
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రాకతో భారత్‌లో నిరుద్యోగరేటు గణనీయంగా పెరిగింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ ఎనాలిసిస్ ప్రకారం...భారత నిరుద్యోగిత రేటు 2019లో 5.27 శాతంగా నమోదవ్వగా, 2020లో నిరుద్యోగిత రేటు గణనీయంగా 7.11 శాతానికి చేరుకుంది. కోవిడ్ రాకతో సుమారు 12.2 కోట్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా వైరస్ ఉదృతి తగ్గడంతో కంపెనీలు తిరిగి ఉద్యోగనియామాకాలను చేపట్టాయి.
జీతాల పెంపు..!
తాజాగా బ్లూమ్‌బర్గ్ భారత ఉద్యోగులకు తీపి కబురును అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతీయుల జీతాలు గణనీయంగా పెరుగుతాయనీ పేర్కొంది. కోవిడ్-19 ప్రేరిత లాక్‌డౌన్ల నుంచి కంపెనీలకు ఉపశమనం కల్గనున్నట్లు పేర్కొంది. భారత్‌లో ముఖ్యంగా ఈ-కామర్స్, ఐటీ, ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ రంగాలోని ఉద్యోగులకు గణనీయంగా జీతాల పెంపు ఉంటుందని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది.
ఎరోస్పేస్, పర్యాటకం, అతిథ్య రంగాలు పుంజుకోవడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం..కోవిడ్-19 మూడో వేవ్‌ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే దేశంలోని ఉద్యోగులకు ఏప్రిల్ 2022 నుంచి వారి జీతాల్లో 8 శాతం మేర జీతాల పెంపు ఉండవచ్చునని పేర్కొంది. కరోనా మహామ్మారి సమయంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగ, వేతన కోతలను ఎదుర్కోన్న వారికి కాస్త ఉపశమనం కల్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment