నటుడు బాలాజీ కన్నుమూత
హాస్య నటుడు బాలాజీ శుక్రవారం చెన్నై సమీపంలోని అనకాపుత్తూర్‌లో మృతి చెందారు. ఈయన బుల్లితెరపై లొల్లు సభ కార్యక్రమం ద్వారా ప్రాచుర్యం పొందారు. లొల్లుసభ బాలాజీగా గుర్తింపు పొందారు. సూపర్ 10 వంటి పలు టీవీ కార్యక్రమాల్లో పేరుగాంచిన బాలాజీ నేటి ప్రముఖ హాస్య నటుడు సంతానంను బుల్లితెరకు పరిచయం చేసిన క్రెడిట్ పొందారు.
దిండుగల్ సారథి తదితర 50 చిత్రాల వరకు నటించిన ఈయన నటుడు శివ నటించిన తిల్లుముల్లు చిత్రానికి సంభాషణలు రాశారు. పచ్చకామెర్లకు గురైన బాలాజీ చికిత్స పొందుతూ వచ్చా రు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడం తో శుక్రవారం వేకువజామున ఆయనను కుటుంబ సభ్యులు అనకాపుత్తూర్ సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయ న కన్నుమూశారు. బాలాజీకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.