కోవిడ్-19 రాకతో పలు రంగాల్లో నెలకొన్న అనిశ్చితితో చాలా వరకు కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయి. అంతేకాకుండా పలు వ్యాపార కార్యకలాపాలు కూడా గణనీయంగా పడిపోయాయి. కాగా ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్నాయి. కోవిడ్ ప్రేరేపిత లాక్‌డౌన్స్ నుంచి బయటపడ్డ పలు కంపెనీలు ఉద్యోగులకు భారీగా వేతనాల పెంపు చేయనున్నట్లు అడ్వైజరీ, బ్రోకింగ్ అండ్ సొల్యూషన్స్ సంస్థ విల్లిస్ టవర్స్ వాట్సన్ తన నివేదికలో పేర్కొంది. 2021 మే- జూన్ మధ్య ద్వైవార్షిక సర్వేను విల్లిస్ టవర్స్ వాట్సన్ ఆన్‌లైన్‌లో నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 435 భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి.
చదవండి: Ola Electric :ఓలా బైక్, నవంబర్ 10 నుంచి టెస్ట్ రైడ్స్ ప్రారంభం
నివేదిక అంశాలు...
► వచ్చే ఏడాది భారత్‌లో సుమారు 9.3 శాతం మేర జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వేతనాల పెంపులో ఆసియా పసిఫిక్ రిజియన్‌లో అత్యధిక చెల్లింపుదారుగా భారత్ నిలవనుంది.
► 2021తో పోలిస్తే భారత్‌లో 8 శాతం మేర అధిక వేతనాల పెంపు ఉండనుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2021గాను అత్యధిక జీతాల పెంపు విషయంలో భారత్ తరువాత శ్రీలంక (5.5 శాతం), చైనా (6 శాతం), ఇండోనేషియా (6.9 శాతం) , సింగపూర్ (3.9 శాతం) ఉన్నాయి.
► భారత్‌లో సుమారు 52.2 శాతం కంపెనీలు వచ్చే ఏడాదిలో గణనీయమైన వృద్ధిని సాధిస్తాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా పలు రంగాల్లోని కంపెనీలు రాబోయే 12 నెలల్లో 30 శాతం కంటే ఎక్కువగా ఉద్యోగ నియమాకాలను చేయనున్నాయి. ఇది గత ఏడాది కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
► ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,టెక్నికల్ స్కిల్డ్ ట్రేడ్, సేల్స్, ఫైనాన్స్ వంటి కీలకమైన సెక్టార్లలో ఉద్యోగ నియామకం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఈ రంగాల్లో అత్యధికంగా వేతనాలపెంపు ఉండనుంది.
► మరోవైపు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అట్రిషన్ రేట్ తక్కువగా ఉంది.
► 2022 లో హైటెక్ రంగం అత్యధికంగా 9.9 శాతం , కన్‌స్యూమర్ ప్రొడక్ట్ అండ్ రిటైల్ రంగంలో 9.5 శాతం, తయారీ రంగంలో 9.30 శాతం మేర వేతనాల పెంపు ఉంటుందని తెలుస్తోంది.
► మరోవైపు ఎనర్జీ రంగంలో 2021లో 7.7 శాతంతో అత్యల్ప వాస్తవ జీతాల పెరుగుదల ఉండగా..వచ్చే ఏడాది 7.9 శాతానికి చేరనుంది. ఎనర్జీరంగంలో వేతనాల పెంపు కొంతమేర మందకొడిగా ఉందనే అభిప్రాయాన్ని విల్లిస్ టవర్స్ వాట్సన్ పేర్కొంది.
చదవండి: నెట్‌ఫ్లిక్స్ దశనే మార్చేసిన దక్షిణకొరియన్ డ్రామా..!
Comments
Please login to add a commentAdd a comment