salary hikes
-
నాడు డబుల్.. నేడు సింగిల్! తేలికవుతున్న ఐటీ జీతాలు
కొవిడ్-19 మహమ్మారికి ముందు టాప్ ఐటీ సంస్థల్లో వేతన ఇంక్రిమెంట్లు రెండంకెలమేర వృద్ధి చెందేవి. కానీ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో వేతన పెరుగుదల శాతం సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా పేరున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఆర్థిక సంవత్సరానికి వార్షిక వేతన పెంపును అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. నివేదికల ప్రకారం వేతన పెంపు 4% నుంచి 8% వరకు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగుల సవరించిన వేతనాన్ని ఏప్రిల్ నుంచి జమ చేయనున్నారు. ఈ మేరకు త్వరలో వారికి లేఖలు అందుతాయని కొందరు అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులోగా ఉద్యోగులకు వేతన సవరణలకు సంబంధించిన లేఖలు జారీ చేయాలని మరో టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. పెరుగుదలను ప్రభావితం చేసే అంశాలుటీసీఎస్ జీతాల పెంపు, వేరియబుల్ చెల్లింపులను 2024 ప్రారంభంలో ప్రకటించిన రిటర్న్-టు-ఆఫీస్ (ఆర్టీఓ) ఆదేశానికి ఉద్యోగులు కట్టుబడి ఉండటానికి ముడిపెట్టింది. దానిప్రకారం ఆర్టీఓ పాలసీని పాటించిన ఉద్యోగులకు అధిక ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. టీసీఎస్ ఏకీకృత నికర లాభంలో 11.95% పెరుగుదలను నివేదించినప్పటికీ మొత్తంగా స్వల్ప వేతన పెంపు మాత్రమే ఉందనే వాదనలొస్తున్నాయి. కంపెనీ నికరలాభం డిసెంబర్ త్రైమాసికంలో రూ.12,380 కోట్లకు చేరుకుంది. నికర అమ్మకాలు రూ.60,583 కోట్ల నుంచి 5.59 శాతం వృద్ధితో రూ.63,973 కోట్లకు పెరిగాయి.ఇదీ చదవండి: లిక్విడిటీ అవసరాలకు ఆర్బీఐ రూ.43 లక్షల కోట్లుఉద్యోగులు ఏమంటున్నారంటే..వేతన పెంపు సానుకూల పరిణామమే అయినప్పటికీ కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు క్రమంగా తగ్గుముఖం పట్టడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతంగా ఉన్న సగటు వేతన పెరుగుదల 2024 ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతంగా ఉంది. ఏదేమైనా ఆర్టీఓ పాలసీని పాటించేవారికి అధిక ప్రోత్సాహకాలు ఉంటాయనే వాదనలుండడంపట్ల ఉద్యోగులకు కొంత ఊరట లభించినట్లయింది. -
ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..
ఓ వైపు ఉద్యోగుల తొలగింపు రేట్లు పెరుగుతున్నప్పటికీ భారతీయ ఐటీ పరిశ్రమ జీతాల పెంపు (Salary hike) విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) వంటి అగ్ర సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3 FY25) అధిక టర్నోవర్‌ను నివేదించాయి. అయినప్పటికీ ఈ ఏడాది జీతాల పెంపుదల 3% నుండి 6% స్థాయిలోనే ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇచ్చే శాలరీ హైక్ డిమాండ్ ఆధారిత పెరుగుదల కాదని, ప్రపంచ అనిశ్చితులకు అనుగుణంగా రంగాల వ్యాప్త సర్దుబాటు అని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు . ఈ సంవత్సరానికి ఐటీ ఉద్యోగుల తొలగింపు (అట్రిషన్) రేటు 12-13% వరకు ఉంటుందని అంచనా. కానీ జీతాల పెరుగుదల మాత్రం అంతంతమాత్రంగానే ఉండనుంది. అధిక పనితీరు కనబరిచేవారికి మాత్రం కాస్తంత మెరుగైన వేతన పెంపు లభించే అవకాశం ఉంది.ఏ కంపెనీలో ఏంటి పరిస్థితి?దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రైజల్ సైకిల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికీ పద్ధతి ప్రకారం నిర్ధిష్ట కాల వ్యవధిలో అప్రైజల్ ప్రక్రియను అమలు చేస్తున్న అతి కొద్ది కంపెనీలలో టీసీఎల్ కూడా ఒకటి. 2025లో ఉద్యోగులకు సగటున 7-8 శాతం జీతాల పెంపును కంపెనీ ప్రకటించిందిఇక ఇన్ఫోసిస్ విషయానికొస్తే 2025 ఆర్థిక సంవత్సరానికి జీతాల పెంపుదల రెండు దశల్లో జరిగింది. జూనియర్ ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు అందుకోగా మిగిలిన వారికి ఏప్రిల్‌లో జీతాల పెంపుదల అందుతుంది. దేశంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు జీతాల పెంపుదల 6-8 శాతం పరిధిలో ఉంటుందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ ఇప్పటికే సంకేతాలిచ్చారు.మరోవైపు విప్రో, హెచ్‌సీఎల్‌టెక్.. ఈ రెండు కంపెనీలు అధిక అట్రిషన్ రేట్లను నివేదించాయి. అయినప్పటికీ వేతన పెంపుదలలో ఆలోచించి అడుగులు వేస్తున్నాయి. స్థిర పెంపుదల కంటే వేరియబుల్ పే సర్దుబాట్లపైనే ఇవి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఐటీ పరిశ్రమలో అప్రైజల్ సైకిల్ సాధారణంగా ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో ఉంటుంది. కానీ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు అప్రైజల్ సైకిల్‌ను ఏప్రిల్-జూన్ మధ్య కాలం నుండి క్యూ3 (సెప్టెంబర్-అక్టోబర్) కు వాయిదా వేశాయి. -
ఐటీ ఉద్యోగులకు తీవ్ర నిరాశ.. టాప్ 2 కంపెనీ ఝలక్
దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) వార్షిక వేతనాల పెంపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (Q4FY25)వాయిదా వేసింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది.అన్ని ఐటీ కంపెనీలదీ అదే దారిసాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం కావడం ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ సేవల రంగంలో విస్తృత అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, క్లయింట్ బడ్జెట్ల ఆలస్యం, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.ఇటాంటి వాతావరణంలో పోటీ కంపెనీలైన హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree), ఎల్&టీ (L&T) టెక్ సర్వీసెస్ కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు, లాభదాయకతను కొనసాగించడానికి రెండవ త్రైమాసికంలో జీతం ఇంక్రిమెంట్లను దాటవేశాయి.క్యూ4లో అక్టోబర్ 17న దశలవారీగా వేతనాల పెంపుదలకు ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అందులో కొంత భాగం జనవరిలో అమలులోకి వస్తుందని, మిగిలినది ఏప్రిల్‌లో అమలులోకి వస్తుందని క్యూ2 ఫలితాల తర్వాత విలేకరుల సమావేశంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు.లాభం మెరుగురెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం త్రైమాసికానికి 2.2 శాతం పెరిగి రూ. 6,506 కోట్లకు చేరుకుంది. తక్కువ ఆన్సైట్ ఖర్చులు, మెరుగైన వినియోగ రేట్లు, మెరుగైన కార్యాచరణ సామర్థ్యాల కారణంగా మార్జిన్లు 10 బేసిస్ పాయింట్ల మేర మెరుగయ్యాయి.వేతనాల్లో భారీ వ్యత్యాసంసాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే. -
32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు
వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన ప్రముఖ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్ ఉద్యోగులతో యాజమాన్యం మరోసారి చర్చలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 27న ఈమేరకు కార్మికుల యూనియన్‌తో చర్చించనుంది. ఉద్యోగుల సమ్మె కారణంగా తయారీ కార్యకలాపాలు గణనీయంగా ప్రభావితం చెందనట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కంపెనీకి భారీ ఆర్డర్లున్న 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు చెప్పారు.బోయింగ్ ఉద్యోగులు 2008 తర్వాత చేస్తున్న ఈ సమ్మెలో పలు డిమాండ్లను లేవనెత్తారు. యూనియన్‌లోని దాదాపు 32,000 మంది సభ్యులు 40 శాతం వేతనం పెంచాలంటున్నారు. దాంతోపాటు ఉద్యోగుల పెన్షన్ స్లాబ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంస్థ మాత్రం 30 శాతం వేతనాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. కానీ సంస్థ ఆఫర్‌కు యూనియన్ సిద్ధంగా లేదని ఉద్యోగులు లేచ్చి చెప్పారు. తప్పకుండా 40 శాతం వేతన పెంపు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల బోయింగ్ యాజమాన్యం యూనియన్‌తో చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. వచ్చే నాలుగేళ్లలో 25 శాతం వేతన పెంపు చేస్తామని కంపెనీ ఇప్పటికే హామీ ఇచ్చింది. అయితే ఆ ప్రతిపాదనను ఉద్యోగులు తోసిపుచ్చారు. దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా వేతనాల పెరుగుదలపై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాగైనా తమ డిమాండ్‌ను భర్తీ చేయాలని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై 27న మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా..ఉద్యోగుల నిరసనలో భాగంగా సీటెల్, పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్‌లో విమానాల తయారీ నిలిచిపోయింది. సెప్టెంబర్ 13 నుంచి కొనసాగుతున్న ఈ సమ్మె వల్ల ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. బోయింగ్ అత్యధికంగా అమ్ముతున్న 737 మ్యాక్స్ మోడల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తిని సైతం నిలిపేసినట్లు చెప్పారు. -
సీఈఓల జీతాలు పెంపు!
ప్రైవేట్ బ్యాంకులకు సారథ్యం వహించే సీఈఓల వేతనాలు గతేడాదితో పోలిస్తే ఈసారి స్వల్పంగా పెరిగాయి. బ్యాంకుల్లో కీలకమైన మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగుల జీతం, బోనస్‌లు, స్టాక్ ఆప్షన్లకు సంబంధించిన వెసులుబాటును పెంచాలంటే ఆర్బీఐ అనుమతులు తప్పనిసరి. ఈ వ్యవహారంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు దృష్టి సారించినట్లు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.కొన్ని నివేదికల ప్రకారం.. ప్రముఖ బ్యాంకుల సీఈఓల వేతనాలు కింది విధంగా ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్-శశిధర్ జగదీషన్ వేతనం 2024లో రూ.10.77 కోట్లు, 2023లో రూ.10.54 కోట్లు, స్టాక్ ఆప్షన్స్ రూపంలో 2,09,131.ఐసీఐసీఐ బ్యాంక్-సందీప్ భక్షి, 2024లో రూ.9.96 కోట్లు, 2023లో రూ.9.57 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 2,99,100.యాక్సిస్ బ్యాంక్-అమితాబ్ చౌదరి, 2024లో రూ.9.64 కోట్లు, 2023లో రూ.9.75 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 3,13,300.ఇండస్ఇండ్ బ్యాంక్-సుమంత్ కత్పలియా, 2024లో రూ.8.5 కోట్లు, 2023లో రూ.8.5 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 1,98,000.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్-వీ.వైద్యనాథన్, 2024లో రూ.5.3 కోట్లు, 2023లో రూ.4.45 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 30,59,514.యెస్ బ్యాంక్-ప్రశాంత్ కుమార్, 2024లో రూ.3.77 కోట్లు, 2023లో రూ.3.47 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 48,16,490.ఇదీ చదవండి: ఏ ధర ఫోన్లను ఎక్కువగా కొంటున్నారంటే..ప్రైవేట్ బ్యాంకుల మొదటి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా బ్యాంకులు వార్షిక సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అందులో సీఈఓల జీతాల పెంపునకు ఇన్వెస్టర్ల మద్దతు లభించింది. దాంతో వారి వేతనాలు పెరిగినట్లు రెగ్యులేటరీలకు రిపోర్ట్ చేశాయి. ఇదిలాఉండగా, త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకులు పెద్దగా లాభాలను పోస్ట్ చేయలేదు. ఇటీవల ఆర్బీఐ మానిటరీ సమావేశంలోనూ రెపోరేటును స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ సెప్టెంబర్‌లో నిర్వహించే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే దేశీయంగా ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగా జరిగితే బ్యాంకులకు సానుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
టీసీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి..
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు జీతాలు పెంచింది. 4.5 నుంచి 7 శాతం శ్రేణిలో వార్షిక ఇంక్రిమెంట్లను ప్రకటించింది. టాప్ పెర్ఫార్మర్లకు రెండంకెల పెంపుదల ఉంటుందని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఈ వేతనాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని చెప్పారు. "క్యాంపస్ నియామకాలు, పెరిగిన కస్టమర్ విజిట్ల ఫలితంగా అట్రిషన్ 12.5 శాతానికి తగ్గింది. ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం మా డెలివరీ సెంటర్లలో గొప్ప చైతన్యాన్ని కలిగించింది. మా సహచరుల ఉత్సాహాన్ని పెంచింది" అని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ కొంత మంది పర్ఫార్మర్లకు 12-15 శాతం వరకు జీతాలను పెంచి ప్రమోషన్స్ సైకిల్‌ను ప్రారంభించింది. ఈ పెంపుదల 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఫలితాలను ప్రకటించిన తర్వాత లక్కాడ్ మీడియాతో మాట్లాడుతూ, 2023-24లో కంపెనీ చాలా మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేసిందని, అయితే, ఇంకా కొంతమందిని చేర్చుకోవాల్సి ఉందని అన్నారు. ఈ మిగిలిన ఫ్రెషర్లను ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు గతంలో టీసీఎస్ తెలిపింది. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా ఫ్రెషర్లు, ఇతర నియామకాల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేస్తోంది. -
ఆశగా ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
నాస్డాక్-లిస్టెడ్ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు చేదు వార్త ఇది. ఏప్రిల్‌లో జరగాల్సిన జీతాల పెంపు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఆగస్టు 1 నుండి "అర్హత" ఉన్న ఉద్యోగులకు జీతాల పెంపును అందజేస్తుందని ‘మనీకంట్రోల్’ నివేదించింది. జీతాల పెంపు గత సంవత్సరంతో పోలిస్తే సుమారు నాలుగు నెలల ఆలస్యం కానుంది. స్థూల ఆర్థిక సమస్యల కారణంగా కంపెనీ బలహీనమైన డిమాండ్ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీతాల పెంపు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇతర ఐటీ కంపెనీలను కూడా ప్రభావితం చేయనుంది. జీతాల పెంపు ఆలస్యాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించినట్లు మనీకంట్రోల్ పేర్కొంది. “వార్షిక మెరిట్ పెంపుదల, బోనస్‌ల ద్వారా మా ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధతలో భాగంగా, అర్హతగల అసోసియేట్లకు మెరిట్ పెంపుదల ఈ సంవత్సరం ఆగస్టు 1న అందిస్తాం. ముఖ్యంగా మూడు సంవత్సరాలలో మా చాలా మంది ఉద్యోగులకు నాలుగు మెరిట్ హైక్స్ దక్కాయి” అని కంపెనీ పేర్కొంది. తాజా చర్యతో మెజారిటీ కాగ్నిజెంట్ ఉద్యోగులు మూడు సంవత్సరాలలో నాలుగు పెంపులను అక్టోబర్ 2021, అక్టోబర్ 2022, ఏప్రిల్ 2023, ఆగస్టు 2024 పొందుతున్నట్లవుతుంది. కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 2.54 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు. -
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతనం పెంపు
బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం పెంచాలని కొద్దిరోజులుగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి శుక్రవారం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం వెలువడింది. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17% పెరగనుంది. ఇందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా రూ.12,449 కోట్లు ఖర్చు అవ్వనున్నట్లు తెలిసింది. ఈ వేతన పెంపు 2022 నవంబరు నుంచి అమలుకానుంది. దీంతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేసేలా, అన్ని శనివారాలను సెలవుగా గుర్తించడానికి ఆలిండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒప్పుకుంది. ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పనిగంటలు అమల్లోకి వస్తాయి. కొత్త డీఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను రూపొందించారు. దీని ప్రకారం.. మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించకుండానే నెలకు ఒక సిక్ లీవ్ తీసుకునే సౌలభ్యం ఉంది. ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో 255 రోజుల వరకు ప్రివిలేజ్డ్ లీవ్‌లను నగదుగా మార్చుకోవచ్చు. విధుల్లో మరణించినా, ఈ మొత్తం సంబంధీకులకు చెల్లిస్తారు. ఇదీ చదవండి: ‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు నెలవారీ ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. 2022 అక్టోబరు 31న, అంతకుముందు పెన్షన్ అందుకునేందుకు అర్హత ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. -
మరో బ్యాడ్‌న్యూస్: విప్రో ఉద్యోగుల ఆశలు ఆవిరేనా? పిడుగు లాంటి నివేదిక!
Wipro salary hike: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు షాకుల మీద షాకులిస్తోంది. ఇంటి పని చేస్తున్న ఉద్యోగులందరూ ఆఫీస్‌లకు రావాల్సిందేనని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన కంపెనీ ఇప్పుడు జీతాల పెంపు విషయంలో ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పిడుగు లాంటి నివేదికను రాయిటర్స్ బయటపెట్టింది. విప్రో సంస్థ పనితీరు ఆధారంగా ఇచ్చే వేతన పెంపు విషయంలో ఈ సంవత్సరం అధిక ప్యాకేజీ ఉద్యోగులకు మొండిచేయి చూపిస్తుందని, వారికి వార్షిక వేతన పెంపును దాటవేయవచ్చని రాయిటర్స్ తాజాగా నివేదించింది. ఈ కంపెనీలో డిసెంబర్ నెలలో వేతన సవరణలు జరగాల్సి ఉంది. డిసెంబర్ 1న ఉద్యోగులు పెరిగిన జీతాలు అందుకుంటారని కంపెనీ యాజమాన్యం తమ 2023-24 రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించింది. తక్కువ ప్యాకేజీ ఉద్యోగులకు ఊరట నివేదిక ప్రకారం.. విప్రో కంపెనీ జీతాల పెంపును పూర్తిగా విరమించుకోలేదు. తక్కువ ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు మాత్రమే వేతన పెంపును అమలు చేయబోతోంది. వేతన పెంపులో తక్కువ ప్యాకేజీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్న కంపెనీ అంతర్గత మెమోను రాయిటర్స్ ఉటింకించింది. ఆఫీస్‌కు రావాల్సిందే.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని విప్రో ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొత్త వర్క్ పాలసీలో భాగంగా నవంబర్ 15 నుంచి ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుందని సిబ్బందికి పంపిన ఈమెయిల్స్‌లో పేర్కొంది. కొత్త వర్క్ పాలసీని అనుసరించకపోతే, వచ్చే ఏడాది జనవరి 7 నుంచి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదీ చదవండి: 70-hour work: అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్! -
మనసున్న సీఈవో! ఉద్యోగుల కోసం ఏం చేశాడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఓవైపు లేఆఫ్‌లు.. మరోవైపు తక్కువ జీతాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కంపెనీల్లో జీతాల పెంపు లేక ఎంప్లాయీస్ అవస్థలు పడుతున్న తరుణంలో ఓ కంపెనీ సీఈవో తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.. సతీష్ మల్హోత్రా (Satish Malhotra).. అమెరికన్ స్పెషాలిటీ రిటైల్ చైన్ కంపెనీ ‘ది కంటైనర్ స్టోర్’కు సీఈవో (CEO). తమ కంపెనీలోని ఇతర ఉద్యోగులకు వేతనాల పెంపునకు, ఖర్చులను తగ్గించడంలో సహాయపడటానికి తన జీతాన్ని స్వచ్ఛందంగా 10 శాతం తగ్గించుకున్నారు. సతీష్ 2021 ఫిబ్రవరి నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ చైన్ సెఫోరాలో 20 ఏళ్లు పనిచేశారు. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. ఆరు నెలల కాలానికి మల్హోత్రా వార్షిక జీతం 925,000 డాలర్ల (రూ. 7.68 కోట్లు) నుంచి 8,32,500 డాలర్లకు (రూ. 6.9 కోట్లు) తగ్గుతుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కాగా గత సంవత్సరం మల్హోత్రా 2.57 మిలియన్ డాలర్ల (రూ. 21.35 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. అయితే ఉద్యోగులకు సగటు పెంపుదల ఎంత ఉంటుందనేది కంపెనీ స్పష్టం చేయలేదు. కంటైనర్ స్టోర్ దాని ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో 10.1 మిలియన్ డాలర్ల సర్దుబాటు చేసిన నికర నష్టాన్ని నివేదించింది. గూగుల్, యాపిల్ సీఈవోల సరసన.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO Tim Cook), గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai)తో పాటు ఈ ఏడాది భారీగా వేతనాలు తగ్గించుకున్న సీఈవోల జాబితాలో సతీష్ మల్హోత్రా కూడా చేరారు. ఈ ఏడాది జనవరిలో 12,000 తొలగింపులను ప్రకటించిన 10 రోజుల తర్వాత తనతో సహా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి కంటే పైస్థాయి ఎగ్జిక్యూటివ్‌లందరూ తమ వార్షిక బోనస్‌ను గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇక యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023 సంవత్సరానికి తన వేతన పరిహారాన్ని 50 శాతం తగ్గించుకున్నారు. -
ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, ముంబై: ప్రపంచ మాంద్యం భయాలు, మూన్‌లైటింగ్ వివాదాల మధ్య ఐటీ నిపుణులకు కంపెనీలు తీపి కబురు అందిస్తున్నాయి. ప్రధానంగా దేశీయ రెండో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు వేతనాలను పెంచినట్టు ధృవీకరించింది. తన సిబ్బందికి 10 నుంచి 13 శాతం జీతాల పెంపును అందించినట్టు ప్రకటించింది. దీంతోపాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉద్యోగులు 20-25శాతం ఇంక్రిమెంట్లు పొందినట్టు తెలిపింది. ఇన్ఫీ, టీసీఎస్, విప్రో,తోపాటు కాగ్నిజెంట్ సంస్థలు తమ ఉద్యోగులకు దాదాపు 10శాతం వేతనాలు పెంపును దిశలో ఉండటం విశేషం. ఇంక్రిమెంట్లు ఉద్యోగి గ్రేడ్‌పై ఆధారపడి ఉంటాయయనీ, సీనియర్ మేనేజ్మెంట్ జీతాలు ఎక్కువగా ఉన్నందున తక్కువ మొత్తంలో పెంపు ఉంటుందని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గ్రూప్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. తగ్గుతున్న అట్రిషన్ రేట్లతో, ఇన్ఫోసిస్ వినియోగ స్థాయిలను పెంచడం, పార్శ్వ నియామకాలు, ఆన్-సైట్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వేతన వ్యయాలను నియంత్రించ డానికి ప్రయత్నిస్తోంది. ఇన్ఫోసిస్‌తోపాటు, టీసీఎస్, విప్రో, ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా తన ఉద్యోగులకు 10 శాతం వరకు వేతనాలు పెంచనుందట. అక్టోబర్ మాసంనుంచి ఈ పెంపు వర్తించనుందని తెలుస్తోంది. కాగా కరోనా సంక్షోభకాలంలో ముఖ్యంగా 2021లో ఐటీ కంపెనీల బంపర్ జీతాల పెంపు, కౌంటర్ ఆఫర్లతో ఉద్యోగులను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ఇన్ఫోసిస్ కూడా గత ఏడాది జనవరి, జూలైలో రెండు పెంపులను ప్రకటించింది. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. 345,218 మంది నిపుణులకు ఉపాధి కల్పించిన ఇన్ఫీ, అధిక వ్యయాలను నియంత్రించుకోవాలని చూస్తోంది. -
విప్రో ఉద్యోగులకు దసరా కానుక, 96 శాతం కవర్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన విప్రో ఉద్యోగులకు తీపి కబురు అందించింది.విప్రోయిట్ల వార్షిక జీతాల పెంపును తాజాగా ప్రకటించింది. 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అర్హులైన ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్స్ ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల జీతంతో దీన్ని ఉద్యోగులకు అందించనుంది. ఈమేరకు ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందించింది. ఈ రౌండ్ వార్షిక ఇంక్రిమెంట్లు లేదా మెరిట్ జీతాల పెంపుదల (MSI) ప్రయోజనాలను దాదాపు 96 శాతం మంది ఉద్యోగులకుఅందించనుంది. (వాళ్లంతా అలా వచ్చినవారేగా! మూన్ లైటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు) గత త్రైమాసికంలో ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, తాము గణనీయమైన విస్తృత కవరేజీని, మార్కెట్‌తో సమానంగా జీతం పెరుగుదలను అందిస్తున్నామని కంపెనీ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఇమెయిల్ ద్వారా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ జీతం పెరుగుదలకు సంబంధించిన లేఖలను ఆయా ఉద్యోగులకు అందిస్తామని తెలిపారు. అలాగే జీతం పెరుగుదల పనితీరు అర్హత ప్రమాణాల ఆధారంగా 96 శాతం మంది ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు. (మూన్‌లైటింగ్: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు) -
సినీ కార్మికుల వేతనాల పెంపునకు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్..
వేతనాలు పెంచాలనే సినీ కార్మికుల డిమాండ్‌పై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించింది. కార్మికుల డిమాండ్ మేరకు 30 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ నాయకులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. రెండు నెలలు క్రితం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫేడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. ఇక దీనిపై రేపు (సెప్టెంబర్ 15) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలిం ఫేడరేషన్ నాయకులు భావిస్తున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. -
శాలరీ ఎక్కువ ఇస్తున్నారని..టెంప్ట్ అయ్యారా కొంప కొల్లేరే!
సమ్మర్ సీజన్లో తమ లాభాలతో హీటెక్కించిన స్టార్టప్‌లు..వింటర్ సీజన్లో నిధుల కొరతతో వణికి పోతున్నాయి. వెరసి కాస్ట్ కటింగ్‌లు పేరుతో ఉద్యోగుల్ని తొలగించాయి. తొలగిస్తున్నాయి. అలా ఇప్పటి వరకు మనదేశంలో 10వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. మనీ కంట్రోల్ రీసెర్చ్ ప్రకారం.. గతేడాది స్టార్టప్‌లలో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులతో స్టార్టప్‌ల మధ్య టాలెంట్ వార్ నడిచింది. అందుకే ఒక సంస్థతో మరో సంస్థ పోటీ పడుతూ కళ్లు చెదిరేలా జీతాలిచ్చి ఉద్యోగుల్ని ఎంపిక చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఎంత వేగంతో రిక్రూట్ చేసుకున్నాయో..అంతే వేగంతో ఉద్యోగులకు గుడ్ బై చెబుతున్నాయి. ఈ తొలగింపులు ఎక్కువగా అమ్మకాలు, మార్కెటింగ్ విభాగాల్లో ఎక్కువగా ఉన్నాయని నివేదికలు హైలెట్ చేస్తుండగా.. ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలున్నాయని చెబుతున్నాయి. ఉద్యోగుల తొలగింపు గురుగ్రామ్ ప్రధాన కేంద్రంగా 3 ఏళ్ల క్రితం సోషల్ కామర్స్ స్టార్టప్ సిటీమాల్ ప్రారంభమైంది. ఈ ఏడాది మార్చి నెలలో 75 మిలియన్ల నిధుల్ని ఇన్వెస్టర్ల నుంచి సేకరించింది. జూన్ 19న లింక్డ్ఇన్ పోస్ట్‌లో వృద్ది, వ్యాపార వ్యూహాల్ని కారణాలుగా చూపిస్తూ 191 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ఇలా సిటీమాల్తో పాటు దాదాపూ 25కి పైగా స్టార్టప్‌లు నిధుల కొరత, పునర్నిర్మాణం,మొదలైన వాటిని పేర్కొంటూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. వాటిలో మీషో, కార్స్24, ఓలా, బ్లింకిట్లు ఉన్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులు పనితీరు సరిగ్గా లేదని ఆరోపించాయి. ఏదేమైనా, ప్రస్తుత కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నది భారతీయ ఎడ్టెక్ స్టార్టప్లేనని తెలుస్తోంది. ఎడ్‌టెక్‌కు పెద్ద దెబ్బే కోవిడ్-19 ఆంక్షల సడలింపుతో ఫిజికల్ ట్యూషన్ సెంటర్లు, స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. దీంతో రిమోట్ లెర్నింగ్, టెక్నాలజీ ఆధారిత ఎడ్యుకేషన్ సర్వీసులకు డిమాండ్ తగ్గిపోయింది. అదే సమయంలో వింటర్ సీజన్లో నిధుల కొరత ఎక్కువైంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఎడెటెక్ సంస్థలైన అన్అకాడమీ, వేదాంతు, లిడో లెర్నింగ్ లపై ప్రభావం పడింది. పైన పేర్కొన్న సంస్థలు 38 శాతంతో 4వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించాయి. ఉదాహరణకు జూన్ 18న అన్అకాడమీ మరో 150 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో10శాతంతో సుమారు 600 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగ నంపింది. శాలరీ ఎక్కువని టెంప్ట్ అయ్యారా! కోవిడ్ సమయంలో ఉద్యోగుల్ని ఆకర్షించేందుకు స్టార్టప్‌లు భారీ ఎత్తున జీతాలిచ్చాయి. వారిని నిలుపుకునేందుకు కొన్ని సందర్భాలలో బీఎండబ్ల్యూలాంటి కార్లని ఉద్యోగులకు అందించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నిధులు లేక..ఎక్కువ జీతాలిచ్చిన సంస్థలు సైతం ఉద్యోగుల్ని పక్కన పెట్టేస్తున్నాయి. అందుకే స్టార్టప్‌లో ఉద్యోగం అంటే కత్తిమీద సామేనని, సంస్థ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని హెచ్ఆర్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ఉద్యోగులకు బంపరాఫర్,ఫుల్ శాలరీ ఇస్తాం..365 రోజులు సెలవులు తీసుకోండి! -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..!
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించనుంది. ఈ నెల నుంచి ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా అట్రిషన్ రేటు..! గత ఆర్థిక సంవత్సరానికిగాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. మూడో త్రైమాసికం 25.5 శాతంతో పోల్చితే నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు 27.7 శాతానికి పెరిగింది. దీంతో కంపెనీ నుంచి వలసలను తగ్గించేందుకుగాను ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి వేతనాలను పెంచేందుకు ఇన్ఫోసిస్ సిద్దమైన్నట్లు సమాచారం. ఇక గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50,000 మందిని నియమించుకోనేందుకు ఇన్ఫోసిస్ చూస్తోంది. అంచనాల కంటే తక్కువ..! గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2021–22, క్యూ4)లో రూ. 5,686 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 5,076 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 22.7 శాతం ఎగబాకి రూ.32,276 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ఆదాయం రూ.26,311 కోట్లుగా ఉంది. 2021–22 క్యూ3 (అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్)లో నమోదైన లాభం (రూ.5,809 కోట్లు)తో పోలిస్తే క్యూ4లో లాభం 2.1 శాతం తగ్గింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం క్యూ3 (రూ.31,867 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా 1.3 శాతం పెరిగింది. కాగా గత నాలుగో త్రైమాసికంతో అంచనాల కంటే తక్కువ వృద్ధిని ఇన్ఫోసిస్ నమోదుచేసింది. చదవండి: బ్రిటన్ రాణిని దాటేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె..! -
టీసీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..!
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ తన ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా ఇంక్రిమెంట్స్..! గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 6 నుంచి 8శాతం మేర జీతాలను పెంచిందని కంపెనీ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఫలితాలు సానుకూలంగా ఉండడంతో FY23లో కూడా ఉద్యోగులకు భారీగా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీలో భారీగా అట్రిషన్ రేటు అత్యధికంగా 17.4 శాతానికి చేరుకుంది. దీంతో ఉద్యోగుల వలసలను ఆపేందుకుగాను ఉద్యోగులకు ఈ ఏడాదిలో భారీ స్థాయిలో ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు కంపెనీ సిద్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో రికార్డులను సృష్టిస్తూ నికరంగా లక్షకు పైగా ఉద్యోగాలను టీసీఎస్ కల్పించింది. ఈ ఏడాది(2022–23)లో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించేందుకు టీసీఎస్ సిద్దంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. తొలిసారి రికార్డు స్థాయిలో..! గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక ఫలితాలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రకటించింది. నాలుగో త్రైమాసిక ఫలితాలతో టీసీఎస్ దుమ్మురేపింది. గడిచిన త్రైమాసికంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయాలను టీసీఎస్ గడించింది. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి నాలుగో త్రైమాసికంలో రూ. 9,926 నికర ఆదాయాలను ఆర్జించింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోల్చితే...7.4 శాతం వృద్ధిని సాధించింది. ఒక త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం తొలిసారిగా రూ.50 వేల కోట్లను దాటడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే 15.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1, 91, 754 కోట్ల ఆదాయన్ని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ. 16.8 శాతం వార్షిక వృద్ధిని టీసీఎస్ ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఒక్కో షేరుకు రూ. 22 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. చదవండి: దుమ్మురేపిన టీసీఎస్...! తొలిసారి రికార్డు స్థాయిలో..! -
వేతన జీవులకు అదిరిపోయే శుభవార్త..!
కోవిడ్-19 రాకతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. దీంతో ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి మార్పులు చోటుచోసుకోలేదు. ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితులు సర్దుమనగడంతో ఆయా రంగాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. కాగా ఈ ఏడాదిలో వేతన జీవుల శాలరీలు బాగా పెరుగుతాయని జాబ్స్ అండ్ రిక్రూటింగ్ ఎజెన్సీ మైకేల్ పేజ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. కోవిడ్-19 ముందు ఇచ్చిన శాలరీ హైక్ కంటే ఈ ఏడాది ఎక్కువ ఇవ్వాలని కంపెనీలు చూస్తున్నట్లు తెలుస్తోంది. 9 శాతం మేర జీతాల పెంపు..! కరోనా సంక్షోభం నుంచి ఆయా రంగాలు గణనీయంగా పుంజుకోవడం... మార్కెట్లో టాలెంట్ ఉన్నవాళ్లు తక్కువగా ఉండడంతో ఉద్యోగుల జీతాలను భారీగా పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్లు మైకేల పేజ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఈ ఏడాది దేశంలోని కంపెనీలు సగటున 9 శాతం మేర జీతాలను పెంచేందుకు సిద్దంగా ఉన్నాయని వెల్లడించింది. ఆయా కంపెనీల్లో నిర్వహించిన సర్వే ప్రకారం జీతాల పెంపు నివేదికను మైకేల్ పేజ్ ఇండియా రూపోందించింది. ఈ సర్వేలో 13 మేజర్ సెక్టార్లకు చెందిన 500 కంపెనీలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. వీరికి భారీగా పెరగనున్న జీతాలు అట్రిషన్ రేటు కూడా జీతాల పెంపుకు దారితీసిందని మైకేల్‌పేజ్ తన నివేదికలో వెల్లడించింది. ఐటీ, ఐటీ సంబంధిత సెక్టార్, మాన్యుఫాక్చరింగ్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్, రిటైల్, గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్ (జీఐసీ), ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ) సెక్టార్లలోని పెద్ద కంపెనీలు ఈ ఏడాది సగటున 8–12 శాతం శాలరీ హైక్‌ను చేపట్టనున్నాయని మైకల్ పేజ్ ఇండియా శాలరీ సర్వేలో తేలింది. అంతేకాకుండా ఫిన్‌టెక్, కన్జూమర్ టెక్, బీ2బీ, హెల్త్‌టెక్, క్రిప్టో, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) రంగాల్లోని స్టార్టప్‌లు శాలరీలను ఎక్కువగా పెంచాలని చూస్తున్నాయని అన్నారు. స్టార్టప్స్‌లో భారీగా పెంపు..! స్టార్టప్‌లు, యూనికార్న్‌లు, త్వరలో యూనికార్న్‌లుగా మారబోయే కంపెనీలు ఉద్యోగులకు భారీ వేతన పెంపును అందిస్తాయని మైకేల్ పేజ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. ఆయా కంపెనీల ఉద్యోగులకు సగటున 12 శాతం మేర జీతాలను పెంచనున్నాయి. గత రెండేళ్ల కంటే ఈ సారి శాలరీ హైక్ ఎక్కువగా ఉంటుందని, కరోనా ముందు లెవెల్స్‌ను దాటుతుందని మైకల్ పేజ్ ఇండియా ఎండీ అంకిత్ అగర్వాల్ వెల్లడించారు. చదవండి: పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై ఐఎంఎఫ్ ప్రశంసలు..! -
అమెజాన్ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీగా పెరగనున్న వేతనం!
ప్రముఖ ఈ -కామర్స్ కంపెనీ అమెజాన్ తన ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. అమెజాన్ సంస్థ తన ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచేందుకు సిద్దం అవుతుంది. అమెరికాలో పని చేస్తున్న తన ఉద్యోగులకు చెల్లించే గరిష్ట బేస్ వేతనాన్ని 1.60 లక్షల డాలర్ల నుంచి రూ.3.5 లక్షల డాలర్లకు పెంచేందుకు సిద్దం అవుతున్నట్లు ఉద్యోగులకు తెలిపింది. అంటే వేతనం రెట్టింపు కానున్నది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగాలకు కూడా ఈ వేతనం పెంపు వర్తించనున్నది. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులతో పాటు కొత్తగా నియమకాలు చేపట్టనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో ప్రతిభావంతులను కాపాడుకోవడంతో పాటు బయటి నుంచి ప్రతిభ ఉన్నవారిని నియమించుకునేందుకు చూస్తున్నట్లు తెలిపింది. ఈ పోటీ మార్కెట్లో సిబ్బందిని కాపాడుకునేందుకు వేతన పెంపు ఉంటుందని సూచించింది. సిబ్బంది బేసిక్ శాలరీని బట్టి పరిహారం ఉంటుందని, అయితే, స్టాక్ యూనిట్లలో ఆంక్షల్లేకుండా సైన్ ఆన్ బోనస్‌లు, ఇతర బెనిఫిట్లు లభిస్తాయని అమెజాన్ చెప్పింది. గతేడాది అమెజాన్ గోదాములో పనిచేసే సిబ్బంది వేతనాలను గంటకు 15 డాలర్ల నుంచి 18 డాలర్లకు పెంచింది. వేర్‌హౌస్, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాల్లో ఇంకా1.25 లక్షల మందిని నియమించుకోనున్నామని వివరించింది. (చదవండి: హైదరాబాద్ స్టార్టప్ కంపెనీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..!) -
ఈ సెక్టార్లలోని ఉద్యోగులకు జీతాలు భారీగా పెరగడం ఖాయమేనా?
కోవిడ్-19 రాకతో పలు రంగాల్లో నెలకొన్న అనిశ్చితితో చాలా వరకు కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయి. అంతేకాకుండా పలు వ్యాపార కార్యకలాపాలు కూడా గణనీయంగా పడిపోయాయి. కాగా ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్నాయి. కోవిడ్ ప్రేరేపిత లాక్డౌన్స్ నుంచి బయటపడ్డ పలు కంపెనీలు ఉద్యోగులకు భారీగా వేతనాల పెంపు చేయనున్నట్లు అడ్వైజరీ, బ్రోకింగ్ అండ్ సొల్యూషన్స్ సంస్థ విల్లిస్ టవర్స్ వాట్సన్ తన నివేదికలో పేర్కొంది. 2021 మే- జూన్ మధ్య ద్వైవార్షిక సర్వేను విల్లిస్ టవర్స్ వాట్సన్ ఆన్లైన్లో నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 435 భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి. చదవండి: Ola Electric :ఓలా బైక్, నవంబర్ 10 నుంచి టెస్ట్ రైడ్స్ ప్రారంభం నివేదిక అంశాలు... ► వచ్చే ఏడాది భారత్‌లో సుమారు 9.3 శాతం మేర జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వేతనాల పెంపులో ఆసియా పసిఫిక్ రిజియన్లో అత్యధిక చెల్లింపుదారుగా భారత్ నిలవనుంది. ► 2021తో పోలిస్తే భారత్‌లో 8 శాతం మేర అధిక వేతనాల పెంపు ఉండనుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2021గాను అత్యధిక జీతాల పెంపు విషయంలో భారత్ తరువాత శ్రీలంక (5.5 శాతం), చైనా (6 శాతం), ఇండోనేషియా (6.9 శాతం) , సింగపూర్ (3.9 శాతం) ఉన్నాయి. ► భారత్‌లో సుమారు 52.2 శాతం కంపెనీలు వచ్చే ఏడాదిలో గణనీయమైన వృద్ధిని సాధిస్తాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా పలు రంగాల్లోని కంపెనీలు రాబోయే 12 నెలల్లో 30 శాతం కంటే ఎక్కువగా ఉద్యోగ నియమాకాలను చేయనున్నాయి. ఇది గత ఏడాది కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ► ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,టెక్నికల్ స్కిల్డ్ ట్రేడ్, సేల్స్, ఫైనాన్స్ వంటి కీలకమైన సెక్టార్లలో ఉద్యోగ నియామకం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఈ రంగాల్లో అత్యధికంగా వేతనాలపెంపు ఉండనుంది. ► మరోవైపు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అట్రిషన్ రేట్ తక్కువగా ఉంది. ► 2022 లో హైటెక్ రంగం అత్యధికంగా 9.9 శాతం , కన్స్యూమర్ ప్రొడక్ట్ అండ్ రిటైల్ రంగంలో 9.5 శాతం, తయారీ రంగంలో 9.30 శాతం మేర వేతనాల పెంపు ఉంటుందని తెలుస్తోంది. ► మరోవైపు ఎనర్జీ రంగంలో 2021లో 7.7 శాతంతో అత్యల్ప వాస్తవ జీతాల పెరుగుదల ఉండగా..వచ్చే ఏడాది 7.9 శాతానికి చేరనుంది. ఎనర్జీరంగంలో వేతనాల పెంపు కొంతమేర మందకొడిగా ఉందనే అభిప్రాయాన్ని విల్లిస్ టవర్స్ వాట్సన్ పేర్కొంది. చదవండి: నెట్‌ఫ్లిక్స్ దశనే మార్చేసిన దక్షిణకొరియన్ డ్రామా..! -
ప్రైవేటు రంగ ఉద్యోగులకు శుభవార్త..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రాకతో భారత్‌లో నిరుద్యోగరేటు గణనీయంగా పెరిగింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ ఎనాలిసిస్ ప్రకారం...భారత నిరుద్యోగిత రేటు 2019లో 5.27 శాతంగా నమోదవ్వగా, 2020లో నిరుద్యోగిత రేటు గణనీయంగా 7.11 శాతానికి చేరుకుంది. కోవిడ్ రాకతో సుమారు 12.2 కోట్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా వైరస్ ఉదృతి తగ్గడంతో కంపెనీలు తిరిగి ఉద్యోగనియామాకాలను చేపట్టాయి. జీతాల పెంపు..! తాజాగా బ్లూమ్‌బర్గ్ భారత ఉద్యోగులకు తీపి కబురును అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతీయుల జీతాలు గణనీయంగా పెరుగుతాయనీ పేర్కొంది. కోవిడ్-19 ప్రేరిత లాక్డౌన్ల నుంచి కంపెనీలకు ఉపశమనం కల్గనున్నట్లు పేర్కొంది. భారత్‌లో ముఖ్యంగా ఈ-కామర్స్, ఐటీ, ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ రంగాలోని ఉద్యోగులకు గణనీయంగా జీతాల పెంపు ఉంటుందని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఎరోస్పేస్, పర్యాటకం, అతిథ్య రంగాలు పుంజుకోవడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం..కోవిడ్-19 మూడో వేవ్‌ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే దేశంలోని ఉద్యోగులకు ఏప్రిల్ 2022 నుంచి వారి జీతాల్లో 8 శాతం మేర జీతాల పెంపు ఉండవచ్చునని పేర్కొంది. కరోనా మహామ్మారి సమయంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగ, వేతన కోతలను ఎదుర్కోన్న వారికి కాస్త ఉపశమనం కల్గనుంది. -
ఈ ఏడాది వేతనాలు పెరగనున్నాయ్
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీల్లో ఉద్యోగులకు ఈ ఏడాది సగటు వేతన పెంపు 7.3 శాతం ఉండొచ్చని డెలాయిట్ నివేదిక తెలిపింది. అంచనాలను మించి ఆర్థిక పునరుద్ధరణ, వ్యాపారాలు తిరిగి పుంజుకోవడం, వినియోగదార్ల విశ్వాసం ఇందుకు కారణమని వివరించింది. ఏడు రంగాలు, 25 ఉప రంగాలకు చెందిన 400 సంస్థలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. 2020లో సగటు వేతన పెంపు 4.4 శాతముంటే, 2019లో ఇది 8.6 శాతముందని వెల్లడించింది. జీతాలు పెంచే యోచనలో ఉన్నట్టు సర్వేలో పాలుపంచుకున్న 92 శాతం కంపెనీలు తెలిపాయి. గతేడాది 60 శాతం కంపెనీలే వేతన పెంపునకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. 2021లో రెండంకెల స్థాయిలో జీతాలు పెంపునకు 20 శాతం కంపెనీలు సుముఖంగా ఉన్నాయి. గతేడాది ఇంక్రిమెంట్ ఇవ్వలేకపోయిన కొన్ని కంపెనీలు ఈ ఏడాది అధికంగా వేతనాలను పెంచడం లేదా బోనస్ అందించాలని యోచిస్తున్నాయి. లైఫ్ సైన్సెస్, ఐటీ రంగ కంపెనీలు అధిక ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. -
జీతాల పెంపు యోచనలో ఐసీఐసీఐ బ్యాంక్
కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్‌రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తన సిబ్బంది జీతాలను పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుమారు 80వేల మందికి పైగా ఉద్యోగుల మూలవేతనంపై 8శాతం పెంచనుంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న సమయంలోనూ బ్యాంకుకు వీరు అందించిన సేవలకు ప్రోత్సాహకంగా వేతనాల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. పెంచుతున్న 8శాతం వేతనం ఈజూలై నుంచి అమల్లోకి రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకు వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించే ఎం1, అంతకంటే తక్కువ గ్రేడ్ ఉద్యోగులకు ఈ వేతనాల పెంపు ఉంటుందని తెలుస్తుంది. అయితే వేతనాల పెంపు అంశంపై బ్యాంకు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కోవిడ్-19 దెబ్బకు అనేక సంస్థలు వ్యయా నియంత్రణలో భాగంగా సిబ్బందిని తొలగించడం, వేతనాల కోత విధిస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి వారి వేతనాలు పెంచడం అభినందనీయమని కార్పోరేట్ వర్గాలు తెలిపాయి. -
మిడ్-డే మీల్స్ కార్మికుల వేతనం పెంచుతూ జీవో
సాక్షి, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనం 1000 నుంచి 3000 కు పెంచుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలు పెంచుతూ ఆదేశాలిచ్చారు. జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచుతూ జీవో విడుదల చేయడంపట్ల మధ్యాహ్న భోజన పథకం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చిగురించిన ఆశా
-
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, ముంబై: ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సీనియర్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పటికంటే ముందుగానే జీతాల పెంపును ప్రకటించి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఉద్యోగుల పనితీరు ప్రాతిపదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి వారికి 3నుంచి 5శాతం జీతం పెంచనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు సీనియర్ ఉద్యోగులు మొత్తం 170 మందికి ప్రమోషన్లు కూడా ఇవ్వనుంది. సాధారణంగా ప్రతి ఏటా ఉద్యోగులకు ఏప్రిల్ నెల నుంచి జీతాలు పెంచుతారు. సీనియర్లకైతే జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇచ్చి మరీ జీతాలు పెంచుతారు. అయితే ఈ సారి దానికి భిన్నంగా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు కలిసి సీనియర్ ఉద్యోగులైన 500 మందికి జనవరి నుంచే జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో 170 మందికి ప్రమోషన్లు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. -
6% వేతనాల పెంపు
ముంబై: వేతనాల పెంపు ప్రతిపాదనలపై బ్యాంకు ఉద్యోగులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా 13వ రౌండు చర్చల్లో ఐబీఏ ఆరు శాతం పెంపును ప్రతిపాదించింది. కానీ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల సమాఖ్య యూఎఫ్‌బీయూ దీన్ని తిరస్కరించింది. చర్చలు కొనసాగించడానికి సిద్ధమని మాత్రం ప్రకటించింది. ‘ఐబీఏ గతంలో ప్రతిపాదించిన 2% ఆఫర్‌ను సవరించి 6%కి పెంచింది. అయితే యూఎఫ్‌బీయూ దీన్ని తిరస్కరించింది. కానీ చర్చల కొనసాగింపునకు అంగీకరించింది’ అని యూఎఫ్‌బీయూ కన్వీనర్ (మహారాష్ట్ర) దేవీదాస్ తుల్జాపూర్కర్ తెలిపారు. బ్యాంకు యూనియన్లు 25 శాతం పెంపును డిమాండ్ చేస్తున్నాయని, ఆగస్టు నెలాఖరులోగా దీనిపై మళ్లీ చర్చించేందుకు ఐబీఏ అంగీకరించిందని ఆయన వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 37 బ్యాంకుల యాజమాన్యాల తరఫున ఉద్యోగుల వేతన సవరణపై ఐబీఏ చర్చలు జరుపుతోంది. మే 5న జరిగిన చర్చల్లో ఐబీఏ కేవలం రెండు శాతమే ఆఫర్ చేసింది. దీన్ని తిరస్కరించిన ఉద్యోగుల యూనియన్లు మే నెలలో 2 రోజుల సమ్మెకు కూడా దిగాయి. -
ఉద్యోగులకు శుభవార్త
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఆరో వేతన సంఘం సిఫార్సు చేసిన 30 శాతం వేతన పెంపు జూలై నుంచి ఉద్యోగుల జీతాల్లో జమ కానుంది. ఏప్రిల్ 1 నుంచి పెంపు వర్తిస్తుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంఆర్ శ్రీనివాసమూర్తి నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ ఉద్యోగుల మూలవేతనంపై 30 శాతం, డీఏపై 13 శాతం పెంచాలని సిఫార్సు చేసింది. దీనికి అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమోదం తెలిపారు. రూ.10,500 కోట్ల భారం ఇదే విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో మాజీ సీఎం సిద్ధరామయ్య వేతనాల పెంపు గురించి ప్రస్తావించారు. ఈ పెంపుతో ప్రభుత్వంపై రూ.10,500 కోట్ల భారం పడుతుందని అప్పట్లో సిద్ధరామయ్య ప్రకటించారు. వేతనాల పెంపుతో రాష్ట్రంలోని 5.02 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థల్లోని 73 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం ప్రకటించిన 43 శాతం వేతనాలు పెంచడం సాధ్యం కాదని, ఆ మేరకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే 30 శాతం మేర జీతాలు పెంచేందుకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. పెంపునకు ఆరో వేతన సంఘం ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్నికల కారణంగా వాటి అమలు వాయిదా పడింది. మే నెలలో పెంచిన జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉండగా ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ పెరిగిన జీతాలు మే, జూన్ నెలల్లో జమ కాలేదు. ఈ నేపథ్యంలో జూలై జీతంలో జమ అవుతుంది. సాక్షి, బెంగళూరు.. -
ఆ ఉద్యోగులకు నిరాశే..
సాక్షి, ముంబయి : సంక్షోభాలతో సతమతమవుతున్న టెలికాం పరిశ్రమ ఉద్యోగులకు చేదు కబురు అందిస్తోంది. గత ఏడాది అత్యంత క్లిష్ట పరిస్థితులను అధిగమించిన క్రమంలో ఈసారి ఈ రంగంలోని 30 నుంచి 40 శాతం ఉద్యోగులకు వేతన పెంపు ఉండదని, బోనస్ సైతం సగానికి సగం తగ్గుతుందని భావిస్తున్నారు. టెలికాం ఆపరేటర్లు, టవర్లను నిర్వహించే సంస్ధలు రాబడి తగ్గి మార్జిన్లు పడిపోవడంతో ఖర్చులకు కోత పెట్టే పనిలో పడ్డారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మంది ఉద్యోగులకు ఎలాంటి ఇంక్రిమెంట్ ఉండకపోవచ్చని, బోనస్‌లు సైతం సగానికి తగ్గే అవకాశం ఉందని రిక్రూట్మెంట్ సంస్థ కోర్న్ ఫెర్రీ ఛైర్మన్ నవ్‌నీత్ సిన్హా చెప్పారు. రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్‌లో చేపట్టిన టారిఫ్ వార్తో టెలికాం సంస్థలు కుదేలయ్యాయి. వినియోగదారులను నిలబెట్టుకునేందుకు పలు సంస్థలు పోటాపోటీగా టారిఫ్‌లు తగ్గించడంతో కంపెనీల మార్జిన్లు భారీగా పడిపోయాయి. గత ఏడాదిగా పరిస్థితి దారుణంగా ఉందని, 40 శాతం సిబ్బందికి వేతన పెంపు దక్కలేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ పరిస్థితి తీవ్రతను వివరించారు. ఈ రంగంలో చోటుచేసుకుంటున్న నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడంపై కంపెనీలు దృష్టిసారించాలని చెప్పారు.టెలికాం కంపెనీలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్న క్రమంలో ఉద్యోగుల వేతనాల పెంపును విస్మరించకతప్పదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
వేతన సంబురం
పరిగి : హోంగార్డుల్లో హర్షాతిరేకాలు.. వేతనం పెంచుతూ ప్రభుత్వం గత డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. పెంచిన ప్రకారం నెలకు రూ. 20 వేల వేతనం గురువారం వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ ఆనందభరితమైన క్షణాలు వారు తోటి సిబ్బంది, పోలీసు అధికారులతో పంచుకున్నారు. మొదటి సారి రూ. 20 వేల వేతనం డ్రా చేసుకున్న వారు స్వీట్లు తీసుకువచ్చి అందరికీ పంచారు. ప్రభుత్వం పెంచుతున్నట్లు ప్రకటించిన రోజు కంటే తమ ఖాతాల్లో జజ అయిన క్షణాల్లో తమ ఆనందం రెట్టింపుయ్యిందని వారు తెలిపారు. పరిగి ఎస్ఐలు కృష్ణ, ఓబుల్‌రెడ్డి వారికి స్వీట్లు తినిపించారు. తమ పనికి తగిన గౌరవం లభించినట్లయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ముందు మరింత ఆత్మ విశ్వాసంతో పనిచేస్తామని తెలిపారు. క్రమబద్ధీకరిస్తే బాగుండేదని మరికొందరు హోంగార్డులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సర కాలంలో రెండు సార్లు వేతనాలు పెంచటంతో పాటు హోంగార్డులకు ఆరోగ్యపరమైన, గృహాలు నిర్మించి ఇచ్చే విషయంలో ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. నెలకు రూ. 9 వేలుగా ఉన్న హోంగార్డుల వేతనాలు గత మార్చిలో రూ. 12 వేలకు పెంచగా ప్రస్తుతం రూ. 20 వేలకు పెంచింది. ఎంతో మంచి నిర్ణయం ఇప్పటి వరకు హోంగార్డులుగా అనేక సేవలు అందిస్తూ వచ్చాం. చాలిచాలని వేతనాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు సీఎం కేసీఆర్ హోంగార్డులకు వేతనాలు పెంచటంతో పాటు తగిన గుర్తింపు ఇచ్చారు. సంక్షేమంపై తీసుకున్న నిర్ణయంతో హోంగార్డుల కుటుంబాలకు ఎంతో మేలు జరగనుంది. – బిచ్చయ్య, హోంగార్డు, పరిగి. సమస్యలు తీరుతాయి సీఎం కేసీఆర్ తమకు వేతనాలు పెంచడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పటంతో చాలా సంతోషం. తమకు చాలా వరకు సమస్యలు తీరుతాయి. ఇదే సమయంలో కానిస్టేబుల్ నియామకాల్లో రిజర్వేషన్లు పెంచటం కూడా మంచి నిర్ణయమే. మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. – యాదలక్ష్మి, హోంగార్డు, పరిగి -
రాష్ట్రపతి వేతనం రూ.5 లక్షలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాలు భారీగా పెరిగాయి. రాష్ట్రపతి వేతనం నెలకు రూ.5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనం నెలకు రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గవర్నర్ల వేతనం రూ.3.5 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు రూ.1.50 లక్షలు, ఉపరాష్ట్రపతికి 1.25 లక్షలు, గవర్నర్లకు రూ.1.10 లక్షల చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వేతనాల పెంపును బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..వారి జీతభత్యాలు చివరిసారి 2006 జనవరి 1న పెరిగిన సంగతిని గుర్తుచేశారు. రెండేళ్ల క్రితం ఏడో వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు రాష్ట్రపతి కన్నా ఎక్కువ వేతనాలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఎంపీలకు డబుల్ ధమాకా... ఎంపీల మూల వేతనాలు రెట్టింపు కానున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి వారి మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ తాజా బడ్జెట్లో జైట్లీ ప్రతిపాదించారు. వారికిచ్చే ఇతర భత్యాలను కూడా పెంచనున్నారు. ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోసారి ఎంపీల వేతనాలు, భత్యాలను ఆటోమేటిక్‌గా సవరించేందుకు కూడా జైట్లీ కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. ఎంపీల వేతనాల పెంపుపై ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులు విమర్శలకు దారితీస్తున్నాయని అన్నారు. అందుకే వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఎంపీల వేతనాలు, నియోజకవర్గాల భత్యం, కార్యాలయాల ఖర్చులు, సమావేశాల భత్యాలను సవరించే విధానాల్లో మార్పులు తెస్తున్నట్లు ప్రకటించారు. -
ఉద్యోగులకు కాగ్నిజెంట్ బ్యాడ్ న్యూస్
ప్రమోషన్లు, వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఆ కంపెనీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రమోషన్లు, వేతనాల పెంపును మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. వృద్ధి రేటు మందగించడం, వ్యాపారాల వ్యయాలు పెరుగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ విషయంపై ఇప్పటికే కంపెనీ తన ఉద్యోగులకు ఈ-మెయిల్స్‌ను పంపుతోంది. ఈ మెయిల్స్‌లో వేతనాల సవరణ, ప్రమోషన్లను అక్టోబర్ 1 నుంచి చేపడతామని కంపెనీ సీటీఎస్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ జిమ్ లెనోక్స్ చెప్పారు. ప్రతేడాది జూలై 1న వేతనాల సవరణను, ప్రమోషన్లను కంపెనీ ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది అక్టోబర్‌లో చేపడతామని కంపెనీ చెప్పింది. ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 2,61,000 మంది ఉద్యోగులున్నారు. జిమ్ లెనోక్స్ పంపిన ఈ-మెయిల్స్‌లో మేనేజర్ స్థాయి వరకున్న ఉద్యోగులు తమ బేసిక్ వేతనంపై శాతం పెరుగుదల ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సీనియర్ మేనేజర్, ఆపై స్థాయి వారికి మొత్తం ఒకేసారి చెల్లిస్తామని లేదా ప్రతినెలా పెంచుతూ ఉంటామని చెప్పారు. పనితీరుకు సంబంధించిన బోనస్‌లు వేరుగా ఉంటాయని పేర్కొన్నారు. అసోసియేట్లకు, వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకున్న ఉద్యోగులకు ప్రమోషన్లను త్వరలోనే ప్రకటిస్తామని, అవి కూడా అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తాయని ఈ-మెయిల్లో తెలిపారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, పై స్థాయి వారి ప్రమోషన్ల వివరాలను వేరుగా ప్రకటిస్తామని కంపెనీ చెప్పింది. అయితే వీటిపై స్పందించడానికి కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి నిరాకరించారు. అప్రైజల్ సైకిల్‌ను జాప్యం చేయడం ఐటీ ఇండస్ట్రీ కఠినతరమైన సవాళ్లను ఎదుర్కొంటుందనే పరిస్థితులకు సంకేతమని కొంతమంది ఉద్యోగులంటున్నారు. వృద్ధి రేటు మందగించడం, టెక్నాలజీలో ఆందోళనలు మధ్యస్థాయి ఉద్యోగుల్లో ఉద్యోగాల కోత భయాలను పెంచుతుందని పేర్కొన్నారు. -
ఇన్ఫోసిస్ మరో బ్యాడ్ న్యూస్
బెంగళూరు : ఉద్యోగాల కోతపై తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల కోత భయాందోళనలను కొంత తగ్గించి, వేతనాల పెంపును వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.. వేతనాల పెంపును జూలై వరకు వాయిదా వేస్తున్నట్టు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. జూలై వరకు వేతనాల పెంపుకు ఆగాల్సిందేనని, సీనియర్ ఉద్యోగులకు మరింత ఆలస్యమయ్యే అవకాశముందుని తెలిపారు. నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రవీణ్ రావు వివరించారు. అయితే ఇన్ఫోసిస్ లో ఎలాంటి ఉద్యోగాల కోతకు తాము ప్లాన్ చేయడం లేదని యూబీ ప్రవీణ్ రావు తెలిపారు. లేఆఫ్స్ ప్లాన్స్ పై టెక్కీల్లో నెలకొన్న ఊహాగానాలకు తాను స్వస్తి చెప్పుతున్నట్టు పేర్కొన్నారు. కానీ గతంలో మాదిరిగా కొంత ఫర్ఫార్మెన్స్ ఆధారితంగా వైదొలగాల్సి వస్తుందని చెప్పారు. వరుసగా కొంతకాలంపాటు మంచి పనితీరు కనబరచనివారిపై చర్యలు తీసుకోనున్నాం. ఇందులో భాగంగా కొందరు వైదొలగాల్సిన అవకాశముందని ప్రవీణ్ రావు ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. ఎనిమిదేళ్ల కంటే తక్కువ అనుభవమున్న జాబ్ లెవల్ 5 ర్యాంక్ ఉద్యోగుల పరిహారాల సమీక్ష జూలై నుంచి ప్రారంభమవుతుందని ప్రవీణ్ రావు తమ ఉద్యోగులకు బుధవారం ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. సీనియర్ ఉద్యోగులకు పరిహారాల సమీక్ష తర్వాతి క్వార్టర్లలో ఉంటుందని ఈ లేఖలో పేర్కొన్నారు. వేతనాల పెంపు ఆలస్యం ఒకటి లేదా రెండు క్వార్టర్ల మార్జిన్లను కాపాడుకునేందుకు తాత్కాలిక మార్గమేనని అనాలిస్టులు చెబుతున్నారు. ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాక, టెక్ మహింద్రా సైతం వేతనాల పెంపును వాయిదా వేస్తుందని తెలిసింది. కానీ సీనియర్ ఉద్యోగులకు వేతన పెంపు ఆలస్యమనేది, వారు ఇతర ఉద్యోగాలు చూసుకునే స్థాయికి దారితీస్తుందని ముంబై బ్రోకరేజ్ కు చెందిన ఓ అనాలిస్టు చెప్పారు. ఉద్యోగంలో అభద్రతా వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు. ఇటీవల టెక్ కంపెనీల్లో భారీగా లేఆఫ్స్ తో ఉద్యోగులు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ సైతం 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనుందని తెలుస్తోంది. కానీ ఉద్యోగాల కోతకు తాము ఎలాంటి ప్లాన్ చేయడం లేదని, రెగ్యులర్ ఫర్ ఫార్మెన్స్ ఆధారితంగానే కొందరు వైదొలగాల్సి వస్తుందని కంపెనీ చెబుతోంది. -
25 శాతం మాకు సమ్మతం కాదు!
జీతాల పెంపుపై టీమిండియా సహాయక సిబ్బంది ముంబై: తమ వేతనాల పెంపుతీరుపై టీమిండియా సహాయక సిబ్బంది గుర్రుగా ఉన్నారు. ప్రస్తుత వేతనాన్ని 25 శాతం పెంచేందుకు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి చేసిన ప్రతిపాదనను బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లతో కూడిన సిబ్బంది తిరస్కరించినట్టు సమాచారం. గతంలో బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే వీరికి వంద శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగా వారు పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. గతంలో తమకు లభించిన హామీతో పోలిస్తే తాజాగా జోహ్రి చేసిన ప్రతిపాదన చాలా తక్కువ అనే అసంతృప్తి వారి నుంచి వ్యక్తమవుతోంది. ‘బంగర్ సహా కొందరు టీమిండియా తరఫున మూడేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ అదే జీతంతో వారు కొనసాగుతున్నారు. ఇది నిజంగా వీరిపై వివక్ష కొనసాగిస్తున్నట్టే అవుతుంది. చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా వారికి లభిస్తున్న వేతనాలను పెంచాల్సిందిగా అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు బోర్డు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదు’ అని సహాయక సిబ్బంది వర్గాలు తెలిపాయి. మరోసారి బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) ఈ విషయంపై దృష్టి సారించనుంది. మరోవైపు గతేడాది జట్టు కోచ్‌గా ఎంపికైన కుంబ్లేకు ఏడాదికి రూ.6.5 కోట్ల వేతనాన్ని అందిస్తున్నారు. -
అంగన్వాడీలపై వరాల జల్లు
- కార్యకర్తల వేతనం రూ. 10,500కు పెంచుతామన్న కేసీఆర్ - మినీ అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనం రూ. 6,000కు పెంపు - పదోన్నతులు, బీమా సదుపాయం కూడా.. 67,411 మందికి లబ్ధి - డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరులో ప్రాధాన్యత - అంగన్వాడీ కార్యకర్తల పేరు అంగన్వాడీ టీచర్లుగా మార్పు - వచ్చే నెల నుంచి అంగన్వాడీల్లో సన్న బియ్యం భోజనం - ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు రూ.12 వేల ప్రోత్సాహకం - ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనంగా అందజేత - శిశువుల కోసం నూనెలు, సబ్బులతో కూడిన ప్రత్యేకమైన కిట్ సాక్షి, హైదరాబాద్ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాల వర్షం కురిపించారు. అంగన్ వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.7,000 నుంచి రూ.10,500కు, మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాల (హెల్పర్ల) వేతనాన్ని రూ.4,500 నుంచి రూ.6,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తల హోదాను అంగన్వాడీ టీచర్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు రూ.12 వేలు ప్రోత్సాహకంగా అందిస్తామని, ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనంగా అందిస్తామని సీఎం ప్రకటించారు. సోమవారం జనహితలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు అక్కడికక్కడే పలు నిర్ణయాలను ప్రకటించారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పదోన్నతులు, బీమా సదుపాయం కూడా.. సీనియారిటీ, అర్హతల ఆధారంగా అంగన్వాడీ టీచర్లకు సూపర్ వైజర్లుగా పదోన్నతులు కల్పిస్తామని, అంగన్వాడీ టీచర్, హెల్పర్లకు బీమా సదుపాయం కల్పిస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక వచ్చే నెల నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు సన్న బియ్యం భోజనం పెడతామన్నారు. మే నెలలో ఎండల కారణంగా గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు రావడం ఇబ్బందిగా ఉన్నందున ఆ నెల పోషకాహారాన్ని నేరుగా ఇళ్లకే పంపుతామని ప్రకటించారు. రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు ‘‘ప్రైవేటు డాక్టర్లు రాక్షసులకన్నా ఎక్కువగా తయారయ్యారు.. అంటే బాధ అనిపిస్తది. అక్కర ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేయడం, గర్భ సంచులు తీసేయడం.. ఇలా పరమ దుర్మార్గమైన, నీచమైన పనులు చేస్తున్నరు. మంచిగా ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టే పనులు చేస్తున్నరు..’’అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దీనిని నిర్మూలించేందుకు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం తమిళనాడు తరహాలో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నామని.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు రూ.15 వేల వరకు ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించామని తెలిపారు. రూ.12 వేలు.. రూ.2 వేల విలువైన కిట్ రాష్ట్రంలో మాతాశిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటరు. తెలంగాణ తల్లులు జన్మనిచ్చిన పిల్లలు రేపటి తెలంగాణ సంపద. వారు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఆరోగ్య లక్ష్మి పథకం కింద అంగన్వాడీల ద్వారా పోషకాహారం, పాలు, గుడ్లు అందిస్తాం. అందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడం. పేద గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులుగా ఉండి కూడా కుటుంబం గడవడం కోసం కూలి పనులకు వెళ్లాల్సి రావడం బాధాకరం. వారు డబ్బుల కోసం కూలి పనులకు వెళ్లకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించాం. ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత కూడా తల్లీ బిడ్డల బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నాం..’’అని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ.4 వేల చొప్పున మూడు విడతలుగా రూ.12 వేలు సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆడపిల్ల పుడితే చివరి విడతలో మరో రూ. వెయ్యి అదనంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇక పుట్టిన శిశువులకు కావాల్సిన నూనెలు, సబ్బులు, పౌడర్ల వంటి వాటితో రూ.2 వేల విలువ చేసే కిట్‌ను కూడా ప్రభుత్వం తరఫున బహుమతిగా ఇస్తామని చెప్పారు. ఈ పథకాన్ని పేద మహిళలు సద్వినియోగం చేసుకోవాలని.. ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు ఈ దిశగా కృషి చేయాలని కోరారు. కాగా శిశువులకు అందజేసే కిట్‌ను కేసీఆర్ కిట్‌గా పిలవాలని అంగన్వాడీల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్లుగా అనంతరం సీఎం కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్, డైరెక్టర్ ఇందిర, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. 67,411 మందికి లబ్ధి వేతనాల పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణ ఆవిర్భావం నాటికి అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ.4,200. 2015 ఫిబ్రవరిలో రూ.7,000కు పెంచారు. తాజాగా 50 శాతం పెంపుతో వారి వేతనాలు రూ.10,500కు చేరాయి. ఇక మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, హెల్పర్ల వేతనం రాష్ట్ర ఏర్పాటు నాటికి రూ.2,200గా ఉండగా.. 2015 ఫిబ్రవరిలో రూ.4,500కు పెంచారు. తాజాగా సుమారు 33.3 శాతం పెంపుతో వేతనాలు రూ.6,000కు చేరాయి. ఇక నుంచి అంగన్వాడీ టీచర్లు: కార్యకర్తల హోదా మార్చుతూ ఉత్తర్వులు అంగన్వాడీ కార్యకర్తల పేరును అంగన్వాడీ టీచర్లుగా మార్చారు. వారికి గౌరవ వేతనాన్ని పెంచడంతోపాటు హోదాను మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెంటనే చర్యలు చేపట్టింది. ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు అధికారులు ఫైలును సిద్ధం చేయగా.. ప్రభుత్వ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీ టీచర్లుగా సంబోధించాలని అందులో పేర్కొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రస్తుత మున్న వేతనాలపై 50 శాతం పెంపునకు సంబంధించిన ఫైలుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం సంతకం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక్కో లెక్చరర్‌కు రూ.18 వేలు ఉండగా, దానిని రూ.27 వేలకు పెంచేందుకు ఇటీవల ఆర్థిక శాఖ అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆ ఉత్తర్వుల జారీకి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. దీంతో రాష్ట్రంలోని 3,687 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రయోజనం చేకూరనుంది. -
జియో ఉద్యోగులకు ఫెస్టివల్ గిప్ట్
కోల్కత్తా : రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సంస్థ జియో ఇన్ఫోకామ్ తన ఉద్యోగులకు పండుగ కానుకలు తీసుకొచ్చింది. ఉత్తమమైన ప్రతిభ కనబర్చి 4జీ నెట్వర్క్ ఆపరేషన్స్‌ను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలను 15 శాతం పెంచింది. పనితీరు బాగున్న జూనియర్, మధ్యశ్రేణి ఉద్యోగులకు ఈ వేతనాలు పెరిగినట్టు కంపెనీకి చెందిన ఒకరు చెప్పారు. అదేవిధంగా ఉన్నతస్థాయి పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, డీజీఎమ్ స్థాయి వారికి కూడా ప్యాకేజీ 10 శాతం ఎగిసినట్టు వెల్లడించారు. నెట్వర్క్స్/నెట్వర్క్స్ ఐటీ అండ్ సపోర్టు, సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్, ప్రాజెక్టు, హెచ్ఆర్, రెగ్యులేటరీలో పనిచేసే వారు ఈ వేతనాల ఇంక్రిమెంట్ లబ్దిపొందనున్నట్టు చెప్పారు. వార్షిక ఇంక్రిమెంట్ కింద తమ జూనియర్, మిడిల్ స్థాయి ఉద్యోగులకు 7 శాతం నుంచి 15 శాతం వేతనాలను పెంచనున్నట్టు జియో గతేడాది చివర్లోనే ప్రకటించింది. పెరిగిన వేతనాలు ఏప్రిల్-మే నుంచి ఉద్యోగులకు అందుతాయని తెలిపింది. కానీ ఆ పెంపు కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ వేతనాలను రిలయన్స్ జియో పెంచినట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియో ఉద్యోగులు అందుకుంటున్న వార్షిక ఇంక్రిమెంట్స్ ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా బాగున్నాయని ఓ ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టెన్సీ చెప్పింది. గతనెలలోనే రిలయన్స్ జియో సంచలనం సృష్టిస్తూ 4జీ సేవలను లాంచ్ చేసింది. కానీ ఆ సర్వీసులు ఆవిష్కరించిన కొన్ని రోజులకే ఉన్నత స్థాయి ఉద్యోగులు కొంతమంది కంపెనీకి రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలకు సరియైన కారణాలు తెలియరాలేదు. -
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాల పెంపు!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ల జీతభత్యాలను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఏడో వేతన సంఘం అమలుతో కేంద్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల జీతాలు.. రాష్ట్రపతి, ఉపరాష్ర్టపతుల జీతాల కంటే ఎక్కువగా ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. హోం శాఖ సిద్ధంచేసిన ఈ ప్రతిపాదనలను వచ్చే వారంలో కేబినెట్ ఆమోదానికి పంపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రపతి నెలకు రూ. 1.50 లక్షలు, ఉపరాష్ట్రపతి రూ. 1.25 లక్షలు, గవర్నర్లు రూ. 1.10 లక్షలు జీతంగా అందుకుంటున్నారు. అయితే, ఏడో వేతన సంఘం అమలుతో తాజాగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి రూ. 2.5లక్షలు, కార్యదర్శులు రూ. 2.25లక్షల జీతం పొందుతున్నారు. ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పాక ఆయా బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది. 2008లో చివరిసారిగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు పెంచారు. 2008కి ముందు వీరి జీతాలు వరసగా రూ. 50,000, రూ. 40,000, రూ. 36,000 ఉండేవి. కాగా, మాజీ రాష్ట్రపతులు, మాజీ ఉపరాష్ట్రతులు, మాజీ గవర్నర్ల పెన్షన్ చెల్లింపులను పెంచాలనే ప్రతిపాదనలపై కేంద్రం యోచిస్తోంది. -
సెర్ప్, ‘ఉపాధి’ ఉద్యోగుల వేతనాలు పెంపు
• పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం • ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్), ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపునకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు వేతనాల పెంపు కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సెర్ప్ సీఈవో పౌసమిబసుతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సమీక్షించారు. అనంతరం ఏమేరకు వేతనాలను పెంచాలనే దానిపై అధికారులకు ఆదేశాలిచ్చారు. సెర్ప్‌లో మొత్తం 4,174 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 767 మంది మండల సమాఖ్య క్లస్టర్ కో-ఆర్డినేటర్లుగా పనిచేస్తున్నారు. వారి వేతనాన్ని ప్రస్తుతమున్న రూ.6,150 నుంచి రూ.12 వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు. మిగతా ఉద్యోగులకు 30 శాతం పెంచాలని సూచించారు. ఇక ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 6,900 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రస్తుతమున్న రూ.6,290 వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని... మిగతా ఉద్యోగులకు 20 శాతం మేర పెంచాలని సూచించారు. ఈ వేతనాల పెంపునకు సంబంధించి వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీచేయాలని మంత్రి జూపల్లికి సూచించారు. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం సెర్ప్, ఉపాధి హామీ ఉద్యోగుల వేతనాల పెంపుపై కొందరు ఉద్యోగులు హర్షం ప్రకటిస్తుండగా, మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.6 వేల వేతనంతో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండింతలు పెంచి.. తమకు 20 శాతమే పెంచడం ఎంతవరకు సమంజసమని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్ ఉద్యోగులతో సమానంగా 30 శాతం వేతనాలు పెంచినా బాగుండేదని పేర్కొంటున్నారు. ఇక 50 శాతం దాకా వేతనాలు పెరుగుతాయని ఆశించిన సెర్ప్ ఉద్యోగులు సైతం తాజా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సాధికారత ఎక్కడ?
మహిళలను నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం కోటీశ్వరులను చేస్తామంటూ.. మొండిచేయి వేలం పేరుతో అధికారపార్టీ నాయకులకు ఇసుక రీచ్‌లు ? ఫిబ్రవరి నుంచి కొత్త విధానం అమలు విమర్శల నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ జీతాలపెంపు పేరుతో.. అంగన్వాడీలను, రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను నమ్మించి నట్టేట ముంచిన తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా మరో ఝలక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ ఇసుక రీచ్‌లను కేటాయించి మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారు. వేలం పాటల ద్వారా ఇసుక రీచ్‌లను విక్రయించాలని ఇటీవల నిర్ణయించారు. అందులోనూ రీచ్‌లన్నీ అధికార పార్టీ కార్యకర్తలకే దక్కేటట్లు నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో మహిళాసాధికారత మూన్నాళ్ల ముచ్చటగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు: మాట ఇచ్చి తప్పడంలో తనను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి రుజువు చేశారు. ఇప్పటివరకు ఇసుక రీచ్లిచ్చి డ్వాక్రా మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న బాబు ఇప్పుడు మాట మార్చారు. పేరుకు డ్వాక్రా సంఘాలకు కేటాయించినా 90 శాతం ఇసుక రీచ్‌లను అధికార పార్టీ నేతలు ఆక్రమించి అక్రమ ఇసుక వ్యాపారాన్ని సాగించారు. ఏడాదిలో జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారం ద్వారా రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీని నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు సిద్ధమైంది. డ్వాక్రా మహిళల అడ్డును తొలగించేందుకు వ్యూహరచన చేసింది. ఇసుక రీచ్‌ల కేటాయింపుల్లో కొత్త విధానమంటూ కుట్రకు తెరలేపింది. వేలంపాటల ద్వారా ఇసుక రీచ్‌లను సొంత పార్టీ నాయకులకు కేటాయించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లావ్యాప్తంగా అధికారికంగా 64 ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి. ఇందులో అధికారికంగా 6,16,054 క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు సాగించారు. దీనికి సంబంధించి రూ.19.20 కోట్లు ప్రభుత్వానికి రాబడి లభించింది. అన్ని రీచ్‌లను అధికార పార్టీ నేతలు ఆక్రమించి యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తరలించారు. చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు రేయింబవళ్లు ఇసుకను తరలించారు. తద్వారా రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించారు. ఇక సగటున ఒక్కొక్క క్యూబిక్ మీటరు ఇసుకను రూ.310లకు అమ్మారు. ఇందులో క్యూబిక్ మీటర్‌కు రూ.10 చొప్పున డ్వాక్రా మహిళలకు కమీషన్ ప్రకారం రూ.61.6 లక్షలు మాత్రమే ఇచ్చింది. వచ్చిన ఆదాయంలో 25 శాతం మహిళలకే ఇస్తామన్న చంద్రబాబు ఆ హామీని తుంగలో తొక్కారు. క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తాజాగా ఇసుక రీచ్‌లపై క్యాబినెట్లో చర్చించిన ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అధికార పార్టీ నేతలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి వేలం పాటల పేరుతో ఇసుక రీచ్‌ల కేటాయింపు జరపనుంది. దీంతో తెలుగుదేశం నాయకులు ఇకపై బహిరంగంగా ఇసుక వ్యాపారం చేయనున్నారు. -
తొలగింపుపై తిరుగుబాటు
నోటికి నల్ల రిబ్బన్లతో అంగన్వాడీల ప్రదర్శన సర్కార్ ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని వెల్లడి విజయవాడ (మధురానగర్) : జీతాల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగించాలంటూ ఉత్తర్వులు ఇవ్వటంపై ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యాన గురువారం మౌన నిరసన చేపట్టారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని లెనిన్ సెంటర్లో ప్రదర్శన చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం చేస్తున్న ఉద్యమాలను నీరుగార్చేందుకు టీడీపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉద్యోగాలు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. తామంతా సంఘటితంగా ఉండి డిమాండ్లు సాధించుకుంటామని, తమ సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అప్పులు చేసి నిర్వహిస్తున్నాం... గత ఆరు నెలలుగా వేతనాలు, బిల్లులు సక్రమంగా రాకపోయినా తాము అప్పులు చేసి మరీ సెంటర్లను నిర్వహిస్తున్నామని సుప్రజ చెప్పారు. చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్న తాము కనీస వేతనాల కోసం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే తమపై పోలీసులతో దాడి చేయించటమే కాకుండా ధర్నాలో పాల్గొన్నవారిని ఉద్యోగాలు నుంచి తొలగించటానికి ప్రయత్నించటం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు, ధర్నాలు ఉద్యమాలు ఎందుకు చేశారని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో రాత్రంతా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి చర్చించిన టీడీపీ సర్కారు తమ సమస్యల గురించి పట్టించుకోకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో తమ సమస్యలపై మాట్లాడుతున్న రోజాను సస్పెండ్ చేయటమేకాక నగరంలో టీడీపీ నాయకులు రోజా దిష్టిబొమ్మను దహనం చేయటం వారి నైజాన్ని తెలియజేస్తోందన్నారు. అణచివేయాలని చూస్తున్నారు... ఎన్నికలకు ముందు అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు.. ఇప్పుడు అంగన్వాడీ ఉద్యమాన్ని అణచి వేయటానికి ప్రయత్నిస్తునారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు సుధాకర్, టి.ప్రభుదాస్, బి.నాగేశ్వరరావులు మాట్లాడుతూ అంగన్వాడీల పోరాటానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం కార్మికులు చేస్తున్న ఉద్యమాలను ఖాకీలతో అణగదొక్కాలనుకోవటం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటన్నారు. తాను మారాన ని చెప్పి ఎన్నికల్లో ఓట్లేయించుకున్న చంద్రబాబు ఎన్నికల్లో గెలిచిన రెండేళ్లలో పోలీసు బందోబస్తుతోనే పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాల పెంపు జీవోను జారీ చేసి ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులను తొలగించటానికి జారీ చేసిన మెమో నంబర్ 5557-కె.3-2015ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు డేవిడ్, ఐద్వా నాయకులు ఝాన్సీ, షకీలా పాల్గొన్నారు. -
వేతనాల పెంపు భారం కాదు...
న్యూఢిల్లీ: ఏడవ వేతన సవరణ సంఘం సిఫారసులు కేంద్ర పటిష్ట ద్రవ్య పరిస్థితులకు ఇబ్బంది కల్పించబోదని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం దారితప్పదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు జీత భత్యాలు, పింఛను 23.55 శాతం వరకూ పెంచుతూ జస్టిస్ ఏకే మాథుర్ నేతృత్వంలోని సంఘం సిఫారసులు చేసింది. ఈ సిఫారసుల అమలుకు కేంద్రం అదనంగా ఏడాదికి రూ. 1.02 లక్షల కోట్లను భరాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ద్రవ్యలోటు లక్ష్య సాధన భరోసా ప్రకటనలు వెలువడుతున్నాయి. అయితే ద్రవ్యలోటు లక్ష్య కట్టడి కష్టమేనని ఫిచ్, ఎస్అండ్పీ వంటి రేటింగ్ సంస్థలు, సిటీ గ్రూప్ వంటి బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. తాజా పరిణామంపై ఆర్థిక కార్యదర్శి శుక్రవారం మాట్లాడుతూ, వేతన సవరణ సంఘం సిఫారసుల భారం గురించి కొంత ముందుగా ఊహించిందేనని అన్నారు. 2016 జనవరి 1 నుంచీ ఈ సిఫారసులు అమలు చేయాలన్న విషయం ప్రభుత్వానికి తెలుసని పేర్కొన్నారు. 2016-17లో సవాలే: సిటీ గ్రూప్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యం ఇప్పుడు మరింత సవాలుగా మారింది. వేతన పెంపు భారం వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.5%గా ఉంటుందన్నది అంచనా. కార్పొరేట్ పన్ను రేటును ప్రస్తుత 30 శాతం నుంచి దశలవారీగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే తగ్గిస్తున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఆయా అంశాల నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్య సాధన మరింత క్లిష్టతరం కానుంది. ద్రవ్యలోటు కట్టడి కష్టమే: ఎస్అండ్పీ పే కమిషన్ సిఫారసు ప్రభుత్వ ద్రవ్య పరిస్థితిపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ క్రమంలో 2016-17లో 3.5% వద్ద ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం కష్టమే. అదనపు ఆదాయాలపై దృష్టి పెట్టాలి: ఫిచ్ తాజా సిఫారసుల అమలుతో ప్రభుత్వ వేతన బిల్లు తడిసి మోపెడవుతుంది. ద్రవ్యలోటు లక్ష్యాలకు ఇది విఘాతం కలిగించే అంశమే. వేతన కమిటీ సిఫారసుల అమలు కోసం కేంద్రం ఇతర విభాగాల్లో వ్యయాలు తగ్గించుకునే వీలుంది. అయితే పెట్టుబడులు, వ్యయాల్లో కోతలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడే అంశం కాదు. సవాళ్ల నుంచి గట్టెక్కడానికి కేంద్రం అధిక ఆదాయ సమీకరణలపై దృష్టి సారించే అవకాశం ఉంది. వినియోగం రికవరీ: బీఓఎఫ్ఏ-ఎంఎల్ వేతన పెంపు సిఫారసుల అమలు దేశ వినియోగ విభాగంలో రికవరీని భారీగా పెంచడానికి దోహదపడుతుంది. వినియోగ వస్తువులు, హౌసింగ్ రంగాల్లో ప్రధానంగా డిమాండ్ మెరుగుపడే వీలుంది. ద్రవ్యలోటు అంటే.. ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. ద్రవ్యలోటు ఈ ఆర్థిక సంవత్సరం రూ.5.55 లక్షల కోట్లు(మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 3.9%) మించకూడదన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే ఈ లోటు 3.78 లక్షల కోట్లకు చేరింది. 2014-15లో ద్రవ్యలోటు రూ.5.01 లక్షల కోట్లు. జీడీపీలో ఇది 4%. 2016-17లో ఈ లక్ష్యం 3.5 శాతం. -
ఇతర మున్సిపాలిటీల్లోనూ భారీగా పెంపు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను 47.05 శాతం పెంచిన ప్రభుత్వం... రాష్ట్రంలోని మిగతా 67 పురపాలక సంస్థల్లోనూ వేతనాల పెంపు దిశగా కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.8,500 నుంచి రూ.12,500కు, డ్రైవర్ల వేతనాన్ని రూ.10,200 నుంచి రూ.15,000కు పెంచడంతో.. రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీల కార్మికుల్లో ఆశలు చిగురించాయి. కానీ వాటిల్లో జీహెచ్ఎంసీ స్థాయిలో వేతనాల పెంపు సాధ్యంకాదని పురపాలక శాఖ ఇప్పటికే తేల్చేసింది. అయినా కార్మికులకు సంతృప్తి కలిగించేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా మున్సిపాలిటీల్లోని కార్మికుల వేతనాల పెంపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రతిపాదనలను సమర్పించాలని సీఎం కేసీఆర్.. గత శుక్రవారం జరిగిన ఓ సమీక్షలో పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు కూడా. ఈ మేరకు పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. అయితే పురపాలికల ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో 20 నుంచి 30 శాతానికి మించి వేతనాలను పెంచితే భరించడం కష్టమని పురపాలక సంఘాల అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. అయినప్పటికీ మున్సిపాలిటీల ఆర్థిక సామర్థ్యం, ఆదాయం పెంచుకునే వనరులను దృష్టిలో పెట్టుకుని కార్మికుల వేతనాలను 30 నుంచి 40 శాతం వరకు పెంచవచ్చని పేర్కొంటూ పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. తాత్కాలిక కార్మికుల కనీస వేతనాన్ని నగర పంచాయతీల్లో రూ.7,300 నుంచి రూ.9,855కు, మున్సిపాలిటీల్లో రూ.8,300 నుంచి రూ.11,205కు, కార్పొరేషన్లలో రూ.8,500 నుంచి రూ.11,900కు పెంచాలని ప్రతిపాదించింది. జీహెచ్ఎంసీలో 47.05 శాతం వేతనాలను పెంచిన నేపథ్యంలో.. నగర పంచాయతీల్లో 30 శాతం, మున్సిపాలిటీల్లో 35 శాతం, మున్సిపల్ కార్పొరేషన్లలో 40 శాతం పెంచాలని కోరింది. ప్రస్తుతం సీఎస్ రాజీవ్‌శర్మ పరిశీలనలో ఈ ఫైలు ఉంది. అనంతరం సీఎం కేసీఆర్‌కు పంపుతారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఓ నిర్ణయం వెలువడవచ్చని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల తరహాలోనే వీరికి సైతం జూలై నెల నుంచి వేతన సవరణను వర్తింపజేసే అవకాశముందని పేర్కొంటున్నారు. మరోవైపు కార్మిక సంఘాల జేఏసీ పిలుపుతో ఈనెల 6 నుంచి తాత్కాలిక కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారానికి 17వ రోజుకు చేరుకుంది. సమ్మెపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి వామపక్షాలు, కార్మిక సంఘాలు బస్సు యాత్రను నిర్వహిస్తున్నాయి.