thanks
-
నటి లయ థ్యాంక్స్ గివింగ్ పార్టీ.. ఫ్యామిలీతో కలిసి (ఫొటోలు)
-
నంద్యాల మాజీ ఎమ్మెల్యే ట్వీట్‌కు బన్నీ రిప్లై .. అదేంటో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను కకావికలం చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యంత వేగంగా 40 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇంతవరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ మూవీ కూడా ఇలాంటి రికార్డ్ సాధించలేదు.అయితే అల్లు అర్జున్‌కు, నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రవికి మద్దతు తెలిపారు. తన ఫ్యామిలీతో కలిసి స్వయంగా నంద్యాలకు వెళ్లి రవిని కలిశారు. ఆ సమయంలోనే అల్లు అర్జున్ నిబంధనలు పాటించలేదంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.తాజాగా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ మూవీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శిల్పారవి పోస్ట్ చేశారు. థియేటర్లలో వైల్డ్ ఫైర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప 2 టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.శిల్పా రవి చేసిన ట్వీట్‌కు ఐకాన్ స్టార్ స్పందించారు. థ్యాంక్యూ బ్రదర్.. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. వీరిద్దరు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.Thank you brotherrr 🖤 . Thank you for your love ❤️🔥— Allu Arjun (@alluarjun) November 21, 2024 -
అందరికీ ధన్యవాదాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా గత సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన గుండెలోని రక్తనాళానికి వాపు రావడంతో వైద్యులు శస్త్ర చికిత్స లేకుండా స్టెంట్ అమర్చారు. శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు రజనీ. వైద్యులు ఆయనకు 15 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా రజనీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక అభిమానులైతే గుళ్లు, గోపురాలు, చర్చిలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘‘నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయక మిత్రులకు, సినీ రంగానికి చెందిన స్నేహితులకు, నా క్షేమం కోరిన మీడియా మిత్రులకు, నన్ను బతికిస్తున్న ఫ్యాన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు. – సాక్షి ప్రతినిధి, చెన్నైఆస్పత్రి నుంచి గోవిందా డిశ్చార్జ్బాలీవుడ్ నటుడు గోవిందా ఈ నెల 1న తన వ్యక్తిగత తుపాకీ పొరపాటున పేలడంతో కాలికి గాయాలై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేసి, కొన్ని రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. వీల్‌ఛైర్‌లో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన గోవిందాను పలువురు అభిమానులు పరామర్శించారు. ‘‘ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలనిప్రార్థించినవారికి కృతజ్ఞతలు’’ అని గోవిందా తెలిపారు. -
World Gratitude Day: నేనెవరికి థ్యాంక్స్ చెప్తానంటే
థాంక్యూ అమ్మమ్మా!నేను ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పలనుకుని చెప్పలేకపోయింది మా అమ్మమ్మకే. తన ప్రవర్తన ద్వారా మాకు ఒక జీవన విధానాన్ని నేర్పించిందామె. ముఖ్యంగా జీవన సహచరుడితో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మెలగాలో, కొట్టకుండా... తిట్టకుండానే పిల్లలను క్రమశిక్షణతో ఎలా పెంచాలో మా అమ్మమ్మ మా అందరితో మెలిగిన తీరు నుంచే మేము నేర్చుకున్నాం. పోదుపు పాఠాల సంగతి సరేసరి. మేమందరం చిన్నప్పుడు మా ప్రతి సెలవులకూ మా అమ్మమ్మ వాళ్లింటికే వెళ్లేవాళ్లం. తన పిల్లలతో΄ాటు మమ్మల్ని అందరినీ చదువుల వైపు, ఉద్యోగాల వైపు ముఖ్యంగా నిజాయితీతో కష్టపడి పనిచేయాలనే తలంపు వైపు, కుల మతాలకు తావులేని ఆదర్శాలవైపు తమ జీవన విధానంతోనే మళ్లించిన మా అమ్మమ్మ, తాతయ్యలు శ్రీమతి వావిలాల సీతాదేవి, వెంకటేశ్వర్లు గార్లకు కృతజ్ఞతలు ఎలా చెప్పలో మాకు అప్పట్లో తెలియలేదు. ఇప్పుడు తెలిసినా, చెప్పడానికి భౌతికంగా వారు మా మధ్య లేదు. అయితేనేం, మా జ్ఞాపకాలలో పదిలంగా ఉన్న మా అమ్మమ్మ, తాతయ్యలకు ఈ రోజున గుండెలనిండుగా థాంక్స్ చెప్పుకునే అవకాశం మాకు కల్పించిన సాక్షికి కూడా థాంక్స్.– తెల్కపల్లి ఇందిరా ప్రియదర్శిని, కంభం మా వారికే నా థాంక్స్నేను థాంక్స్ చెప్పేది ముందుగా మా వారికే. ఎందుకంటే కుటుంబ పరిస్థితుల రీత్యా పెళ్లయ్యే సమయానికి నేను అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేయగలిగాను. అయితే ఇంకా చదువుకోవాలని ఉందన్న నా మనసు గ్రహించింది మా వారు జేవీఎస్ రామారావు గారే. ఇంటిలో పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, నేను చదువుకునేందుకు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనతో΄ాటు మా అత్తగారు, మా మామగారు, వదినగారు కూడా చదువుకుని ఉద్యోగం చేయడంలో ఎంతగానో సహకరించారు. ఇప్పుడు నేను మూడు పీజీలు, రెండు డిగ్రీలు, రెండు డిపామాలు, ఎం.ఈడీ. చేసి ఉద్యోగం చేస్తూ కూడా మరికొద్దికాలంలోనే పీహెచ్డీ కూడా పూర్తి చేయబోతున్నానంటే అందుకు మా వారి ప్రోత్సాహ సహకారాలే కారణం. అందుకే మా వారికే నా ధన్యవాదాలు. – డి.ఎల్. అనూరాధ, భద్రాద్రి కొత్తగూడెంతండ్రి తర్వాత తండ్రి లాంటి...నేను నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత అంతగా రుణ పడిన ఏకైక వ్యక్తి మా మేనమామ కొన్నూరు సత్యారెడ్డిగారే. నా చిన్నప్పుడు నా సోదరుడి అనారోగ్య పరిస్థితుల్లో, నా తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే వారికి అండగా ఉంటూ, నన్ను గుండెలపై పెట్టి పెంచుకున్న ఆ రోజులను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆయన ప్రేమతో పెట్టిన గోరుముద్దలతో పెరిగిన ఈ దేహం పడిపోయే వరకూ ఆయన పేరు కాపాడుకుంటూ నిలబడే ఉంటుంది. నన్ను పెంచి పెద్ద చేసి, విలువలు నేర్పి, ఇంతవాణ్ణి చేసిన నా మేనమామకు సాక్షి పత్రిక వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నందుకు సంతోషిస్తున్నాను. – లంకల అన్వేశ్వర్ రెడ్డి, కుమార లింగం పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా -
‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. ఈ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి ముంబై వెళ్లారు. నగరంలోని శ్రీమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి తొలిసారి ఆలయానికి వెళ్లారు. ఈ ఏడాది జూన్ నెలలో ఈ జంటకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న సీనియర్ హీరోయిన్ కుమారుడు.. వధువు ఎవరంటే?) అయితే ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను చెర్రీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రజల అతిథ్యం, అప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. Dear Honorable Chief Minister Garu, Shrikanth Shinde Garu, and the Vibrant People of Maharashtra, We express our heartfelt gratitude for your exceptional hospitality and warmth.🙏 @CMOMaharashtra pic.twitter.com/8uqTZgpGmM — Upasana Konidela (@upasanakonidela) December 22, 2023 View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ఛత్తీస్‌గఢ్ చిన్నారికి ప్రధాని మోదీ లేఖ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన చిత్రం గీసిన చిన్నారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా లేఖ రాశారు. గురువారం ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆకాంక్ష అనే చిన్నారి తన చిత్రం గీసి తీసుకువచ్చింది. ప్రధాని మోదీ ఆ చిన్నారిని గమనించి, వేదికపైకి పిలిపించుకున్నారు. వివరాలడిగి ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. శనివారం చిన్నారి ఆకాంక్షకు ఆయన ఒక లేఖ రాశారు. నేటి బాలికలే దేశ ఉజ్వల భవిత అని పేర్కొన్నారు. నువ్వు తీసుకువచ్చిన స్కెచ్ నాకు చాలా బాగా నచ్చింది. నాపై నువ్వు చూపిన అభిమానం, ప్రేమకు ధన్యవాదాలు. నీకు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. భవిష్యత్తులో నువ్వు విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. రాబోయే 25 ఏళ్లు మీలాంటి చిన్నారులకు ముఖ్యమైన రోజులు కానున్నాయి. ఈ కాలంలో ముఖ్యంగా దేశయువతతోపాటు మీలాంటి పుత్రికలు భారత్ కలలను నెరవేరుస్తారు. దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తారు’అని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. -
సీఎం జగన్‌కు వీఆర్ఏ సంఘం నేతల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: వీఆర్ఏ సంఘం నేతలు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వీఆర్ఏలకు ఇస్తున్న రూ.300 డీఏను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఏపీజీఎఫ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం.. డీఏను పునరుద్ధరించడమే కాకుండా డీఏను రూ.500కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏ సంఘం నేతలు సీఎంను కలిసి సన్మానించారు. ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, వీఆర్ఏ సంఘం నేతలు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
మీ నవ్వులు చూడాలనుకుంటున్నా– విజయ్ దేవరకొండ
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా సక్సెస్‌లో, ఫెయిల్యూర్స్‌లో ఇంత ప్రేమ ఇచ్చిన మీకు(ఫ్యాన్స్) థ్యాంక్స్. జీవితంలో చాలా మారాయి. ఎత్తు, పల్లాలు చూస్తున్నా. నా చుట్టూ మనుషులు మారుతున్నారు.. నా గురించి ఏదో మాట్లాడతారు. కానీ, మీ (ఫ్యాన్స్) ప్రేమ స్థిరంగా ఉంటుంది.. అందుకే సెప్టెంబర్ 1న మీ మొహాల్లో నవ్వులు చూడాలనుకుంటున్నా’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘నీ మొహంలో నవ్వు చూడాలని మాత్రమే పనిచేస్తున్నా’ అంటూ గత నెల రోజులుగా చెబుతున్నాడు శివ నిర్వాణ. నాక్కూడా నవ్వులు చూడాలని ఉంది. కానీ, నాకంటే ఎక్కువగా సమంత మొహంలో నవ్వులు చూడాలని ఉంది. తను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అలాగే శివ నిర్వాణలోనూ నవ్వులు చూడాలనుంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ–‘‘మీ కోసం(అభిమానులు, ప్రేక్షకులు) కష్టపడుతున్నాను.. తిరిగి ఆరోగ్యంగా వస్తాను.. ‘ఖుషి’తో బ్లాక్ బస్టర్ ఇస్తానని మీకు మాట ఇస్తున్నాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘ఖుషి’ చూస్తే మీకు(ప్రేక్షకులు) విజయ్, సమంత కనిపించరు.. విప్లవ్, ఆరాధ్య మాత్రమే కనిపిస్తారు. సినిమా చూసి బయటికెళ్లేటప్పుడు ఈ మూవీని మరోసారి చూద్దామనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డియర్ కామ్రేడ్’ మేము అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ‘ఖుషి’ పెద్ద హిట్ కాబోతోంది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘శివ నిర్వాణతో మా బ్యానర్లో మరో సినిమా చేయనున్నాం’’ అన్నారు వై.రవిశంకర్. ‘‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’కి విచ్చేసిన విజయ్, సమంతలకి థ్యాంక్స్. ఈ వేడుకని గ్రాండ్‌గా చేసేందుకు సహకారం అందించిన నవీన్, రవిశంకర్, దినేశ్గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ, కెమెరామేన్ జి.మురళి, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. -
జగనన్నకు థ్యాంక్స్
-
జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు: కేటీఆర్
-
జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు: కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో పురాతన ఆలయాల పునరుద్ధరణతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి టీటీడీ తరపు నుంచి అన్నివిధాలుగా సాయం అందించేందు ముందుకు రావడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నారు తిరుమల తిరుపతి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆలయం. ఆ దేవుడి దయతో జగన్రెడ్డన్న ఏపీ సీఎంగా, వైవీ సుబ్బారెడ్డన్న టీటీడీకి చైర్మన్ కొనసాగుతున్నారు. అలాగే తెలంగాణాలో పురాతన, ప్రశస్తి.. ప్రభ కలిగిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. కొన్ని డబ్బులు ఇస్తే అవి కూడా వెలుగుతాయని అడిగాం. అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నారు. డబ్బులు ఇవ్వడంతో పాటు కార్యక్రమానికి ఇవాళ వైవీ సుబ్బారెడ్డన్న వచ్చారు. మరోమాట లేకుండా సాయం అందించేందుకు ఒప్పుకున్న జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ కేటీఆర్ కృతజ్క్షతలు తెలియజేశారు. అలాగే.. వేణుగోపాలస్వామి ఆలయానికి ఇంకో 80 లక్షల రూపాయలు కావాలని అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పకున్న సుబ్బారెడ్డన్న గొప్ప మనసుకు ధన్యవాదాలు. గంభీరావుపేట సీతారామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కూడా నేను చెప్పగానే ఆలోచిస్తాన్నామన్నందుకూ ధన్యవాదాలు అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ అడిగారు.. మేం చేశాం దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా.. కొత్త దేవాలయాలను నిర్మించడం, పాత ఆలయాలను పునర్మించే కార్యక్రమం సీఎం జగన్‌గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున గత నాలుగేళ్లుగా కొనసాగుతోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బలహీన వర్గాలు, మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున్న దేవాలయాలు నిర్మిస్తున్నాం. కరీంనగర్లో ఆలయ పనులకు శంకుస్థాపన జరిగి.. పనులు ప్రారంభించాం. సిరిసిల్ల పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం పనులకు 2 కోట్లు.. వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ మేరకు నిధులు కావాలన్నా టీటీడీ నుంచి నిధులు ఇస్తామని మాటిస్తున్నాం అని అన్నారాయన. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. సోదరుల్లాగా ఉందామని, తెలుగు ప్రజల ఇల వేల్పు కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో సుఖంగా, సంతోషంగా ఉందామని కోరుకుంటున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
మీరు బాగుంటేనే ప్రజలు బాగు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా సరే చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, వారంతా చిరునవ్వుతో ఉండేలా చూస్తామని అన్నారు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని, ఉద్యోగుల మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొత్తగా.. జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీం) తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, 12వ పీఆర్సీ ఏర్పాటు సహా పలు అంశాలపై ఈ నెల 7వ తేదీన జరిగిన కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సదర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ఏమన్నారంటే.. పరిష్కారాల కోసం తపనపడ్డాం ♦ ఉద్యోగుల మనసు కష్టపెట్టకూడదనే ఉద్దేశంతోనే పెన్షన్ సహా కొన్ని సమస్యల పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపన పడ్డాం. గతంలో ఎవరూ కూడా ఒక పరిష్కారం కోసం ఇంతగా తపన పడిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి.. అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలనే ఆలోచన చేశాం. వీటన్నింటి దృష్ట్యా జీపీఎస్ తీసుకువచ్చాం. ♦ రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించాం. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.లక్ష జీతం ఉంటే రూ.50 వేలు రిటైర్ అయిన తర్వాత పింఛన్ వస్తుంది. 62 ఏళ్లకు రిటైర్ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని ఆలోచన చేశాం. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం. ♦ ఉద్యోగులకు న్యాయం జరగాలి.. మరోవైపు నడపలేని పరిస్థితులు రాకుండా కూడా చూడాలని ఆలోచించాం. సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. దీనికోసం రెండేళ్లపాటు ఆర్థిక శాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది. ఫలితంగా జీపీఎస్‌కు రూపకల్పన చేశాం. చదవండి: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి మంచి జరిగేలా అడుగులేశాం ♦ న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు మంచి జరగాలని ప్రతి అడుగులో కనిపించే విధంగా చేశాం. ఇది సంతృప్తినిచ్చే అంశం. అసలు చాలా మంది ఎఫర్ట్ కూడా పెట్టరు. ఇంత ఆలోచన చేయాల్సిన పని ఏముందని అనుకుంటారు. అలా చేస్తే పరిష్కారం రాదు. అందుకే తొలిసారిగా పరిష్కారం దిశగా అడుగులు వేశాం. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కూడా మంచి ఆలోచన చేశాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశాం. నా దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన కంటే ముందు పదేళ్లను విండోగా అధికారులు నిర్ణయించారు. అలాగైతే మరీ ఆలస్యమవుతుందని ఐదేళ్లకు తగ్గించాం. తద్వారా గరిష్టంగా ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. చిరునవ్వుతో ఉండేలా చేస్తాం ♦ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేశాం. 010 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగా వీరికి జీతాలు సమయానికి రావు. పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో కూడా వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకున్నాం. ♦ ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన మంచి జరగాల్సి ఉన్నా, మీ మొహంలో (ఉద్యోగులు) చిరునవ్వు ఉండేలా చేస్తాం. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలకూ మంచి జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ♦ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: మధ్య హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన చేపల ఓడ మునిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు నావికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఓడలోని మిగతా 37 మంది నావికులను కాపాడేందుకు భారత నేవీ రంగంలోకి దిగి సాయం చేసింది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని చైనాకు ఆపన్నహస్తం అదించింది. దీంతో భారత్ సహా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని తమ వంతు సాయం అందించించిన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవ్‌కు చైనా విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో సాయం చేసినందుకు ప్రశంసల వర్షం కురిపించింది. చైనాకు చెందిన లుపెంగ్ యువాన్యు 028 చేపల ఓడ మంగళవారం హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఇందులో మొత్తం 39 మంది నావికులు ఉన్నారు. వీరిలో చైనాకు చెందన వారు 17 మంది, ఇండోనేషియాకు చెందినవారు 17 మంది, ఫిలిప్పైన్స్కు చెందిన ఐదుగురు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. చైనాకు చెందిన 10 ఓడలు ఆ ఆపరేషన్‌లో భాగమయ్యాయి. ఇంకా మరిన్ని ఓడలను ఘటనా స్థలానికి చేర్చుతున్నారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఓడను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్‌కు అతిపెద్ద విజయం.. ‘రాణాను అప్పగించండి’ -
అచంచలమైన నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేరువైంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ నిలిచింది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్సీపీ క్యాడర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సుపరిపాలన, ప్రభుత్వ విధానాలపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, పార్టీ క్యాడర్‌కు ధన్యవాదాలు’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. ‘‘ప్రజలకు మరింత సేవ చేసేందుకు దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. మన పాలన పట్ల మన ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన @YSRCParty క్యాడర్ కు ధన్యవాదాలు. మీకు మరింత సేవ చేసేందుకు, దేవుని దయ మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా… pic.twitter.com/92DSw9eFFX — YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2023 కాగా, వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. చదవండి: ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు..1.1 కోట్ల మిస్డ్ కాల్స్ -
నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీరే కారణం.. థ్యాంక్స్: గ్యాంగ్‌స్టర్
లక్నో: ఉమేష్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్‌ను బుధవారం గుజరాత్ సబర్మతి జైలు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జైలుకు తరలించారు అధికారులు. ఈ సమయంలో పలు మీడియా సంస్థలు పోలీసుల వాహనాలను అనుసరించాయి. అతిక్ అహ్మద్‌ను సురక్షితంగా జైలుకు తీసుకెళ్లేంత వరకు కెమెరాలతో రికార్డు చేశాయి. దీంతో తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీడియానే కారణమని అతిక్ అహ్మద్ అన్నారు. అందుకు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. మీరు భయపడుతున్నారా అని అడిగిన ఓ ప్రశ్నకు అతడు ఈమేరుక సమాధానం ఇచ్చాడు. అలాగే ఉమేష్ పాల్ హత్య కేసుతో మీకున్న సంబంధం ఏంటి? మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది? అని మీడియా అడగ్గా.. తన ఫ్యామిలీ నాశనం అయిందని అతిక్ బదులిచ్చాడు. జైలులో ఉన్న తనకు కుటుంబసభ్యులు ఎలా ఉన్నారో.. ఎక్కడ ఉంటున్నారో ఎలా తెలుస్తుందని అన్నాడు. Rajasthan | Prayagraj Police convoy taking criminal-turned-politician-mafia Atiq Ahmed from Sabarmati Jail to Prayagraj, to present him in a murder case, took a halt in Bundi. pic.twitter.com/ntwPenvf6v — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023 2006లో ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో అతిక్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు దోషులుగా తేలారు. వీరికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అతిక్ సోదరుడు ఖలీద్ అజీమ్‌తో పాటు మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 2006లోనే జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య ఘటనలో ఉమేష్ పాల్ కీలక సాక్షిగా ఉన్నాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ ప్రయాగ్ రాజ్‌లోని తన నివాసం ఎదుట దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు ఆయనను తుపాకులతో కాల్చిచంపారు. అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అశ్రఫ్లే ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. #WATCH | Bundi, Rajasthan: "My family has been ruined...I was in jail what will I know about it (Umesh Pal murder case)," says criminal-turned-politician-mafia Atiq Ahmed while being taken from Sabarmati Jail to Prayagraj pic.twitter.com/LTc869VdxQ — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023 చదవండి: నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీరే కారణం.. థ్యాంక్స్: గ్యాంగ్‌స్టర్ -
థాంక్యూ భారత్! ఎప్పటికీ మనం దోస్తులమే!: టర్కీ రాయబారి
టర్కీలో వచ్చిన భారీ భూకంపం కారణంగా సుమారు 30 వేల మంది దాక చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ 'ఆపరేషన్ దోస్త్'లో భాగంగా టర్కీకి తక్షణ సాయం అందించడమే గాక పలు రెస్క్యూ బృందాలను కూడా పంపించింది. అందులో భాగంగానే భారత్ 23 టన్నులకు పైగా సహాయక సామాగ్రితో మరో ఏడవ ఆపరేషన్ దోస్త్ విమానాన్ని టర్కీకి పంపించింది. ఆ విమానం ఆదివారం భూకంప బాధిత సిరియాకు చేరుకుంది. దీనిని డమాస్కస్ విమానాశ్రయంలోని స్థానిక పరిపాలన, పర్యావరణ డిప్యూటీ మంత్రి మౌతాజ్ డౌజీ అందుకున్నారు. ఈ మేరకు టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ సోమవారం తమ దేశానికి మరోసారి సహాయక సామాగ్రిని పంపినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. రాయబారి సునెల్ ట్విట్టర్ వేదికగా.. భారత ప్రజల నుంచి మరో బ్యాచ్ అత్యవసర విరాళాలు టర్కీకి చేరుకున్నాయి. భూకంపం సంభవించిన ప్రాంతానికి ప్రతి రోజు ఎంతో ఉదారంగా ఉచిత సహాయాన్ని అందజేస్తోంది. అందుకు భారతదేశానికి ధన్యావాదాలు. వందల వేల మంది భూకంప నుంచి బయటపడిన వారందరికి ఈ సమయంలో గుడారం, దుప్పటి, స్లీపింగ్ బ్యాగ్ వంటివి చాలా ముఖ్యమైనవి. అలాంటి వాటన్నింటిని ఈ విపత్కర సమయంలో మా ప్రజలకు అందించి ఎంతో మేలు చేసింది. లాంఛనప్రాయంగా ప్రారంభమైన ఈ 'ఆపరేషన్ దోస్త్' మనం ఎప్పటికీ స్నేహితులమని నిరూపించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలోపేతం కావలి అని ట్వీట్ చేశారు. THANK YOU INDIA! 🇮🇳🇮🇳🇮🇳 Each tent, each blanket or sleeping bag are of vital importance for the hundreds of thousands of earthquake survivors. https://t.co/v9rsXtdzjL — Fırat Sunel फिरात सुनेल فرات صونال (@firatsunel) February 13, 2023 (చదవండి: ఉక్రెయిన్ మరితంగా బ్రిటన్ మిటలరీ సాయం..మండిపడుతున్న రష్యా) -
సీఎం వైఎస్ జగన్ కు ఫాతిమా మెడికల్ స్టూడెంట్స్ కృతజ్ఞతలు
-
మీ ఆప్యాయతకు పొంగిపోయా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తనకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ మేరకు గురువారం ఓ ట్వీట్ చేశారు. తనపై చూపిన అభిమానానికి, అప్యాయతకు నిజంగా పొంగిపోయానంటూ ట్వీట్ చేసిన సీఎం జగన్.. వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. I thank you all for your kind wishes. I am truly overwhelmed by the affection shown by my @YSRCParty family. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 22, 2022 ఇదిలా ఉంటే.. బుధవారం(డిసెంబర్ 21)న సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా మిగతా చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
మీ పేరు నిలబెడతాం.. థ్యాంక్స్ మామయ్య
-
నన్ను సీఎస్ గా నియమించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు : జవహర్ రెడ్డి
-
సాక్షి ఎడిటర్‌కు ‘కాంబోడియా’ బాధితుల కృతజ్ఞతలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తాము స్వదేశానికి రావడంలో ‘సాక్షి’చూపిన చొరవ మరువలేని దని ‘కాంబోడియా’బాధితులు అన్నారు. గురువారం కరీంనగర్‌కు చెందిన యువకులు సలీం, షారుఖ్, షాభాజ్, హాజీ హైదరాబాద్ లోని ‘సాక్షి’ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ వర్ధెల్లి మురళిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి కోసం కాంబోడియా వెళ్లి అక్కడ సైబర్ నేరస్తుల ముఠా చేతిలో చిక్కిన తాము తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. అయితే సాక్షి దినపత్రిక వరుస కథనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించేలా చేసిందని అన్నారు. ఈ సందర్భంగా కాంబోడియాలో సైబర్ నేరస్తుల ముఠా తమను ఎలా హింసించిందన్న విషయాలను వారు ఎడిటర్‌కు వివరించారు. సెప్టెంబర్ 19న ‘కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి’అన్న శీర్షికన కరీంనగర్ యువకులు కాంబోడియాలో చిక్కుకున్న విషయాన్ని ‘సాక్షి‘బయట పెట్టిన విషయం తెలిసిందే. తర్వాత కూడా సాక్షి ప్రచురించిన వరుస కథనాలతో స్పందించిన కరీంనగర్ పోలీసులు, స్థానిక ఎంపీ సంజయ్ చొరవ తీసుకుని ఆ యువకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. (క్లిక్: ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం) -
సల్మాన్ ఖాన్ కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పిన మెగాస్టార్
-
భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
Taiwan said it will continue to enhance its self-defence capabilities: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన ఎంత పెద్ద పెను వివాదంగా మారిందో తెలిసిందే. ఒక పక్క తైవాన్‌ని అడ్డుపెట్టుకుని అమెరికా తమపై కుట్ర చేస్తుందంటూ డ్రాగన్ కంట్రీ నిప్పులు కక్కుతోంది. అమెరికా సైతం తాము అనుకున్నదే చేస్తామని తగ్గకపోవడంతో భవిష్యత్తులో జరగబోయే ఏ పరిణామానికైన అగ్రరాజ్యమే కారణమంటూ కయ్యానికి కాలుదువ్వింది చైనా. ఈ మేరకు తైవాన్ జలసంధిలో మిలటరీ డ్రిల్లు చేపట్టింది. తైవాన్ భయపట్టించేలా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున్న సైనిక విన్యాసాలు ప్రారంభించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీంతో జపాన్, భారత్‌తో సహ ఇతర దేశాలు తైవాన్ జలసంధి అంతటా అంతర్జాతీయ భద్రతను కాపాడేలా సమన్వయంగా వ్యవహరించాలని చెబుతూ.. ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పేలే పిలుపునిచ్చాయి. ఈ మేరకు భారత్ ఇతర దేశాల మాదిరిగా ఆందోళన వ్యక్తపరుస్తూ.. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గి ఈ ప్రాంతంలో శాంతి, సంయమనం పాటించాలని, ఏకపక్ష చర్యలను నివారించాలని కోరుతున్నాము" అని విదేశీ వ్యవహారాలు మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చ పిలుపునిచ్చారు. దీంతో తైవాన్, చైనా విషయంలో భారత్‌తో సహా ఇతర దేశాలు తమకు మద్ధతు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో స్నేహం చేయడానికి, సంబంధాలు కొనసాగించడానికి తాము అర్హులమని తైవాన్ పేర్కొంది. ఈ క్రమంలో తైవాన్ అంతర్జాతీయ భద్రతను కాపాడేలా భారత్‌తో సహా ఇతర దేశాలతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తూనే తమ ఆత్మరక్షణ సామర్థ్యాలను పెంపొందించుకుంటామని వెల్లడించింది. -
24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
-
మాట తప్పని మడం తిప్పని నాయకుడు మన సీఎం
-
సీఎం జగన్‌కు థ్యాంక్స్.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
-
సీఎం జగన్‌కు థ్యాంక్స్.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ఆర్ కృష్ణయ్య
సాక్షి, తాడేపల్లి: బీసీల మీద సీఎం జగన్ చూపుతున్న ప్రేమను.. మరే సీఎం చూపలేదన్నారు ఆర్ కృష్ణయ్య. రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య స్పందించారు. మొదట్నుంచీ సీఎం జగన్.. బీసీలంటే బ్యాక్ బోన్ అంటూనే ఉన్నారు. అన్నట్టుగానే బీసీలకి అధిక ప్రాదాన్యత ఇస్తూ వస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి రాజ్యసభ పదవులు కొనే పరిస్థితి వైఎస్సార్సీపీలో ఉండదన్న కృష్ణయ్య.. అదే ఉంటే తనలాంటోడు రాజ్యసభకు వెళ్తాడా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలోనే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతోందని, సీఎం జగన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకుగానూ ఆర్ కృష్ణయ్య.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభకు పంపుతున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ణతలు తెలియజేసేందుకు వచ్చానని అన్నారు. దశాబ్దాలుగా బీసీ ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం తాను పోరాడుతున్నానని, ఆ అంకిత భావాన్ని గుర్తించి సేవ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారని, బీసీలకు సీఎం జగన్ ఇస్తోన్న ప్రాధాన్యతను చూసి దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. తన సేవలను వైస్సార్సీపీలో ఉన్న నేతలంతా మనస్పూర్తిగా అంగీకరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. పార్టీ కండువా కప్పుకోపోయినా.. తాను వైఎస్సార్సీపీలో చేరినట్లేనని, అలాగే బీసీల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే పార్థసారథి కృతజ్ఞతలు
-
కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన నందమూరి రామకృష్ణ
సాక్షి, అమరావతి: తన తండ్రి నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గురువారం ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారు గర్వపడేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి హర్షం ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా’నంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: (కొత్త జిల్లాల ప్రకటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ) (NTR District: కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన పురందేశ్వరి) -
ఏపీ ప్రభుత్వానికి సీఐఐ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ఆదాయ వనరులు అడుగంటినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవటాన్ని భారతీయ పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) అభినందించింది. రూ.7,880 కోట్లతో కొత్తగా 16 ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు రూ.3,820 కోట్లతో ఆధునికీకరణకు శుక్రవారం కేబినెట్ ఆమోదం తెలపడాన్ని సీఐఐ ఏపీ విభాగం స్వాగతించింది. రెండేళ్లుగా కరోనా పరిస్థితులను ఎదుర్కొంటూనే రాష్ట్ర ఆర్థిక వృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతు ఇచి్చనందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ నియంత్రణతో పాటు పరిశ్రమలు, వ్యాపార వ్యవహారాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఐఐ పేర్కొంది. ఈమేరకు సీఐఐ విడుదల చేసిన పత్రంలో కొన్ని సూచనలు చేసింది. చదవండి: AP: నేతన్నకు ఊతం.. ఆఫర్లతో ఆప్కోకు అందలం ►ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదుర్కొన్న దాదాపు రెండేళ్ల తర్వాత ప్రజల శక్తి తిరిగి పూర్వ స్థాయికి చేరుకునేందుకు ఆరి్థక కార్యకలాపాల పునరుద్ధరణ కీలకం. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాలి. ►కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు 25 శాతం ఆక్యుపెన్సీలో ఉంటే తగిన జాగ్రత్తలతో సాధారణ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అదే 25 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీలో ఉంటే సామాజిక కార్యకలాపాలను పరిమితం చేయాలి. కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి. ►కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు 50 నుంచి 75 శాతం వరకు ఆక్యుపెన్సీలో ఉంటే మైక్రో జోన్ల్లో కార్యకలాపాలపై నియంత్రణ, రద్దీని నివారించడానికి లాక్డౌన్ లాంటి కఠిన చర్యలు అవసరం. 75 శాతానికి మించి బెడ్లు నిండితే లాక్‌డౌన్‌తో పాటు అదనపు ఆంక్షలు అమలు చేయాలి. పరిశ్రమలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభ సమయంలో వ్యాపారాల కొనసాగింపు, స్థిరత్వాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమని సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ సి.కె.రంగనాథన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆరి్థక మాంద్యాన్ని అధిగమించాలంటే వ్యాపార లావాదేవీలను కొనసాగించడం అవసరమన్నారు. ఎంఎస్ఎంఈలకు అండగా ఏపీ ప్రభుత్వంతో కలసి సీఐఐ పని చేస్తోందని చెప్పారు. మహమ్మారి సమయంలో పరిశ్రమలకు మద్దతిచి్చనందుకు ఏపీ ప్రభుత్వానికి సీఐఐ కృతజ్ఞతలు తెలియజేస్తోందని పేర్కొన్నారు. అలాగే కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఐఐ ఆంధ్రప్రదేశ్ విభాగం చైర్మన్ డి.తిరుపతిరాజు ప్రశంసించారు. 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, వైద్య కళాశాలల అభివృద్ధి ద్వారా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు బలోపేతమై ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమ వర్గాలు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాయని తెలిపారు. -
తెలుగు ప్రజల ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది: ఎన్వీరమణ
సాక్షి, కృష్ణాజిల్లా: తెలుగు ప్రజల ఆశీర్వాదమే తనను ఈ స్థాయికి చేర్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. పొన్నవరం పర్యటనపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పర్యటనకు సహకరించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబ సభ్యులకు సొంత గ్రామం చూపించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆతిథ్యమిచ్చిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి సీఎం జగన్‌కి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగులు, రోటరీ క్లబ్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
వాటిని పోస్ట్ చేయనందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పిన అనుష్క శర్మ
సాధారణంగా సెలబ్రిటీలలో కొందరి పిల్లలకు పుట్టగానే సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది. ఇక అప్పటి నుంచి ఆ చిన్నారులు ఏం చేసిన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. దీనికి భిన్నంగా టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల కూతురు వామికా కోహ్లీ అసలు ఎలా ఉంటుందని కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. పైగా ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి వామికాకు సంబందించిన ఏ ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు విరుష్క జంట. తాజాగా ఇందుకు సంబంధించి బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన కుమార్తె వామిక ఫోటోలను ప్రచురించనందుకు మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కోహ్లీ, అనుష్క, వామికాతో కలిసి బయటకు రాగా వామిక ఫోటోని తీశారన్న వార్తలు వచ్చాయి. దీంతో వామిక ఫోటోలను పోస్ట్ చేయకండని ఈ జంట మీడియాని అభ్యర్థించారు. దీనిపై స్పందిస్తే అనుష్క తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో .. వామికా ఫోటోలు/వీడియోలను పోస్ట్ చేయనందుకు మీడియా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపూతూ.. మేము మా చిన్నారి గోప్యతను కాపాడాలనుకుంటున్నాము. ఎందుకుంటే భవిష్యత్తులో ఆమె జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికే మేము మీడియాకు దూరంగా ఉంచుతున్నాము. అందుకు మా వంతు కృషి చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ విషయంలో సంయమనం పాటించాలని అనుష్క ఆ పోస్ట్‌లో తెలిపింది. అంతకుముందు, ముంబై నుంచి దక్షిణాఫ్రికాకు జట్టు బయలుదేరే సమయంలో వామికా ఫోటోలు తీయవద్దని విరాట్ కోహ్లీ ఫోటోగ్రాఫర్లను అభ్యర్థించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. "బేబీ కా ఫోటో మాట్ లీనా (దయచేసి పాప ఫోటోలు క్లిక్ చేయకండి)" అని కోహ్లి ఆ వీడియోలో చెప్పాడు. ఏదైమైనా వామిక ప్రైవసీ విషయంలో విరుష్క జంట చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చదవండి: Sushmita Sen: సుస్మితా సేన్ ఎమోషనల్ పోస్ట్.. అందుకు 27 ఏళ్లు పట్టిందట -
ఇదో ప్రేమలేఖ! ఆనందం పట్ట‘లేఖ’
టెక్కలి రూరల్: ఇదో ప్రేమలేఖ. తన భార్యకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞత చెప్పేందుకు భర్త రాసిన లేఖ. సంతకం పెట్టడం తప్ప రాయడం తెలీని ఆ వ్యక్తి లెటర్‌ను టైప్ చేయించి ఆస్పత్రిలోని ఫిర్యాదుల పెట్టెలో వేసి వైద్యులను ఆశ్చర్యపరిచారు. నిత్యం ఫిర్యాదులతో సతమతమయ్యే వైద్య సిబ్బంది ఈ లేఖను చూసి మురిసిపోయారు. అసలు విషయంలోకి వెళ్తే.. టెక్కలి మెట్టవీధికి చెందిన గుడ్ల రామారావు భార్యకు అకస్మాత్తుగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. చదవండి: శ్యామలను బిడ్డలా చూసుకుంటా! కాళ్లు చేతులు కదలక నోట మాట కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అలాంటి స్థితిలో ఆమెను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యులు పది రోజుల పాటు పసిబిడ్డను చూసుకున్నట్లుగా ఆమెను రాత్రీపగలు చూసుకున్నారు. వారి కృషి ఫలితంగా ఆమె వేగంగా కోలుకున్నారు. వైద్య సిబ్బంది చూపిన చొరవ రామారావు మనసు గెలుచుకుంది. వారిని ప్రత్యక్షంగా అభినందించడానికి మొహమాట పడి, ఓ లెటర్‌ను ఇలా టైప్ చేయించి ఫిర్యాదుల పెట్టెలో ఈ నెల 4న వేశారు. శుక్రవారం ఆ పెట్టెను తెరిచి చూసిన ఆస్పత్రి సిబ్బంది లేఖను చూసి సంతోషపడ్డారు. ప్రజలు ఏవో కారణాలతో ఎప్పుడూ తమను నిందిస్తూనే ఉంటారని, ఈ లేఖతో ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. -
సీఎం జగన్‌కు బీసీ నేతల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీసీ నేతలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్‌ను బుధవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిశారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, వెనుకబడిన తరగతులను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దుతున్న వైనాన్ని ఆయా వర్గాలకు మరింతగా తెలియజెప్పేలా నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సూచించారు. -
ఏపీ ప్రభుత్వానికి పెన్షనర్ల కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడంపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రపదేశ్ పెన్షనర్ల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఖజానా శాఖ సంచాలకులు స్పష్టం చేయడంపై సంఘం ప్రధాన కార్యదర్శి టి.ఎం.బి. బుచ్చిరాజు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ పెన్షనర్లందరూ ఈ విషయాన్ని గుర్తించి తదనుగుణంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని కోరారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన ఇషాక్
-
సీఎం వైఎస్ జగన్‌కు అర్చక సమాఖ్య కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ఆలయాల జీర్ణోద్ధరణతో పాటు అర్చకుల సంక్షేమ కార్యక్రమాల కోసం టీటీడీ ప్రతి ఏటా రూ.50 కోట్లు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై ఏపీ అర్చక సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వం అర్చకుల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబులు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఇవీ చదవండి: వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్ వన్ టీడీపీ అప్పులతోనే తిప్పలన్నీ.. -
థ్యాంక్యూ సీఎం జగన్ సర్: పంచాయతీ రాజ్ ఉద్యోగులు
అనంతపురం: గ్రూప్–1 ద్వారా నియమితులైన ఎంపీడీఓలకు, పంచాయతీ రాజ్ ఉద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాతికేళ్ల తర్వాత పదోన్నతులకు మార్గం సుగమంచేసింది. దీంతో పంచాయతీ రాజ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం స్థానిక జెడ్పీ సమావేశ హాలులో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, ఎంపీడీఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్ల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందన్నారు. ఎంపీడీఓ మొదలుకొని దిగువ స్థాయిలోని పన్నెండు కేడర్లకు చెందిన ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. పదోన్నతులు ఇవ్వడం ద్వారా జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, డివిజనల్ అభివృద్ధి అధికారులు వంటి వివిధ రకాల పోస్టులు రెగ్యులర్ బేసిస్‌లో భర్తీ కానున్నాయన్నారు. పదోన్నతుల విషయంలో న్యాయం చేసిన ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఏఓ విజయప్రసాద్, ఎంపీడీఓల సంఘం కార్యదర్శి దివాకర్, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, షేక్షావలి, ఈఓఆర్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు సౌజన్య తదితరులు పాల్గొన్నారు. పాతికేళ్లకు పదోన్నతులు పంచాయతీ రాజ్ ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాయలసీమ జోన్ (అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు) పరిధిలోని 21 మందికి పదోన్నతులు కల్పిస్తూ ఎస్ఈ భాగ్యరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారు ... అనంతపురం జిల్లాలో ఇద్దరు జేటీఓలకు ఏటీఓలుగా, పదిమంది వర్క్ ఇన్స్పెక్టర్లను జేటీఓలుగా, కర్నూలు జిల్లాలో ఏటీఓ నుంచి టీఓగా ఒకరు, జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా ఒకరు, చిత్తూరు జిల్లాలో ఏటీఓ నుంచి టీఓగా ఒకరు, వైఎస్సార్ జిల్లాలో జేటీఓ నుంచి ఏటీఓగా ఇద్దరు, వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి జేటీఓగా ముగ్గురు, సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్‌గా ఒకరికి పదోన్నతి కల్పించారు. -
సీఎం జగన్ దంపతులకు పీవీ సింధు తండ్రి ప్రత్యేక కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలకు పీవీ సింధు తండ్రి రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సింధును సీఎం జగన్ అభినందించారన్నారు. సింధు కచ్చితంగా పతకం గెలవాలని సీఎం జగన్ ఆకాంక్షించారని పేర్కొన్నారు. సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు పూర్తి సహకారం అందించారని రమణ తెలిపారు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు పతకాలు సాధించి కొత్త అధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్ ఈవెంట్స్‌లోనూ సింధు విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. -
జెఫ్ బెజోస్‌కు ఊహించని ఎదురు దెబ్బ!
సాక్షి,న్యూఢిల్లీ: రోదసీ యాత్ర పూర్తి చేసుకుని ఫుల్ ఖుషీగా ఉన్న ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తన స్పేస్ టూర్ విజయవంతమైనందుకు అమెజాన్ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు బెజోస్. ఇందులో ఇబ్బంది ఏముంది అంటారా? ఇక్కడే ఉంది ట్విస్ట్. ప్రపంచ బిలియనీర్‌గా ఉన్నా బెజోస్ పన్నులు చెల్లించకుండా..ప్రజల సొమ్ముతో టూర్‌కు వెళ్లొచ్చావు అన్నట్టుగా రాజకీయ ప్రముఖులు, నెటిజన్ల నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అమెజాన్ సంస్థ బ్లూ ఆరిజిన్ ఆధ్వర్యంలో రాకెట్ నిర్మాణం, అంతరిక్ష ప్రయాణం దీని ఖర్చంతా మీరే చెల్లించారంటూ స్వయంగా బెజోసే వెల్లడించడంతో ఆయనకు దిమ్మ తిరిగే రెస్పాన్స్ వచ్చింది. ప్రతి అమెజాన్ ఉద్యోగికి, ప్రతి అమెజాన్ కస్టమర్‌కూ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరే వీటన్నింటికీ చెల్లించారు" అని బెజోస్ తన టూర్ ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు. సీరియస్లీ.. మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. తక్కువ జీతాలు, దారుణమైన, అమానవీయ ఆఫీసు వాతావరణం, కరోనా మహమ్మారి సమయంలో కూడా డెలివరీ డ్రైవర్లకు ఆరోగ్య బీమా లేకుండా అమెజాన్ ఉద్యోగులే ఇదంతా భరించారంటూ అమెరికా చట్టసభ ప్రతినిధి లెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ ట్విటర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు. పన్నులు కట్టకుండా అమెరికన్లు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నులతోనే స్పేస్ టూర్ చేసి వచ్చారంటూ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ ట్వీట్ చేశారు. కానీ అమెరికన్లకు థ్యాంక్స్ చెప్పడం మాత్రం మరచిపోయాంటూ మండిపడ్డారు. మరోవైపు కెనడాలోని న్యూడెమొక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ కూడా బెజోస్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 11 నిమిషాల్లో బెజోస్ యాత్ర ముగిసింది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ప్రతి 11 నిమిషాలకు (16 లక్షల డాలర్లు) మిలియన్ల డాలర్లు మూటగట్టుకుని మరింత కుబేరుడిగా అవతరించాడని వ్యాఖ్యానించారు. అమెజాన్‌పై ఎలాంటి పన్నులు లేకుండా అనుమతించిన ప్రధాని జస్టిన్ ట్రూడో చలవే ఇదంతా అని ట్వీట్ చేశారు. కాగా బిలియనీర్ బెజోస్పై అమెరికాలో పన్ను ఎగవేత ఆరోపణలు అమెజాన్ ఉద్యోగులకు తగిన జీతాలు చెల్లించకపోడం, ప్రమాదకరమైన పని పరిస్థితులు, భోజన, వాష్‌రూం విరామాలను కూడా తీసుకోనీయకుండా వేధింపులకు పాల్పడుతోందంటూ చెలరేగిన విమర్శల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జెఫ్ బెజోస్ మంగళవారం 11 నిమిషాల్లో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. Yes, Amazon workers did pay for this - with lower wages, union busting, a frenzied and inhumane workplace, and delivery drivers not having health insurance during a pandemic. And Amazon customers are paying for it with Amazon abusing their market power to hurt small business. https://t.co/7qMgpe8u0M — Alexandria Ocasio-Cortez (@AOC) July 20, 2021 Yes, Amazon workers did pay for this - with lower wages, union busting, a frenzied and inhumane workplace, and delivery drivers not having health insurance during a pandemic. And Amazon customers are paying for it with Amazon abusing their market power to hurt small business. https://t.co/7qMgpe8u0M — Alexandria Ocasio-Cortez (@AOC) July 20, 2021 Jeff Bezos's space flight lasted 11 minutes During the pandemic, every 11 minutes, he got about 1.6 million dollars richer All while, Justin Trudeau allowed Amazon to pay $0 in taxes It's time the ultra-rich pay their fair sharehttps://t.co/uhILFSSfxw — Jagmeet Singh (@theJagmeetSingh) July 20, 2021 -
అత్యున్నత పురస్కారం: తలైవా భావోద్వేగం
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. 2020 సంవత్సరానికిగాను తనను అత్యుత్తమ పురస్కారానికి ఎంపిక చేయడంపై తలైవా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనగురువు, సోదరుడుతోపాటు సినీ పరిశ్రమలోని పెద్దా చిన్నా, కేంద్ర, రాష్ట్ర రాజకీయ నేతలతోపాటు, స్నేహితులు, అభిమానులు అందరికీ పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. (రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు) ముఖ్యంగా తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకుగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జ్యూరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన స్నేహితుడు రాజ్ బహదూర్, తనలోని నటనా నైపుణ్యాన్ని గుర్తించిన బస్ డ్రైవర్, తన ఉన్నతికి కారణమైన సోదరుడు రావు గైక్వాడ్‌తో పాటు తనను రజనీకాంత్‌గా సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గురువు కే బాలచందర్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు తన దర్శకులు,నిర్మాతలు, టెక్నీషియన్లు, మీడియాకు, తమిళ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డు అంకితమని రజనీ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అలాగే ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్, తన సహ నటుడు కమల్‌హాసన్, ఇతర రాజకీయ నాయకులు, హితులు, సన్నిహితులందరికీ ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కాగా భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతీసంవత్సరం ఇచ్చే పురస్కారాన్ని రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రజనీకి ఈ అవార్డును ఇవ్వాలన్న జ్యూరీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించిందని కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, ఇతర రంగ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనల వెల్లువ కురుస్తోంది. భారతీయ సినిమా పితామహుడుగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో 1963లో ఈ అవార్డును ప్రారంభించారు. అయితే దివంగత పాపులర్ నటుడు శివాజీ గణేషన్, దర్శకుడు కె.బాలచందర్ తర్వాత ఈప్రతిష్టాత్మక అవార్డును పొందిన తమిళ సినీ రంగానికి చెందిన మూడవ వ్యక్తిగా రజనీకాంత్ నిలిచారు. My heart is so full! 😊 @rajinikanth sir♥️#DadasahebPhalkeAward pic.twitter.com/YrNbq26rZM — Nivetha Thomas (@i_nivethathomas) April 1, 2021 -
వారందరికి ధన్యవాదాలు: పవన్ కళ్యాణ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా బుధవారం నాడు ఆయన ఫ్యాన్స్‌కు చాలా సర్ప్రైజ్లు అందాయి. ఆయన నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు పవన్ 27వ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు. పవన్ కల్యాణ్- క్రిష్ జాగర్లపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక చాలా మంది సెలబ్రెటీలు, ఆయన అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. చిరంజీవి, వెంకటేశ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్, సమంత, రకుల్‌ప్రీత్, దేవి శ్రీ తదితర సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులతో పాటు తనకు పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజల మేలు కోరి భగవంతుడిని ప్రార్థించడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో శుభాకాంక్షలు స్వీకరించడానికి కూడా మనసు అంగీకరించడంలేదని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తున్నట్లు జనసేన అధినేత పవన కల్యాణ్ తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు తన బాధ్యతను మరింత పెంపొందించాయని తెలిపారు. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/aLde1oSUWv — JanaSena Party (@JanaSenaParty) September 2, 2020 చదవండి: అద్భుతమైన పవన్‌కు హ్యాపీ బర్త్‌డే -
హైకోర్టు సూచనతోనే సమ్మె విరమించాం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేశారని జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి అన్నారు. హైకోర్టు సూచన మేరకే తాము సమ్మె విరమించామని అన్నారు. శుక్రవారం వీఎస్టీలోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. తాము అడిగిన 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఆర్టీసీలో భవిష్యత్‌లో యూనియన్లు ఉండవని సీఎం చెబుతున్నారని, వ్యవస్థ ఉన్నంత కాలం ట్రేడ్ యూనియన్లు ఉంటాయని చెప్పారు. డిపోలకు ఇద్దరు చొప్పున కార్మికులను నియమిస్తామని చెబుతున్నారని, ఇది రాజ్యాంగం ప్రకారం చెల్లదన్నారు. కార్మికుల ద్వారా ఓటింగ్ పెట్టి నిర్ణయించాలన్నారు. ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన సమ్మెలు ఎన్నడూ జరగలేదని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సమ్మెలు జరిగాయన్నారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘థ్యాంక్యూ’...
న్యూఢిల్లీ: తీవ్ర కాలుష్యం నగరాన్ని కమ్మేసిన సమయంలో కూడా ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టి20 మ్యాచ్ మాత్రం ఆగలేదు. ఇరు జట్లు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఆటను కొనసాగించాయి. ఒక దశలో రద్దు అవుతుందేమో అనిపించినా... అవాంతరం లేకుండా నిర్ణీత సమయం ప్రకారమే మ్యాచ్ జరిగింది. దాంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఊపిరి పీల్చుకున్నాడు. రెండు జట్లకు కూడా అతను కృతజ్ఞతలు చెప్పాడు. ‘కఠిన పరిస్థితుల మధ్య మ్యాచ్ ఆడినందుకు ఇరు జట్లకు కృతజ్ఞతలు. బాగా ఆడిన బంగ్లా జట్టుకు అభినందనలు’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. మరోవైపు ఢిల్లీ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని బయటకు చెప్పినా... సౌమ్య సర్కార్‌తో పాటు మరో బంగ్లా క్రికెటర్ కాలుష్యం దెబ్బకు తట్టుకోలేక మైదానంలో వాంతి చేసుకున్నట్లు సమాచారం. ‘మహా’ ఆపుతుందా! భారత్, బంగ్లా మధ్య గురువారం రెండో టి20 మ్యాచ్ జరగడంపై సందేహాలు రేగుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన రాజ్‌కోట్ తీవ్రమైన తుఫాన్ ‘మహా’ బారిన పడే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం గుజరాత్ తీరానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాజ్‌కోట్‌పై తుఫాన్ ప్రభావం ఉండవచ్చు. ‘మహా’ కారణంగా 6, 7 (మ్యాచ్ జరిగే రోజు) తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జైదేవ్ షా అన్నారు. -
రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు
రాయ్‌బరేలీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్నీ అందించిన రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి విచ్చేశారు. సోనియా గాంధీ సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారి రాయ్‌బరేలీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం మధ్యాహ్నం ఫర్సాత్ గంజ్ విమానాశ్రయానికి చేరుకున్న సోనియా, ప్రియాంక అక్కడి నుంచి భుయేము అతిథి గృహానికి వెళ్లారని రాయ్‌బరేలీ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి లాల్‌కృష్ణ ప్రతాప్ తెలిపారు. అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రియాంక గాంధీ సమీక్ష నిర్వహించనున్నారని చెప్పారు. ఆహ్వానించిన 2,500 మంది పార్టీ కార్యకర్తలతో సాయంత్రం జరిగే కృతజ్ఞత సమావేశంలో సోనియా, ప్రియాంక పాల్గొంటారని వెల్లడించారు. ఇటివల జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న రాయ్‌బరేలీలో సోనియా గాంధీ మరోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్‌పై సోనియా 1, 67,178 మెజార్టీతో గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా సోనియా ఇదే నియోజకవర్గంలో 3,52,713 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అజయ్ అగర్వాల్‌పై విజయం సాధించారు. -
అంత సమయం ఏదీ!
ఒక ఊరిలో ఒక దేవాలయముంది. ఆ ఊళ్లో ఒక సాధువు ఉండేవాడు. అతను రోజూ తన పొట్టకు సరిపడా భిక్షాటన చేసుకుని మిగతా సమయం అంతా దేవాలయంలో ధ్యానంతో గడుపుతూ, రాత్రి నిద్రపోవటానికి ముందు దేవుని దగ్గరకు వెళ్లి ఏడుస్తూ, ఏదో మొరపెట్టుకుంటున్నట్లుగా భగవంతుణ్ణి వేడుకునే వాడు. ఇది రోజూ గమనిస్తున్న ఆ గుడి పూజారికి ఆ సన్యాసి రోజూ దేవుని ఏమని కోరుకుంటాడో తెలుసుకోవాలనిపించింది. ఒకరోజున ఆ సాధువును సమీపించి ‘‘బాబా! మీరు గొప్ప దైవభక్తి సంపన్నులు. మీకు ‘నా’ అన్న వారు ఎవరూ లేరు. మీరు రోజూ దేవుణ్ణి ఎవరికోసం ప్రార్థిస్తారు? ఏమని ప్రార్థిస్తారు’ అని అడిగాడు. అందుకు ఆ సన్యాసి చిరునవ్వుతో ‘‘నేను ఏమీ అడక్కుండానే ఎంతో కరుణ తో అవసరమైన దానికంటే ఎక్కువగా కురిపిస్తూ నా అవసరాలన్నీ తీర్చాడు భగవంతుడు. ఒక్కొక్క అవసరాన్ని తీర్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా.. అందుకోసమే రోజంతా – నా అవసరం ఎలా తీర్చాడో అందుకు ఒక్కొక్క అవసరానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే, ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నా – ఆయన తీర్చిన నా అన్ని అవసరాలకు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయలేక పోతానేమో అని ఆందోళనగా ఉంది’’ అని సమాధానం చెప్పాడు. పూజారి ఆశ్చర్యంతో ‘‘అయితే మీరు భగవంతుణ్ణి ఏమీ కోరరా?’’ అనడిగాడు. ‘‘భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయటానికే రోజంతా సరిపోతుందే! ఇక కోరికలు కోరే తీరికెక్కడ? అడక్కుండానే అన్ని కోర్కెలు తీరుస్తుంటే తిరిగి కోరికలు తీర్చమని కోరాలా! ఏవి తీర్చాలో ఆయనకు తెలియదా!’’ అన్నాడు. సాధువు సమాధానంతో పూజారిలో జ్ఞానం మేల్కొంది. నిజమైన పూజ అంటే ఏమిటో అర్థమైంది. – డి.వి.ఆర్. -
నా వాదం ధన్యవాదం
కృతజ్ఞతాభావాన్ని దినచర్యలో భాగంగా సాధన చేయాలి. కృతజ్ఞతాభావం కలిగిన మనుషుల మనసు శక్తివంతంగా ఉంటుంది. గౌతమ బుద్ధుడు ఉపకారం చేసిన వారికి అవసరం ఏర్పడినప్పుడు ప్రత్యుపకారం చేయడం, ఉపకారం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం కనీస మానవ ధర్మాలు. ప్రపంచంలోని అన్ని మతాలూ కృతజ్ఞతను ఉత్తమ లక్షణంగా పరిగణిస్తాయి. పంచభూతాల పట్ల, సమస్త ప్రకృతి పట్ల కృతజ్ఞతలు వెలిబుచ్చే అనేక శ్లోకాలు మన ప్రాచీన వాంగ్మయంలో ఉన్నాయి. పురాణేతిహాసాలు రచించిన మహర్షులందరూ ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసిన వారే! ఆధునికుల్లో కృతజ్ఞతాభావం అడుగంటిపోతోంది. మేలు చేసిన వారికి కీడు తలపెట్టే కృతఘ్నుల సంఖ్య పెరిగిపోతోంది. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడమే కాదు, చివరకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారి ఉదంతాలు, జన్మకు మూలమైన పితృదేవతలకు, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు కృతజ్ఞతగా ఘనకార్యాలను సాధించిన వారి ఉదంతాలు మన పురాణాల్లో ఉన్నాయి. ‘కృతజ్ఞతాభావం సుగుణాలన్నింటిలోకి గొప్పది మాత్రమే కాదు, సుగుణాలన్నింటికీ మాతృక వంటిది కూడా’ అని రోమన్ తత్వవేత్త సిసిరో చెప్పడం విశేషం.మానవులకు ఉండే రకరకాల భావోద్వేగాలలో కృతజ్ఞతాభావం కూడా ఒకటి. సర్వమత గ్రంథాలు, ప్రాక్ పశ్చిమ పురాణేతిహాసాలలో కృతజ్ఞతాభావం గురించిన ప్రస్తావనలు చాలానే ఉన్నాయి. కృతజ్ఞతాభావాన్ని గొప్ప సుగుణంగా, మానవ విలువల్లో అతి ముఖ్యమైనదిగా మన పూర్వీకులు పరిగణించేవారు. ఒకనాటి ఆచార్యులు తమ శిష్యులకు కృతజ్ఞతాభావం ఆవశ్యకతను బోధించేవారు. శిష్యులు కూడా గురువుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండేవారు. ఆధునిక విద్యావ్యవస్థలో కృతజ్ఞతాభావాన్ని బోధించే గురువులూ, గురువుల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్న శిష్యులూ అరుదైపోయారు. ఆధునిక మనస్తత్వ శాస్త్రం అభివృద్ధి చెంది శతాబ్దం గడిచినా, కృతజ్ఞతాభావంపై ఇటీవలి కాలం వరకు ప్రత్యేకంగా అధ్యయనాలు, పరిశోధనలు చేసిన దాఖలాల్లేవు. ఇరవై ఒకటో శతాబ్ది ప్రారంభమైన తర్వాతనే మనస్తత్వ శాస్త్ర నిపుణులు కృతజ్ఞతాభావంపై పరిశోధనలు ప్రారంభించారు. కృతజ్ఞతాభావానికి సంబంధించిన కొన్ని గాథలు, ఇంకొన్ని విశేషాలు ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా... ఆజన్మాంతం కృతజ్ఞత మరువని కర్ణుడు మన పురాణాల్లో కృతజ్ఞతాభావానికి నిలువెత్తు రూపంగా చెప్పుకోవాలంటే కర్ణుడి గురించే చెప్పుకోవాలి. తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన దుర్యోధనుడి పట్ల కృతజ్ఞతను ఆజన్మాంతం మరువలేదు. ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం ముగించుకున్న కౌరవ పాండవ రాకుమారులకు కురుసభలో క్షాత్రపరీక్ష జరిగింది. అందులో తాను కూడా పాల్గొంటానని వచ్చాడు కర్ణుడు. క్షత్రియులు తప్ప అన్యులకు ఆ పరీక్షలో పాల్గొనే అర్హత లేదని, సూతపుత్రుడైన కర్ణుడిని క్షాత్రపరీక్షలో పాల్గొనేందుకు అనుమతించలేనని కరాఖండిగా చెప్పాడు ద్రోణుడు. అప్పటికే పాండవులపై స్పర్థతో రగిలిపోతున్న దుర్యోధనుడు ఇదే తగిన అవకాశంగా తలచాడు. ఇది క్షాత్రపరీక్షే కాని కులపరీక్ష కాదంటూ గురువుకు ఎదురు చెప్పాడు. తన కుల పరంపరను ఏకరువు పెడుతూ ఇంతకీ క్షత్రియులంటే ఎవరనే ధర్మసందేహాన్ని లేవనెత్తాడు. క్షత్రియ కులంలోనైనా పుట్టి ఉండాలి లేదా రాజ్యం ఏలుతూనైనా ఉండాలి. అలాంటి వాళ్లనే క్షత్రియులుగా పరిగణించడం జరుగుతుందని సభలోని కురువృద్ధులు ముక్తకంఠంతో తీర్మానించారు. రాజ్యం లేకపోవడమే కర్ణుడికి అనర్హత అయితే, ఇప్పుడే అతడికి రాజ్యాభిషిక్తుడిని చేస్తానంటూ కురు సామ్రాజ్యంలోని భాగమైన అంగరాజ్యానికి అభిషిక్తుడిన చేస్తాడు దుర్యోధనుడు. నిండుసభలో తన ఆత్మగౌరవాన్ని కాపాడిన దుర్యోధనుడికి కర్ణుడు ఆనాటి నుంచి ఆత్మబంధువుగా మారాడు. దుర్యోధనుడు తన మీద పెట్టుకున్న ఆశలను ఎరిగిన వాడై అడుగడుగునా అతడికి తోడుగా నిలిచాడు. దుర్యోధనుడి కోరిక మేరకు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని అంతమొందించడానికి సర్వశక్తులూ సమకూర్చకున్నాడు. సహజ కవచ కుండలాలను తన నుంచి దానంగా తీసుకున్న ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని చాలాకాలం అర్జునుడి కోసమే దాచిపెట్టుకున్నాడు. ఘటోత్కచుడు కురుసేనపై విరుచుకుపడి బీభత్సం సృష్టించడంతో కర్ణుడి తలరాత మారింది. ఇంద్రుడి శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించి, అతడిని అంతమొందించాల్సి వచ్చింది. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా కడవరకు యుద్ధక్షేత్రంలో నిలిచి పోరాడాడు. చివరకు అర్జునుడి చేతిలో ప్రాణాలు విడిచాడు. దానగుణ సంపన్నుడైన కర్ణుడు కృతజ్ఞతకు మారుపేరుగా మహాభారతంలో నిలిచిపోయాడు. జటాయువు పట్ల రాముడి కృతజ్ఞత పక్షిరాజైన జటాయువు దశరథుడికి మిత్రుడు. రావణుడు సీతను అపహరించి తీసుకుపోతుండగా చూసి అతడితో తలపడ్డాడు. రావణుడితో హోరాహోరీ పోరాడి అతడి రథాన్ని కూల్చేసి, సారథిని చంపాడు. వృద్ధుడు కావడంతో రావణుడి ధాటి ముందు నిలువలేకపోయాడు. రావణుడు కత్తిదూసి జటాయువు రెక్కలు తెగనరికేశాడు. జటాయువు కుప్పకూలగానే పుష్పకవిమానంలో సీతను తీసుకుని లంకకు వెళ్లిపోయాడు. సీత జాడ కోసం వెతుకుతున్న రామలక్ష్మణులు మార్గమధ్యంలో రెక్కలుతెగి నెత్తురోడుతూ నేలకూలి ఉన్న జటాయువును చూశారు. అతడి వద్దకు వెళ్లి పలకరించారు. రావణుడు సీతను ఎత్తుకుపోతుండగా అతడిని అడ్డగించానని, తన రెక్కలు నరికేసిన రావణుడు సీతను దక్షిణ దిశగా ఆకాశమార్గాన తీసుకుపోయాడని చెప్పాడు. రెక్కలు తెగిన జటాయువు రాముడి సమక్షంలోనే ప్రాణాలు విడిచాడు. సీతను కాపాడటం కోసం రావణుడిని ఎదిరించిన జటాయువు పట్ల కృతజ్ఞతాభావంతో రాముడు అతడికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపి, మోక్షాన్ని అనుగ్రహించాడు. తండ్రి దశరథుడికి స్వయంగా అంత్యక్రియలు జరిపించలేకపోయిన రాముడు తండ్రికి మిత్రుడైన జటాయువుకు అంత్యక్రియలు జరిపి తృప్తిచెందుతాడు. పాండవుల పట్ల మయుడి కృతజ్ఞత శరణు కోరినంతనే తనకు, తన మిత్రుడైన తక్షకుడికి కృష్ణార్జునులు అభయమిచ్చి కాపాడినందుకు కృతజ్ఞతగా మయుడు ఇంద్రప్రస్థంలో అద్భుతమైన మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు. మహాభారతంతో మయుడి ఉదంతానికి నేపథ్యం ఖాండవదహన ఘట్టం. అగ్నిదేవుడికి అజీర్తి చేయడంతో ఔషధమూలికలతో సమృద్ధమైన ఖాండవవనాన్ని దహనం చేసి రోగ విముక్తి పొందాలని అనుకుంటాడు. కృష్ణార్జునుల సహాయం కోరుకుంటాడు. ఖాండవవనంలో ఇంద్రుడి మిత్రుడైన తక్షకుడు నివాసం ఉంటాడు. తక్షకుడు అక్కడ ఉంటున్నందున ఖాండవవన రక్షణ బాధ్యతను ఇంద్రుడు స్వయంగా చూసుకుంటాడు. తక్షకుడికి ఇంద్రుడి అండ ఉందని, అందువల్ల తాను ఖాండవ వనాన్ని దహనం చేయలేకపోతున్నానని కృష్ణార్జునులకు చెబుతాడు అగ్నిదేవుడు. శరవేగంగా దౌడుతీసే రథాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తే కృష్ణుడి సహాయంతో తప్పకుండా ఖాండవ దహనానికి తోడ్పడతానని, వెయ్యిమంది ఇంద్రులు వచ్చినా వెనుకాడబోనని అర్జునుడు మాట ఇస్తాడు. అర్జునుడికి కపిధ్వజం గల రథాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని, అక్షయతూణీరాన్ని ఇస్తాడు అగ్నిదేవుడు. కృష్ణార్జునులు తోడు రాగా ఖాండవవనానికి చేరుకుని, ఆ వనాన్ని దహించడం ప్రారంభిస్తాడు.ఖాండవవనాన్ని అగ్నిదేవుడు దహిస్తున్న సంగతి తెలుసుకున్న ఇంద్రుడు తన పరివారాన్ని పంపించగా, అర్జునుడు గాండీవం తీసుకుని, శర పరంపరను కురిపించి వారిని తరిమి కొడతాడు. తన పరివారం అర్జునుడి చేతిలో ఓటమి చెంది తిరిగి రావడంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు అగ్నికీలలను ఆర్పివేసేందుకు ఖాండవ వనంపై కుండపోతగా వర్షం కురిపిస్తాడు. ఖాండవ వనంలోనికి పైనుంచి ఒక్క నీటి చుక్కైనా చొరబడని రీతిలో బాణాలతోనే పందిరి నిర్మిస్తాడు అర్జునుడు. అగ్ని యథేచ్ఛగా తన దహన కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. అగ్నిదేవుడి విజృంభణకు తాళలేక తక్షకుడు అక్కడి నుంచి పారిపోయి రాక్షస శిల్పాచార్యుడు, తన మిత్రుడు అయిన మయుడిని శరణు వేడుకుంటాడు. కృష్ణార్జునులను ఎదిరించలేనంటూ మయుడు తక్షకుడిని వెంటబెట్టుకుని కురుక్షేత్రం వైపు పారిపోతుండగా, కృష్ణార్జునులు వారిని వెంబడిస్తారు. ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలంటే కృష్ణార్జునులను శరణు వేడటమే దిక్కని తలచిన మయుడు తన రథం దిగి, వారికి ఎదురేగి శరణు వేడుకుంటాడు. అభయమిచ్చిన కృష్ణార్జునులు మయుడిని, అతడి మాట మీద తక్షకుడిని విడిచిపెడతారు. ఇందుకు కృతజ్ఞతగా మయుడు తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి ముల్లోకాల్లో మరెక్కడా లేని రీతిలో చిత్ర విచిత్రమైన సొబగులతో చూపరులను విస్మయపరచే రీతిలో అత్యద్భుతమైన మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇస్తాడు. మహాభారతంలో మయసభ పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే! కృతజ్ఞతాభావం కలిగించే లాభాలు కృతజ్ఞతాభావం వల్ల ఎన్నో లాభాలు ఉన్నట్లు ఆధునిక పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. సానుకూల భావనల్లో కృతజ్ఞతాభావం కీలకమైనదిగా ఆధునిక మనస్తత్వ శాస్త్ర నిపుణులు గుర్తించారు. ఇరవై ఒకటో శతాబ్ది ప్రారంభం నుంచి కృతజ్ఞతాభావంపై ప్రత్యేక దృష్టి సారించి జరిపిన పరిశోధనలు పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృతజ్ఞతాభావం వల్ల కలిగే లాభాలపై ఇటీవలి పరిశోధనలు వెల్లడించిన వాస్తవాలు ఇవీ... ♦ కృతజ్ఞతాభావం లేనివారి కంటే కృతజ్ఞతాభావం ఉన్నవారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారి గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. రక్తపోటు అదుపులో ఉంటుంది. ♦ కృతజ్ఞతాభావం కలిగి ఉన్నవారు ఎప్పుడైనా మానసిక కుంగుబాటుకు లోనైనా, త్వరలోనే దాని నుంచి బయటపడగలుగుతారు. పనిభారం పెరిగినా త్వరగా అలసట చెందరు. ♦ కృతజ్ఞతాభావం ఉన్నవారు పరిస్థితుల పట్ల సానుకూలంగా స్పందించగలుగుతారు. అవసరమైనప్పుడు తోటివారికి సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తారు. ♦ కృతజ్ఞతాభావం ఎక్కువగా ఉన్నవారు చిన్నచిన్న లోటుపాట్లకు పెద్దగా బాధపడకుండా జీవితంలో సంతృప్తిని పొందగలుగుతారు. ♦ కృతజ్ఞతాభావం ఎక్కువగా ఉన్నవారు తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇతరుల కంటే సంతోషంగా ఉంటారు. ♦ కృతజ్ఞతాభావం ఉన్నవారు ఇతరులతో త్వరగా కలిసిపోగలుగుతారు. తమపై నమ్మకం ఉంచిన వారితో దీర్ఘకాలం అనుబంధాన్ని కొనసాగించగలుగుతారు. గ్రాటిట్యూడ్ రాక్ ఇదేదో విలువైన రత్నమేమీ కాదు. మామూలు గులకరాయి. నదీ ప్రవాహాల ఒడ్డునైనా, వీధుల్లో మరెక్కడైనా కాస్త నునుపుదేరిన ఏదైనా చిన్న గులకరాయి. ‘ది సీక్రెట్’ అనే హాలీవుడ్ సినిమా పుణ్యాన ‘గ్రాటిట్యూడ్ రాక్’ ఒక సెంటిమెంటల్ వస్తువుగా మారింది. ‘ది సీక్రెట్’ సినిమాలోని నటుడు లీ బ్రూవర్ విలక్షణ పాత్ర పోషించాడు. ఆ పాత్రలో లీ బ్రూవర్ ఒక గులకరాయిని జేబులో వేసుకుని తిరుగుతూ ఉంటాడు. దానిని ఎప్పుడు తాకినా అతడికి కృతజ్ఞతాభావాన్ని రేకెత్తించే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ‘ది సైలెన్స్’ 2006లో విడుదలైంది. ఈ సినిమా వచ్చిన తర్వాత నునుపుదేరిన గులకరాళ్లను జేబులో వేసుకుని తిరగడం కొందరికి ఫ్యాషన్‌గా మారింది. అలా మొదలైంది ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం ఎలా మొదలైందంటే... హవాయిలోని ఈస్ట్–వెస్ట్ సెంటర్లో 1965లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. ప్రపంచంలోని అద్భుతమైన విషయాల పట్ల, మేలు చేసిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతలు వెల్లడించుకోవడానికి ఒక రోజు ఉంటే బాగుంటుందనే ఆలోచనకు ఆ సదస్సులోనే అంకురార్పణ జరిగింది. సదస్సుకు నాయకత్వం వహించిన భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ చిన్మయ్ కృతజ్ఞతా దినోత్సవం ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ సరేనని సమ్మతించాయి. దాని ఫలితంగానే చాలా దేశాలు 1966 సెప్టెంబర్ 21న మొట్టమొదటిసారిగా ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం పాటించాయి. ఇది జరిగిన పదకొండేళ్లకు... అంటే 1977 సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి మెడిటేషన్ గ్రూప్ శ్రీచిన్మయ్ను ఘనంగా సత్కరించింది. నాటి నుంచి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవాన్ని అధికారికంగా పాటించడం మొదలైంది. ప్రకృతిపై కృతజ్ఞతతోనే ఆ ఉద్యమం ప్రకృతి పట్ల అంతులేని కృతజ్ఞత చరిత్రలో నిలిచిపోయే ఉద్యమానికి దారితీసింది. అటవీ సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతం అప్పట్లో ఉత్తరప్రదేశ్‌లో ఉండేది. ఉత్తరప్రదేశ్ అటవీశాఖ 1973లో సైమన్ కంపెనీకి చమోలీ జిల్లా గోపేశ్వర్ ప్రాంతంలో ఉన్న మూడువందల భారీ వృక్షాలను నరికివేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇన్నాళ్లూ తమకు జీవనోపాధి కల్పిస్తూ వస్తున్న అటవీ సంపదను కాపాడుకునేందుకు బిష్ణోయి తెగకు చెందిన గిరిజన మహిళలు నడుం బిగించారు. కంపెనీ మనుషులు చెట్లను నరకడానికి వీలులేకుండా చెట్లను ఆలింగనం చేసుకున్నారు. ‘ఇక్కడి చెట్లను నరకాలంటే ముందు మమ్మల్ని నరకండి’ అంటూ ముక్తకంఠంతో నినదించారు. అహింసా మార్గంలో గిరిజన మహిళలు చేపట్టిన ఈ ఉద్యమం ‘అటవీ సత్యాగ్రహం’గా పేరుపొందింది. ఆలింగనం చేసుకోవడాన్ని అక్కడి భాషలో ‘చిప్కో’ అంటారు. అందువల్ల ఇది ‘చిప్కో ఉద్యమం’గా పేరుపొందింది. సుందర్‌లాల్ బహుగుణ ముందుకు వచ్చి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడంతో ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించింది. అటవీ సంపదను కాపాడుకునేందుకు దేశం నలుమూలలా గిరిజనులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సుందర్‌లాల్ బహుగుణ హిమాలయాల దిగువనున్న అటవీ ప్రాంతంలో దాదాపు ఐదువందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. హిమాలయ ప్రాంతంలో వృక్షాల నరకివేతను నిషేధించాలంటూ ఆయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి విజ్ఞప్తి చేయడంతో, ఆమె పదిహేనేళ్ల పాటు చెట్ల నరికివేతను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెండితెరపై కృతజ్ఞతాభావం కృతజ్ఞతాభావంతో త్యాగాలు చేసిన పాత్రలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. మన తెలుగు సినిమాల్లో పాత్రల్లోని కృతజ్ఞతాభావమే కేంద్రంగా చేసుకున్న కథతో రూపొందిచిన వాటిలో ‘శంకరాభరణం’ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులోని కథానాయకుడు శంకరశాస్త్రి సంగీత విద్వాంసుడు. వేశ్య కూతురైన తులసి ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. ఆమె తల్లి మాత్రం ఆమె వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఈలోగా ప్రతినాయకుడు తులసిపై అత్యాచారం చేసి, శంకరశాస్త్రిని తూలనాడతాడు. తులసి అతడిని హతమార్చేస్తుంది. దిక్కులేని స్థితిలో ఉన్న తులసికి శంకరశాస్త్రి అండగా నిలుస్తాడు. ఊరు ఊరంతా తనను చిన్నచూపు చూసినా వెనుకాడడు. తులసి ఒక కొడుకును కంటుంది. ఆ కొడుకును శంకరశాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరుస్తుంది. తనకు అండగా నిలిచిన శంకరశాస్త్రిపై కృతజ్ఞతాభావంతో ఆమె ఆయనకు తెలియకుండా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటుంది. తులసి కొడుకును తన సంగీత వారసుడిగా ప్రకటించి శంకరశాస్త్రి కన్నుమూస్తాడు. శంకరశాస్త్రి పాదాల చెంతనే తులసి ప్రాణాలు విడిచిపెడుతుంది. కృతజ్ఞతాభావం గురించి పెద్దల మాటలు సౌందర్యభరితమైన అన్ని కళలు, గొప్ప కళాఖండాల సారాంశం కృతజ్ఞతాభావమే! – ఫ్రెడెరిక్ నీషే, జర్మన్ తత్వవేత్త, సాంస్కృతిక విమర్శకుడు కృతజ్ఞతాభావం గొప్ప వ్యక్తిత్వాలకు ఆనవాలు. – ఈసోప్, ప్రాచీన గ్రీకు కథకుడు కృతజ్ఞతాభావం ఆత్మలో ఉద్భవించే దివ్యపుష్పం. – హెన్రీ వార్డ్ బీచర్, అమెరికన్ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు ఒక మనిషిలో కృతజ్ఞతాభావం లేకుంటే ఆ మనిషిలో మానవ లక్షణమేదో లోపించినట్లే! – ఎలీ వీసెల్, అమెరికన్ రచయిత సాయం చేసిన వారి జ్ఞాపకం మెదడులో కాకుండా మనసులో నిక్షిప్తమై ఉండటమే కృతజ్ఞతాభావం. – లయనెల్ హ్యాంప్టన్, అమెరికన్ సంగీతకారుడు, నటుడు కృతజ్ఞత ఒక బాధ్యత. దానిని నిర్వర్తించాల్సిందే. అయితే ఎవరికీ దానిని ఆశించే అధికారం లేదు. – రూసో, జర్మన్ తత్వవేత్త ప్రతీకారం లాభసాటిదే కావచ్చు. కృతజ్ఞత మాత్రం విలువైనది. – ఎడ్వర్డ్ గిబ్బన్, ఇంగ్లిష్ చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు కృతజ్ఞతాభావాన్ని గొప్ప సంపదగా పరిగణిస్తాను. ఎవరిలోనైనా ఆ భావన లేకుంటే అది వారి వ్యక్తిత్వ లోపమే. – మార్షల్ గోల్డ్‌స్మిత్, అమెరికన్ రచయిత, నాయకత్వశిక్షకుడు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసే చాలామంది మనుషులు భవిష్యత్తులో మరిన్ని ఉపకారాలను రహస్యంగా ఆశిస్తూ ఉంటారు. – ఫ్రాంకోయిస్ డి లా రోష్ఫుకాల్డ్, ఫ్రెంచి రచయిత – పన్యాల జగన్నాథదాసు -
మీకోసమే వచ్చారు.. కృతజ్ఞతలు తెలపండి!
ఇండోర్: అసలే కుమార్తెపై అఘాయిత్యంతో కుమిలిపోతున్న తల్లిదండ్రులతో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అమానవీయంగా ప్రవర్తించారు. ‘మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన ఎంపీకి కృతజ్ఞతలు తెలపండి’ అంటూ తీవ్రమైన బాధలో ఉన్న కుటుంబసభ్యుల్ని ఆదేశించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మంద్‌సౌర్‌లో జూన్ 26న ఓ మైనర్ బాలిక(8)పై ఇద్దరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఇండోర్ ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సుదర్శన్ గుప్తా, మంద్సౌర్ ఎంపీ సుధీర్‌తో కలసి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అత్యుత్సాహం చూపిన ఎమ్మెల్యే సుదర్శన్.. ‘ఎంపీ సుధీర్‌కు కృతజ్ఞతలు తెలపండి. ఆయన మిమ్మల్ని కలుసుకునేందుకే ప్రత్యేకంగా ఆస్పత్రికి వచ్చారు’ అని చెప్పారు. దీంతో తెల్లబోయిన బాధితురాలి తల్లిదండ్రులు ఇద్దరికీ చేతులెత్తి దండం పెట్టారు. ఇంతలో మీడియాను గమనించిన సుదర్శన్.. ‘ఇంకేమైనా అవసరముంటే చెప్పండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన బాధితురాలి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు మైనర్ బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. -
సచిన్‌కు సీఎం కృతజ్ఞతలు
జమ్మూకశ్మీర్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.40 లక్షలను కుప్వారా జిల్లాలోని ఓ పాఠశాలకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా తన సందేశం వెల్లడించారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా మన అందరికీ సచిన్ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆమె అన్నారు. ద్రుగ్‌ముల్లా గ్రామంలో 2007లో స్థాపించిన ఇంపీరియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఒక్కటే పదో తరగతి వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాల. ఈ పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సచిన్ కేటాయించిన నిథులతో తరగతి గదులు, లాబొరేటరీ, మూత్రశాలలు, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లను నిర్మించనున్నారు. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోని సూళ్లకు ఇప్పటికే సుమారు 7.5 కోట్ల రూపాయలను సచిన్ కేటాయించాడు. -
జీవితాంతం గుర్తుంచుకుంటా : రాజమౌళి
ఐదేళ్లుగా రాజమౌళి చేస్తున్న యజ్ఞం పూర్తయి బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఎదురైన ఇబ్బందులపై రాజమౌళి స్పందించాడు. ఆదివారానికి రిలీజ్ హడావిడి కాస్త తగ్గటంతో తన సోషల్ మీడియా పేజ్ లో తనకు అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. 'బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ కు రిలీజ్ సమయంలో ఇబ్బందులు ఎదురవ్వటం సహజం. బాహుబలి అభిమానుల ప్రేమ, సపోర్ట్ మూలంగానే ఆ ఇబ్బందులన్నింటినీ యూనిట్ దాటగలిగింది. గత ఐదేళ్లుగా మాతో ఉండి, ప్రతీ సందర్భంలో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అందరికీ థ్యాంక్స్. మీరు మా మిగతా జీవితమంతా గుర్తుండి పోయే ఘనవిజయాన్ని అందించారు' అంటూ ప్రేక్షకులకు ట్వీట్ల రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు రాజమౌళి. Its only natural that a big project like Baahubali faces hurdles during release. I must say that the enormous love and support that was — rajamouli ss (@ssrajamouli) 30 April 2017 given by Baahubali Fans made us cruise through the obstacles. Thank you everyone who have been with us for the past 5 years encouraging us — rajamouli ss (@ssrajamouli) 30 April 2017 at every turn. You have given us such a big success that we can keep it in our hearts for the rest of our lives. 🙏🙏🙏🙏 — rajamouli ss (@ssrajamouli) 30 April 2017 -
అభివృద్ధికి సహకరించిన ఎంపీలకు కృతజ్ఞతలు
కర్నూలు: దత్తత గ్రామం కప్పట్రాళ్ల అభివృద్ధికి సహకరించినందుకు కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్.పి.వై.రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌లకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కప్పట్రాళ్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం(మరమ్మతులు) నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి తన కోటా నిధుల నుంచి రూ.8.50 లక్షలు నిధులు మంజూరు చేశారన్నారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ రూ.25 లక్షల నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించారని తెలిపారు. కొత్తగా నిర్మించిన జిల్లాపరిషత్ హైస్కూల్ ప్రహరీకి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక రూ.10 లక్షల నిధులు విడుదల చేశారని వెల్లడించారు. రైతుసంఘం కార్యాలయ నిర్మాణానికి(2 గదులు) మంత్రాలయం మఠాధిపతులు ముందుకు వచ్చారని వెల్లడించారు. ఆయా పనులు వచ్చే నాలుగు నెలల్లో పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
సీఎంకు ‘కొత్త’ కృతజ్ఞతలు
కొత్తగూడెం: కొత్తగూడెం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా విడుదల చేయడంపట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావుతోపాటు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కొత్తగూడెం జిల్లాలో మరిన్ని మండలాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. -
ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు:గోపిచంద్
-
గజ ఈతగాళ్లకు అభినందన
పాన్‌గల్/వీపనగండ్ల: చెల్లపాడు ఘాట్‌లో మంగళవారం ఓ భక్తురాలు పుణ్యస్నానం చేస్తుండగా ఆమె పుస్తెల తాడుకు ఉన్న బంగారు తాళిబొట్టు బిళ్లలు నీటమునిగాయి. ఆందోళన చెందిన ఆమె, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్లకు సమాచారం ఇచ్చారు. అరగంటపాటు శ్రమించిన ఈతగాళ్లు తాళిబొట్టుబిళ్లలను వెతికిపట్టుకున్నారు. తహసీల్దార్ ప్రభాకర్‌రావు ఈతగాళ్లను అభినందించారు. రూ.116 నగదును అందజేశారు. తన బొట్టుబిళ్లలు వెదికిచ్చినందుకు భక్తురాలు ఈతగాళ్లకు రూ.500 నగదు ఇచ్చారు. -
సహారా ‘కృతజ్ఞత’ యాత్ర...
సహారా ఉద్యోగులు, ఇన్వెస్టర్లకు కృతజ్ఞతలు తెలిపే ‘అభార్ యాత్ర’ ను సహారా ఇండియా పరివార్ చైర్మన్, ఎండీ సుబ్రతా రాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో జరిగిన కార్యక్రమంలో వేల మంది సహారా ఉద్యోగులను ఉద్దేశించి సుబ్రతా రాయ్ ప్రసంగించారు. -
క్రిష్‌కు కిక్కిచ్చిన 'కంచె'
హైదరాబాద్: కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న తరుణంలో విలువలతో కూడిన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ కెరీర్లో మరో మెట్టు పైకి ఎక్కాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన కంచె అనుకున్నట్టుగానే విజయాన్ని సాధించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును దక్కించుకుంది. దీంతో కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డులలో బాహుబలికి ఉత్తమ జాతీయ చిత్రం, ఇటు కంచె సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు ద్వారా టాలీవుడ్ పేరును సగర్వంగా నిలిచింది. తన సినిమాకు జాతీయ అవార్డు రావడం పట్ల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఉబ్బితబ్బిబవుతున్నారు. అవార్డు సాధించే సత్తా ఉన్నప్పటికీ, ఈ పురస్కారాన్ని తాను ఊహించలేదని మీడియాతో తెలిపారు. కానీ ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో 'కంచె'అత్యంత అసాధారణ చిత్ర మన్నారు. దీనికోసం చాలా కష్టపడ్డాడనని ఆయన చెప్పారు. అటు తన రెండో సినిమాగా ప్రయోగాత్మక సినిమాను ఎంపికచేసుకొని సాహసం చేసిన టాలీవుడ్ మెగాహీరో తన తొలి అవార్డును ఖాతాలో వేసుకున్నాడు. దీనిపై వరుణ్ తేజ్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు సాధించిన కంచె సినిమాలో నటించడం పట్ల ట్విట్టర్లో సంతోషం వ్యక్తంచేశాడు. కంచె దర్శకుడు కెప్టెన్ క్రిష్‌కు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశాడు. కాగా మెగా వారసుడు వరుణ్‌తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమ, యుద్ధం రెండూ ఒకటే.. అంటూ ప్రేమలోని యుద్ధాన్ని విభిన్నంగా ఆవిష్కరించాడు క్రిష్. Humbled to be part of a national award-winning film thanks to the captain of #kanche @DirKrish and our entire team!!.. Thank you all! — Varun Tej (@IAmVarunTej) 28 March 2016 -
కొండ గుండెల్లో గునపం
గుప్త నిధుల కోసంకొండలను తవ్వేస్తున్న దుండగులు భారీ జనరేటర్లు, విద్యుత్ లైట్ల వెలుగులో 200 అడుగులుపైగా తవ్వకాలు డిటోనైటర్లతో కొండలు పేల్చివేత కొండవీడు కొండల గుండెల్లో గుప్త నిధుల అత్యాశాపరులు గునపాలు దించుతున్నారు.. మంత్రగాళ్ల మాయమాటలు విని 200 అడుగుల లోతు వరకూ యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. జిలెటిన్ స్టిక్స్ సాయంతో కొండను పిప్పి పిప్పి చేసేస్తున్నారు..అర్ధరాత్రి వేళ ఆయుధాలు ధరించి.. ఆ ప్రాంతం వైపు ఎవరి కన్నూ పడకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.విచ్చలవిడిగా పేలుడు పదార్థాలు వినియోగిస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారులు, పోలీసులు మొద్దు నిద్ర నటిస్తున్నారు. గుంటూరు రూరల్ : కొద్ది నెలలుగా వెంగళాయపాలెం సిలువకొండ, ఓబులునాయుడుపాలెం, పేరేచర్ల, కైలాసగరి, కొండవీడు కోట ప్రాంతాలతోపాటు కొండవీడు పరిధిలోని కొండల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారు. 10 నుంచి 20 మంది సభ్యులు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో సంచరిస్తున్నారు. వారితోపాటు తవ్వకాలకు అవసరమైన ఆయుధాలు, భోజన వసతికి నిత్యావసర సరుకులు తీసుకెళుతున్నారు. రాత్రి 10 గంటల నుంచి శతాబ్దాల చరిత్ర కలిగిన కోటల బూరుజులు, దావానాలను పగలగొడుతున్నారు. మూడు నెలల క్రితం తవ్వకాల్లో కొందరు వ్యక్తులకు మూడు పంచలోహ విగ్రహాలు దొరికాయని, వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతున్నారు. అత్యాధునిక స్కానర్లు ఉపయోగించి భూమిలో దాగి ఉన్న నిధులను గుర్తిస్తున్నారు. విచిత్ర చిత్రాలు, వింత శబ్దాలు, పూజలతో అటు వైపు ఎవరినీ రాకుండా భయపెడుతున్నారు. భారీ స్థారుులో జిలెటిన్ స్టిక్‌లు, జనరేటర్లు, డ్రిల్లిగ్ మిషన్ల సాయంతో తవ్వకాలు చేస్తున్నారు. భారీ జనరేటర్లను కొండపై గుంటలను తీసి మట్టిలో కప్పి( సౌండ్ రాకుండా) దాని ద్వారా తవ్వకాలు నిర్వహించే గుహల్లోకి ప్రత్యేక విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. విద్యుత్ లైట్ల వెలుగులోనే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు బయటకు వస్తున్నాయంటే దాని వెనుక పలువురు పెద్దలు ఉన్నారని సమాచారం. స్థానికం కొందరిని ప్రలోభాలకు గురి చేసి వారిని సైతం అవసరాలకు వినియోగించుకుంటున్నారు. కొండపైనే సుమారు 200 అడుగుల లోతు గుహల్లోకి దిగేందుకు తాళ్ల సాయంతో మంచెలు, నిచ్చెనలు ఏర్పాటు చేసుకున్నారు. మారణాయుధాలతో సంచారం ఈ కొండల వైపు ఎవరైనా వస్తారనే అనుమానంతో దుండగులు మారణాయుధాలు ధరించి సంచరిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులు కొండవైపు వెళ్లేందుకు జంకుతున్నారు. తవ్వకాల సమయంలో అటు వైపు వెళితే ప్రాణాలకు ముప్పు వాటిల్లడం ఖాయం. అధికారులకు తెలిసే...? కొండల్లో తవ్వకాల గురించి పోలీసు, అటవీ శాఖాధికారులకు తెలిసినా కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. రెండు శాఖల్లో కింది స్థాయి సిబ్బంది ద్వారా పెద్ద మొత్తాల్లో మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. -
మహేశ్, ప్రభాస్‌లకు థ్యాంక్స్!
ఇద్దరు స్టార్ హీరోలు ఓ సినిమాను ప్రమోట్ చేస్తే ఇంకేం కావాలి? కావల్సినంత పబ్లిసిటీ. ‘భలే మంచి రోజు’ విషయంలో ఇదే జరిగింది. సుధీర్‌బాబు హీరోగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శశిధర్‌రెడ్డి, విజయ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు, ప్రభాస్ చేసిన ప్రచారం చాలా ఉపయోగపడింది. ఈ విషయం గురించి నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం ఆడియో విడుదలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మహేశ్‌బాబు మా ట్రైలర్‌ను మెచ్చుకున్నారు. అలాగే ప్రభాస్ అయితే మా సినిమాకు సంబంధించిన విశేషాలు స్వయంగా అడిగి తెలుసుకుని, మా ప్రయత్నాన్ని అభినందించారు. ఈ ఇద్దరూ ఇచ్చిన సపోర్ట్ మా సినిమా మీద అంచనాలను పెంచింది. అందుకే మహేశ్, ప్రభాస్‌లకు చాలా థ్యాంక్స్. ఈ చిత్రం అన్నివర్గాల వారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
థాంక్యూ సర్..నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని
న్యూఢిల్లీ: పాకిస్తాన్ గజల్ మాస్ట్రో గులాం అలీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి డిసెంబర్ లో ఢిల్లీలో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంగీకరించినందుకు ఆయన థాంక్స్ చెప్పారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ తన సోషల్ మీడియా అకౌంట్లో శుక్రవారం షేర్ చేశారు. గులాం అలీ సాబ్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. మీతో మాట్లాడ్డం చాలా సంతోషంగా ఉంది అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్ చేశారు. కాగా ప్రఖ్యాత గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ముంబై, పుణే నగరాలలో జరిగే సంగీత కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే శివసేన బెదిరింపుల నేపథ్యంలో ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో తమ నగరంలో కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ ఢిల్లీనేత గులాం అలీ ఆహ్వానించారు. దీంతో భారత్‌లోని అభిమానుల అలరించేందుకు డిసెంబర్లో కన్సర్ట్ నిర్వహించనున్నట్టు అలీ ప్రకటించారు. Ghulam Ali Sahib. Hum apke bahut bade fan hain. Abhi apse baat karke bahut acha laga. Thanks for agreeing to do a program in Delhi in Dec. — Arvind Kejriwal (@ArvindKejriwal) October 9, 2015 -
సూర్యకు థ్యాంక్స్ చెప్పుకోవాలి
సూర్యది చాలా పెద్ద మనసు. ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటున్నారు నటి శ్రుతీహాసన్. ఈమె ఇప్పుడు చాలా పాపులర్ హీరోయిన్. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషలలో ప్రముఖ హీరోలతో వరస పెట్టి నటించేస్తున్నారు. మధ్య మధ్యలో ఐటమ్ సాంగ్స్‌లోనూ దుమ్ము రేపుతున్నారు. తెలుగు చిత్రం ఆగడులో ఓ ఐటమ్ సాంగ్‌లో అందాలారబోతతో అదిరే స్టెప్స్ వేసి ఆ పాటకు యమ క్రేజ్ తీసుకొచ్చారు. అంతే కాదు ఒక నాటి ఐటమ్ సాంగ్స్‌కే చిరునామా అనేంతగా పేరు గడించిన నటి జయమాలిని ప్రశంసలను కూడా అందుకున్నారు. తాజాగా నాగార్జున, కార్తీ నటిస్తున్న చిత్రంలో కూడా శ్రుతీహాసన్ ఐటమ్ సాంగ్ చూడొచ్చు అంటున్నారు. శ్రుతీ కోలీవుడ్‌లో పరిచయమైన చిత్రం 7ఆమ్ అరివు అన్న విషయం తెలిసిందే. ఇందులో హీరో సూర్య. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ పాత్ర సూర్య పాత్రకు ధీటుగా ఉంటుంది. ఇకపోతే తాజాగా మరోసారి సూర్యతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు శ్రుతీ. కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సింగం-3లో ఈ క్రేజీ జంట నటించనున్నారు. ఇందులోనూ శ్రుతీహాసన్‌కు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అట. దీని గురించి శ్రుతీహాసన్ తెలుపుతూ సూర్య కథానాయకుడిగా నటించే చిత్రాలలో కథానాయికలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందుకు అంగీకరించే పెద్ద మనసు ఆయనకు ఉందని పేర్కోన్నారు. 7ఆమ్ అరివు చిత్రంలో మాదిరిగానే సింగం-3 చిత్రంలోనే తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పగానే బాగా నచ్చేసిందని అన్నారు. హీరో పాత్రకు సమానమైన పాత్ర ఉండడాన్ని అంగీకరించిన సూర్యకు థ్యాంక్స్ చెప్పాలని శ్రుతీహాసన్ అన్నారు. ఇటీవలే విజయ్‌తో పులి చిత్రాన్ని పూర్తి చేసిన శ్రుతీహాసన్ ప్రస్తుతం అజిత్‌కు జంట గా నటిస్తున్నారు. సింగం-3 త్వరలో సెట్స్ పైకి రానుంది. -
సెక్యూరిటీ గార్డుకు కలాం కృతజ్ఞతలు
షిల్లాంగ్: కలాం షిల్లాంగ్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు తనకు భద్రత కల్పించేందుకు రిస్క్ తీసుకున్న సెక్యూరిటీ గార్డుకు కృతజ్ఞతలు తెలిపారు. కలాం సహాయకుడు సృజన్ ఈ సంగతి తెలిపారు. సోమవారం గువాహటి నుంచి షిల్లాంగ్‌కు బయల్దేరిన కలాంకు స్పెషల్ ఆపరేషన్ టీవ్ దారి వెంబడి భద్రత కల్పించింది. కలాం పక్కన పాల్ కూడా ఉన్నారు. వారి వాహనం ముందు వెళ్తున్న ఓపెన్ జిప్సీ వాహనంలో ముగ్గురు భద్రతా సిబ్బంది ఉన్నారు. వారిలో ఎస్ఏ లపాంగ్ అనే గార్డు తుపాకీ పట్టుకుని జిప్సీలో నిల్చున్నాడు. అతన్ని కూర్చోమనాలని కలాం తన పక్కనున్న వారికి చాలాసార్లు చెప్పారు. కలాం వాహనం నుంచి రేడియో మెసేజ్ కూడా పంపారు. ఫలితం లేకపోయింది. షిల్లాంగ్ చేరుకున్న తర్వాత కలాం.. లపాంగ్‌ను పిలిపించుకున్నారు. ఎందుకు పిలుస్తున్నారో అని లపాంగ్ భయపడ్డాడు. తర్వాత కలాం అతన్ని ‘నీ విధి బాగా నిర్వహించావ’ని కరచాలనంతో అభినందించి, కృతజ్ఞత తెలపడంతో నోరెళ్లబెట్టాడు. ‘నా వల్ల అన్నిగంటల పాటు నువ్వు ఇబ్బంది పడినందుకు సారీ. అలసి పోయావా? ఏమైనా తింటావా?’ అని మాజీ రాష్ట్రపతి అతనితో అన్నాడు. ‘సర్, మీ కోసం నేను ఆరుగంటలపాటు నిలబడేందుకు కూడా సిద్ధం’ అని లపాంగ్ ఆయనతో చెప్పాడు. -
వెంకటేశ్వరస్వామికి థ్యాంక్స్ : ఛోటా కె. నాయుడు
‘‘సంజు (సందీప్) ఓ కథ తీసుకొచ్చి, నన్ను వినమన్నాడు. నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే బాగా నచ్చింది. ‘ఠాగూర్’ మధుకి ఈ కథ చెబితే, చేద్దామన్నారు. గ్యారంటీ హిట్ అనే నమ్మకంతో ఈ చిత్రం చేశాం. మొదటి మూడు రోజుల్లో దాదాపు ఆరు కోట్లు వసూలు చేసి, మాకు ఘనవిజయాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు చెప్పాలి’’ అని ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు అన్నారు. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్‌కపూర్ ముఖ్య పాత్రల్లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘టైగర్’ ఇటీవలే విడులైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ఛోటా ఇంకా మాట్లాడుతూ -‘‘ ‘టైగర్’ ముగిసిన తర్వాత మొక్కు అంటూ తిరుపతి వెళ్లి, సంజు తలనీలాలు సమర్పించాడు. కానీ, ఇంకా ఏదో సన్నివేశాలు తీయాల్సి వచ్చింది. గుండుతో ఉన్నాడు కాబట్టి, విగ్ తయారు చేయిస్తే, అది సెట్ కాలేదు. దాంతో మూడు నెలలు ఆగాం. ఈ గ్యాప్‌లో ఎడిటింగ్ మీద బాగా దృష్టి పెట్టాం. అది చిత్రవిజయానికి దోహదపడింది. అందుకే, ఆ వెంకటేశ్వరుడికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరం చాలా ఇష్టపడి చేశాం. టైటిల్ మాస్‌గా ఉన్నా కూడా ఆడియన్స్ అందరూ ఈ చిత్రాన్ని ఇష్టపడుతున్నారు. ఈ సినిమా ఫలితం విని ఏడ్చేశాను’’ అని సందీప్ కిషన్ అన్నారు. రజనీకాంత్, చిరంజీవి వంటి సూపర్‌స్టార్స్‌తో పనిచేసిన చోటా. కె. నాయుడుగారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ‘‘ఈ కథ పై నమ్మకంతో సందీప్ మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. అబ్బూరి రవి డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ‘ఠాగూర్’ మధు, తాగుబోతు రమేశ్, సప్తగిరి, సీనియర్ దర్శకుడు ధవళ సత్యం తదితరులు పాల్గొన్నారు. -
సోనియాకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
-
అభిమానులకు సల్మాన్‌ఖాన్ కృతజ్ఞతలు
-
అభినందనలు.. ధన్యవాదాలు
సాక్షి దినపత్రికలో నాలుగో పేజీలో ప్రచురించే త్రికాలమ్ నాకు ఎంతో ఇష్టమైన శీర్షిక. 26-4-2015 సంచికలో అన్నదాతను ఆదుకోరా! అన్న శీర్షికతో వెలువడిన రచన ప్రధానమంత్రినీ, ముఖ్యమంత్రులనూ అభ్యర్థిస్తూ చేసిన విన్నపంలా నాకు అనిపిం చింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో మొదటిది సేవారంగం కాగా, రెండోది పారిశ్రామిక రంగం, మూడో స్థానంలో వ్యవసాయం ఉన్నాయి. అయినా రైతులు దేశంలో దుర్భర స్థితిలో ఉన్నారు. రాజధాని ఢిల్లీలో జరిగిన గజేంద్రసింగ్ ఆత్మహత్య ఇందుకు నిదర్శనం. అలాగే ఒక రాష్ట్రంలో 67 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా దారుణ పరి ణామం. మన నేతలు స్మార్ట్ సిటీలకీ, స్మార్ట్ విలేజ్లకీ ఇచ్చే ప్రాధాన్యం రైతులకు ఇస్తే వారి ఆత్మహత్యలు ఆగుతాయి. రైతు పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వా లన్నీ ఈ ఆత్మహత్యలను నివారించాలి. అది వారి బాధ్యత, నైతిక విధి. పదకొండవ పేజీ లో ప్రచురించిన ‘ఉడకని మెతుకులు చెబుతున్న ఊసులు’ ఆ సంచికకే పరిపూర్ణతను తెచ్చింది. కె.ఆర్. వేణుగోపాల్ అభిప్రాయాలు అందులో చదివాం. అంతర్జాతీయ విధివిధానాలు రూపొందించిన వేణుగోపాల్ ఐసీడీఎస్ వంటి చిన్న పథకం చేపట్టడం ఏమిటని మొదట అనుకున్నాం. కానీ ఆయన పుస్తకం వచ్చిన తరువాత ఆ పథకం లోతుపాతులు ఎంతటివో తెలిశాయి. శాసన, చట్ట, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడిం టినీ ఆయన అపారంగా గౌరవించారు. ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావిస్తాను. వేణుగోపా ల్ ఒక పని మీద సబ్‌రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లారు. సొంతపని. అయినా అందరికి ఉండే పద్ధ తి ప్రకారమే క్యూలో నిలబడి ఆఫీసర్‌ను గౌరవంగా సంబోధించారు. అదీ ఆయన సం స్కారం. ఇలాంటి మహోన్నతుడి ఇంటర్వ్యూ ప్రచురించినందుకు సాక్షికి ధన్యవాదాలు. - నీలయ్య జ్యోతి హైదరాబాద్ -
గురువింద చందంగా చంద్రబాబు తీరు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, ప్రజానీకానికి టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. భారీ మొత్తంలో ఈ సభకు హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. సభ నుంచి తిరిగి వెళుతూ ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన చెప్పారు. గాయపడిన వారికి ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తామని చెప్పారు. అనంతరం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు తీరు గురువింద చందంగా ఉందని విమర్శించారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీ కొనుగోలు చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో ఎందుకు రాజీనామా చేయించలేదని కూడా ఆయన మరో ప్రశ్న వేశారు. -
జగన్ గారూ... ధన్యవాదాలు
ప్రతిపక్ష నేతకు సీపీఐ నేత రామకృష్ణ ఫోన్ జనం కోసం జరిగే పోరాటాలకు మద్దతిస్తాం: వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై పోరాడుతున్న తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం జగన్‌కు ఫోన్ చేశారు. ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రత్యేక హోదా కోసం ధర్నాలు జరిగాయి. ఇందులో భాగంగా రామకృష్ణ ఆధ్వర్యంలో అనంతపురంలో ఆందోళన చేశారు. సీపీఐ కార్యకర్తలు టెలిఫోన్ కార్యాలయంలోకి ప్రవేశించి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారన్న ఆరోపణల మేరకు పోలీసులు రామకృష్ణతో పాటు పది మందిని అరెస్ట్ చేశారు. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆ మర్నాడు అంటే 19వతేదీన శాసనసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీపీఐ నేత అరెస్ట్‌పై హోం మంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నేతల్ని అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీనివల్ల సమస్య తీవ్రత రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందని, అందుకు ధన్యవాదాలు తెలపడం తమ బాధ్యతని రామకృష్ణ చెప్పారు.ప్రత్యేక హోదా విషయంలో రాజకీయాలకు తావు లేదని.. ప్రజా సమస్యలపై పోరాడే వారిని అరెస్ట్ చేసినప్పుడు, వారి పట్ల పాలకులు అనుచితంగా ప్రవర్తించినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉంటుందని జగన్ అన్నట్టు సమాచారం. -
వరుణ్‌కు థ్యాంక్స్
నిర్మాత వరుణ్మణియన్కు నటి త్రిష థ్యాంక్స్ చెప్పారు. దీంతో వీరిద్దరిపై మీడియా మరోసారి ఫోకస్ చేసింది. ఈ వరుణమణియన్ ఎవరో కాదు త్రిషను వివాహం చేసుకోబోతున్నారని నిశ్చితార్థం జరిగిందని ఇటీవల ప్రచారం హోరెత్తింది. ఆ వార్తలో వరుడే ఈ వరుణ్‌మణియన్. ఈ ప్రచారం జరిగిన తరువాత త్రిష ధనుష్ సరసన నటించే చిత్రం నుంచి, జయ్‌కు జంటగా నటించనున్న చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం త్రిషకు కొత్త చిత్రాలేమీ చేతిలో లేవు. జయంరవితో నటించిన భూలోకం, అజిత్‌తో రొమాన్స్ చేసిన ఎన్నైఅరిందాల్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. తెలుగులో బాలకృష్ణ సరసన నటిస్తున్న చిత్రంతోపాటు రమ్ అనే మరో చిత్రం మాత్రం ఉన్నాయి. దీంతో త్రిష తన నిశ్చితార్థం వార్తను ఎంతగా ఖండించినా ఫలితం లేదు. ఇందుకు బలమైన కారణం లేకపోలేదు. వరుణ్‌మణియన్ సమర్పణలో దర్శకుడు వసంతబాలన్ దర్శకత్వం వహించిన చిత్రం తలైవన్. సిద్ధార్థ్, వేదిక తదితరులు నటించిన చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం గురించి త్రిష తన ట్విట్టర్లో పేర్కొంటూ చిత్ర యూనిట్ నైపుణ్యానికి నిదర్శనం కావ్యతలైవన్. చాలా మంచి ప్రయత్నం. సినీ ప్రియులు తప్పక చూడవలసిన చిత్రం. ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన వరుణ్మణియన్కు ధన్యవాదాలు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. చిత్ర దర్శకుడి గురించి మాత్రం ఒక్క మాట పేర్కొనకపోవడం త్రిషకు వరుణ్మణియన్కు మధ్య వున్న సాన్నిహిత్యాన్ని తెలియచేస్తోందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. -
మోడీకి ఆస్ట్రేలియా ప్రధాని కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: వారం క్రితం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్.. తనకు ఇచ్చిన ఆతిథ్యానికి మోడీ భారత ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. మంగళవారం మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. నిర్ణయాలు అమలయ్యేలా కృషి చేయాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల వరదలు సంభంవించడం, అపార నష్టం వాటిల్లడం పట్ల ఆస్ట్రేలియా ప్రధాని విచారం వ్యక్తం చేశారు. -
డ్యాష్‌బోర్డుకు మొబైల్ టెక్నాలజీ
-
మీ మద్దతు మరువలేనిది
ముంబై: తన 24 ఏళ్ల కెరీర్‌కు మద్దతిచ్చిన కోట్లాది మంది అభిమానులకు భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కృతజ్ఞతలు చెప్పాడు. ‘నా క్షేమం కోరుతూ సుదీర్ఘ కెరీర్‌కు మద్దతిచ్చిన ప్రతి అభిమానికి చాలా రుణపడి ఉన్నాను. ఈ సందర్భంగా వారందరికీ నా హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను’ అని ఇక్కడ జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న మాస్టర్ తెలిపాడు. నాలుగేళ్ల కిందట కుటుంబంతో కలిసి వెళ్లిన ఐస్లాండ్ పర్యటన మధురమైన అనుభూతినిచ్చిందని చెప్పాడు. ‘క్రికెట్‌కు దూరంగా కుటుంబంతో కలిసి ఐస్లాండ్కు వెళ్లా. ఆ టూరును ఇప్పటికీ మర్చిపోలేను. అక్కడి ప్రకృతి అద్భుతం, అమోఘం. క్రెడిట్ కార్డులు జేబుకే పరిమితమయ్యాయి. ఎందుకంటే అక్కడ కొనేందుకు ఒక్క షాపు కూడా లేదు. అలాంటి ప్రదేశాలకు కుటుంబంతో కలిసి వెళ్లడం చాలా బాగుంటుంది. అందరు కలిసి మెలిసి పర్యటనను ఆస్వాదించొచ్చు. నాకు లభించిన ప్రత్యేకమైన విశ్రాంతి అదే’ అని సచిన్ వివరించాడు. క్రికెట్ వల్ల దేశం వెలుపలా, బయటా ఎన్నో ప్రదేశాలను చూసే అవకాశం తనకు లభించిందన్నాడు. భారత్‌లోనూ చూడటానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని మాస్టర్ అన్నాడు. -
విజయకేతనం