తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు వెల్లడించింది. స్టార్ హీరోలు నటించే ఏ సినిమాలైనా రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్ణయించింది. ఆగస్టు 16వ తేదీ తర్వాత కొత్త సినిమాల షూటింగ్ ప్రారంభించవద్దని సూచించింది.
అంతే కాకుండా ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలన్నీ అక్టోబరు 31వ తేదీలోగా పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు థియేటర్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు ఫిల్మ్ డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు..
అగ్ర హీరోలు నటించిన చిత్రాలను థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేయాలి.
ఇటీవలి కాలంలో ఎక్కువగా నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఇతర చిత్రాలకు వెళ్లడం వలన నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, సాంకేతిక నిపుణులు వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రానికి పనిచేయాలి.
నటుడు ధనుష్ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయనకు వివిధ చిత్ర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌లు వెళ్లాయి. వారందరూ నిర్మాతల అసోసియేషన్‌తో మాట్లాడి తమ పనులు మొదలు పెట్టాలి. కొత్త సినిమాల పనిని ప్రారంభించే ముందు నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు తెలియజేయాలి.
అనేక తమిళ సినిమాలు సరైన థియేటర్లు దొరక్క నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి అసోసియేషన్ కొత్త నిబంధనలను ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల షూటింగ్‌లు ప్రారంభించకూడదు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలు అక్టోబర్ 31 నాటికి పూర్తి కావాలి. నిర్మాణ సంస్థలు ఈ సినిమా షూటింగ్ వివరాలను తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు అందించాలి.
నటీనటులు, టెక్నీషియన్ల జీతాలు, ఇతర ఖర్చులు అదుపులేకుండా పెరిగిపోతున్నందున, చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే నవంబర్ 1 నుంచి తమిళ సినిమాకు సంబంధించిన అన్ని రకాల షూటింగ్‌లను నిలిపివేయాలని మండలి ప్రతిపాదించింది.
చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment