వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్‌ దంపతులు | All Arjun And Chiranjeevi Attends Allu Bobby Son Wedding, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్‌ దంపతులు

Published Fri, Nov 15 2024 7:15 AM | Last Updated on Fri, Nov 15 2024 2:26 PM

Allu Bobby Son Wedding All Arjun And Chiranjeevi Grace Tthe Event

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, మెగాస్టార్‌ చిరంజీవి ఒక పెళ్లి వేడుకలో సందడిగా కనిపించారు. తమ ఇంట్లో పెళ్లిలా వారందరూ పాల్గొనడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నూతన దంపతులను చిరంజీవితో పాటుగా అల్లు అర్జున్‌ ఆశీర్వదంచారు. దీంతో ఈ వివాహ వేడుక ఎవరిదై ఉంటుందని సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.

అల్లు అరవింద్‌ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూస్తున్న బాబీ కుమారుడిదే ఈ వివాహ సందడి. తమ వద్ద ఎన్నో ఏళ్లుగా ఉంటూ కుటుంబ సభ్యుడిగా బాబీ ఉండటం వల్లే తన కుమారుడి పెళ్లి వేడుకలో వారందరూ పాల్గొన్నట్లు తెలుస్తుంది. బాబీ కుమారుడు రామకృష్ణ తేజ- సుజాతల పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అరవింద్‌తో పాటు మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌ దంపతులు, అల్లు శీరిష్‌ పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
 

(ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ)

త్వరలో 'పుష్ప 2' మూవీతో అల్లు అర్జున్ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. 17వ తేదీన సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే హైప్ బోలెడంత ఉంది. ట్రైలర్ రిలీజైన తర్వాత అది ఇంకాస్త పెరగడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement