'సార్' హీరో ధనుష్‌కి షాక్ తగిలేలా కనిపిస్తుంది. తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక్కడ ఓ చిక్కొచ్చి పడింది. తమిళ నిర్మాతల మండలి అతడికి రెడ్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ధనుష్తోపాటు అతడి చిత్రాలపై నిషేధం గ్యారంటీ. అసలేమైంది? రెడ్ కార్డ్ అంటే ఏంటి?
ఏం జరిగింది?
దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ధనుష్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే గతంలో శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సినిమా చేస్తానని మాటిచ్చాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇది జరిగి చాలా ఏళ్లవుతుంది. కానీ సినిమా మాత్రం చేయట్లేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ.. తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. ఇలా ఆలస్యం చేస్తున్నందుకుగానూ ధనుష్ కి రెడ్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!)
రెడ్ కార్డ్ ఇస్తే?
ధనుష్ లానే పలు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని సినిమాలు చేయడం లేదనే కారణంతో హీరోలు శింబు, విశాల్, ఎస్జే సూర్య, అథర్వతో పాటు కమెడియన్ యోగిబాబుకి తమిళ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇవ్వనుందనే సమాచారం ఈ మధ్యే బయటకొచ్చింది. ఒకవేళ ఇది జారీ చేస్తే.. ఏ దర్శకనిర్మాతలు వీళ్లతో సినిమా చేయడం కుదరదు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లపై నిషేధం విధించినట్లే. గతంలో డైరెక్టర్ శంకర్ తో ఇలాంటి వివాదం కారణంగానే కమెడియన్ వడివేలు.. ఏళ్లపాటు సినిమాలకు దూరమయ్యాడు.
ధనుష్ ఏం చేస్తున్నాడు?
ఈ ఏడాది తెలుగులో 'సార్'తో ఎంట్రీ ఇచ్చి మిక్స్ డ్ టాక్ అందుకున్న ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు 'మిల్లర్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇది మూడు భాగాల ఫ్రాంచైజీగా తీస్తున్నారు. తొలి భాగం త్వరలో విడుదల కానుంది. మరోవైపు కొన్నిరోజుల ముందే బాలీవుడ్ లోనూ ఓ చిత్రం ఒప్పుకొన్నాడు. ఒకవేళ రెడ్ కార్డ్ ఇస్తే మాత్రం ఈ సినిమాల రిలీజ్ చేయడానికి వీలు లేకుండా పోతుంది!
Actor #Dhanush did not complete the long pending committed movie with Sri Thenandal Films, hence the producer council is discussing to issue red card.
— Manobala Vijayabalan (@ManobalaV) July 1, 2023
Recently #SilambarasanTR, #Vishal, #SJSuriya etc were given red card.
(ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment