
ఆదాయ వనరులు అడుగంటినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవటాన్ని భారతీయ పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) అభినందించింది.
సాక్షి, అమరావతి: ఆదాయ వనరులు అడుగంటినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవటాన్ని భారతీయ పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) అభినందించింది. రూ.7,880 కోట్లతో కొత్తగా 16 ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు రూ.3,820 కోట్లతో ఆధునికీకరణకు శుక్రవారం కేబినెట్ ఆమోదం తెలపడాన్ని సీఐఐ ఏపీ విభాగం స్వాగతించింది. రెండేళ్లుగా కరోనా పరిస్థితులను ఎదుర్కొంటూనే రాష్ట్ర ఆర్థిక వృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతు ఇచి్చనందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ నియంత్రణతో పాటు పరిశ్రమలు, వ్యాపార వ్యవహారాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఐఐ పేర్కొంది. ఈమేరకు సీఐఐ విడుదల చేసిన పత్రంలో కొన్ని సూచనలు చేసింది.
చదవండి: AP: నేతన్నకు ఊతం.. ఆఫర్లతో ఆప్కోకు అందలం
►ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదుర్కొన్న దాదాపు రెండేళ్ల తర్వాత ప్రజల శక్తి తిరిగి పూర్వ స్థాయికి చేరుకునేందుకు ఆరి్థక కార్యకలాపాల పునరుద్ధరణ కీలకం. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాలి.
►కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్‌లు 25 శాతం ఆక్యుపెన్సీలో ఉంటే తగిన జాగ్రత్తలతో సాధారణ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అదే 25 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీలో ఉంటే సామాజిక కార్యకలాపాలను పరిమితం చేయాలి. కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి.
►కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్‌లు 50 నుంచి 75 శాతం వరకు ఆక్యుపెన్సీలో ఉంటే మైక్రో జోన్‌ల్లో కార్యకలాపాలపై నియంత్రణ, రద్దీని నివారించడానికి లాక్‌డౌన్ లాంటి కఠిన చర్యలు అవసరం. 75 శాతానికి మించి బెడ్‌లు నిండితే లాక్‌డౌన్‌తో పాటు అదనపు ఆంక్షలు అమలు చేయాలి.
పరిశ్రమలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
కోవిడ్ సంక్షోభ సమయంలో వ్యాపారాల కొనసాగింపు, స్థిరత్వాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమని సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ సి.కె.రంగనాథన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆరి్థక మాంద్యాన్ని అధిగమించాలంటే వ్యాపార లావాదేవీలను కొనసాగించడం అవసరమన్నారు. ఎంఎస్‌ఎంఈలకు అండగా ఏపీ ప్రభుత్వంతో కలసి సీఐఐ పని చేస్తోందని చెప్పారు. మహమ్మారి సమయంలో పరిశ్రమలకు మద్దతిచి్చనందుకు ఏపీ ప్రభుత్వానికి సీఐఐ కృతజ్ఞతలు తెలియజేస్తోందని పేర్కొన్నారు.
అలాగే కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఐఐ ఆంధ్రప్రదేశ్ విభాగం చైర్మన్ డి.తిరుపతిరాజు ప్రశంసించారు. 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, వైద్య కళాశాలల అభివృద్ధి ద్వారా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు బలోపేతమై ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమ వర్గాలు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాయని తెలిపారు.