TFPC
-
'ఆ రోజు నుంచి షూటింగ్‌లు బంద్'.. నిర్మాతల మండలి కీలక నిర్ణయం
తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు వెల్లడించింది. స్టార్ హీరోలు నటించే ఏ సినిమాలైనా రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించింది. ఆగస్టు 16వ తేదీ తర్వాత కొత్త సినిమాల షూటింగ్ ప్రారంభించవద్దని సూచించింది.అంతే కాకుండా ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలన్నీ అక్టోబరు 31వ తేదీలోగా పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు థియేటర్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు ఫిల్మ్ డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు..అగ్ర హీరోలు నటించిన చిత్రాలను థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేయాలి.ఇటీవలి కాలంలో ఎక్కువగా నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఇతర చిత్రాలకు వెళ్లడం వలన నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, సాంకేతిక నిపుణులు వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రానికి పనిచేయాలి.నటుడు ధనుష్ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయనకు వివిధ చిత్ర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌లు వెళ్లాయి. వారందరూ నిర్మాతల అసోసియేషన్‌తో మాట్లాడి తమ పనులు మొదలు పెట్టాలి. కొత్త సినిమాల పనిని ప్రారంభించే ముందు నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు తెలియజేయాలి.అనేక తమిళ సినిమాలు సరైన థియేటర్లు దొరక్క నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి అసోసియేషన్ కొత్త నిబంధనలను ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల షూటింగ్‌లు ప్రారంభించకూడదు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలు అక్టోబర్ 31 నాటికి పూర్తి కావాలి. నిర్మాణ సంస్థలు ఈ సినిమా షూటింగ్ వివరాలను తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు అందించాలి.నటీనటులు, టెక్నీషియన్ల జీతాలు, ఇతర ఖర్చులు అదుపులేకుండా పెరిగిపోతున్నందున, చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే నవంబర్ 1 నుంచి తమిళ సినిమాకు సంబంధించిన అన్ని రకాల షూటింగ్‌లను నిలిపివేయాలని మండలి ప్రతిపాదించింది.చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. -
పాయల్ రాజ్‌పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
'ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్ చేసిన ఆరోపణలపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది. నాలుగేళ్ల క్రితం నటించిన రక్షణ సినిమాను ప్రమోట్ చేయకపోతే టాలీవుడ్ బహిష్కరిస్తామంంటున్నారని పాయల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై టీఎఫ్‌పీసీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. పాయల్ సినిమాను ప్రమోట్ చేయడానికి డేట్లు కేటాయించకపోవడంపై నిర్మాత, దర్శకుడు ప్రణ్‌దీప్ ఠాకూర్ నుంచి మార్చిలోనే తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. అతను ఈ సినిమాను ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నాడని తెలిపింది. కానీ ఇందుకు పాయల్ సహకరించలేదని.. మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆమె చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ప్రమోషన్స్‌కు వస్తే ఆమెకు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వెల్లడించారు.ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ఆమె ఆరోపణలను ఖండిస్తూ.. మేనేజర్ ద్వారా పాయల్‌ను కలిసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని టీఎఫ్‌పీసీ పేర్కొంది. ఈ చిత్రంలో పాయల్ నటించినందున ప్రమోషన్స్ సమయంలో ఆమె పేరును ఉపయోగించుకునే హక్కు నిర్మాత, దర్శకుడు ప్రణ్దీప్కు ఉందని వారు పేర్కొన్నారు.బ్యాన్ చేస్తామంటూ..కాగా.. అంతకుముందు పాయల్ తనను బెదిరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రక్షణ సినిమా ప్రమోషన్లకు పాల్గొనకపోతే టాలీవుడ్లో నిషేధిస్తామంటున్నారంటూ ఆరోపించింది. నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్‌తో నా టీమ్ ఇప్పటికే చెప్పిందని.. కానీ వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదని పేర్కొంది. నా ప్రమేయం లేకుండా ఆ సినిమాలో నాపేరు, పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేసింది.'రక్షణ'లో పోలీస్ ఆఫీసర్‌గా పాయల్రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే. Producer & Director Sri Prandeep Thakore gave a complaint on his film "Rakshana" Heroine and Lead artist Ms. Payal Rajput at Telugu Film Producers Council pic.twitter.com/0TlzpYmA3s— Telugu Film Producers Council (@tfpcin) May 20, 2024 -
ముదురుతున్న వారసుడు మూవీ వివాదం, మండిపడుతున్న తమిళ్ దర్శక-నిర్మాతలు
వారసుడు మూవీ వివాదం ముదురుతోంది. ఇటీవల తెలుగు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం టాలీవుడ్-కోలీవుడ్ మధ్య లోకల్-నాన్‌లోకల్ వార్ రచ్చకు దారి తీసేల కనిపిస్తోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా రానున్న ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి తెలుగు చిత్రాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని, డబ్బింగ్ సినిమాలు విడుదల చేయొద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి రీసెంట్గా లేఖ విడుదల చేసింది. ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బేబీ బంప్ ఫొటోలు షేర్ షాకిచ్చిన హీరోయిన్, ఫొటోలు వైరల్ తమిళనాట తెలుగు సినిమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అవుతున్నాయని, కానీ తెలుగులో తమిళ చిత్రాలను ఆపడం ఏంటని దర్శకులు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు తాము కూడా తెలుగు చిత్రాలను అడ్డుకుంటామని వారు పేర్కొన్నారు. వారసుడు విషయానికి వస్తే దర్శక నిర్మాతలు ఇద్దరూ తెలుగు వారేనని, హీరో మాత్రమే తమిళ నటుడని డైరెక్టర్ సీమాన్ తెలిపారు. ఇంత జరుగుతున్న స్పందించకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాగా ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. -
సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల మండలి కీలక ప్రకటన
సినీ కార్మికుల వేతనాల పెంపుకు చలన చిత్ర నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మికుల డిమాండ్ మేరకు వేతనాలను 30 శాతం పెంచుతున్నట్లు తాజాగా ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి, ఫలిం ఫెడరేషన్ సంయుక్తంగా అధికారిక ప్రకటన ఇచ్చింది. పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చాయి. ఇక ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అనేది ఫిలిం చాంబర్, ఫెడరేషన్ కలిసి నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఈ తాజా వేతనాల పెంపు సవరణ అనేది 01-07-2022 నుంచి 30-06-2025 వరకు అమలవుందని నిర్మతల మండలి స్పష్టం చేసింది. కాగా ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫెడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. Telugu Film Industry PRESS NOTE#TFPC #TELUGUFILMPRODUCERSCOUNCIL #TFCC #TFI pic.twitter.com/7XBs9feYkp — Telugu Film Producers Council (@tfpcin) September 15, 2022 చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి -
సినీ కార్మికుల వేతనాల పెంపునకు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్..
వేతనాలు పెంచాలనే సినీ కార్మికుల డిమాండ్‌పై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించింది. కార్మికుల డిమాండ్ మేరకు 30 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ నాయకులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. రెండు నెలలు క్రితం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫేడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. ఇక దీనిపై రేపు (సెప్టెంబర్ 15) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలిం ఫేడరేషన్ నాయకులు భావిస్తున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. -
తెలుగు నిర్మాతల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: తమిళ డైరెక్టర్
సుందర పాండియన్ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు ఎస్ఆర్ ప్రభాకరన్. ఆ చిత్రం హిట్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. శశికుమార్ కథానాయకుడుగా నటించి నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును గెలుచుకున్న దర్శకుడు ఎస్ఆర్ ప్రభాకరన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. అవార్డులు దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం కథను రాయలేదని, సహజత్వంగా ఉండాలన్న దృష్టిలో పెట్టుకుని కథలు రాశానన్నారు. దర్శకుడు, నటుడు శశికుమార్ కూడా కథా చిత్రాలు సహజత్వానికి దగ్గరగా ఉండాలని భావిస్తారన్నారు. శశికుమార్ వద్ద సహాయకుడిగా పని చేశానని ఆయన చిత్రాలు చాలా యదార్థంగా ఉంటాయని తెలిపారు. ఆయన నిర్మిం కథానాయకుడిగా నటించిన సుందరపాండియన్ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డును అందుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం శశికుమార్ కథానాయకుడిగా ముందానై ముడిచ్చు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా నటి తాన్యా రవిచంద్రన్ ప్రధాన పాత్రలో రెక్కై ములైత్తేన్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా రరల్ పొలిటికల్ క్రైమ్ కథాంశంతో కొలైక్కారన్ కైరేఖగళ్ పేరుతో వెబ్‌సిరీస్‌ను జీ–5 సంస్థ కోసం రపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో కలైయరసన్ వాణిభోజన్ జంటగా నటిస్తున్నారని తెలిపారు. అలాగే ఇతర దర్శకులకూ అవకాశం ఇస్త చిత్రాలు నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. తనకు నటుడు అవ్వాలన్న ఆసక్తి లేదని, మంచి చిత్రాలు చేసి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగులో చిత్రాలు చేసి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగులోనూ చిత్రాలు చేసే ఆలోచన ఉందని చెప్పారు. చిత్రాలు ఓటీటీలో విడుదల చేయడం వ్యాపారం కోసం అని పేర్కొన్నారు. కాగా ఇటీవల నటీనటులు వారి సహాయకుల వేతనాలను వారే చెల్లించాలని తెలుగు సినీ వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, దీనిని కోలీవుడ్‌లోనూ అమలు పరచడానికి తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. -
8 వారాల తర్వాత... షూటింగ్స్ రీస్టార్ట్ పై దిల్‌రాజు క్లారిటీ
-
8 వారాల తర్వాతే ఓటీటీలో సినిమా: దిల్ రాజు
సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిర్మాతలు షూటింగ్‌లు బంద్ చేసిన విషయం తెలిసిందే! ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు వేసి చర్చిస్తున్నారు. తాజాగా ఫిలిం ఛాంబర్ సభ్యులు తాము తీసుకున్న కొత్త నిర్ణయాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు ఆపేసి మరీ కమిటీలు వేసుకున్నాం. నిర్మాతలుగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. 8 వారాల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. టికెట్ రేట్లు కూడా తగ్గించాలని భావిస్తున్నాం. థియేటర్లు, మల్టీప్లెక్సులతో మాట్లాడాం.. సినీప్రియులకు టికెట్ రేట్లు తగ్గించి ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఇక సినిమాలో ఎందుకు వృథా ఖర్చు అవుతుందనేది చర్చించాం.. ఇంకా షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభం కావాలనేది నిర్ణయం తీసుకోలేదు. మరో మూడు నాలుగు రోజుల్లో ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాతే అన్నీ వివరంగా చెప్తాం' అని చెప్పుకొచ్చాడు. ఈ సమావేశానికి సి. కల్యాణ్, మైత్రి రవి, దామోదర ప్రసాద్, బాపినీడు డైరెక్టర్ తేజ తదితరులు హాజరయ్యారు. చదవండి: బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్ ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి -
వజ్రోత్సవ వేడుకలపై సినీ ప్రముఖులతో మాట్లాడిన తలసాని
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 9 నుండి 22 వరకు ఘనంగా నిర్వహించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ అధికారులు, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు తలసాని. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుగారి ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నాం. ఇక విద్యార్థులందరికీ మహాత్మా గాంధీ చరిత్రను తెలియజెప్పే, విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన చిత్రాలను రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్థ్యంతో ఉన్న 563 స్క్రీన్లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను థియేటర్లకు తీసుకెళ్ళే రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే చేపడుతుంది. అలాగే సినిమాల ప్రదర్శన సమయాల్లో వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తాం’’ అని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సునీల్ నారంగ్, కార్యదర్శులు అనుపమ్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, ఎఫ్డీసీ ఈడీ కిషోర్‌బాబులతో పాటు యూఎఫ్ఓ క్యూబ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. -
ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో ‘మా’ కీలక భేటీ.. ‘అవసరమైతే స్ట్రయిక్ తప్పదు’
‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారం దిశగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) సమస్యల గురించి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్లతో చర్చలు జరిపారు. బుధవారం ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)తో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక సభ్యులు సమావేశమై పలు సమస్యల గురించి చర్చించారు. ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘మా’ జనరల్ సెక్రటరీ రఘుబాబు, కోశాధికారి శివబాలాజీ హాజరయ్యారు. ఇటు నిర్మాతలు ‘దిల్’ రాజు, మైత్రీ నవీన్, నాగవంశీ, శరత్ మరార్, బాపినీడు, వివేక్, నటి-దర్శకురాలు జీవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నటీనటుల పారితోషికాలు, ‘మా’ సభ్యత్వం వంటి అంశాల గురించి చర్చలు జరిగినట్లుగా తెలిసింది. నూతన నటీనటులను సినిమాల్లోకి తీసుకోవాలంటే వాళ్లు కచ్చితంగా ‘మా’లో అసోసియేట్ లేదా లైఫ్ మెంబర్షిప్ అయినా ఉండాలని, వేరే భాషల నటులను ఇక్కడి సినిమాలకు తీసుకుంటే వాళ్లకు కూడా ‘మా’లో మెంబర్షిప్ ఉండాలనే నిర్ణయాలను ‘మా’ ప్రతిపాదించిందట. ఓటీటీల్లో నటించే ఆర్టిస్టులకూ ‘మా’లో సభ్యత్వం ఉండాలనే అంశాన్ని కూడా చర్చించారట. ‘మా’లో సభ్యత్వం ఉన్నవారిలో దాదాపు వందమంది సీనియర్ నటీనటుల పేర్లు సూచించి, వారికి అవకాశాలు ఇవ్వాలని నిర్మాతలను ‘మా’ కోరినట్లు తెలిసింది. షూటింగ్ బంద్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యేలోపు ‘మా’లో సభ్యత్వం ఉన్న నటీనటులనే తీసుకోవాలన్నట్లుగా నిర్మాతలు నిర్ణయించుకోవాలని కూడా ‘మా’ కోరిందని భోగట్టా. అలా కాని పక్షంలో ‘మా’నే స్ట్రైక్‌కు పిలుపునివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. -
ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్‌లకు తాత్కాలిక బ్రేక్
-
షూటింగ్స్ బంద్.. ఎఫెక్ట్ అయ్యే పెద్ద సినిమాలివే!
టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్ కానున్నాయంటూ కొన్నిరోజులుగా ఊరిస్తున్న ఊహాగానాలు నిజమే అయ్యాయి. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ పడనుంది. దీంతో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడే అవకాశం ఉంది. అటు ఓటీటీ రిలీజ్‌పైనా కఠిన నిర్ణయాలు తీసుకుంది ప్రొడ్యూసర్స్ గిల్డ్. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లో రిలీజైన 10 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని తేల్చి చెప్పింది. మామూలు బడ్జెట్‌తో తీసిన సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని సూచించింది. అలాగే ఆరు కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాల ఓటీటీ రిలీజ్ అంశంపై ఫెడరేషన్తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామంది. షూటింగ్స్ బంద్‌తో ఎఫెక్ట్ అయ్యే పెద్ద సినిమాలివే.. ► బాబీ - చిరంజీవి సినిమా ► గాడ్ ఫాదర్ ► మెహర్ రమేశ్- చిరంజీవి ► గోపీచంద్ మలినేని- బాలకృష్ణ (NBK107) ► హరిహర వీరమల్లు ► శంకర్- రామ్‌చరణ్ (RC15) ► వంశీ పైడిపల్లి- విజయ్ ► ఖుషీ ► యశోద ► ఏజెంట్ ఇవి కాకుండా పుష్ప2, భవదీయుడు భగత్ సింగ్, త్రివిక్రమ్- మహేశ్ కాంబినేషన్లో ఓ మూవీ, కొరటాల శివ- తారక్ కాంబినేషన్లోని భారీ చిత్రాలు సెట్స్‌కు వెళ్లేందుకు రెడీ అవుతుండగా తాజా నిర్ణయంతో వాటికి ఆదిలోనే ఆటంకం ఏర్పడినట్లయింది. చదవండి: ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ బంద్! -
ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ బంద్!
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా బంద్ చేయాలని భావిస్తోంది. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానించింది. అలాగే ఓటీటీ రిలీజ్‌లపైనా పలు నిర్ణయాలు తీసుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలను పది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించింది. పరిమిత బడ్జెట్లో తీసిన చిత్రాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని చెప్పింది. అలాగే రూ.6 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించిన సినిమాల ఓటీటీ రిలీజ్ విషయంపై ఫెడరేషన్తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మంగళవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో 25 మంది నిర్మాతలు పాల్గొన్నారు. ఓటీటీలో కొత్త సినిమాలు, నటీనటుల పారితోషికాలు, కార్మికుల వేతనాలపై సుమారు గంటపాటు చర్చించిన అనంతరం.. సినిమా ప్రదర్శన కోసం చెల్లించే వీపీఎఫ్ ఛార్జీలను ఎగ్జిబిటర్లే చెల్లించాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. సామాన్యులకు టికెట్ ధరలను అందుబాటులో ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణ థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 రూపాయలు ఉండేలా ప్రతిపాదనలు ముందు పెట్టింది. మల్టీఫ్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125, రూ.150 ఉండేలా ప్రతిపాదనలు చేసింది. ఫిలిం చాంబర్, నిర్మాతల మండలితో చర్చించాకే సినిమా నిర్మాణ వ్యయాలు పెంచుకోవాలని సూచించింది. ఫిలిం చాంబర్ నిర్ణయించిన రేట్ కార్డ్ నే షూటింగ్ ప్రదేశాల్లో నిర్మాతలు అమలు చేయాలని ఆదేశించింది. నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న మేనేజర్లు, కోఆర్డినేటర్ల వ్యవస్థను తొలగించాలని మండిపడింది. నిర్ణీత సమయానికల్లా నటీనటులు షూటింగ్స్‌కు హాజరయ్యేలా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. నిర్దేశించిన సమయానికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని తెలిపింది. నటీనటుల సహాయకులకు వసతులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే పారితోషకంలో కోత విధించాల్సిందేనని పేర్కొంది. చదవండి: రణ్వీర్ సింగ్‌ను అనుకరించిన నటుడు, నిజంగానే అంత సాహసం చేశాడా? హోంటూర్ వీడియోను షేర్ చేసిన యాంకర్ శ్యామల -
షూటింగ్స్ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..
-
ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కతాటిపై ఉంది: సి కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా నిర్మాతల మండలి సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లతో ఫిలిం చాంబర్లో నిర్మాతల మండలి భేటీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. బుధవారం జరిగే సమావేశంలో ప్రతి అంశాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కాగా, షూటింగ్స్ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. తమ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనేది అవాస్తవమన్నారు. ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కతాటిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో కొత్త సినిమాలు వంటి అంశాలు నిర్మాతల మండలి భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఓటీటీ, వీపీఎఫ్ చార్జెస్, టిక్కెట్ ధరలు, నిర్వహణ వ్యయం వంటి అంశాలపై ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సి. కళ్యాణ్ , సునీల్ నారంగ్ , స్రవంతి రవికిశోర్, సుప్రియ, దర్శకుడు తేజ, వైవీఎస్ చౌదరి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. భేటీకి ముందు తెలుగు ఫిలిం చాంబర్ ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్ రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటీటీల వల్ల థియేటర్లు, డిస్ట్రీబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పెద్ద సినిమాలను 8 వారాలు, చిన్న సినిమాలు 4 వారాల తర్వాతే ఓటీటీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 14 ఏళ్ల నుంచి అమలవుతున్న డిజిటల్ ఛార్జీలను యధాతథంగా కొనసాగించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టిక్కెట్ల విక్రయం జరపాలన్నారు. రెంటల్ విధానంలో మార్పులు చేసి ఆక్యుపెన్సీలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ జూమ్ మీటింగ్ తమ డిమాండ్లను తెలియజేస్తామన్నారు. -
షూటింగ్స్ బంద్‌పై వీడని సస్పెన్స్!
టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్ కానున్నాయంటూ గతకొన్నిరోజులుగా వార్తలు ఊరిస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా దీనిపై నిర్మాత సి.కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్‌లు బంద్ చేయాలా? లేదా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాలను యథాతథంగా కొనసాగనిచ్చి కొత్త సినిమాలు మాత్రం షూటింగ్ మొదలు పెట్టకుండా ఆపాలా? అన్న విషయాలపై చర్చిస్తున్నామన్నాడు. అలాగే ప్రేక్షకులకు టికెట్ రేట్లను అందుబాటులోకి తేవడం, ఓటీటీలపై చర్చించామని తెలిపాడు. ఈ నెల 23న అన్ని విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యాక ఫిలిం చాంబర్ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాడు. బుధవారం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, టికెట్ ధరలు, ఉత్పత్తి వ్యయం, పని పరిస్థితులు, రేట్లు, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ సమస్యలు, మేనేజర్ల పాత్ర, నటులు, టెక్నీషియన్స్ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు నిర్మాత సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్, వడ్లపట్ల మోహన్, నట్టి కుమార్, ఏలూరి సురేందర్ రెడ్డి, అభిషేక్ నామా, వైవీఎస్ చౌదరి, యలమంచిలి రవి తదితరులు హాజరయ్యారు. చదవండి: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో! దుమ్ము లేపుతున్న లైగర్, కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలంతే -
తెలంగాణలోనూ ఆన్లైన్ టికెట్ విధానం పెట్టండి: నిర్మాత
సాక్షి, హైదరాబాద్: సినిమా ఆన్లైన్ టికెట్ విధానాన్ని తెలంగాణలో కూడా తీసుకురావాలని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా సినిమా టికెట్లను ఆన్లైన్లో అమ్మే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఏపీ సీఎం ఆలోచన చరిత్రాత్మకం
‘‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రమే విక్రయించా లనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చరిత్రాత్మకం’’ అని ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’(టీఎఫ్‌పీసీఏపీ) అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టిక్కెట్ల దోపిడీ గురించి తెలుసుకున్న జగన్‌గారు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు వినోదం భారం కాదు.. పైగా నిర్మాతలు చిత్ర నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు దోహదపడుతుంది.. బడ్జెట్ అదుపులో ఉంటుంది. జగన్‌గారి ఆలోచన చిత్రపరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది. ముఖ్యంగా కార్మికులకు, చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుంది. కానీ కొంత మంది నిర్మాతలు తమ వ్యక్తిగత లాభాలకు గండి పడుతుందని భావించి, ఆ ఆలోచన తప్పు అని ప్రచారం చేస్తున్నారు. త్వరలో జగన్‌గారిని కలిసి, పరిశ్రమలోని సమస్యలను వివరిస్తాం’’ అన్నారు. చదవండి: Mrunal Thakur: విరాట్ కోహ్లిని పిచ్చిగా ప్రేమించాను: హీరోయిన్ -
హీరో శింబుకు ఊరట.. రెడ్‌కార్డు రద్దు
చెన్నై: నటుడు శింబుకు ఊరట కలిగింది. ఆయనపై తమిళ నిర్మాతల మండలి విధించిన రెడ్కార్డును రద్దు చేసింది. శింబు కథానాయకుడిగా అన్బాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించిన మైఖేల్ రాయప్పన్ శింబు సహకరించకపోవడం వల్లే తాను రూ.2 కోట్లు నష్టపోయానని తమిళ నిర్మాతల మండలిలో (టీఎఫ్‌పీసీ) ఫిర్యాదు చేశారు. శింబు నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతల మండలి తీర్మానం చేసినా ఫలితం లేకపోవడంతో రెడ్ కార్డును విధించారు. ఈ వ్యవహారంపై శింబు తల్లి ఉష ఇటీవల నిర్మాతల మండలికి లేఖ రాశారు. తదనంతరం శింబుకు, నిర్మాతల మండలికి మధ్య జరిగిన చర్చల్లో ఈ వివాదానికి పరిష్కారం లభించింది. చదవండి : సినిమాలకు సమంత బ్రేక్.. అందుకేనా! మా సినిమా సక్సెస్‌పై పూర్తి నమ్మకం ఉంది: సుశాంత్ -
అసహనం వ్యక్తం చేసిన ఇళయరాజా!
పెరంబూరు: నటుడు రజనీకాంత్, కేంద్ర మంత్రి పక్కన కూర్చునేందుకు విముఖత చూపారా? ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయంశంగా మీడియాలో వైరల్ అవుతోంది. సంగీతజ్ఞాని ఇళయరాజా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని నిర్మాతల మండలి ఘనంగా సత్కరించింది. శని, ఆదివారాల్లో నందనంలోని వైఎంసీఏ మైదానంలో జరిగిన ఈ బ్రహ్మండ సంగీత కార్యక్రమంలో ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్, కేంద్ర మంత్రి పొన్.రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా నటుడు రజనీకాంత్ విశ్చేశారు. ఆ తరువాత వచ్చిన కేంద్ర మంత్రి పొన్.రాధాకృష్ణన్ రజనీకాంత్‌ను చూసి చిరునవ్వుతో ఆయన పక్కన కూర్చోవడానికి వచ్చారు. ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించడానికి నిశ్చల ఛాయాగ్రహకులు, వారి మధ్య సంభాషణలను సేకరించడానికి విలేకరులు వారి వైపు వేగంగా రావడం మొదలెట్టారు. దీంతో రజనీకాంత్ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఈ లోగానే కార్య నిర్వాహకులు రజనీకాంత్‌ను వేదికపైకి ఆహ్వానించడంతో అబ్బా.. తప్పించుకున్నాం రా బాబూ అన్నంత రిలీఫ్ అయినట్లు కనిపించింది. రజనీ మాట్లాడిన తరువాత నటుడు కమల్‌హాసన్ రావడంతో ఆయన పక్కన కూర్చున్నారు. ఇదంతా గమనిస్తున్న మీడియా రజనీకాంత్, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ పక్కన కూర్చోవడానికి విముఖత చూపారా? అన్న ప్రచారానికి తెరలేపింది. కానరాని ప్రముఖులు: ఇళయరాజా 75 వసంతాల వేడుకకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పలువురు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నటుడు విజయ్, అజిత్, సూర్య, ధనుష్, జీవా, ఎస్జే.సూర్య, జీవీ ప్రకాశ్‌కుమార్, అరుణ్‌విజయ్, అధర్వ, సతీష్, సంతానం, శశికుమార్, సముద్రఖని, సూరి, యోగిబాబు, ప్రకాశ్‌రాజ్, సమంత, హన్సిక, కాజల్, అంజలి, అమలాపాల్, దర్శకుడు భారతీరాజా, రామ్, రంజిత్, పాండిరాజ్, అట్లీ, విఘ్నేశ్‌శివన్, సంగీత దర్శకుడు అనిరుధ్, తమన్, శ్యామ్.సీఎస్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యేసుదాస్, హరిహరన్, శంకర్‌మహదేవన్, గాయని పి.సుశీల, జానకి, సైంధవి, ప్రముఖ నిర్మాత ఏవీఎం.శరవణన్, కలైపులి ఎస్.థాను వంటి ప్రముఖులు అభినందన సభకు దూరంగా ఉన్నారు. దీంతో కార్యక్రమ నిర్వహణలో కొన్ని లోటుపాట్లు జరిగాయన్నది వాస్తవం. అందరినీ కలుపుకునిపోవడంలో నిర్మాతల మండలి విఫలమైందనే అంశం వినిపిస్తోంది. వారికీ ధన్యవాదాలు ఆదివారం జరిగిన వేడుకలో చివరిగా సంగీతజ్ఞాని మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొందరు ఎంతగా కృషి చేశారో, ఆపడానికి మరికొందరు అంతగా శ్రమించారన్నారు. వారికీ, వీరికీ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఆపడానికి ప్రయత్నించిన వారికి ధన్యవాదాలు ఎందుకో అనుకోవచ్చని, వారు అలా చేయడం వల్లే ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి ఈ కార్యక్రమాన్ని నిషేధించరాదని తీర్పు ఇచ్చారన్నారు. న్యాయస్థానమే అండగా ఉంది కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యహరించిన నటి సుహాసిని మాట్లాడుతూ.. తాను ఇంటి నుంచి ఇళయరాజా వేడుకకు బయలుదేరుతున్న సమయంలో ఇంటి పనిమనిషి వచ్చి, సంగీతజ్ఞాని సన్మాన కార్యక్రమానికి న్యాయమూర్తే అండగా నిలిచారు. సంతోషంగా వెళ్లి రండమ్మా అని చెప్పిందన్న విషయాన్ని ప్రస్తావించారు. అంతగా పోరాడిన గెలిచిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను అభినందిస్తున్నానని అన్నారు. నటి రోహిణీ ప్రశ్నిస్తూ దర్శకుడు శంకర్‌తో మీరు చేసే చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. వారి ఆశ ఎప్పుడు నెరవేరుతుందని ఇళయరాజాను ప్రశ్నించడంతో ఆయన కాస్త చిరాకు పడ్డారు. అవన్నీ ఇప్పుడెందుకమ్మా? దర్శకులు ఏ సంగీత దర్శకుడితే కంఫర్టుబుల్‌గా ఉంటే వారితో పని చేయించుకుంటారు అని అన్నారు. ఏదేమైనా విశాల్ ముందు నుంచి చెబుతున్నట్లు గానే ఇళయరాజాకు అభినందన సభను చరిత్రలో గుర్తుండిపోయేటట్లు నిర్వహించి చూపించారు. అదేవిధంగా ఒక సంగీత పుత్రుడి అభినందన కార్యక్రమం అశేష సంగీత ప్రియులను ఆనందడోలికల్లో ముంచెత్తిందన్నది నిజం. -
ఆ హీరో సహకరించలేదు.. నటి హ్యాండిచ్చింది !
కోట్ల రూపాయల నష్టానికి కారణమైన నటుడు శింబు, వడివేలు, హీరోయిన్ త్రిషలకు నిర్మాతల మండలి, నడిగర్ సంఘం నోటీసులు జారీ చేసింది. శింబు సహకరించలేదు: అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మైఖెల్ రాయప్పన్ ఆ చిత్ర కథానాయకుడు శింబుపై నిర్మాతల మండలిలో ఇటీవల ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నటుడు శింబు తన చిత్రంలో నటించడానికి పూర్తిగా సహకరించలేదని ఆరోపించారు. చిత్ర షూటింగ్ సగ భాగం పూర్తి అయిన తరువాత ఇక నటించను చిత్రీకరించిన దానితోనే చిత్రాన్ని విడుదల చేయమని, మిగిలింది రెండవ భాగంగా విడుదల చేయండి అని అన్నారని తెలిపారు. ఈ కారణంగా తనకు రూ.18 కోట్ల నష్టం వాటిల్లిందని దీనికి సరైన పరిష్కారం చేయాలని కోరారు. త్రిష హ్యాండిచ్చింది విక్రమ్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో సామి–2 చిత్రాన్ని నిర్మిస్తున్న శిబు తమీస్ నటి త్రిషపై నడిగర్‌సంఘంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో సామి–2 చిత్రంలో నటించడానికి అంగీకరించిన త్రిష షూటింగ్ ప్రారంభమైన తరువాత అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలగినట్లు పేర్కొన్నారు. దీంతో చిత్ర షూటింగ్ రద్దు అయ్యిం దని, త్రిష చిత్రం నుంచి తప్పుకోవడంతో కథను మార్చాల్సిన అవసరం ఏర్పడిందని, ఇందువల్ల షూటింగ్‌ను కొనసాగించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో తనకు కోట్లలో నష్టం ఏర్పడిందని, ఈ వ్యవహారంపై తగిన న్యాయం చేయాలని కోరారు. వడివేలుపై ఫిర్యాదు హాస్య నటుడు వడివేలుపై దర్శకుడు శంకర్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నటుడు వడివేలు హీరోగా హింసైఅరసన్ 24వ పులికేసి చిత్రాన్ని నిర్మిస్తున్నానని, ఈ చిత్రంలో నటించడానికి వడివేలు సహకరించడం లేదని పేర్కొన్నారు. చిత్రం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారీ సెట్స్ వేసినట్లు పేర్కొన్నారు. వడివేలు కారణంగా చిత్ర షూటింగ్ కొనసాగక తీవ్ర నష్టం ఏర్పడిందని ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. దీంతో ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు నిర్మాతల మండలి కార్యదర్శి జ్ఞానవేల్ రాజా తెలిపారు. ఇదిలా ఉంటే నటి అమలాపాల్‌పై కారు కొనుగోలు పన్ను మోసం వ్యవహారంలో కేరళ రాష్ట్ర మెట్రో వాహన శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. -
ఈ నెల 26న షూటింగులు రద్దు
తమిళసినిమా: ఈ నెల 26వ తేదీన సినిమా షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది. ఇంతకుముందు దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) సమ్మె కారణంగా మూడు రోజుల పాటు షూటింగులు రద్దయిన విషయం తెలిసిందే. ఆ సమస్య చర్చల్లోనే ఉంది. కాగా ఈ నెల 26వ తేదీన షూటింగులను ఒక్క రోజు రద్దు చేయనున్నట్లు తమిళ నిర్మాతలమండలి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అందులో పేర్కొంటూ దక్షిణ భారత సినీ, బుల్లితెర స్టంట్ దర్శకులు, స్టంట్ కళాకారుల సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 26వ తేదీన చెన్నైలో స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించనుందన్నారు. అందువల్ల ఆ రోజున షూటింగులను రద్దు చేయవలసిందిగా కోరడంతో అంగీకరించినట్లు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు పేర్కొన్నారు. -
సినిమా రివ్యూలపై నిర్మాతల మండలి చిర్రుబుర్రులు
హైదరాబాద్: సినిమా రివ్యూలపై నిర్మాతల మండలి చిర్రుబుర్రులాడింది. మీడియా ఇచ్చే రివ్యూల వల్ల సినీపరిశ్రమకు నష్టాలు వస్తున్నట్లు మండలి తెలిపింది. సినిమా విడుదల కాగానే రివ్యూలు రాసే సంస్కృతిని మీడియా మానుకోవాలని కోరింది. చిత్ర పరిశ్రమ ఎటక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా సహకారం కోరుకుంటున్నట్లు తెలిపింది. నిర్మాతల మండలి ప్రత్యేకంగా ఏ ఛానళ్లతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపింది. ఏ నిర్మాత అయినా, ఏ ఛానల్తోనైనా ఒప్పందం కుదుర్చుకొని సినిమా ప్రచారం చేసుకోవచ్చునని పేర్కొంది. -
మూడు నెలలు సినిమా రిలీజ్లు ఆపేద్దాం..
చెన్నై: తమిళనాడులో సినిమాల విడుదలను కనీసం మూడు నెలలపాటు నిలిపివేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఆదివారం జరిగిన తమిళ సినిమా ప్రొడ్యూసర్ల కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశంలో దాదాపు సభ్యులందరూ దీనిపై సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైరసీ మూలంగా గత ఏడాదిగా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని, ఓ మూడు నెలలు సినిమాల విడుదలను నిలుపుదల చేస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నామని టిఎఫ్పీసీ అధ్యక్షులు కలైపులి ఎస్ థాను తెలిపారు. మిగతా నిర్మాతలు, సంబంధిత రంగాల వారితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న తమను సినిమాల విడుదలను ఆపమనడం సమంజసం కాదని, రిలీజ్ ఆపినంత మాత్రాన పైరసీ భూతం వదలదని సీనియర్ ప్రొడ్యూసర్లు వాదిస్తున్నారు.