Hero Simbu Says He Lost 27 Kgs In Lockdown: ‘‘నేను నటించిన ‘మన్మథ, వల్లభ’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి కథ కుదిరితే తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేయడానికి సిద్ధం’’ అని హీరో శింబు అన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు, యస్.జె. సూర్య, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మానాడు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ది లూప్‘ పేరుతో అనువదించారు. అల్లు అరవింద్, బన్నీ వాసు తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళ్, తెలుగు భాషల్లో ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ– ‘‘పొలిటికల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ‘ది లూప్’ రూపొందింది. ఇందులో నేను చేసిన అబ్దుల్ కాలిక్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. రాజకీయాల వల్ల సామాన్య వ్యక్తి అయిన అబ్దుల్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? వాటిని ఎలా అధిగమించాడు? అన్నదే ఈ చిత్రకథ. ఒక్క రోజులో వేరే వేరే సమయాల్లో జరిగే కథ ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకులకు కలుగుతుంది.
ఈ చిత్రంలో నేను హంతకుడి పాత్ర పోషించాను. ఈ పాత్ర కోసం 27 కిలోల బరువు తగ్గాను. వెంకట్ ప్రభు మంచి దర్శకుడు. గతంలో ‘మన్మథ’ చిత్రాన్ని నేను తెలుగులో రీమేక్ చేద్దామంటే వద్దన్నారు.. అయినా పట్టుబట్టి నేను డబ్బింగ్ చేయించి, రిలీజ్ చేశాను. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ‘ది లూప్’ని కూడా నేనే తెలుగులో రిలీజ్ చేయిస్తున్నాను. నాపై నమ్మకంతో తెలుగులో రిలీజ్ చేస్తున్న అల్లు అరవింద్, బన్నీ వాసుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment