Red Card
-
CPL 2023: క్రికెట్లో తొలిసారి రెడ్ కార్డ్ ప్రయోగం.. తొలి బాధితుడిగా..!
క్రికెట్లో తొలిసారి రెడ్ కార్డ్ జారీ చేయబడింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న (ఆగస్ట్ 27) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్‌కు అంపైర్ రెడ్ కార్డ్ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో రెడ్ కార్డ్ కారణంగా మైదానం వీడిన తొలి క్రికెటర్‌గా సునీల్ నరైన్ చరిత్రపుటల్లోకెక్కాడు. Red Card in cricket. So apparently, captain gets to pick who they have to send out of the field. Dhoni might have a lot of options if this comes in IPL.pic.twitter.com/gycU62MmAF — Silly Point (@FarziCricketer) August 28, 2023 స్లో ఓవర్‌రేట్ కారణంగా జట్టులో ఎవరో ఒక ఆటగాడు మైదానం వీడాల్సి ఉండటంతో, అప్పటికే తన కోటా ఓవర్లు పూర్తి చేసుకున్న సునీల్ నరైన్ పేరును ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ప్రతిపాదించగా.. ఫీల్డ్ అంపైర్ నరైన్‌కు రెడ్ కార్డ్ చూపించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లోనే తొలిసారి క్రికెట్లో ఈ రెడ్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది. ఫుట్‌బాల్‌లో ఈ రెడ్ కార్డ్ విధానాన్ని మనం తరుచూ చూస్తుంటాం. అయితే క్రికెట్లో మాత్రం ఇదే తొలిసారి. ఫుట్‌బాల్‌లో ఓ ఆటగాడు కఠినమైన ఫౌల్కు పాల్పడినప్పుడు రిఫరీ అతనికి రెడ్ కార్డ్ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశిస్తాడు. అయితే క్రికెట్లో ఫుట్బాల్లోలా కాకుండా స్లో ఓవర్ రేట్‌కు పెనాల్టీగా ఈ రెడ్ కార్డ్‌ను ఇష్యూ చేస్తారు. ఓ ఇన్నింగ్స్‌లో 3 సార్లు నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే, రెడ్ కార్డ్‌ను జారీ చేస్తారు. తొలిసారి నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే ఓ ఫీల్డర్‌ను (ఐదో ఫీల్డర్), రెండో సారి అదే రిపీటైతే మరో ఫీల్డర్‌ను (ఆరో ఫీల్డర్) 20 యార్డ్స్ సర్కిల్‌లోకి తీసుకరావాల్సి ఉంటుంది. ఇక ఇదే మూడోసారి రిపీటైతే మాత్రం జట్టులోకి ఓ ఆటగాడు మైదానాన్ని వీడాల్సి ఉంటుంది. నిన్నటి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 17, 18, 19వ ఓవర్లను కోటా సమయంలో పూర్తి చేయకపోవడంతో అంపైర్ ఆ జట్టులోని ఓ ఫీల్డర్‌ను మైదానం వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో నైట్‌రైడర్స్ 10 మంది ఆటగాళ్లతోనే చివరి ఓవర్ కొనసాగించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. 179 పరుగుల లక్ష్యఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. -
హీరో ధనుష్‌కి రెడ్ కార్డ్.. అతడి సినిమాలపై నిషేధం?
'సార్' హీరో ధనుష్‌కి షాక్ తగిలేలా కనిపిస్తుంది. తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక్కడ ఓ చిక్కొచ్చి పడింది. తమిళ నిర్మాతల మండలి అతడికి రెడ్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ధనుష్‌తోపాటు అతడి చిత్రాలపై నిషేధం గ్యారంటీ. అసలేమైంది? రెడ్ కార్డ్ అంటే ఏంటి? ఏం జరిగింది? దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ధనుష్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే గతంలో శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సినిమా చేస్తానని మాటిచ్చాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇది జరిగి చాలా ఏళ్లవుతుంది. కానీ సినిమా మాత్రం చేయట్లేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ.. తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. ఇలా ఆలస్యం చేస్తున్నందుకుగానూ ధనుష్ కి రెడ్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!) రెడ్ కార్డ్ ఇస్తే? ధనుష్ లానే పలు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని సినిమాలు చేయడం లేదనే కారణంతో హీరోలు శింబు, విశాల్, ఎస్జే సూర్య, అథర్వతో పాటు కమెడియన్ యోగిబాబుకి తమిళ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇవ్వనుందనే సమాచారం ఈ మధ్యే బయటకొచ్చింది. ఒకవేళ ఇది జారీ చేస్తే.. ఏ దర్శకనిర్మాతలు వీళ్లతో సినిమా చేయడం కుదరదు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లపై నిషేధం విధించినట్లే. గతంలో డైరెక్టర్ శంకర్ తో ఇలాంటి వివాదం కారణంగానే కమెడియన్ వడివేలు.. ఏళ్లపాటు సినిమాలకు దూరమయ్యాడు. ధనుష్ ఏం చేస్తున్నాడు? ఈ ఏడాది తెలుగులో 'సార్'తో ఎంట్రీ ఇచ్చి మిక్స్ డ్ టాక్ అందుకున్న ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు 'మిల్లర్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇది మూడు భాగాల ఫ్రాంచైజీగా తీస్తున్నారు. తొలి భాగం త్వరలో విడుదల కానుంది. మరోవైపు కొన్నిరోజుల ముందే బాలీవుడ్ లోనూ ఓ చిత్రం ఒప్పుకొన్నాడు. ఒకవేళ రెడ్ కార్డ్ ఇస్తే మాత్రం ఈ సినిమాల రిలీజ్ చేయడానికి వీలు లేకుండా పోతుంది! Actor #Dhanush did not complete the long pending committed movie with Sri Thenandal Films, hence the producer council is discussing to issue red card. Recently #SilambarasanTR, #Vishal, #SJSuriya etc were given red card. — Manobala Vijayabalan (@ManobalaV) July 1, 2023 (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) -
హీరో శింబుకు ఊరట.. రెడ్‌కార్డు రద్దు
చెన్నై: నటుడు శింబుకు ఊరట కలిగింది. ఆయనపై తమిళ నిర్మాతల మండలి విధించిన రెడ్కార్డును రద్దు చేసింది. శింబు కథానాయకుడిగా అన్బాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించిన మైఖేల్ రాయప్పన్ శింబు సహకరించకపోవడం వల్లే తాను రూ.2 కోట్లు నష్టపోయానని తమిళ నిర్మాతల మండలిలో (టీఎఫ్‌పీసీ) ఫిర్యాదు చేశారు. శింబు నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతల మండలి తీర్మానం చేసినా ఫలితం లేకపోవడంతో రెడ్ కార్డును విధించారు. ఈ వ్యవహారంపై శింబు తల్లి ఉష ఇటీవల నిర్మాతల మండలికి లేఖ రాశారు. తదనంతరం శింబుకు, నిర్మాతల మండలికి మధ్య జరిగిన చర్చల్లో ఈ వివాదానికి పరిష్కారం లభించింది. చదవండి : సినిమాలకు సమంత బ్రేక్.. అందుకేనా! మా సినిమా సక్సెస్‌పై పూర్తి నమ్మకం ఉంది: సుశాంత్ -
ఆ టాప్ కమెడియన్ కథ ముగిసినట్టేనా?
కోలీవుడ్‌లో గౌండ్రమణి, సెంథిల్ తరం తరువాత సినిమాల్లో హాస్యాన్ని మరో కోణంలో ప్రేక్షకుల ముందుంచి పరవశింపజేసిన నటుడు వడివేలు. అలాంటి నటుడి వినోదానికి ఇక పుల్‌స్టాప్ పడినట్లేనా? పరిస్థితులు గమనిస్తే అలానే అనిపిస్తోంది. హాస్య నటుడి నుంచి కథానాయకుడి స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన నటుడు వడివేలు. ఈ కామెడీ నటుడ్ని హీరోగా పరిచయం చేసింది దర్శకుడు శంకర్. ఆయనే వడివేలు హాస్య శకానికి ముగింపు పలికేలా ఉన్నారు. ఇందుకు వడివేలు స్వయంకృపరాధం కారణం అంటున్నారు. ఆ కథేంటో తెలుసుకోవాలనుందా?. స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగా ఆయన శిష్యుడు శింబదేవన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ఇంసైఅరసన్ 23ఆమ్ పులికేసి. ఈ చిత్రం ద్వారా హాస్య నటుడు వడివేలును కథానాయకుడిగా పరిచయం చేశారు. చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత వడివేలు కొన్ని చిత్రాల్లో హీరోగా నటించినా అవి బాక్సాపీస్ వద్ద పడకేశాయి. కాగా శంకర్ మళ్లీ హింసై ఆరసన్ 23 ఆమ్ పులికేసి చిత్ర యూనిట్‌తో దానికి సీక్వెల్ నిర్మించ తలపెట్డారు. చిత్రం కోసం భారీ సెట్లు వేసి షూటింగ్‌ను మొదలెట్టారు. కొన్ని రోజులు సవ్యంగా సాగిన షూటింగ్ అనివార్య కారణాల వల్ల ఆగింది. అంతే ఆ ఆగడం ఇప్పటి వరకూ మళ్లీ జరగలేదు. ఇందుకు వడివేలు కాల్షీట్స్ కేటాయించక పోవడమే కారణంగా దర్శకుడు శంకర్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. మండలి వడివేలకు నోటీసులు పంపి వివరణ కోరింది. అందుకు వడివేలు తన కాల్షీట్స్ను పులికేసి చిత్ర యూనిట్ వృథా చేశారన్నారు. ఆ చిత్రం కారణంగా తాను చాలా అవకాశాలను వదులకోవలసి వచ్చిందని వివరణ ఇచ్చారు. మళ్లీ నటించాలంటే అధనంగా పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. శంకర్ తన చిత్రాన్ని పూర్తి చేయకపోతే తాను ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ. 9 కోట్లను వడివేలు తనకు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీన్ని నిర్మాతల సంఘం దృఢ పరచడంతో వడివేలు షాక్ అయ్యాడు. దీంతో తను పులికేసి చిత్రంలో మళ్లీ నటించడం మినహా మరో దారి లేదని చాలా మంది అనుకున్నారు. వడివేలు మాత్రం తాను ఆ చిత్రంలో నటించేది లేదని ఖరాఖండీగా చెప్పాడు. దీంతో నిర్మాతల సంఘం పులికేసి 2 చిత్రాన్ని పూర్తి చేసేవరకూ ఇతర ఏ చిత్రంలోనూ నటించరాదని వడివేలుపై రెడ్ కార్డ్ ప్రకటించినట్లు సమాచారం. ఈ విషయమై వడివేలును సంప్రదించగా ఆయన ఈ విషయమై తనకు నిర్మాతల మండలి నుంచి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వడివేలు ఏ చిత్రంలోనూ నటించడం లేదు. -
కార్తీక్ సుబ్బరాజ్‌పై నిర్మాతల గుర్రు
యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌పై తమిళ నిర్మాతలు గుర్రుగా ఉన్నారు. ఆయనపై రెడ్‌కార్డ్ వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. పిజ్జా, జిగరతండా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్. ఈయ న ఆది నుంచి వివాదాలను ఎదుర్కొంటున్నారు. జిగర్తండా చిత్రం నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాతతో భేదాభిప్రాయాలు సంచలనం కలిగించాయి. తాజాగా ఇరైవి చిత్రంతో మరో సారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. విజయ్‌సేతుపతి, ఎస్జే.సూర్య, బాబీ సింహ, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరై వి. కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా, సీవీ.కుమార్ నిర్మిం చారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఇరైవి చిత్ర రిజల్ట్ ఎలా ఉందన్నది పక్కన పెడితే ఇందులోని కొన్ని సన్నివేశాలు తమిళ నిర్మాతలను అవమాన పరచేవిగా ఉన్నాయంటూ పలు నిర్మాతలు ధ్వజమెత్తుతున్నారు. నిర్మాత సురేశ్‌కామాక్షి, పిఎల్.తేనప్పన్ వంటి నిర్మాతలు కార్తీక్సుబ్బరాజ్కు వ్యతిరేకంగా తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. నిర్మాత ఈగో కారణంగా చిత్ర నిర్మాణం నిలిచిపోయిందనే సన్నివేశాలతో సినీ నిర్మాతలను అవమాన పరిచేవిధంగా ఇరైవి చిత్రంలో సన్నివేశాలు చోటు చేసుకున్నాయని,ఈ చిత్ర నిర్మాతలు జ్ఞానవేల్‌రాజా, సీవీ.కుమార్ కథ తెలియకుండా ఇరైవి చిత్రాన్ని నిర్మించి ఉండరని, అందువల్ల ఈ విషయంలో వారిని కూడా ప్రశ్నించాలని తమిళ నిర్మాతల మండలిపై ఒత్తిడి పెరుగుతోంది. సోమవారం తమిళ నిర్మాతల సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇరైవి చిత్ర వివాదం గురించి చర్చించారు. సమావేశంలో పలువురు నిర్మాతలు కార్తీక్సుబ్బరాజ్పై రెడ్‌కార్డ్ వేయాలని డిమాండ్ చేశారు.అ యితే ఒక దర్శకుడిపై నిర్మాతల మండలి రెడ్ కార్డ్ వేయలేదని,ఈ అంశాన్ని దర్శకుల సంఘానికి వదిలిపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో కార్తీక్‌సుబ్బరాజ్ వివా దం దర్శకుల సంఘం కోర్డుకు చేరినట్లు తెలిసింది. ఆ సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.