
చెన్నై: నటుడు శింబుకు ఊరట కలిగింది. ఆయనపై తమిళ నిర్మాతల మండలి విధించిన రెడ్‌కార్డును రద్దు చేసింది. శింబు కథానాయకుడిగా అన్బాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించిన మైఖేల్ రాయప్పన్ శింబు సహకరించకపోవడం వల్లే తాను రూ.2 కోట్లు నష్టపోయానని తమిళ నిర్మాతల మండలిలో (టీఎఫ్‌పీసీ) ఫిర్యాదు చేశారు.
శింబు నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతల మండలి తీర్మానం చేసినా ఫలితం లేకపోవడంతో రెడ్ కార్డును విధించారు. ఈ వ్యవహారంపై శింబు తల్లి ఉష ఇటీవల నిర్మాతల మండలికి లేఖ రాశారు. తదనంతరం శింబుకు, నిర్మాతల మండలికి మధ్య జరిగిన చర్చల్లో ఈ వివాదానికి పరిష్కారం లభించింది.
చదవండి : సినిమాలకు సమంత బ్రేక్.. అందుకేనా!
మా సినిమా సక్సెస్‌పై పూర్తి నమ్మకం ఉంది: సుశాంత్