నిజాలు మాట్లాడితే కష్టాలే.. ఆ వివాదంపై స్పందించిన హీరో శింబు | Actor Simbu Comments On Red Card Over Him | Sakshi
Sakshi News home page

Simbu: నాపై రెడ్ కార్డ్ లాంటిదేం విధించలేదు

Published Wed, Jun 5 2024 7:58 AM | Last Updated on Wed, Jun 5 2024 9:03 AM

Actor Simbu Comments On Red Card Over Him

తమిళంలో సంచలన నటుడిగా ముద్రవేసుకున్న శింబు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శింబు అంటే వివాదాలు, వివాదాలు అంటే శింబు అనే రీతిలో ఉంటుంది. ఈయనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. తాజాగా నిర్మాత ఐసరి గణేశ్ కూడా శింబుపై ఫిర్యాదు చేశారు. తాను నిర్మించనున్న 'కరోనా కుమార్' చిత్రంలో నటించడానికి కమిట్ అయిన శింబుకు రూ.4 కోట్లు అడ్వాన్స్ ఇచ్చానని, కానీ ఇప్పుడాయన తన మూవీలో నటించడం లేదని, తన చిత్రాన్ని పూర్తి చేసే వరకు ప్రస్తుతం శింబు చేస్తున్న 'థగ్ లైఫ్' మూవీలో నటించకుండా నిషేధించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)

దీంతో శింబుపై రెడ్ కార్డ్ విధించినట్లు ప్రచారం హోరెత్తింది. దీనిపై స్పందించిన శింబు.. తాను కమలహాసన్‌ 'థగ్ లైఫ్'లో నటిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ లోకంలో నిజాలు చెప్పేవారు చాలా కష్టపడుతున్నారని.. తాను చాలా నిజాలు మాట్లాడానని చెప్పారు. అయితే తనపై రెడ్ కార్డ్ విధించడం లాంటిదేదీ జరగలేదని పేర్కొన్నారు. చిన్న సమస్య ఉందని, దాన్ని మాట్లాడి పరిష్కరించినట్లు చెప్పారు. కాగా కమల్ హాసన్‌తో కలిసి నటిస్తూనే ఈయన నిర్మిస్తున్న మరో మూవీలోనూ హీరోగా చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement