మహేశ్, ప్రభాస్‌లకు థ్యాంక్స్! | thanks to mahesh babu and prabhas | Sakshi
Sakshi News home page

మహేశ్, ప్రభాస్‌లకు థ్యాంక్స్!

Published Wed, Dec 23 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

మహేశ్, ప్రభాస్‌లకు థ్యాంక్స్!

మహేశ్, ప్రభాస్‌లకు థ్యాంక్స్!

 ఇద్దరు స్టార్ హీరోలు ఓ సినిమాను ప్రమోట్ చేస్తే ఇంకేం కావాలి? కావల్సినంత పబ్లిసిటీ. ‘భలే మంచి రోజు’ విషయంలో ఇదే జరిగింది. సుధీర్‌బాబు హీరోగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శశిధర్‌రెడ్డి, విజయ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు, ప్రభాస్ చేసిన ప్రచారం చాలా ఉపయోగపడింది.
 
  ఈ విషయం గురించి నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం ఆడియో విడుదలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మహేశ్‌బాబు మా ట్రైలర్‌ను మెచ్చుకున్నారు. అలాగే ప్రభాస్ అయితే మా సినిమాకు సంబంధించిన విశేషాలు స్వయంగా అడిగి తెలుసుకుని, మా ప్రయత్నాన్ని అభినందించారు. ఈ ఇద్దరూ ఇచ్చిన సపోర్ట్ మా సినిమా మీద అంచనాలను పెంచింది. అందుకే మహేశ్, ప్రభాస్‌లకు చాలా థ్యాంక్స్. ఈ చిత్రం అన్నివర్గాల వారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement