![Infosys to hike salaries of senior employees by 3-5 per cent in January - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/10/Infosys.jpg.webp?itok=mL12odr4)
సాక్షి, ముంబై: ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సీనియర్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పటికంటే ముందుగానే జీతాల పెంపును ప్రకటించి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఉద్యోగుల పనితీరు ప్రాతిపదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి వారికి 3నుంచి 5శాతం జీతం పెంచనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు సీనియర్ ఉద్యోగులు మొత్తం 170 మందికి ప్రమోషన్లు కూడా ఇవ్వనుంది.
సాధారణంగా ప్రతి ఏటా ఉద్యోగులకు ఏప్రిల్ నెల నుంచి జీతాలు పెంచుతారు. సీనియర్లకైతే జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇచ్చి మరీ జీతాలు పెంచుతారు. అయితే ఈ సారి దానికి భిన్నంగా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు కలిసి సీనియర్ ఉద్యోగులైన 500 మందికి జనవరి నుంచే జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో 170 మందికి ప్రమోషన్లు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment