![Sai Pallavi Wants To Work In Comedy Roles](/styles/webp/s3/article_images/2024/07/10/sai-Pallavi.jpg.webp?itok=4KhRR0Bl)
నటి సాయిపల్లవి ఈ పేరు నటనకు, డాన్స్‌కు చిరునామా అని పేర్కొనవచ్చు. మలయాళంలో ప్రేమమ్ అనే చిత్రంలో టీజర్‌గా నటించి అందరి ప్రశంసలు అందుకున్న అచ్చ తమిళ నటి సాయి పల్లవి. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈమె వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోకుండా, పాత్ర నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ప్రస్తుతం తమిళంలో కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ పతాకంపై శివకార్తికేయన్ హీరోగా నిర్మిస్తున్న అమరన్ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అలాగే తెలుగులో నాగచైతన్య సరసన ఒక చిత్రం చేస్తున్న సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రామయణం చిత్రంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఒక భేటీలో సాయి పల్లవి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకూ వివిధ భాషల్లో రకరకాల పాత్రలు పోషించానన్నారు.
ముఖ్యంగా తెలుగులో ఫిదా, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించానని చెప్పారు. అయితే వాటన్నింటి కంటే విభిన్నమైన కామెడీ కథా పాత్రలో నటించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాంటి చిత్రంలో అవకాశం వస్తే భాషా బేధం లేకుండా నటించడానికి రెడీ అని నటి సాయిపల్లవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment