pramotions
-
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్ నెలలో నిరాశపరిచాయి. దేశవ్యాప్తంగా మార్చి నెలలో 1,37,146 యూనిట్లు రోడ్డెక్కితే.. గత నెలలో ఈ సంఖ్య సగానికంటే క్షీణించి 64,013 యూనిట్లకు పరిమితమైంది. సబ్సిడీ మొత్తం తగ్గడం, కొన్ని ప్రముఖ మోడళ్ల ధర పెరగడం ఈ క్షీణతకు కారణం.ఎన్నికల సీజన్ కావడం కూడా ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2023 ఏప్రిల్‌లో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన ఈ–టూవీలర్ల సంఖ్య 66,873 యూనిట్లు. 2024 జనవరి, ఫిబ్రవరిలో ప్రతినెలా 82 వేల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఫేమ్–2 సబ్సిడీ అందుకోవడానికి మార్చి నెల చివరిది కావడం కూడా 1,37,146 యూనిట్ల గరిష్ట అమ్మకాలకు దోహదం చేసింది.కంపెనీలు మోడల్‌నుబట్టి రూ.4,000లతో మొదలుకుని రూ.16,000 వరకు ధరలను పెంచడం గమనార్హం. అయితే నూతన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.10,000, ఈ–రిక్షా, ఈ–కార్ట్‌కు రూ.25,000, ఈ–ఆటోకు రూ.50,000 సబ్సిడీ ఆఫర్ చేస్తారు. ఇక ఏప్రిల్‌లో ఈ–టూ వీలర్ల విక్రయాల్లో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కో, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాప్‌లో నిలిచాయి.ఇవి చదవండి: అధిక రాబడులకు మూమెంటమ్ ఇన్వెస్టింగ్.. -
బాధలో కూడా ప్రమోషన్స్..
-
నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్
నటీమణులు చిత్రాలు చేసినా, చేయకపోయినా ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటారు. సంచలన నటి నయనతార వంటి వారైతే ఇక చెప్పనవసరం లేదు. పాత్రికేయుల దృష్టి నుంచి ఇలాంటివారు తప్పించుకోలేరు. ఇక అసలు విషయానికి వస్తే నటుడు విశాల్ తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం 'మార్క్ ఆంటోని'. నటి ప్రీతివర్మ నాయకిగా నటించిన ఇందులో ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. దర్శకుడు సెల్వరాఘవన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్‌కుమార్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రం వినాయకచవితికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ 'విమి' విషాద గాథ.. భర్తను కాదని ఆపై ప్రేమికుడి వల్ల వ్యభిచారం) ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న విశాల్‌ను నయనతార చిత్ర కార్యక్రమాల్లో పాల్గొన్న పోవడానికి కారణం ఏంటన్న విలేకరి ప్రశ్నకు ఆయన బదులిస్తూ నయనతార ఏ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అది ఆమె వ్యక్తిగత హక్కు అని పేర్కొన్నారు. కచ్చితంగా పాల్గొనాలని ఆమెను నిర్బంధం చేయలేమన్నారు. తనకు ఇష్టం లేదని చెబితే ఆమెను మనం ఏమి చేయలేమన్నారు. అయితే ఆమె వస్తే బాగుంటుందన్నారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పేమి కాదని విశాల్ పేర్కొన్నారు. -
గాడ్ ఫాదర్ పొలిటికల్ డైలాగ్ పై చిరంజీవి రియాక్షన్
-
ప్రమోషన్లు వదులుకుని మరీ తిష్ట? ఎవరా అధికారులు?
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఎవరైనా ప్రమోషన్లు వదులుకోరు. ఒకసారి కాకపోయినా రెండో సారైనా మిస్ చేసుకోరు. కానీ జీహెచ్ఎంసీలో చిత్రమేమిటో కానీ ఎంటమాలజీ (దోమల నివారణ)విభాగంలోని సీనియర్ అధికారులు తమకు ప్రమోషన్ వద్దంటూ ఇక్కడే తిష్టవేస్తున్నారు. జీహెచ్ఎంసీలో సీనియర్ ఎంటమాలజిస్టులుగా పనిచేస్తున్న ముగ్గురికి గత డిసెంబర్లో జిల్లా మలేరియా అధికారులుగా (డీఎంఓ) ప్రమోషన్లు ఇస్తూ..జిల్లాలకు వెళ్లమంటే ఇక్కడే ఉంటాం తమకు ప్రమోషన్లు వద్దన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రమోషన్లు పొందితే మున్ముందు మరింత ఉన్నత స్థానాలకు వెళతారు. ప్రమోషన్లు కావాలని కోరుకుంటారు. అదేం చిత్రమో కానీ జీహెచ్ఎంసీలోని సీనియర్ ఎంటమాలజిస్టులు మాత్రం వద్దన్నారు. ఉన్న ఎస్ఈ హోదాతోనే కొనసాగుతామంటూ ఉండిపోయారు. ఒకరు మూడేళ్లుగా ఇక్కడే ఉండగా, మరొకరు దాదాపు దశాబ్దకాలంగా ఇక్కడే ఉన్నారు. దశాబ్దకాలంగా ఉన్నఅధికారి రెండో పర్యాయం కూడా ప్రమోషన్ వద్దన్నట్లు తెలిసింది. బహుశా ఇక సర్వీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం లేకున్నా బల్దియాలోనే ఉండేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉత్తుత్తి బదిలీ.. ? మరొకరు ప్రమోషన్ తీసుకొని రంగారెడ్డి జిల్లా డీఎంఓగా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ, విధులు మాత్రం నిర్వహించలేదు. డీఎంఓ పోస్టుతో ఒక్కరోజు కూడా విధులు నిర్వహించకుండానే పైరవీలతో తిరిగి జీహెచ్ఎంసీలోనే ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్ మీద చేరినట్లు తెలిసింది. బదిలీ కావడానికి ముందు బల్దియాలో పనిచేసింది కూడా ఫారిన్ సర్వీసు డిప్యుటేషన్ మీదనే కావడం విశేషం. బదిలీ అయి, జాయినైన రంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోనే ఉన్నప్పటికీ అక్కడ కాకుండా బల్దియాకే తిరిగి రావడం వెనుక మతలబు ఏమిటో అంతు పట్టడం లేదు. అంతేకాదు.. రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉండే బల్దియా ఎల్బీనగర్ జోన్లో పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ముగ్గురు అధికారుల్లో ఒకరు సర్వీసుకాలం మొత్తం మీద ఇక ప్రమోషనే వద్దనుకోవడం.. మరొకరు పేరుకు బదిలీ అయినా వెంటనే వెనక్కు రావడం, ఇంకొకరు సైతం ఇక్కడే ఉంటాననడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకో..? జీహెచ్ఎంసీ వర్గాల నుంచే అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, బల్దియాలో ఎంటమాలజీ విభాగం అంటేనే అవినీతి కార్యకలాపాల పుట్ట అనే పేరుంది. దోమల నివారణలో భాగంగా వినియోగించే పెట్రోలు, కిరోసిన్/డీజిల్‌ల నుంచి పైరిథ్రిమ్ దాకా లెక్కాపక్కా లేకుండా ఖర్చుచేసే వీలుంటుంది. ఫాగింగ్, డ్రోన్ల పేరిట జరిగే కార్యక్రమాలది మరో తంతు. అత్యవసరాల పేరిట ఔట్‌సోర్సింగ్‌పై తీసుకునే సిబ్బంది నియామకాల్లో డబ్బులు చేతులు మారతాయి. ఇటీవల కరోనా తీవ్రత నేపథ్యంలో దాదాపు 200 మందిని తీసుకున్నారు. వీటికోసం భవిష్యత్‌లో ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయంటూ ఒక్కొక్కరి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా అవినీతేనని బల్దియా ఎంటమాలజీ విభాగంపై అవగాహన కొందరు పేర్కొన్నారు. అందువల్లే బదిలీ అయినప్పటికీ సీనియర్ ఎంటమాలజిస్టులు ఎక్కడకూ వెళ్లడం లేరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాశ్వతంగా పాగా..? తాము ప్రమోషన్ పొందకుండా బల్దియాలోనే ఉన్నా, తమను ఇక్కడినుంచి కదిలించే వారు ఇక ఉండరనే ధీమాలో సీనియర్ ఎంటమాలజిస్టులు ఉన్నట్లు చెబుతున్నారు. సీనియర్ ఎంటమాలజిస్టులుగా పదోన్నతులు పొందేందుకు దిగువస్థాయిలో అర్హులు ఎవరూ లేనందునే వారికీ ధీమా అంటున్నారు. పదోన్నతులు పొందేవారుంటే వారిని వీరిస్థానాల్లో నియమించి, వీరిని బదిలీ చేసేందుకు వీలుండేది. అలాంటి పరిస్థితి లేనందువల్లే ఇక ఎవరూ రారనే ధీమాతోనే శాశ్వతంగా బల్దియాలో పాగా వేసేందుకే ప్రమోషన్లు వదులకున్నారని, పైరవీలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు, బదిలీల సందర్భంగా వారి పేరెంట్ విభాగం నుంచి రిమార్కులు తీసుకోవాల్సి ఉన్నా, తీసుకోకుండానే వీరిని బల్దియాలోనే కొనసాగించేందుకు పైరవీలు చేశారని తెలుస్తోంది. -
తెలంగాణలో 6గురు ఐపీఎస్‌లకు ప్రమోషన్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వారంతా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పదోన్నతి పొందినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు.. కార్మికేయ కే రమేష్ నాయుడు వీ సత్యనారాయణ బీ సుమతి ఎమ్ శ్రీనివాసులు వెంకటేశ్వరరావు -
సినిమా నా కల: హీరో కార్తికేయ
సాక్షి, ఒంగోలు మెట్రో: ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్‌ని ఆకట్టుకున్న నవతరం హీరో కార్తికేయ శనివారం ఒంగోలులో సందడి చేశారు. ఆ సినిమాతో యూత్ మదిలో నిలిచిపోయిన ఆయన కొత్త దర్శకుడు శేఖరరెడ్డితో తీసిన ‘90ఎం.ఎల్’ సినిమా ప్రమోషనింగ్ వర్క్‌లో భాగంగా శనివారం సాయంత్రం ఒంగోలు నాగార్జున డిగ్రీ కాలేజీకి వచ్చారు. ఈ సందర్భంగా తొలుత కాలేజీ సెక్రటరీ వి.రాంప్రసాద్, ప్రిన్సిపాల్ వసంతలక్ష్మిలు సినీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన 90 ఎం.ఎల్ సినిమా హీరోయిన్ నేహాతో కలిసి విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్టాడారు. సినిమా తనకొక మధురమైన కల అని, దానిని ఆస్వాదిస్తున్నానన్నారు. సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్ ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందుతుందని, టైటిల్ లాగానే సినిమా కూడా ఆసక్తికరంగా ఉంటుందన్నారు. అనూప్ రూబెన్స్ పాటలకు చిందేసి ఆడాల్సిందేంటూ కితాబిచ్చారు. అనంతరం విద్యార్థుల కోరిక మేరకు సరదాగా డ్యాన్స్ చేశారు. కార్యక్రమానికి సంచాలకులుగా వైస్ ప్రిన్సిపాల్ యోగయ్య చౌదరి, తెలుగు లెక్చరర్ డాక్టర్ నూనె అంకమ్మరావులు వ్యవహరించగా, సినీ బృందం, పలువురు లెక్చరర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీగాయత్రి కళాశాలలో.. కందుకూరు రూరల్: డిసెంబర్ 5వ తేదీ విడుదల కానున్న 90ఎంఎల్ సినీమా ఆదరించాలని హీరో కార్తికేయ, హిరోయిన్ నెహ అన్నారు. స్థానిక శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాంగ్ లీడర్ సినీమాలో విలన్ పాత్ర చేశానని చెప్పారు. గతంలో కందుకూరుకు వచ్చినట్లు చెప్పారు. వీరి వెంట కళాశాల కరస్పాండెంట్ సీహెచ్ రామకృష్ణారావు, ప్రిన్సిపాల్ గీతా శ్రీనివాస్‌లు ఉన్నారు. -
నేనందుకే ప్రమోషన్స్‌కి రాను!
సినిమా: లేడీ సూపర్‌స్టార్. అభిమానులు నయనతారకిచ్చిన పట్టం ఇది. అందుకు తగ్గట్టుగానే ఈ సంచలన నటి తన స్టార్డంను పెంచుకుంటూపోతోంది. ఆదిలో నయనతారకు గ్లామర్ పాత్రలే తలుపు తట్టేవి. ఇప్పుడు నటనకు అవకాశం ఉన్న పాత్రలు వరిస్తున్నాయి. ఇకపోతే ఈ అమ్మడిపై వచ్చినన్ని వదంతులు, తను ఎదురొడ్డిన ఎదురీతలు చాలానే. ముఖ్యంగా వ్యక్తిగతంగానే పలు విమర్శలను ఎదుర్కొంటోంది. అందులో ఒకటి నయనతార తన చిత్రాల ప్రారంభోత్సవాల్లోనూ, చిత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనదనేది. నిజమే ఈ అమ్మడు తను నటించిన ఏ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రాదు. అది ఎంత పెద్ద చిత్రం అయినా, చివరికి సొంత చిత్రం అయినా కావచ్చు. అలాంటిది ఇటీవల విజయ్‌కు జంటగా నటించిన బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననుందనే ప్రచారం జరిగింది. అదేకాదు, తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రచార కార్యక్రమానికి యథాతథంగా నయనతార డుమ్మా కొట్టింది. అంత వరకూ ఎందుకు తాను తన ప్రియుడిని నిర్మాతగా చేస్తూ నిర్మిస్తున్న నెట్రికన్ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా రాలేదు. దీంతో తన చిత్ర ప్రారంభోత్సవానికి రాకపోవడం ఏమిటీ? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అసలు విషయాన్ని నయనతార తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధ పడిందట. తాను ఏ చిత్ర ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆ చిత్రాలు బాగా ఆడలేదని చెప్పింది. ఆ సెంటిమెంట్ కారణంగానే తానీ చిత్ర ప్రారంభోత్సవాల్లోనూ, ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో నయనతార కూడా ఇంత సెంటిమెంటల్ ఉమెన్నా అంటూ చాలా మంది ఆశ్యర్యపోతున్నారు. ఇదిలాఉండగా, నయనతార దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ల ప్రేమ వ్యవహారం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ సంచలన జంట చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇదీ బహిరంగమే. అయితే ఇటీవల నయనతార, విఘ్నేశ్‌శివన్ పెళ్లికి సిద్ధం అయ్యారని, వీరి పెళ్లి తేదీ కూడా ఖరారైట్లు, డిసెంబర్ 25న ముహూర్తం, విదేశంలో వివాహతంతు ఇలాంటి ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే వీటికి ఫుల్స్టాప్ పెట్టే విధంగా నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివన్ ఒక ప్రకటనను తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అందులో ఎవరేమైనా రాసుకోండి. దాని గురించి మాకు బాధ లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. అసలు ఆ విషయం గురించి వివరించడం కుదరదని పేర్కొన్నాడు. మరి ఇకనైనా ఈ జంట గురించి వదంతులు ఆగుతాయో లేదో చూడాలి. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సాక్షి, కడప(రాజంపేట) : ఏళ్ల తరబడి ఒక పోస్టులో సేవలందించిన మండలపరిషత్ అభివృద్ధి అధికారులు పదోన్నతులు లేకుండానే అదే పోస్టులో ఫెవికాల్‌వీరులుగా నేటి వరకు కొనసాగారు. ఒకేపోస్టులో రెండు దశాబ్ధాలు పైబడి పని చేశారు. 1992 నుంచి ఇలాంటి ఎంపీడీఓలు ఎందరో ఉన్నారు. కొందరైతే అదే పోస్టులో రిటైర్ అయ్యారు. మరికొందరు మృతి చెందారు. ఎంపీడీఓలుగా ఉన్న వీరు పదోన్నతి లేక అలాగే ఉండిపోయారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు జగన్‌సర్కారుతో.... వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంపీడీఓలకు పదోన్నతులకు మోక్షం కలిగింది. దీంతో ఎంపీడీఓల మోములో ఆనందం వెల్లివిరిస్తోంది. రిటైర్ అయ్యేలోపు తాము పదోన్నతి పొందుతామో లేదో అన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్న వీరికి ప్రభుత్వ నిర్ణయం ఉపశమనం కలిగింది. జిల్లాలో ఇటువంటి వారు 20 మందికిపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. మచ్చుకు జిల్లాలో... జిల్లాలో సుదీర్ఘకాలంగా ఎంపీడీఓలుగారమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, విజయకుమారి, వెంకటేశ్, జయసింహ, మల్రెడ్డి, వెంకటేశ్వర్లు, మెగిలిచెండు సురేష్, వెంకటసుబ్బయ్య, మద్దిలేటితో తదితరులు పని చేస్తున్నారు. వీరంతా ఎంపీడీఓలుగా నేటికి కొనసాగుతున్నారు. వీరు పదోన్నతి పొందితే జిల్లాపరిషత్ ఏఓ, డిప్యూటీ సీఈఓ, సీఈఓలుగా పని చేసేందుకు వీలవుతుంది. జీఓజారీ చేసిన సర్కారు.. పదోన్నతులు లేకుండా సుదీర్ఘంగా ఎంపీడీఓలుగా కొనసాగుతున్న వారి కోసం ప్రభుత్వం జీఓ నెంబరు 143 జారీ చేసింది. ఈజీఓ ప్రకారం ఎంపీడీఓలు పదోన్నతుల కోసం కాన్సుటేషన్ కమిటీ వేశారు. వీరి సీనియారిటీ ప్రకారం పదోన్నతుల కోసం నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించింది. కొత్త సర్వీసు విధానాలు(2001) ప్రకారం ఎంపీడీఓల పదోన్నతుల విషయం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యేక కమిటీ ఇలా.. సుదీర్ఘకాలంగా పని చేస్తున్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎఏస్‌లు ఉన్నారు. కమిటీ చైర్‌పర్సన్‌గా రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ సాంబశివరావు, సభ్యులుగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ దివ్వేది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్, ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనరు ఎం.గిరిజశంకర్‌లు ఉన్నారు. -
ముద్దంటే ఇబ్బందే!
ప్రభాస్‌కి మొహమాటం ఎక్కువ. ‘రొమాంటిక్ సన్నివేశాలు, ముఖ్యంగా లిప్‌లాక్ సన్నివేశాలకు ఇబ్బందిపడతాను’ అంటున్నారు. ‘సాహో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయం గురించి ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘నాకు చాలా సిగ్గు ఎక్కువ. అందుకే ముద్దు సన్నివేశాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సన్నివేశాల్లో యాక్ట్ చేస్తున్నంతసేపు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది’’ అన్నారు. ‘సాహో’ సినిమాలో శ్రద్ధాతో ఓ ముద్దు సన్నివేశం ఉండగా గతంలో ‘బాహుబలి 2’లో అనుష్కతో ఓ చిన్న ముద్దు సన్నివేశంలో నటించారు ప్రభాస్. -
ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు సంస్థ ఉద్యోగులకు ఎయిరిండియా భారీ షాక్ సిద్ధమవుతోంది. ఉద్యోగుల ప్రమోషన్లు, కొత్త నియామక ప్రక్రియను నిలిపివేసినట్టు తెలుస్తోంది. సుమారు రూ.55వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వీలైనంత త్వరంగా మోడీ సర్కార్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు, ప్రమోషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం.. ఎయిరిండియాను రానున్న నాలుగైదు నెలల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. వాటా విక్రయ ప్రక్రియ కోసం ఎయిరిండియా ఖాతాలను ఈ నెల (జూలై)15 తో క్లోజ్ చేసింది. ఈ ఖాతాలను బిడ్స్ ప్రక్రియ కోసం వినియోగించనున్నట్లు చెబుతున్నారు. అయితే తాజా వార్తలపై విమానయాన శాఖ , ఎయిరిండియా అధికారికంగా స్పందించాల్సి వుంది. ఎయిరిండియా వాటా విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సేల్కు ముందే కార్యకలాపాలు మెరుగుపరుస్తామని, నాలుగైదు నెలల్లో దీనిని విక్రయించే ప్రయత్నాలు చేస్తామని సంబంధిత మంత్రి, అధికారులు చెబుతున్నారు. దీపావళి లోపు అమ్మే ప్రయత్నాలు చేస్తామని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ సెక్రటరీ అటన్ చక్రవర్తి ఇటీవల వెల్లడించారు. ఏ షరతులపై ప్రైవేటు కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానించాలనే విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ సిద్ధం చేస్తోంది. ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించేందుకు 2018లో కేంద్రం ప్రయత్నించింది. అయితే, కొనుగోలుదారు దాదాపు రూ.30 వేల కోట్ల రుణభారాన్ని భరించాల్సి రానుండటంతో విక్రయ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎయిరిండియాలో సుమారు 10వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం ఎయిరిండియా ద్వారా రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. -
ప్రమోషన్ టైమ్..
సాక్షి, శ్రీకాకుళం : పదోన్నతుల కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యాశాఖామాత్యులుగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పదోన్నతుల ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు సోమవారం జిల్లా విద్యాశాఖకు అందాయి. దీంతో విద్యాశాఖ అధికారులు ఆఘమేఘాలపై సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. జిల్లాలో 440 హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ యాజమాన్యాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 400 పోస్టులు జెడ్పీ, 40 ప్రభుత్వ యాజమాన్యం కేటగిరీల్లో ఉన్నాయి. సబ్జెక్టు వారీగా చూస్తే 59 గ్రేడ్ –2 హెచ్ఎం పోస్టులు జిల్లా పరిషత్ పాఠశాలలోనూ, 8 పోస్టులు ప్రభుత్వ పాఠశాలలో, 113 పోస్టులు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయ పోస్టులు జిల్లా పరిషత్ పాఠశాలల్లో, 8 పోస్టులు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే ఇంగ్లీష్ సబ్జెక్టులో–11, గణితం– 14, పీ ఎస్– 5, బయోలాజికల్ పోస్టులు– 17, ఎస్ ఎస్– 101, స్కూల్ అసిస్టెంట్ తెలుగు– 41, హిందీ –17, ఒరియా– 3 , పీడీ– 19 పోస్టులు జెడ్పీలో పదోన్నతులపై భర్తీకి ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలో గణితం 2, పీఎస్–1, ఎస్ఎస్–6, తెలుగు –4, హిందీ–4, ఒరియా–2, పీడీ పోస్టులు 5 పదోన్నతులతో భర్తీ కానున్నాయి.దాదాపు మూడున్నరేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇది సాధ్యం కాలేదు. ఉమ్మడి సర్వీస్ రూల్‌ను సాకుగా చూపించి తాత్సారం చేశారు. ఇది వరలా అడ్‌హక్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసినా అరణ్య రోదనగానే మిగిలింది. ఈ పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఈ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అయితే అర్హత గల ఉపాధ్యాయులకు న్యాయం జరగటంతోపాటు, సబ్జెక్టు టీచర్ల కొరత కూడా తీరుతుంది. పదోన్నతులకు నోచుకోక వందలాది మంది ఉపాధ్యాయులు గత మూడున్నరేళ్లలో పదవీ వరమణ పొందారు. వెబ్సైట్లో సీనియర్ల జాబితా పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తర్వులు వెలువడ్డాయి. సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచాం. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 27 తేదీలోగా అప్పీల్ చేసుకోవాలి. త్వరలో పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేస్తాం. – ఎం.సాయిరాం, జిల్లా విద్యాశాఖ అధికారి -
కేంద్రానికి సుప్రీం ఝలక్
న్యూఢిల్లీ: జడ్జీల పదోన్నతుల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏఎస్ బోపన్నల పేర్లను సుప్రీంకోర్టు జడ్జీలుగా మరోసారి సిఫార్సు చేసింది. ఈ విషయంలో కేంద్రం వ్యక్తంచేసిన అభ్యంతరాలను కొలీజియం తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం.. ‘అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఏప్రిల్ 12న మేం సిఫార్సు చేసిన జడ్జీలు జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించాం. ఈ ఇద్దరు జడ్జీల సమర్థత, ప్రవర్తన, సమగ్రత విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. దేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర జడ్జీల సీనియారిటీతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సహా అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని స్పష్టం చేసింది. వీరిద్దరితో పాటు బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, హిమాచల్‌ప్రదేశ్ సీజే జస్టిస్ సూర్యకాంత్‌లకు కూడా సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రెండు తీర్మానాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో కొలీజియం అప్లోడ్ చేసింది. అంతకుముందు జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు పదోన్నతులు కల్పించాలని ఏప్రిల్ 12న కొలీజియం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. జార్ఖండ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ బోస్ దేశవ్యాప్తంగా సీనియారిటీలో 12వ స్థానంలో, గువాహటి హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ బోపన్న సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారని కేంద్రం తెలిపింది. సీనియారిటీతో పాటు ఇతర ప్రాంతాలకు అత్యున్నత న్యాయస్థానంలో తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. కాగా కేంద్రం అభ్యంతరాలను తిరస్కరించిన సుప్రీం కొలీజియం, జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నతో పాటు మరో ఇద్దరు జడ్జీల పేర్లను సిఫార్సు చేసింది. కొలీజియంలో సీజేఐ జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ బాబ్డే, జస్టిస్ రమణ, జస్టిస్మిశ్రా, జస్టిస్ నారిమన్‌లు ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన పేర్ల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేంద్రం తిప్పిపంపవచ్చు. కానీ ఆ న్యాయమూర్తుల పేర్లను కొలీజియం మరోసారి సిఫార్సుచేస్తే మాత్రం కేంద్రం వాటిని తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధనలేవీ లేవు. -
‘పోలీస్ శాఖలో పదోన్నతులపై విచారణ జరిపించండి’
సాక్షి, హైదరాబాద్ : నిబంధనలకు విరుద్దంగా పోలీస్ శాఖలో ఇచ్చిన పదోన్నతులపై విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం గవర్నర్‌కు ఓ లేఖ రాశారు. పదోన్నతుల విషయంలో నిబంధనలను తుంగలోకి తొక్కి.. సీనియారిటీని తప్పుగా చూపించి అనుకూలమైన వారికి డీఎస్పీ నుంచి ఎస్పీలుగా పదోన్నతులు కల్పించారని విజయసాయి రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలతోనే పదోన్నతులు ఇచ్చారని, గతంలో రూపొందించిన సీనియారిటీ జాబితాను డీజీపీ ఠాకుర్ పక్కన బెట్టారన్నాడు. డీఎస్పీల సీనియారిటీ విషయంలో ఐపీఎస్ కిషోర్ కుమార్ నేతృత్వంలోని కమిటీ ఓ జాబితాను రూపొందించిందని, కానీ డీజీపీ ఠాకుర్ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, స్వలాభం కోసం ఆ జాబితాను పక్కనబెట్టి అనుకూలమైన వ్యక్తులకు పదోన్నతులు వచ్చేల చేశారన్నారు. ఈ పదోన్నతుల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, ముంబై: ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సీనియర్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పటికంటే ముందుగానే జీతాల పెంపును ప్రకటించి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఉద్యోగుల పనితీరు ప్రాతిపదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి వారికి 3నుంచి 5శాతం జీతం పెంచనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు సీనియర్ ఉద్యోగులు మొత్తం 170 మందికి ప్రమోషన్లు కూడా ఇవ్వనుంది. సాధారణంగా ప్రతి ఏటా ఉద్యోగులకు ఏప్రిల్ నెల నుంచి జీతాలు పెంచుతారు. సీనియర్లకైతే జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇచ్చి మరీ జీతాలు పెంచుతారు. అయితే ఈ సారి దానికి భిన్నంగా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు కలిసి సీనియర్ ఉద్యోగులైన 500 మందికి జనవరి నుంచే జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో 170 మందికి ప్రమోషన్లు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. -
క్రీమీలేయర్‌ను వర్తింప చేయలేం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ను వర్తింపజేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల్లో చాలా మంది ఇంకా వెనుకబాటుతనంలోనే ఉన్నారనీ, ఆయా వర్గాల్లోని సంపన్నులు కూడా కులం పరంగా కొంత వరకు వివక్షను ఇంకా ఎదుర్కొంటున్నారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ‘రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీ, ఎస్టీల్లో వెనుకబడిన వారికే అందేలా చూసేందుకు.. ఆయా వర్గాల్లోని సంపన్నులు, అభివృద్ధి చెందిన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు తొలగించేలా క్రీమీలేయర్‌ను వర్తింపజేయొచ్చా?’అని సుప్రీంకోర్టు వేణుగోపాల్‌ను కోరగా ఆయన పై విధంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లోనూ క్రీమీలేయర్‌ను వర్తింపజేయరాదంటూ 2006లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. నాటి తీర్పును పునఃసమీక్షించాలా? వద్దా? అన్న విషయాన్ని తేల్చేందుకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ కురియన్, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఈ అంశాన్ని విచారిస్తోంది. 2006 తీర్పుపై పునఃసమీక్ష అవసరమనుకుంటే ఈ కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి ప్రస్తుత బెంచ్ బదిలీ చేస్తుంది. వేణుగోపాల్ తన వాదనలు వినిపిస్తూ ఎస్సీ, ఎస్టీల్లోకి ఎవరిని చేర్చాలి/తొలగించాలి అనేది పూర్తిగా పార్లమెంటు, రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయమనీ, న్యాయవ్యవస్థకు దీనితో సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. వివక్షాపూరిత కుల వ్యవస్థ దేశంలో ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు. 2006 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు గత నెల 11న సుప్రీం నిరాకరించడం తెలిసిందే. -
పాపం మన పోలీసు
పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్ : మన జిల్లా పోలీసులకు పదోన్నతుల్లో పరాభవం తప్పలేదు. మూడు దశాబ్దాలుగా చాలామంది సుదీర్ఘంగా ఉత్తమ సేవలందించినా వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు. సర్వీసు రికార్డుల ఆధారంగా సీనియార్టీ జాబితా తయారీలో జరిగిన తప్పిదాలు జిల్లాపోలీసులకు శాపంగా మారాయి. ఏలూరు రేంజ్ పరిధిలో తూర్పు, కృష్ణా జిల్లాల్లోని పోలీసులకు పదోన్నతులు లభిస్తే.. పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు మాత్రం ఉన్నతాధికారులు, న్యాయస్థానాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇతర జిల్లాల్లోని తమకంటే జూనియర్లు సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉద్యోగోన్నతి పొందుతుంటే వీరు మాత్రం ఉద్యోగవిరమణ ముందైనాపదోన్నతి లభిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలోని 19మంది ఏఎస్సైలకు సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు కల్పించా లని వారు ఉన్నతాధికారులను అభ్యర్థిస్తున్నారు.జిల్లా పోలీసు శాఖలో 1984 జనవరి 13న సర్వీసులో ప్రవేశించిన కొందరు కానిస్టేబుళ్లు ఏళ్లు గడుస్తున్నా పదోన్నతి పొందలేని దీనస్థితిలో ఉన్నారు. సుమారు 19మంది కానిస్టేబుళ్లకు ఎస్సైగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ ఇచ్చి పదోన్నతులు కల్పించాల్సి ఉన్నా నిబంధనలు అడ్డుకుంటున్నాయి. వారు చేయని తప్పుకు బాధ్యత వహిస్తూ పోలీస్ స్టార్ భుజాన వేసుకుందామనే ఆశ అడియాసగానే మిగిలిపోతుందనే ఆందోళనలో ఉన్నారు. ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా పదోన్నతుల్లో వారికి అన్యాయం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై పోలీస్ శాఖ న్యాయపరమైన వివరణకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఏమి నిర్ణయం తీసుకుంటారో అనే ఆశతో బాధితులు ఎదురుచూస్తున్నారు. జాబితాలో తప్పులే కారణమా! ఏలూరు రేంజ్ పరిధిలో పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది సినియార్టీ జాబితాలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఏఎస్సై ఏవీఎన్ హనుమంతరావు సీనియార్టీ జాబితాలో 185వ నంబర్లోనూ, మరోసారి 230 లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. సీనియార్టీ జాబితాలో డబ్లింగ్‌లు కూడా నమోదు అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. 2010 జనవరి 27 నుంచి ఏప్రిల్ 27వరకూ మూడు నెలలపాటు హైదరాబాదు పోలీసు ట్రైనింగ్ స్కూల్లో హెచ్‌సీలుగా పదోన్నతికి శిక్షణ పొందారు. ప్రస్తుతం ఈ పోలీసు సిబ్బందికి 34ఏళ్ల సర్వీసు ఉంది. కానీ ఏలూరు రేంజ్ సీనియార్టీ జాబితా మేరకు హెచ్‌సీ/ఏఎస్ఐల సీరియల్ నంబర్ 73(2) ఏపీ పోలీస్ మాన్యువల్ పార్ట్–1లో జిల్లా పోలీసుల స్థానమేంటో తెలియని సందిగ్ధత నెలకొంది. కృష్ణా, తూర్పు గోదావరి, విజయవాడ సిటీలో పనిచేస్తున్న పోలీ సులకు పదోన్నతిలో భాగంగా డేట్ ఆఫ్ జాయినింగ్ కాకుండా, డేట్ ఆఫ్ ప్రమోషన్‌ను తీసుకున్నారని, ఈ కారణంగానే జిల్లా పోలీసులకు అన్యాయం జరిగిందని అంటున్నారు. దీనిపై పోలీస్ శాఖలో పెద్ద చర్చే జరుగుతున్నా.. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా సమస్య పరి ష్కారం కాకుండానే మిగిలిపోయిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియార్టీ జాబితాలో చోటుచేసుకున్న తప్పులను సరిదిద్దటం కష్టమేనని, కానీ ఉన్నతాధికారులు తలచుకుంటే అసాధ్యమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగవిరమణ చేసే నాటికైనా తమకు పదోన్నతి లభిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. -
రోషిణి కేరాఫ్ తూర్పుగది..
విశాఖపట్నం ,మాడుగుల రూరల్ :మండలంలో కె.జె.పురం గ్రామానికి చెందిన శరగడం సోదరులు నిర్మించిన∙చలన చిత్రం రోషిణి కేరాఫ్ తూర్పుగది చలన చిత్రం శుక్రవారం విడుదలైంది కె.జె.పురం గ్రామానికి చెందిన శరగడం నాగునాయుడు కుమారులు గత పది సంవత్సరాలుగా హైదరాబాదులో చలనచిత్ర రంగంలో పనిచేస్తు, గతంలో ధడేల్, ఇద్దరం చలనచిత్రాలు నిర్మించారు. ఇప్పుడు తాజాగా తాము నిర్మించిన రోషిణి కేరాఫ్ తూర్పు గది చలనచిత్రం ప్రేక్షకాదరణకు నోచుకుంటోందని నిర్మాతలు తెలిపారు. శరగడం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శరగడం సుధీర్ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. ఇది ప్రేమ కథాంశంతో పాటు హర్రర్ చలన చిత్రమని దర్శకుడు తెలిపారు. -
పదోన్నతులపై నితీష్ కీలక నిర్ణయం
పాట్నా : ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ అధికారుల సలహా మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వ భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సిపారసులకు మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లలను కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం ఏమేరకు ప్రతిఫలం ఇస్తుందో వేచి చూడాలి. -
మరోసారి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
సాక్షి, అమరావతి : దేనినైనా మసిపూసి మారేడు కాయ చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. బాబు చేసేది గోరంత చెప్పుకొనేది కొండంత. ఇందులో ఆయనకు ఉన్న అనుభవం ముందు ఎంతటి వారైనా దిగదుడుపే. కేంద్ర సంక్షేమ పథకాలను సైతం ప్రభుత్వం పేరు చెప్పుకొని ప్రచారం చేసుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇటీవల ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన పథకాన్ని చంద్రన్న భీమా పేరుతో ప్రమోట్ చేసుకోవాలని ప్రయత్నించిన చంద్రబాబు అడ్డంగా బుక్కైపోయారు. తాజాగా ప్రచార బాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి దొరికిపోయారు. విషయం ఏంటంటే అన్న క్యాంటీన్ పేరుతో ఇటీవల చంద్రబాబు నాయుడు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. అయితే ప్రారంభించిన రెండో రోజునే ఆహారం లేదంటూ కొన్ని చోట్ల క్యాంటీన్లను మూసివేశారు. మరికొన్ని చోట్ల ఆకలి తీర్చుకుందామని వచ్చిన పేదలపై తెలుగుదేశం నాయకులు జులుం చూపించారు. పట్టెడు మెతుకుల కోసం వచ్చిన వారిపై నిర్థాక్ష్యణ్యంగా దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. అయితే చేసిన గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకొనే చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రమోట్ చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఆయన చేసిన అసలు ఘనత బయటపడింది. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాలుగు రూపాయలకే భోజనం అంటూ రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు రూపాలయకే నాణ్యమైన భోజనం పేదలకు అందించాలనే లక్ష్యంతో ఆళ్ల ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఆ సందర్భంగా రాజన్న క్యాంటీన్ దగ్గర కడుపు నింపుకుంటున్న కొన్ని ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను ప్రమోట్ చేసుకోవడానికి ప్రచార మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు. ఆ చిత్రంలో కొంత మంది పేదలు భోజనం చేస్తున్న ఫొటోలను కూడా పొందు పరిచారు. కానీ వాటిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన రాజన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఫొటోలను ఉపయోగించుకున్నారు. దీన్ని గ్రహించిన సోషల్ మీడియా కార్యకర్తలు చంద్రబాబు పనితీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రచారం తప్ప పనిలేదని మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రచార చిత్రాలను పరిశీలించండి పై చిత్రం 11-07-2018 రోజున ప్రచార మధ్యమాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన. ఇందులో బ్లూకలర్‌లో ఉన్న వృత్తాన్ని పరిశీలించండి. ముగ్గురు వ్యక్తలు భోజనం చేస్తున్నారు. ఇప్పుడు కింద ఉన్న మరో చిత్రాన్ని పరీక్షించండి. ఈ ఫొటో 14-05-2017 రోజున మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన రోజున ఫేస్బుక్లో చేసిన పోస్ట్. ఈ ఫొటోనే చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ప్రచార చిత్రంగా వాడుకుంది. -
కలెక్టర్‌కే కథలు
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వాల్సిన టైమ్ స్కేల్ ప్రమోషన్‌ను అడ్డగోలుగా కట్టబెట్టేశారు..ఈ వ్యవహారంలో నిబంధనలను చాపచుట్టేశారు.. వేలకు వేలు వసూలు చేసి అర్హత లేని పలువురు వీఆర్వోలకు ప్రమోషన్ స్కేల్ ఇప్పించేసి.. ఒక్కొక్కరికీ లక్షల్లో ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు.. కలెక్టరేట్ ఏ సెక్షన్ సాక్షిగా ఇద్దరు ఉద్యోగులు సాగించిన ఈ దందాను ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో కలెక్టరేట్ మొత్తం ఉలిక్కిపడింది. స్వయంగా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. డీఆర్వో, ఏవోలను పిలిపించి.. ఈ వ్యవహారం నిగ్గు తేల్చాలని.. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలతోపాటు అడ్డగోలు ప్రమోషన్ పొందిన ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని కూడా ఆదేశించారు.అయితే ఆ సాయంత్రానికే సీను మారిపోయిం ది. దందా చేసిన ఉద్యోగుల తరపున కొందరు రెవె న్యూ ఉద్యోగ సంఘాల నేతలు రంగంలోకి దిగారు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ప్రమోషన్ల వర్తింపు అంతా సవ్యంగానే జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్ల డైందని ఏకంగా కలెక్టర్ చేతే ప్రకటన ఇప్పించేశారు.. దందాను బయటపెట్టిన ‘సాక్షి’ ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లింది. ఎటువంటి అర్హతలు లేకపోయినా.. నిర్ణీత పరీక్షలు రాయకపోయినా.. పలువురు వీఆర్వోలకు ప్రమోషన్లు కట్టబెట్టేశారని పరిశీలనలో తేలింది. కలెక్టర్‌కే కట్టు కథలు చెప్పి.. దందా వ్యవహారాన్ని కంచి చేర్చేస్తున్నారనీ తేలింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని వీఆర్వోలకు అడ్డగోలుగా టైమ్ స్కేల్ ప్రమోషన్ వర్తింపజేసిన వ్యవహారంలో కలెక్టరేట్లో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు అధికారులు ఏకంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌నే తప్పుదోవ పట్టించారని తెలుస్తోంది. కలెక్టర్ కార్యాలయంలోని ఏ3, ఏ4 ఉద్యోగులు జీవో నెం.93, 96లలోని నిబంధనలకు విరుద్ధంగా టైమ్ స్కేల్ ఫైళ్లు రూపొందించి ఉన్నతాధికారులతో సంతకాలు పెట్టించిన వైనాన్ని సాక్షి వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 25న ‘కలెక్టరేట్లో ఏ4, ఏ3ల దందా’ శీర్షికతో ప్రచురితమైన ఈ కథనం కలకలం రేపింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్.. ప్రాథమిక సమాచారం మేరకు వీఆర్వోలకు ప్రమోషన్ స్కేలు వర్తింపజేయడంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఫైళ్లన్నింటినీ పరిశీలించామని పేర్కొంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ విషయంలోనూ అధికారులు కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించినట్లు స్పష్టమవుతోంది. జీల్లో ఏముందంటే.. టైమ్ స్కేల్‌కు సంబంధించిన జీవోలను పరిశీలిస్తే.. జీవో నెం. 93 ఫైనాన్స్ పే కమిషన్–2 (తేదీ 30.4.2010) ప్రకారం ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరిన తర్వాత సర్వీస్ రూల్స్‌లో మార్పులు, చేర్పులు జరిగి.. పదోన్నతికి ఆటంకాలు ఎదురయ్యే సందర్భాల్లో మాత్రమే ఆ ఉద్యోగికి ప్రత్యేక పదోన్నతి స్కేల్–1 లేదా 2 ఇవ్వవచ్చు. ఈ జీవో నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో 23.1.2011న ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆర్థిక శాఖ 20.5.2011న జీవో నెం. 96ను ఫైనాన్స్ విభాగం (పేకమిషన్ –2) జారీ చేసింది. దీని ప్రకారం అప్పటి వరకు అమల్లో ఉన్న 8, 16, 24 సంవత్సరాల్లో ఇస్తున్న స్పెషల్ స్కేల్స్‌ను 6, 12, 18, 24 సంవత్సరాల్లో ఇచ్చేలా మార్చారు. ఆ పరీక్షలేమీ లేకుండానే.. జీవోలోని పేరా 7 (2) ప్రకారం 12 ఏళ్ల స్పెషల్ ప్రమోషన్ స్కేలు పొందాలంటే విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. అదే జీవోలోని పేరా 7 (3) ప్రకారం నాలుగో తరగతి కేటగిరీ ఉద్యోగులు అంటే.. అటెండర్లు, డఫేదార్లు, డ్రైవర్లు, ఆపరేటర్లుకు మాత్రం ఈ అర్హతల నుంచి మినహాయించారు. వీఆర్వోలు జూనియర్ అసిస్టెంట్ స్కేలును పొందుతున్నందున వారికి ఈ మినహాయింపులు అసలు వర్తించవు. అలాగే ప్రభుత్వానికి, వీఆర్వోల సంఘానికి జరిగిన ఒప్పందం ప్రకారం.. వారు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలంటే రెవెన్యూ పరీక్షలు పార్ట్–1 (పేపర్ కోడ్–18, 27), పార్ట్ –2 (పేపర్ కోడ్ 43), పార్ట్–3 (పేపర్ కోడ్ 04), అకౌంట్ టెస్టు (పేపర్ కోడ్–7), సర్వే ట్రైనింగ్,, క్రాప్ శాంప్లింగ్ శిక్షణ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అయితే ప్రస్తుతం స్పెషల్ అడ్హాక్ పే స్కేలు ఇచ్చిన ఏ ఒక్క వీఆర్వోకూ ఈ అర్హతలు లేవు. అయినా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఆర్సీ నెం. 1051/2015/ఏ4(తేదీ 15.3.2015) ద్వారా 32 మందికి ఈ స్కేలును వర్తింపజేశారు. ఈ ఉత్తర్వుల్లోని 22వ పేరులో పేర్కొన్న పొలమరశెట్టి వీరప్పారావు (ప్రస్తుతం అచ్యుతాపురం మండలంలో పని చేస్తున్నారు.) ఏ ఒక్క పరీక్షలోనూ అర్హత సాధించలేదు. ఇతనికి అడ్డగోలుగా 12 సంవత్సరాల ప్రమోషన్ స్కేలు ఇచ్చేశారు. అతనొక్కడే కాదు, మిగతా వీఆర్వోల సర్వీసు రిజిస్టర్లను పరిశీలిస్తే ఏ3, ఉద్యోగుల ఘనకార్యం బయటపడుతుంది. వీరివురు సీసీఏ రూల్స్‌ను అతిక్రమించి వీఆర్వోలతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏ3, ఏ4 అంటే హడలెందుకు? వాస్తవానికి సోమవారం ఈ వ్యవహారం మొత్తం సాక్షి వెలుగులోకి తీసుకువచ్చిన వెంటనే సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించారు. అయితే రెవెన్యూ ఉద్యోగుల సంఘంలోని కొందరు నేతల ఒత్తిడి మేరకు విచారణ అటకెక్కించి .. ప్రాధమిక విచారణ మేరకు అంతా సవ్యంగానే జరిగినట్టు మళ్లీ కలెక్టర్ చేతే ప్రకటన ఇప్పించేశారు. దీంతో ఏ–3. ఏ4లు గండం నుంచి గట్టెక్కినట్టేనని భావించారు. ఈ వ్యవహారం కలెక్టరేట్ ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశమైంది. మిగతా జిల్లాల్లో ఈ స్కేల్‌ను ఎందుకు వర్తింపజేయడం లేదు.. అంతవరకకెందుకు మన జిల్లాల్లోనే ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎందుకు వర్తింపజేయడం లేదో కలెక్టర్‌కే తెలియాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన ఏ3, ఏ4లపై విచారణకు సైతం ఉన్నతాధికారులు వెనుకాడటమే ఇప్పుడు కలెక్టరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు అష్టకష్టాలు
పాతగుంటూరు(గుంటూరు): ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంత సురక్షితమో..ఉద్యోగులకు విధుల నిర్వహణ అంతే కష్టం. అందులో మహిళా కండక్టర్ల పరిస్ధితి మరీ దారుణం. పేరుకు కండక్టర్ ఉద్యోగం, చెప్పుకోవడానికి ప్రయాణం చేస్తూ సాఫీగా సాగుతుందనుకుంటారు. కానీ అంత సులువేమీ కాదు. తెల్లారేసరికి ఇంట్లో పనులు చూసుకుని, పిల్లలను స్కూలుకు సిద్ధం చేసి విధులకు గంట ముందుగానే బస్టాండ్‌కు చేరుకోవాలి. గతుకుల దారిలో వేగంగా వెళుతున్న బస్సులో టిక్కెట్లు ఇవ్వాలి. ఓ వైపు ప్రయాణికుల కస్సు బుస్సులు..ఆకతాయిల వెకిలి చేష్టలు..మరో వైపు అధికారుల వేధింపులు..మానసిక ఒత్తిడిలోనూ రైట్..రైట్ అంటూ విజయవంతంగా రాణిస్తున్నారు. విధి నిర్వహణలో చికాకు, కోపాన్ని అణచివేస్తూ..ఎదురయ్యే సమస్యలు, కష్టాలను అధిగమిస్తూ టికెట్లు కొడుతూ ..విజిల్ వేస్తూ కష్టమైన జీవితాన్ని గడుపుతున్న మహిళా కండక్టర్లపై సాక్షి ప్రత్యేక కధనం... కండక్టర్ విధులంటే ఆషామాషీ కాదు. ప్రయాణికులను ఎక్కించుకుని బస్సు కదలగానే టిక్కెట్ ఇవ్వాలి. స్టేజి ఉన్నా, లేకపోయినా ప్రయాణికులు చెయ్యేత్తిన చోట ఆపాలి. కోరిన చోట దించాలి. ప్రయాణికులను లెక్కించుకుని స్టాటికల్ రిపోర్టు(ఎస్ఆర్)రాయాలి. చెప్పడానికి ఇది సులువుగా వున్నా, చేయడానికి ఎంతో కష్టం. పురుషులే ఈ డ్యూటీలు చేయలేక చికాకు పడుతున్న సందర్భాలుంటాయి. కానీ మహిళలు వారితో సమానంగా సత్తా చాటుతున్నారు. 1997 కంటే ముందు పురుషులు మాత్రమే కండక్టర్లుగా విధులు నిర్వహించారు. మహిళా కండక్టర్లు ప్రారంభంలో రోజుకు రూ.65 చొప్పున పని చేసిన రోజులకు జీతం ఇచ్చేవారు. జిల్లాలోని 13 డిపోల్లో 584 మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. గుంటూరు 1డిపోలో 78 మంది,2 డిపోలో 54, రేపల్లె 36, తెనాలి 67,మంగళగిరి 28, పొన్నూరు 39, బాపట్ల 30, నర్సరావేపేట 45, మాచర్ల 46, చిలుకలూరిపేట 39, సత్తెనపల్లి 28 మంది మహిళా కండక్టర్లు పని చేస్తున్నారు. విధుల్లో ఇబ్బందులు... విధుల్లో మహిళా కండక్టర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చెప్పిన డ్యూటీలు చేయకపోతే వేధింపులకు గురికావాల్సిందేననే విమర్శలు వినిపిస్తున్నాయి. డిపోలలో మౌలిక వసతులు సక్రమంగా లేకపోయినా తప్పని పరిస్ధితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఏదైనా అడిగినా, ఓ చిన్న తప్పు దొరికినా మూడు నెలల పాటు ఇంక్రిమెంట్లు తగ్గిస్తున్నట్లు సమాచారం. డ్యూటీ సమయానికి నిమిషం ఆలస్యమైనా గైర్హాజరు వేస్తారు. అంతేకాక డిపో స్పేరులో పెట్టడం, సస్పెండ్ చేయడం చేస్తుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో బస్సుల సంఖ్య తగ్గడంతో బస్సులలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల (8 గంటల ప్రకారం) వరకు డ్యూటీ చేయిస్తున్నట్లు తెలిసింది. డిమాండ్లు... .మహిళా కండక్టర్లకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు పూర్తయ్యే డ్యూటీలు వేయాలి..ప్రతి డిపోలోనూ విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలి.డ్యూటీ టర్మినల్ పాయింట్లలో తాగునీరు, మూత్రశాల వసతులు కల్పించాలి..ప్రత్యేకంగా నెలకు మూడు రోజుల సెలవులు ఇవ్వాలి.అధికారుల ఒత్తిళ్లు, వేధింపులు అరికట్టాలి.అత్యవసర సమయాల్లో సెలవులు ఇవ్వాలి.22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు పదోన్నతులు కల్పించాలి. సెలవులు లేవు అవసరానికి తగినట్లుగా సెలవులు ఉండటంలేదు. అందరితో పాటే విధులకు హాజరుకాలి. ఉదయం 6 గంటల నుంచి మహిళలకు పని వేళలు మార్చేలా చర్యలు తీసుకోవాలి. ఉదయం 4 గంటలకు మహిళలు డ్యూటీకి రావాలంటే ఇబ్బందిగా ఉంది. లక్ష్మీ,పొన్నూరు డిపో మహిళల సమస్యలను పరిష్కరించండి జిల్లాలోని 13 డిపోలలో మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. మూడురోజులు సెలవుపై డిపో మేనేజర్లను ఆదేశించారు. సెలవు ఇవ్వకపోతే తనకు ఫోన్లో చెప్పాలి. గుంటూరు ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి ప్రమోషన్లు లేవు 21 సంవత్సరాలుగా కండక్టరుగా విధులు నిర్వహిస్తున్నా. సర్వీసు ప్రకారం ప్రమోషన్లు లేవు. డ్యూటీ సమయంలో పలు ఇబ్బందులు తప్పడంలేదు. రద్దీ పెరిగినపుడు చిల్లర సమస్య తలెత్తుతోంది. కాశమ్మ, కండక్టర్, తెనాలి డిపో -
సమస్యల స్వాగతం..
కాజీపేట అర్బన్: జాతీయ సాంకేతిక కళాశాల (నిట్)ఏడాదిన్నరగా ఇన్చార్జి డైరెక్టర్ పాలనలో కొనసాగుతోంది. దీంతో కళాశాలలో సమస్యలు పేరుకుపోయి పాలన గాడితప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం రానున్న కొత్త శాశ్వత డైరెక్టర్‌కు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. కళాశాలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని ఈనెల 13న విద్యార్థులు నిట్ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. మౌలిక సౌకర్యాల కొరత.. వరంగల్ నిట్‌లో బీటెక్, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ విభాగాల్లో సుమారు 6వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్నారు. బయట నుంచి మినరల్ వాటర్‌ను కొని విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. కళాశాల ఆవరణ, వసతి గృహ ఆవరణల్లో పారశుధ్యం లోపించింది. ఫలితంగా ప్రాంగణమంతా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి కళాశాలలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించాల్సి ఉన్నా అది అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు సాంకేతిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాణ్యమైన భోజనం లభించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పదోన్నతులపై డీపీసీలో చర్చించాలి .. నిట్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగ భర్తీకి సన్నాహాలు చేస్తున్న క్రమంలో డిపార్ట్మెంటల్ ప్రమోషనల్ కమిటీతో చర్చించి పదోన్నతులు కల్పించాలని నాన్టిచింగ్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఇరవై ఎళ్లుగా పదోన్నతులు లేకుండా నాన్టిచింగ్ సిబ్బంది కొనసాగుతున్నారు. సుమారు 230 మంది నాన్ టీచింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా వారిలో కనీసం వంద మందికైనా ప్రమోషన్లు కల్పించాల్సి ఉంది. వంద కోట్లు వెనక్కి వచ్చేనా... బాలికల వసతి నిట్‌కు పెద్ద సమస్య అవుతోంది. మూడు వందల మందికి ఉండాల్సిన హాస్టళ్లో సుమారు వెయ్యి మంది బస చేస్తున్నారు. వీరిలో కొంత మందిని గెస్ట్ హౌస్‌లో ఉంచుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు కేంద్రమానవ వనరుల మంత్రిత్వ శాఖ బాలికల వసతి గృహ నిర్మాణానికి రూ. వంద కోట్లు మంజూరు చేసింది. శాశ్వత చైర్మన్, డైరెక్టర్, బోర్డు సభ్యులు లేకపోవడంతో నిధులు వెనక్కి వెల్లిపోయాయి. కొత్త డైరెక్టర్ నిధులు వెనక్కి తెప్పించి బాలికల వసతి గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. అందుబాటులో లేని పీఆర్వో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో) నిట్‌లో అందుబాటులో లేక పోవడం చర్చనీయాంశంగా మారింది. పనిఒత్తిడి కారణంగా గతంలో పనిచేసిన పీఆర్వో స్వయంగా విధుల నుంచి తప్పుకోగా ప్రస్తుతం ఎంబీఏ హెచ్ఓడీ పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. పీఆర్వో విద్యార్థులకు, తల్లిదండ్రులు, ఇతర సిబ్బందికి అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న డైరెక్టర్ ఈ సమస్యలు పరిష్కరిస్తారనే ఆశతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. -
పదోన్నతుల కౌన్సెలింగ్‌లో వాగ్వాదం
వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ కార్యాలయంలో గందరగోళం కడప రూరల్ : ఎంపీహెచ్ఏ(ఎఫ్)లకు చేపట్టిన పదోన్నతుల కౌన్సెలింగ్‌పై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఈ శాఖ పరిధిలోని వైఎస్సార్ జిల్లాతోపాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎంపీహెచ్ఏ (ఎఫ్) నుంచి ఎంపీహెచ్‌ఎస్‌గా పదోన్నతులు కల్పించారు. ఈ క్యాడర్లో 86మందికి పదోన్నతి లభించింది. అలాగే హెల్త్ ఎడ్యుకేటర్స్‌గా పదోన్నతులకు ఏడుగురికిగాను ఆరుగురికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఒక ఉద్యోగినికి ఒకచోట పోస్టింగ్ ఇచ్చి రిజిష్టర్‌లో సంతకం కూడా తీసుకున్నారు. తర్వాత ఆమెకు మరోచోటికి పోస్టింగ్ ఇవ్వడంతో ఆ ఉద్యోగిని నిర్ఘాంతపోయింది. ఇదేమని ప్రశ్నించినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదు. ఇలా పలువురికి జరగడంతో ఉద్యోగులు బహిరంగంగానే ఆరోపణలకు దిగారు. కార్యాలయ సిబ్బంది తమకు అనుకూలమైన వారికి అనుకున్నచోటికి పోస్టింగ్ ఇచ్చారని వారంతా మండిపడ్డారు. -
ఎట్టకేలకు తెరదించారు
► 195 మందికి డీఎస్పీలుగా పదోన్నతి! హైదరాబాద్: డీఎస్పీ పదోన్నతుల వ్యవహారం చివరి మజిలీకి చేరింది. మూడే ళ్లుగా నలుగుతున్న ఈ వ్యవహారానికి ఎట్టకే లకు హోంమంత్రి, ఉన్నతాధికారులు ఆది వారం తెరదించారు. హోంమంత్రి అధ్యక్షతన శనివారం అర్ధరాత్రి వరకు ఈ పదోన్నతులపై సమావేశం జరిగింది. అభ్యంతరాలు తెలుపు తున్న ఇన్స్పెక్టర్లు, పదోన్నతి పొందుతున్న ఇన్స్పెక్టర్ల మధ్య రాజీ కుదిర్చి ఆదివారం డిపార్ట్మెంటల్ ప్రమోషనల్ కమిటీ (డీపీసీ) సమావేశానికి తెరదించింది. 195 మందికి గ్రీన్‌సిగ్నల్.. వరంగల్, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్.. ఈ మూ డు ప్రాంతాల్లో అర్హత కలిగిన అధికారుల పదో న్నతి జాబితా రెండు నెలల కిందే డీజీపీ కార్యాలయం విచారణ నిమిత్తం ఏసీబీ తో పాటు అన్ని యూనిట్లకు వెళ్లింది. 1989, 1991, 1995 బ్యాచ్‌లకు చెందిన 460 మంది ఇన్స్పెక్టర్ల జాబితాపై ఆదివారం డీజీపీ కార్యా లయం లో డీపీసీ కసరత్తు చేసింది. ప్రతి అధికారికి సంబంధించిన ఏసీఆర్ (యాన్యు వల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్), పెండింగ్‌లో ఉన్న పనిష్మెంట్లు, విచారణలు.. ఇలా అన్నిం టిని సమీక్షించి 195 మంది ఇన్స్పె క్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమా చారం. 1989, 1991 బ్యాచ్ అధికారులు 131 మందితో పాటు 1995 బ్యాచ్‌కు చెంది న 64 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించే అవకాశం ఉందని సీనియర్ ఐపీఎస్ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. సీఎం వచ్చాకే పోస్టింగ్స్ పదోన్నతుల పొందిన అధికారుల జాబితా సీఎం పరిశీలించాక అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సీఎంకేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారని, ఆయన రాగానే అధికారిక జాబితాతో పాటు పోస్టింగ్స్ ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.