వేతనాలు పెంచాలనే సినీ కార్మికుల డిమాండ్‌పై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించింది. కార్మికుల డిమాండ్ మేరకు 30 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ నాయకులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. రెండు నెలలు క్రితం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్
ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫేడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. ఇక దీనిపై రేపు (సెప్టెంబర్ 15) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలిం ఫేడరేషన్ నాయకులు భావిస్తున్నారు.
చదవండి: రణ్‌వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే..
Comments
Please login to add a commentAdd a comment