ పుష్కలంగా ఉంటాయని తెలిపారు. కమెడియన్‌గానే తనకు గుర్తింపు వచ్చిందని, కాబట్టి కేవలం హీరో పాత్రలే వేస్తానని చెప్పనని, తనకు సౌలభ్యంగా ఉండే నటులు సూర్య, శింబు, ఉదయనిధి స్టాలిన్ చిత్రాలలో హాస్య పాత్రలు చేస్తానని చెప్పారు.
 
 డాన్స్ నేర్చుకున్నా : తాను హీరోగా నటించడానికి సిద్ధమైన తర్వాత ఆర్య సలహాతో బరువు తగ్గానన్నారు. ఎలాంటి దుస్తులు ధరించాల్సిన విషయం గురించి శింబు సూచనలు పాటించానని తెలిపారు. ఇనిమే ఇప్పడిదాన్ చిత్రంలో తాను చూసిన కొన్ని సంఘటనలు, స్నేహితుల ప్రేమ విషయాలు కొన్ని చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ చిత్రం కోసం కష్టపడి డాన్స్ నేర్చుకున్నానని, పాటలు జనరంజకంగా వచ్చాయని సంతా నం అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement