
మరో 20 రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ ఉంది. 17న పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ షురూ కాబోతున్నాయి. అంతలోనే బన్నీ ప్రచారం మొదలుపెట్టేశాడు. 'అన్‌స్టాపబుల్' నాలుగో సీజన్‌లో ఇతడు పాల్గొన్న ఎపిసోడ్‌ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. మూవీ గురించి, అలానే చాలా విషయాల గురించి బన్నీ ఓపెన్‌గా మాట్లాడేశాడు.
మిగతా వాటి సంగతి పక్కనబెడితే ఇండస్ట్రీలో నీకు అతిపెద్ద పోటీ ఎవరని అనుకుంటున్నావ్? ప్రభాస్ లేదా మహేశ్ అని హోస్ట్ బాలయ్య అడగ్గా.. బన్నీ చాలా లాజికల్‌గా సమాధానం చెప్పాడు. 'నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే ! ఐ యామ్ మై బిగ్గెస్ట్ కాంపిటీషన్' అని అన్నాడు.
(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)
ప్రస్తుతం 'పుష్ప 2'కి వస్తున్న హైప్ చూస్తుంటే బన్నీ చెప్పింది నిజమనేలా ఉంది. ఈ మూవీకి రిలీజ్‌కి వెయ్యి కోట్ల బిజినెస్ జరిగిందని టాక్. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం ప్రభాస్ తరహాలో భారీ కలెక్షన్స్ రావడం గ్యారంటీ. అదే టైంలో ప్రభాస్, మహేశ్.. ఇద్దరిలో ఎవరు పేరు చెప్పినా సరే ఆయా ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
అలా ఓవైపు తనకు తాను ఎలివేషన్ ఇచ్చుకున్న బన్నీ.. మిగతా హీరోల అభిమానులని ఇబ్బంది పెట్టకుండా కామెంట్స్ చేశాడని చెప్పొచ్చు. ఇదే ఎపిసోడ్‌లో ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్.. ఇలా తన తోటీ హీరోలందరి గురించి బన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)
I'm my biggest competitor. Says in Pushpa Raj style#AlluArjun #UnstoppableWithNBK #Pushpa2TheRule
pic.twitter.com/2wZgZXVMWn— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 15, 2024