tamil industry
-
తమిళ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది.
-
నిజాలు మాట్లాడితే కష్టాలే.. ఆ వివాదంపై స్పందించిన హీరో శింబు
తమిళంలో సంచలన నటుడిగా ముద్రవేసుకున్న శింబు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శింబు అంటే వివాదాలు, వివాదాలు అంటే శింబు అనే రీతిలో ఉంటుంది. ఈయనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. తాజాగా నిర్మాత ఐసరి గణేశ్ కూడా శింబుపై ఫిర్యాదు చేశారు. తాను నిర్మించనున్న 'కరోనా కుమార్' చిత్రంలో నటించడానికి కమిట్ అయిన శింబుకు రూ.4 కోట్లు అడ్వాన్స్ ఇచ్చానని, కానీ ఇప్పుడాయన తన మూవీలో నటించడం లేదని, తన చిత్రాన్ని పూర్తి చేసే వరకు ప్రస్తుతం శింబు చేస్తున్న 'థగ్ లైఫ్' మూవీలో నటించకుండా నిషేధించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)దీంతో శింబుపై రెడ్ కార్డ్ విధించినట్లు ప్రచారం హోరెత్తింది. దీనిపై స్పందించిన శింబు.. తాను కమలహాసన్ 'థగ్ లైఫ్'లో నటిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ లోకంలో నిజాలు చెప్పేవారు చాలా కష్టపడుతున్నారని.. తాను చాలా నిజాలు మాట్లాడానని చెప్పారు. అయితే తనపై రెడ్ కార్డ్ విధించడం లాంటిదేదీ జరగలేదని పేర్కొన్నారు. చిన్న సమస్య ఉందని, దాన్ని మాట్లాడి పరిష్కరించినట్లు చెప్పారు. కాగా కమల్ హాసన్‌తో కలిసి నటిస్తూనే ఈయన నిర్మిస్తున్న మరో మూవీలోనూ హీరోగా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?) -
చాలా కష్టాలను అనుభవించాను: లోకేష్ కనకరాజ్
తమిళసినిమా: దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ పేరు ఇప్పుడు భారీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. మానగరంతో ప్రారంభమైన ఈయన దర్శక పయనం మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాల వరకు విజయ పథంలో సాగుతూ వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. 2024 ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు ఇటీవల ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తాజాగా నిర్మాతగా అవతారం ఎత్తారు. జీ.స్క్వాడ్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. కాగా ఉయిరడీ చిత్ర పేమ్ విజయకుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఫైట్ క్లబ్. రీల్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య నిర్మిస్తున్న ఇందులో నటి మోనీషా మోహన్ మీనన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం చైన్నెలోని ఒక హోటల్లో నిర్వహించారు. లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. దర్శకుడిగా తనను ఆదరించినట్లే తన నిర్మాణ సంస్థను ఆదరించాలని కోరారు. తాను డబ్బు సంపాదించడానికి చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించలేదన్నారు. దర్శకుడిగా తానిప్పుడు బాగానే సంపాదిస్తున్నానన్నారు. అయితే ఆరంభ కాలంలో తాను చాలా కష్టాలను అనుభవించానని తెలిపారు. తాను రూపొందించిన షార్ట్ ఫిల్మింస్కు తన మిత్రులు ఎంతో సహాయం చేశారన్నారు. వారి సాయంతోనే మానగరం చిత్రాన్ని రూపొందించానని చెప్పారు. అలాంటి మిత్రులు, ప్రతిభావంతులను ప్రోత్సహించడం కోస మే జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా వచ్చిన డబ్బును మళ్లీ చిత్ర పరిశ్రమలోనే పెడతానని లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. అలా తొలి సారిగా ఫైట్ క్లబ్ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. -
హిజ్రాలకూ సభ్యత్వం కల్పిస్తా: ఆర్కే సెల్వమణి
మారుతీ ఫిలిమ్స్, టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సంస్థల అధినేతలు ఎస్.రాధాకృష్ణన్, ఎస్.హరి కలిసి నిర్మిస్తున్న చిత్రం డెవిల్. సవరకత్తి చిత్రం ఫేమ్ ఆదిత్య కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం ద్వారా దర్శకుడు మిష్కిన్ సంగీత దర్శకుడుగా పరిచయం కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆయన ఒక పాట పాడి కీలక పాత్రను పోషించారు. కాగా నటుడు విదార్థ్, పూర్ణ, ఆదిత్ అరుణ్, శుభశ్రీ రాయ్ గురు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో శుక్రవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ముందుగా మిష్కిన్ నేతృత్వంలో లైవ్ మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు, పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, బాల, వెట్రిమారన్, నిర్మాత థాను పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సంగీత దర్శకుడిగా పరిచయం అయిన మిష్కిన్ మాట్లాడుతూ కథలన్నీ ఒక కథ నుంచే పుడుతాయన్నారు. అదే విధంగా ఈ డెవిల్ చిత్ర కథ అలాంటిదేనని పేర్కొన్నారు. ఒక ప్రశాంతమైన ఇంటిలోకి చీకటి చొరబడుతుందన్నారు. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్నారు. ఆ తరువాత దాన్నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే ఈ చిత్ర కథ అని చెప్పారు. తనకు కర్ణాటక, హిందుస్తానీ సంగీతాన్ని నేర్పించిన రామమూర్తి తనకు ఒక గురువు కాగా మరొక గురువు ఉన్నారని ఆయనే ఇళయరాజా అని వారి పాదాలకు నమస్కారం చేస్తున్నానని పేర్కొన్నారు. దర్శకుడు తాను చిన్న వయసు నుంచి చూస్తూ ఆశ్చర్యపడిన దర్శకుడు ఆర్కే సెల్వమణి అని, ఆయన ఆరి–2 కెమెరాతో చిత్రాలను చిత్రీకరించినా, పారా విజన్‌లో తీసినట్లు వుంటుందని అన్నారు. ఈ సందర్భంగా తాను ఆయనను ఒక కోరిక కోరుకుంటున్నానని, హిజ్రాలకు కూడా నటులుగా సభ్యత్వం కల్పించాలన్నదే ఆ కోరిక అన్నారు. దీనిపై స్పందించిన ఆర్కే సెల్వమణి సినీ పరిశ్రమకు చెందిన ఏ శాఖలో నైనా ఆసక్తి కలిగిన హిజ్రాలు చేరవచ్చునని చెప్పారు. బైలాస్‌లో కూడా ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. -
హీరో ధనుష్‌కి రెడ్ కార్డ్.. అతడి సినిమాలపై నిషేధం?
'సార్' హీరో ధనుష్‌కి షాక్ తగిలేలా కనిపిస్తుంది. తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక్కడ ఓ చిక్కొచ్చి పడింది. తమిళ నిర్మాతల మండలి అతడికి రెడ్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ధనుష్‌తోపాటు అతడి చిత్రాలపై నిషేధం గ్యారంటీ. అసలేమైంది? రెడ్ కార్డ్ అంటే ఏంటి? ఏం జరిగింది? దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ధనుష్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే గతంలో శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సినిమా చేస్తానని మాటిచ్చాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇది జరిగి చాలా ఏళ్లవుతుంది. కానీ సినిమా మాత్రం చేయట్లేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ.. తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. ఇలా ఆలస్యం చేస్తున్నందుకుగానూ ధనుష్ కి రెడ్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!) రెడ్ కార్డ్ ఇస్తే? ధనుష్ లానే పలు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని సినిమాలు చేయడం లేదనే కారణంతో హీరోలు శింబు, విశాల్, ఎస్జే సూర్య, అథర్వతో పాటు కమెడియన్ యోగిబాబుకి తమిళ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇవ్వనుందనే సమాచారం ఈ మధ్యే బయటకొచ్చింది. ఒకవేళ ఇది జారీ చేస్తే.. ఏ దర్శకనిర్మాతలు వీళ్లతో సినిమా చేయడం కుదరదు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లపై నిషేధం విధించినట్లే. గతంలో డైరెక్టర్ శంకర్ తో ఇలాంటి వివాదం కారణంగానే కమెడియన్ వడివేలు.. ఏళ్లపాటు సినిమాలకు దూరమయ్యాడు. ధనుష్ ఏం చేస్తున్నాడు? ఈ ఏడాది తెలుగులో 'సార్'తో ఎంట్రీ ఇచ్చి మిక్స్ డ్ టాక్ అందుకున్న ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు 'మిల్లర్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇది మూడు భాగాల ఫ్రాంచైజీగా తీస్తున్నారు. తొలి భాగం త్వరలో విడుదల కానుంది. మరోవైపు కొన్నిరోజుల ముందే బాలీవుడ్ లోనూ ఓ చిత్రం ఒప్పుకొన్నాడు. ఒకవేళ రెడ్ కార్డ్ ఇస్తే మాత్రం ఈ సినిమాల రిలీజ్ చేయడానికి వీలు లేకుండా పోతుంది! Actor #Dhanush did not complete the long pending committed movie with Sri Thenandal Films, hence the producer council is discussing to issue red card. Recently #SilambarasanTR, #Vishal, #SJSuriya etc were given red card. — Manobala Vijayabalan (@ManobalaV) July 1, 2023 (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) -
స్టార్ హీరోతో కుష్బూ పెళ్ళి.. నాలుగు నెలలకే విడాకులు
-
విజయ్ తండ్రి పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
-
సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలు..
థియేటర్ నిండితే సినిమా వాళ్లకు కడుపు నిండినంత ఆనందం. కోవిడ్ అన్‌లాక్ వల్ల అర్ధాకలితో నడుస్తున్నాయి థియేటర్స్. తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్‌కు ఫుల్ మీల్స్ టికెట్ ఇచ్చింది. 100 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్‌లో సినిమా ప్రదర్శించుకోవచ్చంది. ఇనియ పొంగల్ నల్ వాళ్తుగళ్ చెప్పింది. తియ్యని సంక్రాంతి శుభాకాంక్షలన్న మాట. పొంగల్ పండుగ నిండుగా జరుపుకోమంది. మరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌కీ 100 శాతం సీటింగ్ అనుమతి వస్తుందా? మన సంక్రాంతి కూడా నిండుగా జరుగుతుందా? కోలీవుడ్ ఖుషీ ఖుషీ సోమవారం కోలీవుడ్ ఇండస్ట్రీ ఖుషీ ఖుషీగా ఉంది. ‘థియేటర్స్ సిస్టమ్ తిరిగి పుంజుకోవాలంటే వంద శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాల ప్రదర్శనకు అనుమతివ్వాలి’ అని తమిళనాడు ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ కోరింది. ఈ విషయమై తమిళనాడు సీయం పళని స్వామిని స్వయంగా కలిశారు తమిళ స్టార్ విజయ్. ఆయన నటించిన ‘మాస్టర్’, శింబు ‘ఈశ్వరన్’ సినిమాలు పొంగల్‌కి విడుదలవుతున్నాయి. తాజా ప్రకటనపై ఈ రెండు చిత్రబృందాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. తమిళ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. అయితే థియేటర్స్ ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేయడం కరెక్ట్ కాదేమో? అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అన్నింటిని అన్‌లాక్ చేసినప్పుడు థియేటర్స్ సగం సీటింగ్‌తో నడపడమెందుకు? అనేది ఇంకొందరి అభిప్రాయం. ఏది ఏమైనా తొమ్మిది నెలల తర్వాత థియేటర్స్ నిండుగా కనపడబోతున్నాయి. మనకూ 100శాతం సీటింగ్ ఉంటుందా? 50 శాతం సీటింగ్ ఉన్నా కూడా సంక్రాంతికి తెలుగులో పలు సినిమాలు బరిలో ఉన్నాయి. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’, విజయ్ ‘మాస్టర్’ (డబ్బింగ్), దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జాంబి రెడ్డి’, ‘క్రేజీ అంకుల్స్’ విడుదలకు సిద్ధం అయ్యాయి. మరి మన నిర్మాతలు కూడా ప్రభుత్వాన్ని ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు అనుమతి కోరతారా? నిర్మాతల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ► మన దగ్గర కూడా థియేటర్లు నిండుగా ఉంటే బాగుంటుంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయమై సంప్రదించాలనుకుంటున్నాం. సంక్రాంతి రిలీజ్‌కు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. 100 శాతం సీటింగ్‌కి అనుమతి లభిస్తే బాగుంటుంది. – సి. కల్యాణ్, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు ► యాభై శాతం సీటింగ్ కెపాసిటీ విషయమై ఎంహెచ్ఎ (హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) నుంచి ఓ లేఖ అందింది. తమిళనాడు ప్రభుత్వాన్ని దాన్ని ఉపయోగించుకుని వంద శాతం సీటింగ్ కెపాసిటీకి జీవో పాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్ గురించి రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. – నిర్మాత డి. సురేశ్‌బాబు -
వణక్కమ్ దీపికా
దీపికా పదుకోన్‌కి తమిళ పరిశ్రమ వణక్కమ్ చెప్పబోతోందని సమాచారం. అంటే.. స్వాగతం అని అర్థం. విషయం ఏంటంటే... తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందనున్న ఓ చిత్రంలో దీపికాను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ప్యాన్ ఇండియా మూవీలో దీపిక హీరోయిన్గా నటించనున్న విషయం తెలిసిందే. ఇటు తెలుగు సినిమాకి సై అన్న దీపికా అటు తమిళ చిత్రాన్ని కూడా ఒప్పుకోవాలనుకుంటున్నారట. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం విజయ్‌కి 65వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో విజయ్‌కి ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించనున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని రూపొందించనుందట. అందుకే భారీ తారాగణం ఉండేలా చూస్తున్నారని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ‘డాక్టర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఆ సినిమా పూర్తయ్యాక విజయ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతారట. కాగా విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే
ఆ నడకలో ఓ స్టయిల్... సిగిరెట్ అలవోకగా ఎగరేయడం ఓ స్టయిల్... కూలింగ్ గ్లాస్‌ని కూల్‌గా ఎగరేయడం ఓ స్టయిల్... అందుకే ‘స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే..’ పాట రజనీకాంత్ స్టయిల్‌కి తగ్గట్టు ఉంటుంది. కండక్టర్‌గా ఉన్నప్పుడు ప్రయాణికులకు టికెట్లు తెంచారు రజనీ. యాక్టర్ అయ్యాక ప్రేక్షకులు ఆయన సినిమా టిక్కెట్లు తెంచారు. నేటితో తమిళ పరిశ్రమకు రజనీ పరిచయమై 45 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి స్పెషల్ స్టోరీ. సరిగ్గా ఇదే రోజు (ఆగస్ట్ 15), నలభై ఐదేళ్ల క్రితం తమిళ సినిమాకు ఓ కొత్త ముఖం పరిచయం అయింది. అప్పుడెవ్వరూ ఉహించి ఉండకపోవచ్చు.. తమిళ సినిమాకి ముఖం అతనే అవుతాడని. దర్శకుడు బాలచందర్ కనుగొన్న ముత్యాల్లో ఒకరు రజనీకాంత్. కె. బాల చందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు రజనీకాంత్. ఆ సినిమాలో కమల్ హాసన్ హీరో. రజనీ కీలక పాత్ర చేశారు. తర్వాత కన్నడంలో ‘కథా సంగమ’లో ఓ చిన్న పాత్ర చేశారు. వెంటనే తెలుగు చిత్రం ‘అంతులేని కథ’కి రజనీని తీసుకున్నారు బాలచందర్. ‘మూండ్రు ముడిచ్చు’ సినిమాలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో రజనీ గాల్లోకి సిగిరెట్ విసిరేసే విధానానికి విజిల్స్ పడ్డాయి. రజనీ అనేవాడు ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యాడు. ‘చిలకమ్మ చెప్పింది’ సినిమాలో తొలిసారి పూర్తిస్థాయి లీడ్ రోల్ లో నటించారు రజనీ. తెలుగులో హీరో అయినప్పటికీ తమిళంలో పూర్తి స్థాయి హీరోగా మారలేదు రజనీ. దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఆ ప్రయోగం చేశారు. ‘భువనా ఒరు కేళ్విక్కురి’లో విలన్ గా కాకుండా మంచి పాత్రలో కనబడ్డారు. ప్రయోగం ఫలించింది. ఆ తర్వాత ఎస్పీ– రజనీ కాంబినేషన్లో సుమారు 24 సినిమాలు వచ్చాయి. ఒక్క ఏడాదిలో 20 సినిమాలు 1978 రజనీకు మరచిపోలేని ఏడాది. ఆ సంవత్సరం తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఆయనవి 20 సినిమాలు విడుదలయ్యాయి. ‘భైరవి’తో తమిళంలో సోలో హీరోగా తొలి సినిమా చేశారు. ‘వణకత్తుక్కురియ కాదలియే’లో రజనీకు ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టారు. ఆ తర్వాత అదే ట్రెండ్ అయింది. ‘ముళ్ళుమ్ ములరుమ్’ మంచి పేరు తెచ్చిపెట్టింది. యాక్టింగ్‌కి టాటా నాలుగేళ్లలో సుమారు 50 సినిమాలు పూర్తి చేశారు రజనీ. అయినప్పటికీ సాలిడ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొదవయింది. ఇంకా నటుడిగా కొనసాగుదామా? ఆపేద్దామా? అనే ఆలోచనలో పడ్డారట రజనీ. కానీ 1980లో వచ్చిన ‘బిల్లా’ ఆయన ప్రయాణాన్ని మార్చేసింది. ఆ తర్వాత ‘తిల్లు ముల్లు’ (1981)లో వంటి కామెడీ టచ్ ఉన్న సినిమా చేశారు రజనీ. అప్పటికి మంచి కమర్షియల్ హీరోగా దూసుకెళుతున్న రజనీ ఆధ్యాత్మిక సినిమా ‘శ్రీ రాఘవేంద్ర’ (1985) చేశారు. ఇందులో రాఘవేంద్ర స్వామి పాత్రను చేశారు రజనీ. ఇది ఆయనకు నూరవ సినిమా. రజనీ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన పీరియడ్ 1990–2000. ఆ పదేళ్లల్లో చేసిన ’దళపతి’, ‘అన్నామలై’, ‘బాషా’, ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘నరసింహ’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. 2000 –2020 ‘నరసింహా’ సూపర్ సక్సెస్ తర్వాత రజనీ చేసిన ‘బాబా’ ఘోరపరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని, మళయాళ చిత్రం ‘మణిచిత్ర తాళు’ తమిళ రీమేక్ ‘చంద్రముఖి’లో నటించారు. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ‘శివాజీ’ చేశారు. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ‘రోబో’(2010) వచ్చింది. ఇండియన్ ఇండస్ట్రీలో అప్పటి వరకు అంత నిర్మాణం (దాదాపు 200 కోట్ల బడ్జెట్)తో ఏ సినిమా తెరకెక్కలేదు. ఆ తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు రజనీ. నాలుగేళ్ల విరామం తర్వాత తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ చేసిన ‘కొచ్చాడియాన్’ (విక్రమ సింహా), ఆ తర్వాత చేసిన ‘లింగ’ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ‘కబాలి’ కూడా హైప్ ను మ్యాచ్ చేయలేకపోయింది. ఆ తర్వాత ‘కాలా, 2.0, పేట్టా, దర్బార్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు రజనీకాంత్. హిమాలయాలకు.. రజనీ విడిగా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఒకసారి ఓ గుడికి మామూలు లుంగీ, చొక్కాతో వెళ్లిన రజనీని గుర్తు పట్టక ఒకావిడ 10 రూపాయలు ఇచ్చింది. రజనీ నవ్వుతూ ఆ నోటుని తీసుకున్నారు. లగ్జరీ కారు ఎక్కుతున్న ఆయన్ను చూసిన ఆవిడ ‘రజనీకాంత్’ అని గ్రహించింది. దగ్గరకెళ్లి క్షమాపణ చెబితే, రజనీ నవ్వేశారు. ఏడాదికి ఓసారి హిమాలయాలకు వెళతారు. కొన్ని రోజులపాటు ధ్యానం చేస్తారు. పై పై మెరుగులకు ప్రాధాన్యం ఇవ్వడం వృథా అంటారు రజనీ. అందుకే స్టార్ అయినప్పటికీ సామాన్యుడిలానే ఉంటారు. దటీజ్ రజనీకాంత్. రజనీ పంచ్ డైలాగ్స్ ► అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశ పడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. (నరసింహ) ► ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు. (బాషా) ► దేవుడు శాసిస్తాడు. ఈ అరుణాచలం పాటిస్తాడు. (అరుణాచలం) ► నాన్నా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్‌గా వస్తుంది. (శివాజీ) ► నా దారి రహదారి. బెటర్ డోంట్ కమిన్ మై వే. (నరసింహ). -
600 కిలో మీటర్లు ప్రయాణించిన తమిళ స్టార్ అజిత్
-
నామినేషన్ తిరస్కరణ
తమిⶠఇండస్ట్రీలో జరిగిన డబ్బింగ్ యూనియన్ ఎన్నికలపై ఎప్పుడూ లేని ఆసక్తి నెలకొంది. దానికి కారణం ప్రెసిడెంట్ పదవికి రాధారవిపై పోటీగా డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని చిన్మయి నామినేషన్ వేయడమే. గతంలో ప్రముఖ రచయిత వైరముత్తు, నటుడు రాధారవిపై ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు చిన్మయి. ఆ తర్వాత డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం నుంచి ఆమె తొలగించబడ్డారు. కానీ కోర్టు నుంచి ఇంటర్న్ ఆర్డర్ (చిన్మయిని యూనియన్ సభ్యురాలిగా పరిగణించాలి) తెచ్చుకున్నారు చిన్మయి. ఆ తర్వాతే రామరాజ్యం పార్టీ తరఫున డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారామె. అయితే చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురయింది. దాంతో రాధారవి ప్రెసిడెంట్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ‘‘ఎలక్షన్ కమిషనర్ నేను సభ్యురాలిని కాదని నామినేషన్ తిరస్కరించారు. నా వద్ద కోర్ట్ ఇంటర్న్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఎందుకు సభ్యురాలిగా పరిగణించలేదో అర్థం కావడం లేదు. ఎవరి సూచనల మేరకు ఈ పని చేశారు? రాధారవి ఆజ్ఞ మేరకా? ఈ విషయంపై న్యాయపరంగా పోరాడతాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు చిన్మయి. -
అర్థమవుతోంది!
‘మీకు అర్థమవుతుందా’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రష్మికా మందన్నా తెగ సందడి చేసింది. ‘ఛలో’తో తెలుగు తెరపై కనిపించినప్పుడే ఈ కన్నడ బ్యూటీ ఇక్కడ టాప్ హీరోయిన్లలో ఒకటి అవుతుందని చాలామందికి అర్థమైంది. గీత గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ మహేశ్‌తో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’తో టాప్ లీగ్‌లోకి వెళ్లిపోయింది రష్మికా. నెక్ట్స్ అల్లు అర్జున్ సరసన కూడా సినిమా చేయబోతోంది. ప్రస్తుతం నితిన్‌తో ‘భీష్మ’ సినిమాలో నటిస్తోంది. ఇలా తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న రష్మికా ఈ ఏడాది తమిళ తెరకు కూడా పరిచయం కాబోతోంది. కార్తీ సరసన ‘సుల్తాన్’ అనే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే సూర్య సరసన ఓ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిందని టాక్. సూర్యతో ‘సింగమ్’ వంటి హిట్ సిరీస్ తీసిన హరి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రష్మికా నటించనుందట. ఇటు తెలుగులో స్టార్ హీరోలతో చేస్తూ దూసుకెళుతోన్న రష్మికా అటు తమిళంలోనూ ఆ దూకుడు మీదే ఉన్నారని అర్థమవుతోంది కదూ. -
చిన్మయి వర్సెస్ రాధా రవి
‘మీటూ’ ఉద్యమం మన దేశంలోనూ ఊపందుకున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపించిన పేరు చిన్మయి. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి పాపులర్. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకు గొంతుగా ఉండే చిన్మయి, ఈ ఉద్యమంలో ఎందరో బాధితులకు గొంతుగా నిలిచారు. ధైర్యంగా నిలబడ్డారు. ‘మీటూ’ ఉద్యమంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయటకు చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్నది ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని ఆయన పేరుని బయటపెట్టారు. తమిళ పరిశ్రమలో అది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన ట్వీటర్ వేదికగా వైరముత్తు, నటుడు, నిర్మాత రాధారవిపై ఆరోపణలు చేసిన స్త్రీల వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ల చేదు సంఘటనలు షేర్ చేస్తూ ఉన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించకపోవడానికి వార్షికరుసుము చెల్లించకపోవడమే కారణం అని, అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశామని యూనియన్ పేర్కొంది. అప్పుడు డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిలో రాధారవి ఉన్నారు. సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా, కోర్టు చిన్మయి వాదనకు అనువుగా ఇంటర్న్ ఆర్డర్ (ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్ యూనియన్ సభ్యురాలిగానే పరిగణించాలి) మంజూరు చేసింది. ఆ తర్వాత తమిళంలో చిన్మయి డబ్బింగ్ కెరీర్ మందకొడిగా సాగుతోంది. తాజాగా ఈ నెల డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది. మరోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకు ప్రత్యర్థిగా, రామరాజ్యం పార్టీ తరపున ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారు చిన్మయి. విశేషం ఏంటంటే సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్ యూనియన్ ఓటర్ల జాబితాలో నుంచి చిన్మయి పేరును తొలగించారు. ‘సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?’ అని ఒక వర్గం వారు చిన్మయిని విమర్శించారు. ‘‘కోర్టు మంజూరు చేసిన ఆర్డర్లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నాకుంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ప్రస్తుతం చిన్మయి నామినేషన్ పత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎలాంటి నాటకీయత చోటు చేసుకుంటుంది? చిన్మయి వర్సెస్ రాధారవి.. గెలుపు ఎవరిది? అని తమిళ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
ఆ చేదు సంఘటన ఇంకా మర్చిపోలేదు
వైవిధ్యభరిత పాత్రలకు విద్యాబాలన్ పెట్టింది పేరు. ఆమె బాలీవుడ్, టాలీవుడ్‌లలో పలు ప్రేక్షకాదారణ చిత్రాలలో నటించింది. ఇటీవలే బాలకృష్ణ ‘కథానాయకుడు’ చిత్రంలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అవకాశాల పరంగా తమిళ చిత్ర పరిశ్రమలో రెండు ఇబ్బందికర సంఘటనలు జరిగాయని విద్యాబాలన్ వాపోయింది. దీనికి సంబంధించిన నిజాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఓ తమిళ చిత్రంలో నటించడానికి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తిరస్కరించడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని విద్యాబాలన్ తెలిపింది. అయితే తన బాధను చూసి తట్టుకోలేక.. తన కుటుంబ సభ్యులు ఆ నిర్మాత ఇంటికి తీసుకుని వెళ్లగా ఆయన ఆశ్చర్యకర రీతిలో తమను అవమానపరిచారని తెలిపింది. తన క్లిప్పింగ్స్ చూపించి ఈమె హీరోయినా? అంటూ నిర్మాత తన అసహనాన్ని వ్యక్తం చేశారని విద్యాబాలన్ తెలిపారు. దర్శకుడు తీసుకున్న నిర్ణయం మేరకే ఒప్పుకున్నానని నిర్మాత తమతో అన్నారని విద్యాబాలన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే కాకుండా మరో తమిళ చిత్రంలో కూడా తనకు చేదు అనుభవం ఎదురయిందని చెప్పుకొచ్చారు. ఆ చిత్రానికి సంబంధించి ఒక రోజు షూటింగ్ కూడా జరిగిందని, అందులోని మితిమీరిన హాస్యం తనకు నచ్చకనే ఆ చిత్రం నుంచి వైదొలగానని ఆమె పేర్కొంది. బాలీవుడ్లో 2005లో వచ్చిన పరిణిత వంటి పలు విజయాలు అందుకున్నా.. కొన్ని పరాజయాలను కూడా చవిచూసింది. ఆమె తాజాగా అక్షయకుమార్ హీరోగా తెరకెక్కిన ‘మిషన్ మంగల్’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. -
మామియారు వీట్టుక్కు అర్జున్ రెడ్డి
మామియారు వీట్టుక్కు అంటే.. తమిళంలో అత్తారింటికి అని అర్థం. మరి ఈ ఫిబ్రవరిలో అత్తారింటికి అర్జున్ రెడ్డి వస్తాడా? హిట్టు కొడతాడా?ప్రస్తుతం తమిళంలో ఇదే పెరియ కేళ్వి... పెద్ద క్వశ్చన్. వారానికి నాలుగు సినిమాల చొప్పున 28 రోజుల్లో 18 సినిమాలు రిలీజవుతున్నాయి ఇదో తమిళ సినిమా ఫెస్టివల్ఏ సినిమా ఓడుమ్ ఏ సినిమా పోవుమ్ తెలియదు.ఏ సినిమా ఆడుతుందో ఏ సినిమా పోతుందో తెలియదు. ‘రిలీజ్ డేట్లు పంచుకొని.. కలెక్షన్లు పెంచుకోండి’ అన్నారో ట్రేడ్ విశ్లేషకుడు. నిజమే. కానీ ఆ విశ్లేషకుడి మాటలు పూర్తిగా విస్మరించినట్టున్నాం ప్రస్తుతం. సినిమాలో కళ గురించి కాసేపు పక్కన పెట్టి వ్యాపార కోణం నుంచి చూస్తే, నిర్మాత పధ్నాలుగు రీళ్లకు ఖర్చు చేసేది నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే. నాలుగు టికెట్లు ఎక్కువ తెగితే తప్ప జరిగే పని కాదిది. అలా జరగాలంటే నాలుగైదు సినిమాలు ఒకేసారి మార్కెట్లోకి వస్తే కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే తమిళ మార్కెట్లో కనిపిస్తోంది. ఫిబ్రవరి క్యాలెండర్ చూస్తేనేమో 28 రోజులే.. రిలీజ్లు మాత్రం 18 దాకా ఉన్నాయి. మరి థియేటర్స్పై ఈ సినిమాల మూకుమ్మడి కుమ్ముడుకి ఫిబ్రవరి కాస్త ఫిబ్రవర్రీ అవుతుందేమో? ఇది కొందరి ఆవేదన. పైగా సెలవులు ఉండవు కాబట్టి సినిమా రిలీజులకు ఫిబ్రవరిని ‘డ్రై సీజన్’గా పరిగణిస్తుంటారు. మరి.. ఫిబ్రవరి తమిళ పరిశ్రమకు ఏం మిగుల్చుతుంది? వేచి చూద్దాం.సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేట్టా’, అజిత్ ‘విశ్వాసం’ సినిమాల బాక్సాఫీస్ క్లాష్‌తో ఈ ఏడాది కోలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల బోణీ కొట్టింది. పొంగల్ (సంక్రాంతి)కు విడుదలైన ఈ రెండు సినిమాలు మంచి టాక్‌తో జనవరి చివరివారం దాకా మంచి కలెక్షన్లతోనే కొనసాగాయి. ఇద్దరు స్టార్ హీరోలు థియేటర్లు పంచుకున్నప్పటికీ ట్రేడ్‌ని ఆశ్చర్యపరుస్తూ సినిమాలను కొనుగోలు చేసిన అందరూ లాభాలను చూశారు. ఇలాంటి ప్రారంభం చూసి, ఈ ఏడాది మొత్తం ఇలానే ఉండబోతోందని అనుకుంటే అలా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఫిబ్రవరికి నాలుగు వీకెండ్లున్నాయి. 18 రిలీజులు. ఈ లెక్కన ప్రతీ శుక్రవారం నాలుగు సినిమాలు తగ్గకుండా థియేటర్లోకొస్తాయి. ఆ విధంగా రిలీజ్ అయ్యే సినిమాలకు కావాల్సినన్ని స్క్రీన్లు దొరికే విషయంలో కొంత ఇబ్బందే. అవి దాటుకొని థియేటర్స్ వరకూ వచ్చిందే అనుకుందాం... మంచి టాక్ తెచ్చుకోవాలి. అది మౌత్ టాక్‌గా మారి ఆడియన్స్‌లోకి వెళ్లేలోపు ఆ థియేటర్లో వేరే సినిమా పడే అవకాశం ఉంది. ఇలాంటి గందరగోళం ఏర్పడటానికే ఛాన్స్ ఎక్కువ. ఫిబ్రవరి మొదటి రోజే శుక్రవారం కావడంతో పోటీ ఫస్ట్ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 1న 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో.. తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్‌గా శింబు నటించిన ‘వందా రాజావాదా వరువేన్’, పదేళ్ల తర్వాత మమ్ముట్టి తమిళంలో చేసిన ‘పెరంబు’, జీవి ప్రకాశ్ కుమార్–రాజీవ్ మీనన్‌ల ‘సర్వం తాళమయం’లతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలు ‘సగా’, పే ఎల్లామ్ పావమ్’ చిత్రాలు వచ్చాయి. మొదటి మూడు చిత్రాలు మంచి టాక్‌తో ప్రదర్శితం అవుతున్నా పాజిటివ్ టాక్ని వసూళ్లుగా ఎలా మార్చుకుంటారో చూడాలి. వచ్చే వారంలో కమెడియన్ సంతానం ‘దిల్లుకు దుడ్డు 2’ అనే హారర్ కామెడీ చిత్రం ఉంది. ఆ తర్వాత వారం వేలంటైన్స్ వీక్. నాగ చైతన్య– తమన్నాలతో సుకుమార్ రూపొందించిన ‘100% లవ్’ను ‘100% కాదల్గా’ జీవీ ప్రకాశ్ హీరోగా రీమేక్ చేశారు. ఈ సినిమాకు సుకుమార్ కూడా ఓ నిర్మాత. విక్రమ్ తనయుడిని పరిచయం చేస్తూ తెలుగు సూపర్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ‘వర్మ’గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కార్తీ, రకుల్ ప్రీత్‌ల ‘దేవ్’ కూడా రిలీజ్ కానుంది. అలాగే ‘వింక్ సెన్సేషన్’ ప్రియా ప్రకాశ్ వారియర్ ‘ఒరు అధార్ లవ్’ తమిళ అనువాద చిత్రం అదే రోజు విడుదల కాబోతోంది. ఇలా వేలంటైన్స్ వీక్ కూడా థియేటర్స్ ఫుల్. ఇవి మాత్రమే కాకుండా ఫిబ్రవరిలో రిలీజ్ అని అనౌన్స్ చేసిన సినిమాలూ ఉన్నాయి. ‘దాదా 87, కళుగు 2, గొరిల్లా, అయ్యంగరన్, కలవాణి 2, అగ్ని వర్సెస్ దేవి, తిరుమానం, బూమరాంగ్, కన్నే కలైమానే, పొదు నలన్ కరుది’ సినిమాలు ఫిబ్రవరిలో రిలీజ్‌పై కన్నేశాయి. ఇవే కాకుండా వీలుంటే ఆఖరి నిమిషంలో రిలీజ్‌కు సిద్ధమయ్యే సినిమాలు కొన్ని, పోటీ వద్దనుకుని వెనక్కు వెళ్లే సినిమాలూ మరికొన్ని. ఇలా ఫిబ్రవరి మొత్తం థియేటర్స్‌కు ఫుల్ ఫీడింగ్ ఉంటుంది.సినిమా చాలా బావుంటేనో, సినిమాలో స్టార్ హీరోనో లేకపోతే సాధారణ ప్రేక్షకుడిని థియేటర్స్ వరకూ లాక్కురావడం కష్టం. అలా తీసుకొచ్చే ప్రయత్నమే మౌత్ టాక్ చేస్తుంది. కానీ స్మాల్, మీడియమ్ బడ్జెట్ చిత్రాలకు టాక్ చేరేసరికే ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగుస్తుంది. మరి ఇన్ని కష్టాల మధ్య కూడా రిస్క్ చేసి మరీ రిలీజ్ చేయడానికి కారణం? సినిమా నిర్మాణానికి తీసుకున్న వడ్డీ అయినా తగ్గించుకోవచ్చనా? లేక వచ్చే నెల నుంచి పరీక్షలు, ఆ తర్వాత ఐపీఎల్, ఆ తర్వాత ఎన్నికలు. అప్పటికంటే ఈ పోటీనే మేలని ఆలోచించి విడుదల చేస్తున్నారా? లేక వదిలించుకుంటున్నారా? సాధారణంగా తమిళంలో సినిమా రిలీజ్‌లను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చూస్తూ ఉంటుంది. ఏ ఏ సినిమాలు రిలీజ్ కావాలో వాళ్లు నిర్ణయిస్తారు. ఒకేరోజు ఎక్కువ సినిమాలకు నిన్న మొన్నటి వరకూ అనుమతి లేదు. కానీ గతేడాది క్రిస్మస్ సీజన్లో ఈ రూల్‌ని ఎత్తేస్తున్నట్టు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించడంతో డిసెంబర్ 21న 5 రిలీజ్లు వచ్చాయి. అదే ఈ నెలలోనూ రిపీట్ అవుతోంది. ఏది ఏమైనా అందరూ సేఫ్ అవ్వాలంటే కొంచెం గ్యాప్ అవసరం. కానీ ఒక్కసారి వాయిదా వేస్తే మళ్లీ మళ్లీ అదే జరుగుతుందనే సెంటిమెంట్ అయ్యుండొచ్చు.. ఈ మాత్రం థియేటర్లయినా దొరక్కపోవచ్చనే ఫీలింగ్ అయ్యుండొచ్చు.. తాము తీసిన సినిమా మీద బోలెడంత నమ్మకం అయినా అయ్యుండొచ్చు.. కారణం ఏదైనా కావొచ్చు.. ఫిబ్రవరిలో తమిళ స్క్రీన్లు ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం. తెలుగు తమిళంతో పోలిస్తే తెలుగులో అన్ని రిలీజ్‌ల తాకిడి కనిపించకపోవచ్చు. మొదటి వారం చిన్న బడ్జెట్ చిత్రాలు ‘అక్కడొకడుంటాడు, రహస్యం, బిచ్చగాడా మజాకా, సకల కళా వల్లభుడు’ సినిమాలు తెరమీదికొచ్చాయి. ఆ తర్వాతి వారంలో వైయస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ రానుంది. తమిళ అనువాద చిత్రం ‘విచారణ, సీమరాజా, నేనే ముఖ్యమంత్రి, అమావాస్య’ సినిమాలు లైన్లో ఉన్నాయి. వేలంటైన్స్ వీక్‌లో స్ట్రయిట్ తెలుగు లవ్‌స్టోరీలు ఏవీ లేకపోయినా, అనువాద చిత్రాలు కార్తీ ‘దేవ్’, ప్రియా ప్రకాశ్ వారియర్ ‘లవర్స్ డే’ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతి వారంలో యన్టీఆర్ బయోపిక్‌లో సెకండ్ పార్ట్ ‘యన్టీఆర్: మహానాయకుడు’ మరికొన్ని సినిమాలున్నాయి. ఫిబ్రవరి ద్వితీయార్ధం రెండు వారాలు ఖాళీగానే ఉన్నాయి. ఆ స్లాట్‌ని చిన్న బడ్జెట్ సినిమాలు హ్యాపీగా ఉపయోగించేసుకోవచ్చు. అయితే డ్రై సీజన్ అని వెనక్కి తగ్గినా తగ్గొచ్చు. మలయాళం మలయాళ పరిశ్రమలో కూడా మొదటి రోజు నాలుగు సినిమాలతో ప్రారంభమైంది. మమ్ముట్టి ‘పెరంబు, సర్వం తాళమయం, లోనప్పంటేచ మమోదిసా, అల్లు రమేంద్రన్’ సినిమాలతో ఫస్ట్ వీక్ ఆరంభమైంది. కానీ తర్వాత వారాల్లో రిలీజ్లు చాలా పల్చగా ఉన్నాయి. పృథ్వీరాజ్ ‘9’, కులుంబీ నైట్స్, ఒరు అధార్ లవ్, జూన్, కొడతి సమక్షం బలన్ వకీల్’ సినిమాలు మాత్రమే ఫిబ్రవరి రిలీజ్‌కు రెడీ అయ్యాయి. కన్నడ ‘అనుక్తా, మటాష్, అట్టయ వర్సెస్ కయోలు, బజార్’ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ కూడా ఫిబ్రవరిని నాలుగు రిలీజులతోనే స్టార్ట్ చేసింది. ఆ తర్వాతి వారం పునీత్‌రాజ్ కుమార్ ‘నట సార్వభౌమ’ రిలీజ్ కానుంది. ఆ నెక్ట్స్ వీక్ ‘బెల్ బాటమ్’ వస్తుంది. ‘రంధావ’ చిత్రం కూడా రిలీజ్ అనౌన్స్ చేశారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలన్నింటితో పోలిస్తే తమిళంలోనే ఫిబ్రవరిలో రిలీజ్లు ఎక్కువగా ఉన్నాయి. – గౌతమ్ మల్లాది -
తమిళంలో ఇక డబ్ చేయలేనేమో..!
-
ఐరన్ లేడీ!
ఆ మధ్య జయలలిత మీద వరుసగా బయోపిక్స్ అనౌన్స్ చేసింది తమిళ ఇండస్ట్రీ. ఏయల్ విజయ్, ప్రియదర్శిని, భారతీరాజా దర్శకులు అనే వార్త వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురిలో దర్శకురాలు ప్రియదర్శిని ఒక అడుగు ముందుకువేసి ‘ఐరన్‌లేడీ’ అంటూ టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ బయోపిక్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ టైటిల్ రోల్ చేస్తారని సమాచారం. వచ్చే నెలలో ఓ గ్రాండ్ ఓపెనింగ్ ఫంక్షన్ నిర్వహించి, ఆ కార్యక్రమంలో నటీనటులను అనౌన్స్ చేయాలనుకుంటున్నారట. ‘‘ఎప్పటికీ తమిళుల గుండెల్లో ఉండిపోయేటువంటి జీవితాన్ని గడిపారు జయలలితగారు. ఈ సినిమా కచ్చితంగా ఆవిడకు మంచి నివాళిలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని ప్రియదర్శిని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు. -
40 ఏళ్లల్లో ఇదే మొదటిసారి!
కొత్త సంవత్సరం అంటే.. చేయాలనుకునే పనుల్లో ‘కొత్త సినిమా’ చూడటం ఒకటి. సినిమా లవర్స్ ప్లాన్ మోస్ట్లీ ఇలానే ఉంటుంది. అయితే ఈసారి తమిళ సినిమా లవర్స్‌కి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే తమిళ సంవత్సరాది (ఏప్రిల్ 14)కి కొత్త బొమ్మలేవీ థియేటర్‌కి రాలేదు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఆర్థిక లావాదేవీల విషయంలో పొత్తు కుదిరే వరకూ కొత్త సినిమాలు విడుదల చేసేది లేదని తమిళ పరిశ్రమ బలంగా నిర్ణయించుకుంది. ఆ మేరకు కొత్త సినిమాలేవీ రిలీజ్ చేయడంలేదు. స్ట్రైక్ మొదలై దాదాపు నెల రోజులు పైనే అయింది. ఇంకా తమిళ పరిశ్రమవారు కొత్త సినిమాలు విడుదల చేసే విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గడచిన 40 ఏళ్లల్లో ‘కొత్త సినిమా రిలీజ్’ చూడని కొత్త సంవత్సరాది ఇదేనట. సినీప్రియులకు ఇది బాధగానే ఉంటుంది. మరోవైపు పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు, థియేటర్లో సైకిల్ స్టాండ్, స్నాక్స్ అమ్ముకునేవారి వరకూ... అందరికీ నష్టమే. థియేటర్ల మెయిన్టైనెన్స్ కోసం పాత తమిళ సినిమాలను ప్రదర్శించుకుంటున్నారు. వాటికి ఆశించిన కలెక్షన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ స్ట్రైక్ లేకపోయి ఉంటే.. రజనీకాంత్ ‘కాలా’ వచ్చి ఉండేది. ఇక్కడ విడుదలైన ‘మెర్క్యురీ’ అక్కడ రిలీజయ్యుండేది. విశాల్ ‘ఇరుంబుదురై’ ఎప్పుడో రిలీజ్‌కి రెడీ అయి, రిలీజ్ డేట్ దొరక్క ఒకటి రెండు సార్లు, ఇప్పుడు స్ట్రైక్ వల్ల తెరపైకి రావడానికి నోచుకోలేదు. ఇప్పటికే ఇండస్ట్రీ 200 కోట్ల వరకూ నష్టపోయిందని చెన్నై వర్గాల అంచనా. మరి.. ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో? కొత్త తమిళ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి. ‘ఇరుంబుదురై’ లో విశాల్, సమంత ‘మెర్క్యురీ’లో ఓ దృశ్యం -
తమిళ సినీ ఇండస్ట్రీలో కలకలం
-
సెట్లో... టైమ్ బాంబ్
‘దేశముదురు’ ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఇక్కడ బాగానే సినిమాలు చేశారు హన్సిక. అయితే. తెలుగులోకన్నా ఇప్పుడు తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. అక్కడ హన్సిక కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా ఉంది. చిన్న ఖుష్బూ అని తమిళ పరిశ్రమ, ప్రేక్షకులు హన్సికను ముద్దుగా పిలుస్తుంటారు. ఆమెకు ఇంకో పేరు కూడా ఉంది. ఆ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ - ‘‘నేను షూటింగ్‌కి కరెక్ట్ టైమ్‌కి వెళిపోతాను. ఏడు గంటలంటే ఓ పది నిమిషాలు ముందే లొకేషన్లో ఉంటాను. అందుకే అందరూ నన్ను ‘టైమ్ బాంబ్’ అని పిలుస్తారు’’ అని చెప్పారు. పంక్చువాల్టీని ఇష్టపడే హన్సిక ఇప్పుడా విషయంలో కొంచెం మారాలనుకుంటున్నారు. ‘‘నేను ముందు లొకేషన్‌కి వెళిపోతాను. కానీ, ఆలస్యంగా వచ్చేవాళ్ల వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ స్టార్ట్ కాదు. దాంతో నేను ముందు వెళ్లినా ప్రయోజనం ఉండదు. అందుకే, కొంచెం మారాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కానీ, నావల్ల కావడం లేదు’’ అని హన్సిక పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో హన్సిక యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తాను చేస్తున్న చిత్రాల వివరాలు తెలియజేస్తుంటారు. అప్పుడప్పుడూ అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. హన్సిక ట్విట్టర్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య ఇటీవలే 20 లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ఈ బ్యూటీ ధన్యవాదాలు తెలిపారు. -
టాక్సీ డ్రైవర్‌గా..!
గాసిప్ శ్రుతీహాసన్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారా...? తమిళ పరిశ్రమ ఔననే అంటోంది. అజిత్ హీరోగా ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మొదట అజిత్ టాక్సీడ్రైవర్గా నటించనున్నారనే వార్త ప్రచారమైంది. తాజాగా, ఆ పాత్రను శ్రుతీ చేస్తున్నారని భోగట్టా. మరైతే.. అజిత్ పాత్ర ఏంటి? అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. -
నయనే నెంబర్ వన్
తమిళం, తెలుగు భాషల్లో నేటికీ నయనతారనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. అందం ఆమెకు దేవుడిచ్చిన వరం. అయితే అభినయం ఆమె శ్రమకు ఫలితం. వెరసి ప్రేక్షకులు ఆమెకు నెంబర్‌వన్ పట్టం కట్టారు. నయనతార 2005లో అయ్యా చిత్రం ద్వారా కోలీవుడ్‌కి రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత చంద్రముఖి, గజని, శివకాశి, భిల్లా, వల్లవన్, బాస్ ఎన్గిర భాస్కరన్ మొదలగు పలు హిట్ చిత్రాలతో నెంబర్‌వన్ హీరోయిన్ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. కొత్తగా ఎందరు హీరోయిన్లు వస్తున్నా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటునే వున్నారు. తెలుగులోను టాప్ హీరోయిన్గా వెలుగొందుతుండడం విశేషం. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ప్రతిఘటనలు ఎదురైనా దానిని నిబ్బరంతో ఎదుర్కొన్నారు. వాటి ప్రభావాలను నటనపై పడకుండా జాగ్రత్త పడ్డారు. నటనకు కొద్ది రోజులు దూరం అయినా రీ ఎంట్రీలో కూడా నెంబర్‌వన్ స్థానం ఈ బ్యూటీకి దూరం అవ్వలేదు. రాజారాణి, ఆరంభం చిత్రాలు విజయం సాధించి, నయనతారను మేటి నటిగా నిలబెట్టాయి. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ నయనతారనే. ఆ తరువాత వరుసలో కాజల్ అగర్వాల్ నిలిచారు. ఈ భామ ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాలు తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నారు. మూడో స్థానంలో హన్సిక, నాలుగో స్థానంలో సమంత నిలిచారు. వీరి పారితోషికం కోటి నుంచి రెండు కోట్లు వరకు ఉంటుందని సినీ వర్గాలంటున్నాయి. -
నటుడు బాలాజీ కన్నుమూత
హాస్య నటుడు బాలాజీ శుక్రవారం చెన్నై సమీపంలోని అనకాపుత్తూర్లో మృతి చెందారు. ఈయన బుల్లితెరపై లొల్లు సభ కార్యక్రమం ద్వారా ప్రాచుర్యం పొందారు. లొల్లుసభ బాలాజీగా గుర్తింపు పొందారు. సూపర్ 10 వంటి పలు టీవీ కార్యక్రమాల్లో పేరుగాంచిన బాలాజీ నేటి ప్రముఖ హాస్య నటుడు సంతానంను బుల్లితెరకు పరిచయం చేసిన క్రెడిట్ పొందారు. దిండుగల్ సారథి తదితర 50 చిత్రాల వరకు నటించిన ఈయన నటుడు శివ నటించిన తిల్లుముల్లు చిత్రానికి సంభాషణలు రాశారు. పచ్చకామెర్లకు గురైన బాలాజీ చికిత్స పొందుతూ వచ్చా రు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడం తో శుక్రవారం వేకువజామున ఆయనను కుటుంబ సభ్యులు అనకాపుత్తూర్ సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయ న కన్నుమూశారు. బాలాజీకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
ఒన్ అండ్ ఓన్లీ రజినీకాంత్!
విశ్లేషణం అతనో మరాఠీ... పుట్టింది కన్నడసీమలో... నటించింది తమిళ సినిమాల్లో... అయినా భారతదేశం మొత్తం మెచ్చింది... అంతేనా... జపాన్, టర్కీ, జర్మనీ, తదితర విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్న రియల్ సూపర్‌స్టార్ రజినీకాంత్. ఆ పేరు చెప్తే చాలు అభిమానులు పొంగిపోతారు... ఆయన తెరపై కనిపిస్తే చాలు ఆనందతాండవం చేస్తారు... ఆయనకు ఎందుకంత క్రేజ్? ఏమిటాయన స్పెషాలిటీ? అసమాన్య వ్యక్తిత్వం... పరిసరాలు, ప్రవర్తన, నైపుణ్యాలు, విలువలు, విశ్వాసాలు, ఐడెంటిటీ, జీవితాదర్శం... వీటిలో దేనిపై వ్యక్తి ఎక్కువగా ఆధారపడుతున్నాడో దాని ఆధారంగా వ్యక్తిత్వాన్ని విశ్లేషించవచ్చు. రజినీ బలం, రజినీ ప్రత్యేకత ఆయన వ్యక్తిత్వంలో ఉంది. దేశవిదేశాలు ఆయనను సూపర్‌స్టార్‌గా చూస్తున్నా... తనను తాను ఒక సామాన్యుడిగా ఐడెంటిఫై చేసుకోవడంలో ఉంది. ఆయన నమస్కరించేటప్పుడు గమనించండి... ఒక స్టార్లా స్టైల్‌గా చేతులూపరు, చాలా వినయంగా నమస్కరిస్తారు. తనకన్నా చిన్నవారైనా సరే చాలా గౌరవిస్తారు. అదే ఆయన స్పెషాలిటీ. తానెంత ఎదిగినా తన మూలాలను మరిచిపోకపోవడం, స్నేహాలను, స్నేహితులను విస్మరించకపోవడం... సినిమా ఫ్లాప్ అయితే పంపిణీదారులకు డబ్బు వెనక్కుతిరిగి ఇవ్వడం... రజినీ ఆచరించే విలువలకు నిదర్శనం. దైవం, గురువుల పట్ల అచంచల విశ్వాసం, ఆధ్యాత్మిక సాధనలో అనురక్తి రజినీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. ఈ జీవితానికి మించిన సత్యమేదో ఉందని, దానిని తెలుసుకోవాలని నిరంతర యోగసాధన చేస్తుంటారు. ఆయనో సూపర్‌స్టార్ అనే కంటే, సూపర్ హ్యూమన్ బీయింగ్ అనడం కరెక్ట్. స్టైల్ ఈజ్ ద సీక్రెట్ రజినీ విజువల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్. ఆయన మాట్లాడేటప్పుడు కళ్లు అప్పుడప్పుడూ పైకి చూస్తుంటాయి. ఆయనది ఎడమచేతివాటం. అందుకేనేమో తనకంటూ ఒక క్రియేటివ్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. మాట్లాడే మాటలు, చేతుల కదలికల మధ్య ఒక లయ ఉంటుంది... అంటే మనసులో ఉన్నదే చెప్తున్నారన్నమాట. అలాగే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు గడ్డం కింద చేయి ఉంచుకుని చాలా శ్రద్ధగా ఉంటారు. అప్పుడప్పుడూ వారి మాటల్లో నిజమెంతో విశ్లేషిస్తుంటారు కూడా. సుభాషితాల్లాంటి మాటలు... నా దారి... రహదారి, నేను ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే, దేవుడు ఆదేశిస్తాడు నేను పాటిస్తాను, నేను చెప్పిందే చేస్తాను చేసేదే చెప్తాను, మన జీవితం మన చేతుల్లోనే ఉంది... కష్టపడనిదే ఏదీ రాదు... అలా వచ్చింది నీతో ఉండదు... ఇవన్నీ రజినీ సినిమాల్లో చెప్పిన డైలాగ్స్. అందరూ ఆచరించదగిన సుభాషితాల్లాంటి డైలాగ్స్. రజినీ డైలాగ్స్ ఆధారంగా ఒక మేనేజ్మెంట్ పుస్తకమే వచ్చిందంటే ఆ మాటల్లోని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లోనే కాదు... నిజజీవితంలో కూడా రజినీ ఇలాంటి పాజిటివ్ విషయాలే చెప్తుంటారు. ‘‘ఎవరు తన గురించి తాను ఎక్కువ చెప్పుకుంటారో, తెలియనిది తెలిసినట్లు చెప్తారో.. వారు కమెడియన్. ఎవరు సెల్ఫిష్‌గా థింక్ చేసి నేను బాగుండాలి, ఇంకెవరూ బాగుండకూడదని చెప్పి నెగెటివ్‌గానే థింక్చేసి నెగెటివ్ ఎనర్జీని ఇస్తారో... వారు విలన్. ఎవరు నేను బాగుండాలి, అందరూ బాగుండాలని పాజిటివ్‌గా ఆలోచించి పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ ఫీలింగ్‌ని ఇస్తారో... వారు హీరో’’ అని చెప్పే రజినీకాంత్... నిజమైన హీరో. నిజజీవితంలో కూడా హీరో! - విశేష్, సైకాలజిస్ట్